24, నవంబర్ 2014, సోమవారం

పద్యరచన - 745

కవిమిత్రులారా,

పై పద్యభావాన్ని తేటగీతిలో వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. నీ పాలన్నీ నీ దూ
    డే పూర్తిగ కుడువ నేమిడెదవే మేకా
    యీపూట పాలు లేవా
    యీపాపడికనచు చూచెనిబ్బాలుండే

    రిప్లయితొలగించండి
  2. మేక పొదుగు చేపి మేకపి ల్ల యచట
    పాలు ద్రాగు చుండ బాలు డొకడు
    తొంగి చూచు చుండె వంగి వంగి మిగుల
    చిత్ర మదియ చూడ చిత్ర మాయె

    రిప్లయితొలగించండి
  3. అన్నంబది లేదు తినగ
    మన్నున పడియుంటి నేను మార్గము లేకన్
    నిన్నే నమ్మితి నేనిక
    చన్నొక్కటి నాకు వదులు చాలును మేకా!!

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఆ పిల్లాడి పేరు భీష్ముడనుకుంటే :

    01)
    _____________________________

    పిల్లదె ఛాగికి, పాలను
    మెల్లగ తా త్రాగుచుండ - మెలకువ నెరుగన్
    విల్లుగ వంగియు నేలకు
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు ♦ భీష్ముఁడు మురిసెన్ !
    _____________________________

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం (+పూరణ) బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. తల్లి పాలు త్రాగ తల్ల డిల్లును బిడ్డ
    పురిటి లోన వలదు పోత పాలు
    అమ్మ రొమ్ము పాల కమ్మ తనము మించి
    విశ్వ మందు లేదు వినుర వేమ

    రిప్లయితొలగించండి
  7. మేమే ఆకటి కేడ్చిన
    ఏమ్మా యనియమ్మ పాల నెత్తుకొనిచ్చున్
    'మేమేమేమే' పిల్లను
    ఈ మేకే యెత్తుకొనదిదేంజేస్తుందో !

    రిప్లయితొలగించండి
  8. మిగిలిన అందరి పూరణలు చదివిన తరువాత నా పూరణ తేలిపోతోందనిపిస్తూంది - అయినా పూరిస్తున్నాను

    చెదరకుండేను నాఆశ జీవి తమున
    ఎదురు చూచుచుంటినినేను ఎపుడొ నాకు
    సదవ కాశమ్ము పాల్దాగు సమయ మొచ్చు
    కదల కుండాయిటనెవేచి కాను చుందు

    రిప్లయితొలగించండి
  9. అమ్మ పాలను గొనుచుండ నజము పిల్ల
    కాంచుచుండెను బాలుడు కరము తుష్టి
    నమ్మ గుర్తుకు వచ్చెనా? యర్భకునకు
    చూపరులకు దృశ్యము కడు సొంపు గూర్చె.

    రిప్లయితొలగించండి
  10. పాలందు మేక పిల్లా!
    యేలా నీ కందుఁ దృప్తి నిట్లా త్రాగన్!
    నాలాగ నమ్మ యొడిలో
    జోలల మురిపాలఁ బాల జుర్రగ లేవా?

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. మేకయె పాలిచ్చుటగని
    యాకలితో నున్నబాబు నాత్రము పడుచున్
    నాకూ పాలియ్యమనుచు
    యాకీలినిపైన వాలి యాక్రోశించెన్

    రిప్లయితొలగించండి
  13. సృష్టిలోపల సుందర దృశ్యమేది
    తల్లి కడజేరి పాలను త్రాగుశిశువు
    చన్ను విడువని శిశువుల కన్నులకును
    నెన్న నధ్బుతమై యది చెన్నుమీఱు

    రిప్లయితొలగించండి
  14. పొదుగు నందించె పిల్లకు పొట్టిమేక
    వెదకు చుండెను పసిపాప పొదుగు కొరకు
    అమ్మ పాలను గ్రోలంగ అమిత శక్తి
    సృష్టి చిత్రము జూడుము ద్రష్ట యగుచు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  15. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    తాడిగడప శ్యామలరావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ:

    తల్లి దరికి జేరి తల్లడిల్లుచు పిల్ల
    పాలు త్రాగు చుండ,పాప తాను
    ప్రాకి ప్రాకి వచ్చి పరవశంబున గాంచె
    నమ్మ దనము లోని కమ్మదనము.

    రిప్లయితొలగించండి