3, మార్చి 2015, మంగళవారం

పద్యరచన - 837

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

నెమలి వాహనంబు నెక్కి కూర్చొనియుండె
షణ్ముఖుండు తాను చక్కగాను
వల్లి, దేవసేన పత్నులిద్దరిగూడి
కార్తికేయుడిచ్చు కామితములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...


శ్రీవల్లి మదిని గెలిచిన
పావకి యగుఱెల్లు చూలి భర్గుని సుతుడౌ
భావన ముననింద్రు డనెను
దేవత యగుదేవ సేన దేవేరి యగున్
-----------------------------------------
ఇరువురి సవతుల నటునిటు
మురిపెము గాకూర్చుండ బెట్టి భుజగా సనమున్
శరవణ భవునకు శ్రీవల్లి
శరణం టిరిదేవ సేన సంతస మందున్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

వల్లియు దేవసేనయును
యుల్లము రంజిలగ జేర నూరువు పైనన్
సల్లలితరీతి నిలచిన
' పిల్లడు ' శిఖివాహు స్కందు నారాధింతున్.

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యంలో గణదోషాలున్నవి. నా సవరణతో మీ పద్యం...
ఇరువురి సవతుల నటునిటు
మురియుచు కూర్చుండ బెట్టి భుజగా సనమున్
శరవణ భవునకు వల్లికి
శరణంటిరి దేవసేన సంతస మందున్.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘వల్లియును దేవసేనయు’ అనండి.

subbarao చెప్పారు...

వల్లి దేవసేనల నిరు వైపు లునిచి
నెమలి వాహనా రూ డు డై నెమ్మి తోడ
నిలను వేంచేసి యుండిన నీ కు మార
స్వామి కిడుదును వందన శతము లిపుడు

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కుమార|స్వామి’ అన్నప్పుడు ‘ర’ గురువై గణదోషం.

sailaja చెప్పారు...

ఇరువురు దేవేరులతో
నరుదెంచిన నెమ్మిఱేని కంజలినిడుచున్
శరణని సన్నుతి జేయుచు
శరజన్ముని వేడుకొనెద సంతోషముగన్!!!

A.Satyanarayana Reddy చెప్పారు...

శంభు చినపుత్రుడైనట్టి షణ్ముఖుండు
ధర్మపత్నులతోడను దర్శనమ్ము
నిచ్చె భక్తులకున్ కర మింపుగాను
కాంచి పూజింప నొనగూడు వాంఛితములు

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

విశ్వరూపుడట్లువిధిగానుగనుపించ?
షణ్ముఖుండుచిత్రసంపదాయె
నెమలివాహనాననేగుదెంచుటజూడ
భక్తజనులకెపుడుశక్తిగూడు
చెంతనజేరుభార్యలట?చింతనుబాపగషణ్ముఖుండు|తా
నింతయునెంతయోబెరిగినిర్మలుడవ్వగ|వల్లి,దేవసే
నంతటవచ్చికూ ర్చొనగనద్భుతశక్తులుకూడినట్లె|మా
వంతుగభక్తియందుభగవానునివేడెదనిర్మలత్వమున్

Unknown చెప్పారు...

వైష్ణవాదులు-భక్తిగపరవశాన
హరినిపూజింత్రు|"నాస్తికులనవరతము
శాస్త్రసమ్మతినేనమ్మిసాగి,పరుల
మేలొసగెడివారలనగా?మేటియనిరి

subbarao చెప్పారు...

వల్లి దేవసేనల నిరు వైపు లునిచి
నెమలి వాహనా రూ డు డై నెమ్మి తోడ
నిలను వేంచేసి యుండిన నీ కు మార
సామి కిడుదును వందన శతము లిపుడు

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మాస్టరుగారూ ! ధన్యవాదములు...
మీరు చూపిన సవరణ తో...

వల్లియును దేవసేనయును
నుల్లము రంజిలగ జేర నూరువు పైనన్
సల్లలితరీతి నిలచిన
' పిల్లడు ' శిఖివాహు స్కందు నారాధింతున్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

నెమలి వాహనమున 'కొమరునీ జూడరే
సతులఁ గూడి వెడలె వెతలఁ గాంచ
సంత సించి నంత సంతానమును గూర్చు
మ్రొక్కు లిడరె వారి దిక్కుఁ దిరిగి

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

పరమేశుని ప్రియసుతుడా
సుర సంతతులను జయింప శూలము చేతన్
ధరియించిన వాడై తా
ను రణమున గెలిచి నిలిచెను నుతులను గొనుచున్.

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.