2, జనవరి 2016, శనివారం

పద్యరచన - 1136

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి. 

49 కామెంట్‌లు:

  1. లూనా నడుపుచు బామ్మలు
    సానా దినముల నుండి సాహస మొప్పన్
    నీనా భేదము లేకను
    నేనే నీవంచు కలసి నేర్పుగ మైత్రిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘సానా’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
    2. లూనా నడుపుచు బామ్మలు
      నేనాడును విడువకుండ నెయ్యము తోడన్
      నీనా భేదము లేకను
      నేనే నీవంచు కలసి నేర్పుగ మైత్రిన్

      తొలగించండి
  2. పడతులు కారట యబలలు
    కడు నేర్పరులైరి వారు ఘనులే వనితల్
    పుడమిన పురుషుల సమముగ
    బిడియము నేవదలినారు విజయులు సబలల్

    పచనము జేయుటె కాదట
    సచివులు గా వెలుగ గలరు చానలు వారే
    రచనలు కొలువులె కాదట
    ద్విచక్ర వాహనము నడుపు ధీరులే నారుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  3. ఇంటి ఇంతులము తెలియదు మాకు యేదియూ
    మోటారు బండి నెక్కినాము కిక్కుతో జల్లుమన
    యేగుతున్నాము పయనము మీకు సరిజోదుగా
    వెతుకుతున్నాము సమ సమాజ రీతి గీతికలతో !


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీరు వ్రాసిన చూస్తే అక్కర భేదంగా భ్రమింపజేస్తున్నది. భావం బాగున్నది. వీలైతే ఛందోబద్ధం చేస్తాను.

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  5. అయ్యవారి బ్లాగు లో తోలి జిలేబివదన !

    మరి మరి సరి ధీమగా గాడిపై
    సరి సరి మనదీ సవారీ హవా
    పరిపరి గగనాపరీ వీధిలో
    గరిమ మనది వేగ వేణీ గతీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మహదానందంగా ఉంది. మీరు మొదటిసారిగా ఛందోవృత్తాన్ని సమర్థంగా వ్రాశారు. అభినందనలు.
      మీరు వ్రాసినది 12వ ఛందమైన జగతిలో 1216వ వృత్తమైన ‘ప్రభ’ అనే వృత్తం. దీని గణాలు న-న-ర-ర. యతి స్థానం 8. ప్రాస నియమం ఉంది.

      తొలగించండి
    2. పెక్కుదినమ్ముల నుండియు
      చక్కని భావమ్ము లొసఁగి సంతోషమ్మున్
      మిక్కిలిగాఁ జేకూర్చితి
      వక్కజముగఁ బద్య మిప్పు డమరె జిలేబీ!

      తొలగించండి
    3. కంది శంకరయ్య గారు

      నమో నమః !

      కవివర! యిది మదినసరసి
      కవిగ మధురము గన లరసి
      చినది ముదిత పలుకు; కవుల
      అనతి గతి నరయగ మదిలొ !

      చీర్స్
      జిలేబి
      (ఉత్కళిక)

      తొలగించండి
  6. అరె!హా!ఆధునికతరా,
    బిరుసెక్కిన ప్రౌఢ యొకతె వృధ్ధను తన మో
    టరు వాహనమ్ము పైనను
    సరగున నెక్కించి నడపు సరణిని గనరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. 1.వనిత లిరువు రిచట వైనముగా బండి
    నడుపుటనుగనంగ నయనములకు
    పండువగును గాదె;పట్టుదలను బూన
    సాధ్య మవని దేదిదయులార.
    2.రయమున హయమెక్కె రాణి రుద్రమ దేవి
    రాజ్యమేలె గాదె రమణ తోడ
    ముదితల కిలలోన ముదమార నేర్పంగ
    యన్ని నేర్వగలరు యవని యందు.
    3.అవసరమ్ము నేర్పు నతివలకెల్లను
    కష్టసాధ్యమైన కార్యములను
    నేర్పుతోడ చేయు నేర్పరి తనమబ్బు
    అభినుతించరండు నార్యులార.
    4.ఝాన్సి రాణి లక్ష్మి జయమందె హయమెక్కి
    పోరు సల్పితాను పూజ్యతందె
    వంట పనియెగాదు వడిగ నే పనినైన
    చేయగలరతివలు చిటికె లోన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘సదయులార’లో ‘స’ టైపు కాలేదు.
      రెండవ పద్యంలో ‘నేర్వగలరు+అవని’ అన్నపుడు యడాగమం రాదు. ‘అన్ని నేర్తు రవనియందు నిజము’ అందామా?
      మూడవపద్యంలో ‘రండు+ఆర్యులార’ అన్నపుడు నుగాగమం రాదు. ‘అభినుతించవలయు నార్యులార’ అందామా?
      నాలుగవ పద్యంలో ‘పూజ్యత+అందె’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘పూజ్యత గనె’ అనండి.

      తొలగించండి
  8. చిత్ర మందున జూడుడు చిత్రముగను
    యువతి మరియొక యువతిని హోండ పైన
    నునిచి కొనుచును పోవుచుం డెనట యార్య !
    కలియు గపుమార్పు లింకను గలుగుచుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      కాని ఆ చిత్రంలో ఉన్నది యువతులు కాదు, వృద్ధురాళ్ళు. అదీ వింత!

      తొలగించండి
    2. వృధ్ధ మరియొక వృధ్ధనువెనుక తనకు

      తొలగించండి
  9. చెన్నుదన మతిశయింపం
    గన్నారి ఘనద్విచక్ర గమనాతుర ప్ర
    చ్ఛన్న నిజమాతసహ సం
    పన్నాతి విలాసఁ జూడ ప్రమదంబాయెన్

    [“ఆతుర ప్రచ్ఛన్న” లో “ర” ని లఘువు గా తీసుకున్నాను “హరబ్రహ్మాదుల్” లో వలె.]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. “గమనార్తప్రచ్ఛన్న” అని కూడ వాడవచ్చును.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘ఆతుర ప్రద్ఛన్న’లోని ‘ర’ లఘువని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. హీరో హోండా పై సరి
    లేరుగ మాకంచు వృద్ధ లేడీ లిరువుర్
    జోరుగ జనుచుండె నచట
    నౌరా ! వయసును జయించె నభ్యాసమ్మే!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంగ్లాంధ్ర భాషాశంకరము కవివరులకు దగదు. శంకరాభరణమును పలువురు విద్వాంసులు గమనించగలరు. ఇందలి భాష విద్వజ్జనామోదముగ నున్న నుత్తమమని నాభావన. మనసునొప్పించిన క్షమార్హుడను.

      తొలగించండి
    2. శైలజ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘...జనుచుండి రచట’ అనండి.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      నిజమే. సాధ్యమైనంత వరకు అన్యభాషాప్రయోగం పరిహరించవలసిందే. అది సంప్రదాయ చ్ఛందోబద్ధ కవిత్వంలో సమంజసం కాదు.
      మిత్రులు గమనించి పాటిస్తారని ఆశిద్దాం.

      తొలగించండి
  12. ముదుక లిద్దరు కరమగు ముదముతోడ
    బండి పైబోవు చుండిరి భయము విడిచి
    యన్ని విద్యల నందున నారితేరు
    చుండ్రి నేటి మహిళలంత స్ఫూర్తి యడర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  13. ద్విచక్రవాహనము నడిపే బామ్మ వెనుకనున్న అమ్మమ్మతో:

    తగుదునని బాల్యమందున్
    మగరాయడిరీతి పెంచె మా తండ్రియటన్
    దిగులేల వెళ్లెదమిఁక పొ
    రుగూరు, 'చాగంటి'వారి ప్రోక్తము వినగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘పనికె యిల్లాలి... దొరసాని వలెన్’ అనండి.

      తొలగించండి
  15. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ప౦డెన్ దేహము న౦దు సత్తువ | వయ : పాకమ్ము సన్న౦బయెన్ |
    హూ౦డా పైన. సవారి చేయ. హితమే , ఓ అవ్వ లారా యిటుల్ ,
    చ౦డోద్వేగము తో ? సురక్ష్యముగ రిక్షా పైన పో చ్చు గా !గ౦డ౦బే యెదు రైన. కోల్కొన. మహా కష్ట౦బు మీ రీ యెడన్

    { రక్ష్యముగ. = రక్షితముగ. రక్షి౦పదగురీతిగా ; గ౦డ౦బు = అపాయము accident. } ీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

      తొలగించండి
  16. బ్లాగు పరివారులందరకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు

    తమరీతిగ తాముండియు
    సమకట్టిరి సుంతయేని సందియ పడకన్
    గమనము ఘనమౌ నీగతి
    చెమరించును కనులనీరు చిత్రము కనగన్

    రిప్లయితొలగించండి
  17. వెధవ ఆటోలు మనమేల వెదుక వలెనె ?
    వెధవ యెవ్వడు రోడ్డునే వేయడాయె !
    వెధవ బండిని నే నడిపెదను చూడు
    విధవలని మన నెవ్వడే వెక్కిరించు ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. ఇంటి వంటపనికె యిల్లాలిపనిగాక
    నేటినాగరికత నెగడు నట్లు
    నాటివనిత లెల్ల చాటెడి రీతిగా
    వాహనాలు నడుపు వనిత లైరి.
    2.చూడగముదుసలి తనకో
    తోడుగ జతగలియ తాను దొరసానివలెన్
    నేడిల మోటరు సైకిలు
    వాడెడి పనితనము జూడ వాహ్వా|యనరే|
    3.నాటిభయంబు వీడి నవ నాగరికంబునవెళ్లు నట్లుగా
    మోటుతనంబునన్ వనిత మోటరు సైకిలు నందువెళ్ళుచున్
    ఘాటుగ నొక్కసోదరియు గన్పడ చక్కగ నెక్కమన్నదై
    పోటిగ వెళ్ళ వింతగున?పూర్తిగ ధైర్యమ? మార్చు సంఘమా?
    3.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      సవరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘తనకో’ అన్నచోట ‘తనకొక’ అనండి.

      తొలగించండి
  19. కం:అయ్యారే ముదివయసున
    సయ్యాటగ బైకు రైడు- సఖియా రావే
    ఉయ్యాల లూగు రోడ్డున
    తయ్యారుగ పట్టుకొ నను- తడబడ బోకే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగజ్యోతి సుసర్ల గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ఆయన బ్రతికున్నప్పుడు
    ఈ యమహా తోల నేర్పె నిదిగో చెల్లీ
    ఆయముని గలిసె నాతడు
    ఈయమ వేగంబు జూడు మిక భయమేలా !

    రిప్లయితొలగించండి