8, జనవరి 2016, శుక్రవారం

పద్యరచన - 1142

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

34 కామెంట్‌లు:

 1. చక్కిలములు చుట్టెదరట
  చక్కగ తమచేతి తోన సౌరులు విరియన్
  మక్కువ మీరగ తినెదరు
  మిక్కిలి హానేమి కాదు నిక్కము సుమ్మీ

  రిప్లయితొలగించండి


 2. శుభోదయం !

  చయ్యన చక్కిల లనుగన
  సయ్యన బాణలి సురసుర సక్కగ వేయన్
  రయ్యన జిలేబి వచ్చెను
  జయ్యన కందము జలజల ఛందము లాయెన్

  చీర్స్
  జిలేబి
  (సావేజిత)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొద్ది గ సవరించి

   చయ్యన చక్కిల లనుగన
   సయ్యన సుయ్యన సురసుర సక్కగ వేయన్
   రయ్యన జిలేబి వచ్చెను
   జయ్యన కందము జలజల ఛందం బాయెన్ !

   జిలేబి

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ కందపద్యం బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదాన్ని ‘చయ్యన చక్కిలముల గన’ అనండి.
   (అన్నట్టు... ‘సావేజిత’ అంటే ఏమిటి?)

   తొలగించండి
  3. కంది వారు,

   నెనరస్య నెనరః !

   సావేజిత అనగా సాఫ్ట్ వేర్ జిలేబి తయార్ :)

   మీరు పెట్టిన ఛందస్సు సాఫ్ట్ వేర్ లో సరి సరి జేసుకుని వేసుకున్న జిలేబీయం :)

   జిగిబిగి గీతల తో మరి
   బిగినడ పరిపరి విధముల బిరబిర వేయన్
   బిగువును సరిజే యంగ యు
   పకరిణి జూపిన సరళిగ పదముల గుచ్చెన్

   చీర్స్
   జిలేబి
   (సావేజిత!)

   తొలగించండి
 3. అక్క బావ వత్తురనుచు నమ్మ తీర్చి సర్వమున్
  చక్కిలమ్ములన్ని జుట్టి చక్కఁ జేయు చుండెనే
  పక్కఁ జేరి బావ తోటి పల్కుఁ గల్ప ముచ్చటల్
  చక్కనౌను తినగ మేము చక్కిలమ్ములుంచగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. చక్కని చుట్టలు గానట
  చక్కిలముల చుట్టినారు చాతుర్యముతో
  మిక్కిలి రుచికరమైనవి
  నిక్కముగా నిల్వయుండు నెన్నోదినముల్!!!

  రిప్లయితొలగించండి
 5. అన్ని పద్యాలూ బాగున్నయ్....అభినందనలు కంది శంకరయ్య గారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. కోదాటి సాంబయ్య గారూ,
   మీరు నా బ్లాగును సందర్శించడం ఆనందదాయకం. ధన్యవాదాలు.

   తొలగించండి
 6. చక్కిలముల నేజూచితి
  చక్కగనవియుండెనచట జానకి ! తెమ్శా!
  మక్కువగలిగెను దినుటకు
  మిక్కుటముగదేకుసుమ్ము మీకును గొన్నిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. 1.
  మక్కువ తోజే సెదరట
  చక్కిలమను రుచి గలిగిన చక్రము లవియే
  మిక్కిలి శ్రమతో గూడిన
  నొక్కులు గలపిం డివంట నోరూరునులే.

  2.
  మకర సంక్రాంతి వేళ ఘుమఘుమ లాడు
  పిండి వంటక మందున దండిగ జన
  మోదమును పొందు వంటక మేది యనిన
  చక్రమును బోలు కమ్మని చక్కిలములె.

  రిప్లయితొలగించండి
 8. 1.చుట్టి తిప్పి చేయు చుట్టలివి గనుడు
  కరకరమనుచునతి కమ్మగుండు
  పిల్లలనియె గాదు పెద్దలెల్లరకును
  యిష్ట మగుచు నుండు నెల్లపుడును.
  2.బామ్మ చేయుచుండు బహుపసందుగ వీని
  పిల్లలడుగు చుండ విసుగు లేక
  వహ్వయనుచు తింద్రు వదలక చుట్టలన్
  రంజు మీర తినగ రండు మీరు.
  3.వేసవియరు దెంచవేడ్కతో పిల్లలు
  కోరు కొనుచు నుంద్రు కూర్మి తోడ
  చక్కిలాలు తినగమక్కువాయె ననగ
  నమ్మ చేయు నివియు నాదరాన.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 9. సంకురాతిరి పండుగ సంబరమున
  చేసుకొందు రింటంట నీ చెక్కిలములు
  పాత బియ్యపు పిండితో చేత జేసి
  నూనెలో గాల్చితింటుంటె నోరులూరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘తింటుంటె’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘తినుచుండ’ అనండి.

   తొలగించండి
 10. చక్కిలముల జుట్టి చక్కగా చీరపై
  నారబెట్టె నమ్మ యందముగను
  నూనెలోన వేచి మానుగా మాకీయ
  కమ్మగాను తినుటకై ముదాన.

  ఎంత కళాత్మకతయొ గద
  మించెడినిట చీరపైన మెచ్చగ సర్వుల్
  మంచిగ చిరుతిండికి మా
  పంచను కళలద్దె నమ్మ పండుగపూటన్.

  చక్కిలాలు చేయ జాలును వరిపిండి
  మినుపపిండి జేర్చ మించు రుచులు
  పిల్లవాండ్ర కెంచ ప్రీతిని జేకూర్చు
  కడుపు నొప్పిరాని కమ్మదినుసు.

  పెద్దలైన కూడ ప్రేమతో తిందురు
  దంత పుష్టి చాలు దాని కొఱకు
  ఎన్ని తిన్నగాని యిసుమంత నేనియు
  హాని కలుగ బోని హాయితిండి.

  చక్కిలమ్ములు జంతికల్ చెక్కవడలు
  పాలకాయలు చెగొడీలు చాలినన్ని
  కమ్మనైన యప్పచ్చులు ఘనముగాను
  నాటి పిల్లలమౌ మేము నమిలినాము.

  మారె కాల మిపుడు మారెను తిండియు
  లేసు నూడులును సమోస వచ్చె
  పిజ్జ బర్గరాది పెద్ద తిళ్ళధికమై
  వీటి విలువ తగ్గె విధివిధాన.

  పల్లెలందు జూడ నుల్లమ్ము పొంగగా
  వేడుకలను దెచ్చి నేడుకూడ
  పంచిపెట్టుదురివి పదుగుర కిండ్లలో
  శుభము చక్కిలమ్మ! శుభము నీకు.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   అద్భుతమైన ఖండకృతిని అందించారు. అభినందనలు. ధన్యవాదాలు.

   తొలగించండి
 11. భార్యాభర్తల సరసపు సంభాషణ
  చక్కిలములు తినమనగా?
  చెక్కిలి ఫై ముద్దులుంచి చిత్రముగనుమా
  చక్కిలిబుగ్గనగనపడు
  చక్కిలి రుచిదెలిసె ననుచుచక్కగ నొదిగెన్

  రిప్లయితొలగించండి
 12. చక్కగా నమ్మ జేసిన చక్కిలములు
  కరము తృప్తిని కలిగించె కాంచగానె
  నూనెనందున వేయించి యానినపుడు
  మనసు స్వర్గము జేరును తనివితోడ

  రిప్లయితొలగించండి
 13. `Unknown' గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. చక్కగా నమ్మ జేసిన చక్కిలములు
  కరము తృప్తిని కలిగించె కాంచగానె
  నూనెనందున వేయించి యానినపుడు
  మనసు స్వర్గము జేరును తనివితోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   ఎవరో పరిచితులే అనీ, వ్యాఖ్యను పోస్ట్ చేయడంలో ఏదొ ఇబ్బంది ఏర్పడిందనీ అనుకున్నాను. మీ రన్నమాట! సంతోషం.

   తొలగించండి
 15. రామచిలుక జంటలచట
  ప్రేమాతిశయమ్ము లొప్ప విహరించుచు నా
  రామంబుల నున్నవి మా
  రాములు సేయుచు ఘనాను రాగము వెలయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   పద్యం చాలా బాగుంది. కాని ఇది ఏ సందర్భంగా వ్రాశారో పేర్కొనలేదు.

   తొలగించండి
  2. వినయాన్వితు డైనను స
   జ్జనునకు నపకార ముర్వి సలు పూరక దు
   ర్జనుడుం బేటికఁ జీరలు
   చినింగి బోవం గొఱికెడు చిమ్మెట భంగిన్

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   ‘ఊరక సజ్జనుం డొదిగి...’ పద్యభావానికి మీరు వ్రాసిన పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దత్త చిత్రాన్ని పెద్దది చేసి చూస్తే రామ చిలకల జంటలు కన్పిస్తున్నాయి. వలయాకారము లో నున్నవి యవి ఆడుకోవడానికి వేసిన ఇనుపవల యని భావించి వ్రాసిన పద్యము. విమానాశ్రయములో కూర్చుని వ్రాసిన పద్యము.

   తొలగించండి