హనుమచ్ఛాస్త్రి గారూ, నేను గమనించనే లేదు సుమా! మీరే దోషాన్ని గుర్తించి సవరించినందుకు సంతోషం! అన్నట్టు... మీరు పంపిన సమస్యను కొద్దిగా మార్చి రేపు ఇస్తున్నాను. మార్చినందుకు మన్నించండి. దానిని యథాతథంగా తరువాత ఇస్తాను. మీ మెయిల్ చూడండి.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, ధన్యవాదాలు. ‘మనః+అధినాయక=మనోధినాయక’ అవుతుందన్న విషయం గుర్తుకు రాలేదు. ఇప్పుడు సవరిస్తున్నాను. మీ పద్యం మనోహరంగా ఉంది. మీకు నా వందనశతముల్.
జనగణ మనాధి నాయక
రిప్లయితొలగించండిజననీ హరితాంబరధర సంవృతధాత్రీ
ఘనసంస్కృతి దాయిని ఖని
వన నగ సుజలసు ఫలమ్మె భారత జననీ
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
జనగణ మనాధి నాయక
రిప్లయితొలగించండిమనవలె మనమును గుణముల మరువము తోడన్
కనవలె భారత దేశము
అనఘ ! అనఘ ! యనగ భువిన ఆమని గాంచన్
శుభాకాంక్షల తో
చీర్సు సహిత
సావేజిత జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘భువిని నామని గాంచన్’ అనండి.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి---------------------------
జనగణ మనాధి నాయక
వినినంతనె పులకరించు వీనుల విందౌ
ఘనతర సంస్కృతి సంపద
మనదే ననిమోద మొంద మనముప్పొంగన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మనదే యని..’ అనండి.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తొలగించండి----------------------------
జనగణ మనాధి నాయక
వినినంతనె పులకరించు వీనుల విందౌ
ఘనతర సంస్కృతి సంపద
మనదే యనిమోద మొంద మనముప్పొంగన్
జనగణమనాధినాయక!
రిప్లయితొలగించండియనవరతము నిన్నె గొలుతు నాశ్రయమిమ్మా!
మనగను సంతోషంబున
వినుమా యికనాదుమొరనువితరణ బుధ్ధిన్
పొచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జనగణ మనాధి నాయక
యనిఘనముగ బాడుడెగుర గణతంత్ర మహా
దినమున మనజెండాయే
వినువీధుల విశ్వశాంతి వెలుగుల నింపన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
యతి దోష సవరణతో
తొలగించండి" జనగణ మనోధి నాయక "
ఘనముగనని బాడుడెగుర గణతంత్ర మహా
దినమున మనజెండాయే
వినువీధుల విశ్వశాంతి వెలుగుల నింపన్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండినేను గమనించనే లేదు సుమా! మీరే దోషాన్ని గుర్తించి సవరించినందుకు సంతోషం!
అన్నట్టు... మీరు పంపిన సమస్యను కొద్దిగా మార్చి రేపు ఇస్తున్నాను. మార్చినందుకు మన్నించండి. దానిని యథాతథంగా తరువాత ఇస్తాను. మీ మెయిల్ చూడండి.
జనగణమనోధి నాయక
రిప్లయితొలగించండిదినకర నిభ భారత ధనదేశా యమునా
ఘన గంగాది నదీ నద
వననిధి భాసిత తరంగ వందన శతముల్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు. ‘మనః+అధినాయక=మనోధినాయక’ అవుతుందన్న విషయం గుర్తుకు రాలేదు. ఇప్పుడు సవరిస్తున్నాను.
మీ పద్యం మనోహరంగా ఉంది. మీకు నా వందనశతముల్.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీరు పెద్ద వారు.మీనుండి శతాశీస్సులే కోరుకుంటాను. ధన్యవాదములు.
తొలగించండిజనగణమనాధినాయక
రిప్లయితొలగించండివనజల ఘనతర హిమాద్రి వనరుల సముదా
యని భారతజననీ త్రిభు
వనపావనికివె జయజయ వందన శతముల్ !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనగణమనోధి నాయక
తొలగించండియన మన మది మెదలు వారి యాచరణమ్ముల్
మనమాచరించి నంతనె
ఘనమౌ ఫలమందు మాట ఖాయము సుమ్మా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
జనగణ మనోధి నాయక
రిప్లయితొలగించండిగణతంత్ర దినోత్సవాన కలసియు పలుకే
మనజాతీయత|మరచిన
తనవారిని మరచినట్లె తలపోయుమయా.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
జనగణమనాధినాయక
రిప్లయితొలగించండిజననీ సౌభాగ్య ధాత్రి శ్యామల పుడమీ
మునిగణ సేవిత ధరణీ
ఘననగముల జలవనరుల కడలిసుపుత్రీ
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
జనగణమనోధినాయక
రిప్లయితొలగించండియని బాడుచు భరతదేశ యశమును చాటన్
జనవరి ఇరువది యారున
మనజెండానెగురవేయు మహిలో జనులే!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శైలజగారూ! మీ పద్యం బాగుంది. చివరి పాదంలో క్రియ బహువచనానికి సరిపడదేమో ననిపిస్తుంది. పరిశీలించ మనవి.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండి‘వేయునట్టి’ అనే అర్థంలో సరిపోతుంది.
జనగణమనోధి నాయక
రిప్లయితొలగించండిమనరైతుల పాట్లు గాంచు మాన్యత తోడన్
ఘననేతలు స్వార్థముతో
గొనుచుండగ పంట పొలము కూలును బ్రతుకే
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిజనగణమనాధినాయక
యను గేయము వినుచు నుండ మది యుప్పొంగున్
మనపిల్లలకెల్లను నిటు
మనసుకు హత్తునటుల నేర్ప మరువరు భువిలో.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
జనగణ మనోధి నాయక
రిప్లయితొలగించండిఅనవరతము ప్రజకు మేలు నందించు మయా
తనదౌ స్వార్థము నెంచిన
మనుగడలోగెలువనగున మంచుయు లేకన్
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనగణమనోధినాయక...
తొలగించండియనగనె నీవేడ్చుచుండి యందరి లోనన్
మనమున్న లేక పోయిన
మునుపటి వలె లేవ వలెను ముదుసలి శాస్త్రీ!
రిప్లయితొలగించండిజనగణమనోధినాయక
మనమంతా కలిసిమెలిసి మహిలో దేశం
బును మేలగు రీతిగ ని
ల్పి నలుగురు పొగుడగ భళి మలిచెదము రమ్మా !
జిలేబి