26, జనవరి 2016, మంగళవారం

సమస్య – 1925 (వందే మాతర మన్నమాట...)

కవిమిత్రులారా,
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వందే మాతర మన్నమాట చెవి కింపై తోఁచ దెవ్వారికిన్.

42 కామెంట్‌లు:

 1. గురువు గారికి కవిమిత్రులకు 67వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


  రిప్లయితొలగించండి
 2. ఇందేమున్నది భారతావనిన పిచ్చెక్కించె యాచారముల్
  పొందంగన్ ధనమెక్క డేడ్చెనిట, యంభోధిన్ సునాయాసమున్ దాటిన
  న్నందున్ మాకట సంపదల్ సుఖము లాహార్యమ్మనెంచంగ నీ
  వందేమాతరమన్న మాట చెవికింపై తోచదెవ్వారికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదం చివర గణదోషం. ‘భారతావనిని పిచ్చెక్కించె నాచారముల్’ అనండి. ‘...యంబోధిన్ దరింపంగఁ బో| నందున్...’ అందాం.

   తొలగించండి
  2. ఇందేమున్నది భారతావనిన పిచ్చెక్కించె నాచారముల్
   పొందంగన్ ధనమెక్క డేడ్చెనిట, యంభోధిన్ దరింపంగబో
   నందున్ మాకట సంపదల్ సుఖము లాహార్యమ్మనెంచంగ నీ
   వందేమాతరమన్న మాట చెవికింపై తోచదెవ్వారికిన్

   తొలగించండి

 3. శుభోదయం

  సందేహాలను వీడి భారత ఘన స్వాతంత్ర నామాంబుధిన్
  అందేగానర నేడు భూరిగ కవీ ! ఆకాశ హర్మ్యమ్ము లన్
  అందేషా విడు; నీ కరాన బలమే భారీగ సాకార మౌ
  వందేమా తరమన్నమాట చెవికింపైతోచదెవ్వారి కిన్ ?

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ శార్దూల రచన ప్రశంసార్హం. అభినందనలు.
   మూడవపాదంలో యతి తప్పింది. ‘అందేషా విడు’...?

   తొలగించండి
 4. సందో హంబున సాగిపోవు జనులీ సంసార బంధం బులన్
  విందే మున్నది నింగినంటు ధరలన్ వేసారి బోవన్ మదిన్
  సంధా నించగపిల్ల పాపలకటన్ సామాన్య సంసారికిన్
  వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్

  రిప్లయితొలగించండి
 5. ఎందున్ జూచిన బానిసత్వ బ్రతుకే యీదేశ మున్నేలగా
  బందీ లైరి ; స్వతంత్ర సిద్ధికి జనుల్ ప్రాణాల నర్పించ , రా
  బందుల్ నేతలు భోగభాగ్య ములకే బందీలుగా మారగా
  వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్.

  వం ,దేమాత్రము కూరనార కొనగా పట్నాలనున్ పల్లెలన్
  కందుల్ '' వందలు '' రెండు నోట్లి డినచో కన్పించు మార్కెట్ల లో
  మందు ల్లంబర మంట రోగులు ఋజన్ మంచాలనే బట్టగా
  వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్.

  నిన్నటి సమస్య కు నా పూరణ :-

  అక్షరములె '' తెలుగు '' నారంభమున నేర్చి
  యమెరికాకు యెగుర నాంధ్ర మేల !
  తనను గనిన తల్లి దండ్రుల నే వీడ
  తెలుఁ గదేల నీకుఁ దెలుఁగుబిడ్డ.?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి.
   నిన్నటి సమస్యకు పూరణ కూడ బాగున్నది. ‘అమెరికాకు నెగుర...’ అనండి.
   అభినందనలు.

   తొలగించండి
 6. వందేమాతర గీతినొక్క శృతినే పాడంఘ మాధుర్యమౌ
  సుందరమైనబాణి విడువన్ చూడంగ పాశ్చాత్యమై
  డెందమ్మంటని ఘోరమైన ధ్వనితో డీడిక్కు బాణీలలో
  వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో గణదోషం. ప్రారంభంలో రెండక్షరాలు టైపు కాలేదు. ‘విందౌ సుందరమైన బాణి విడువన్ వీక్షింప పాశ్చాత్యమై’ అందామా?

   తొలగించండి
  2. మాస్టరుగారూ ! ధన్యవాదములు...మీ సూచనతో ..సవరణతో...

   వందేమాతర గీతినొక్క శృతినే పాడంగ మాధుర్యమౌ
   విందౌసుందరమైనబాణి విడువన్ వీక్షింప పాశ్చాత్యమై
   డెందమ్మంటని ఘోరమైన ధ్వనితో " డీడిక్కు " బాణీలలో
   వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్.

   తొలగించండి
 7. వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్
  సందేహం బది యేలవార లిట దేశాందోళ నోద్దేశ్యులే
  యిందందే యననేల సచ్చరితులన్యెందెందు గాలించిన
  న్నందందే గలరుత్త మోత్తములు మాత్రారాధ్యు లిద్ధాత్రినిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సచ్చరితులన్ + ఎందెందు' అన్నప్పుడు యడాగమం రాదు కదా. 'సచ్చరితుల న్నెందెందు' కు టైపాటనుకుంటాను.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ముందు వ్రాసిన “యె” తీయకపోవడము వలన దృతములో కలసిపోయింది. చూసుకోలేదు. ధన్యవాదములు.

   తొలగించండి
 8. సమస్య వందే మాతరమన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్
  సందేహమ్ముల సాంద్రమున్ మునిగి విశ్వాసాన జైహిందనన్
  అందేప్రాప్తము యూహ కందినను నానందంబు మీకబ్భునా?
  నిందల్ మానుచు భారతాంభనిధి సాన్నిద్యాన ద్యానించుమా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సందేహమ్ముల వార్ధిలో మునిగి... అందే ప్రాప్తము లూహ కందినను.. భారతాంబ పద సాన్నిధ్యాన ధ్యానింపుమా' అనండి.

   తొలగించండి
 9. వందేమాత్రము నేడు గాంచ ధరలే భారమ్ముగా మారుచున్
  పొందే వేతన మున్ కొట్టులవిసం పూర్ణమ్ముగా మ్రింగగన్
  సందేహమ్మిక యెందుకో ధరణిలో సంతోషమెట్లుండునో
  వందేమాతరమన్నమాట చెవికింపై తోచదెవ్వారికిన్


  చిందుల్ వేయగనెంచు నేటి యువకుల్ చిత్రాతి చిత్రమ్ముగా
  బందూకుల్ భయ పెట్టు భీకరపు శబ్ధాలట్లు మ్రోగంగ నా
  నందంబంచును గెంతువారికిక సౌహార్ద్రంబుయౌ గీతమౌ
  వందేమాతర మన్నమాట చెవికింపై తోచదెవ్వారికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సౌహార్దంబునౌ' అనండి.

   తొలగించండి
 10. వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్
  సందేహం బిదియేల వచ్చెరజనీ! సామూలముం జెప్పుమా
  వందే మాతర మంచు పల్కు మిపుడే వర్ష్మంబు లుప్పొంగగ
  న్నందంబే యగు నట్లు జేయ ప్రజకున్నాహ్లాదముం గల్గెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. * గు రు మూ ర్తి అ చా రి *
  „„„„„„„„„„„„„„„„„„„„„„„„

  బొ౦దిన్ స్వఛ్చపు దేశభక్తి రుధిర౦బున్ గల్గి|దీన ప్రజా
  బా౦ధవ్యేషణమె౦చి|స౦తతము సత్సేవ క్రియోత్సాహమున్
  బొ౦దన్ గోరెడు నట్టి వార లరుదై పోవ౦గ.హా!అక్కటా!
  వ౦దే మాతర మన్న మాట చెవి కి౦పై తోచ దెవ్వారికిన్

  { బా౦ధవ్యము = స౦బ౦ధము ; దీనప్రజా
  బా౦ధవ్య + ఈషణము = పేద వారి తో
  స౦బ౦ధము కలిగి యు౦డుటను వా౦ఛి౦చుట.} ి

  రిప్లయితొలగించండి
 12. వందే మాతర మన్న మాట కడు భావా వేశ సంతప్తులై
  సందేహం బది సుంత లేక తమ విశ్వాసంబు మిన్నంటగన్
  సందోహంబుగ దేశ భ క్తి రతులే స్వాతంత్ర్యతన్ జెప్ప ... ఈ
  వందే మాతర మన్న మాట చెవి కింపై తోచ దెవ్వారికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. రిప్లయిలు
  1. నాయకులు నాడు - నేడు

   బృందమ్మై పరపాలనమ్ము మనలన్ వీడంగ నాడందరున్
   వందేమాతరమంచు దూకిరొకటై పంతమ్మునన్ బోరగన్!
   సందోహమ్ముగ గెల్చి నేడు పదవుల్, సంపాదనే ముఖ్యమై
   వందేమాతరమన్న మాట చెవికింపై తోఁచదెవ్వారికిన్!

   తొలగించండి
  2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. విందుల్ జర్చ లనేకముల్ నడచులే విశ్వాసమున్ బెంచగా
  చిందుల్ వేతురనేకరీతి సభలో చీత్కారముల్ చేయుచున్
  సందేహమ్ములు రాకమానవుగదా సద్వర్తనుల్ గాదనీ
  వ౦దే మాతరమన్నమాటచెవికి౦పై తోచదెవ్వారికిన్!!!

  రిప్లయితొలగించండి
 15. రం దిన్ బొంది ధనమ్ముపైన, సతమున్ రాజ్యమ్ము భోజ్యమ్ము గాన్
  విందుల్ తోడ చరించు నాయకులకున్ , ప్రే మేది దేశమ్ముపై ?
  పొందన్ జాలక వెచ్చమెప్డు , వ్యదలన్ బొందంగ సామాన్యులున్
  వందేమాతరమన్న మాట చెవికింపై తోచ దెవ్వారికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. .వందే మాతర మన్నమాట.చెవి కింపై తోచదెవ్వారికిన్
  సందేహమ్మగుపూల గంధము కడన్-సాగించదుర్గంధమే|
  ముందే మాతర మౌన? చూసెదముమున్ముందున్నటివీలలో
  నిందల్ బంచకు నేటిమార్పులకు మన్నించమ్మ మాదేశమా.

  రిప్లయితొలగించండి
 17. తిందామా పలు వక్ర మార్గమున సందింతైన కన్పించినన్
  ఉందామా కడు వైభవంబున సదా యీ యుర్విలో హాయిగా
  కొందామా పర భూములెల్ల మన పుత్రీ కొడ్కులున్ మెచ్చ నీ
  వందే మాతర మన్నమాట చెవి కింపై తోఁచ దెవ్వారికిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. ​వందల్ వేలు స్వతంత్ర యోధులతి విశ్వాసమ్ముతో ​పోరగా
  ​​పొందెన్ ముక్తిని భారతాంబ ప్రజ లుప్పొంగంగ స్వేచ్ఛాయుతా
  నందంబున్ గని తీవ్రవాదులిక ప్రాణంబుల్ గొనంగన్నహో
  ​వందేమాతర మన్న మాట చెవికింపై తోచ దెవ్వారికిన్ !

  రిప్లయితొలగించండి
 19. నిందల్మోపుచు భారతీయతను తా నిష్టంబు పెంపారగా
  విందుల్జేయుచు గోవు మాంసమున యూపీలో జిహాదీయు డా
  సందోహమ్ముల దాగుగా నెచట నిస్సందే హమై భ్రాతలే
  వందే మాతర మన్నమాట చెవి కింపై తోఁచ దెవ్వారికిన్

  రిప్లయితొలగించండి
 20. RSS భక్తుడువాచ:

  విందుల్ జేయుచు గోవు మాంసమున భల్ వెంటాడి పందుల్ నహో
  బందోబస్తులు జేసి బుర్కలనయో బంగారు బూబమ్మలన్
  హిందూత్వమ్మన కంపమొందెడిని యా హేయంపు మస్జీదులన్
  వందే మాతర మన్నమాట చెవి కింపై తోఁచ దెవ్వారికిన్

  రిప్లయితొలగించండి