28, జనవరి 2016, గురువారం

పద్యరచన - 1159

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

43 కామెంట్‌లు:

  1. విస్తారంబగునడవిని
    నాస్తియనగఁ జేసినారు నవయుగమందున్
    పస్తులె మాకు మిగిలెనని
    రాస్తారోకోలిట వనరాజులు సేసెన్!!

    రిప్లయితొలగించండి
  2. కొలువుదీ రెమృగ రాజులు
    మెలకువ లేకున్న మీకు నెముకలు మిగలవ్
    కలకలము రేపె నాకలి
    బలిమిగ పట్టితి నవలె పాంధుల నిపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. ‘కొలువయ్యెను మృగరాజులు’ అనండి. రెండవపాదంలో యతి తప్పింది. ‘మెలకువ లేకున్న మీకు మిగుల వెముకలున్’ అనండి.

      తొలగించండి
    2. కొలువయ్యెను మృగరాజులు
      మెలకువ లేకున్న మీకు మిగుల వెముకలున్
      కలకలము రేపె నాకలి
      బలిమిగ పట్టి తినవలె పాంధుల నిపుడున్

      తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  4. జిగురు వరి రాస్తా రోకో సెహ భేషు :)

    మా వనములేడ ? మానవ!
    మీవలె మేమును పుడమిన మీరిన వేడిన్
    రావము జేతను అలయుచు
    దోవన చల్లని పవనము దోచున నితిమే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘రావము చేత నలయుచును... దోచు ననవలెన్’ అనండి.

      తొలగించండి
  5. పరుషపు ఘాతపు వాడికి
    యరణ్యములె మృగ్యమైన యరుదెంచును గా
    పురములకై వడివడిగను
    హరులు వినుమిక నరుడా స్వయంకృత మిదియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘వాడికి| నరణ్యములె... మైన నరుదెంచునుగా...’ అనండి.

      తొలగించండి
  6. అడవిని బాటలు వేసి యాక్రమించితిరంచు పులులు
    నడుదారి యందున నిల్చి నరులను ప్రశ్నించుచున్న
    సడలని నిర్లక్ష్యసరళి జడమైన నరజాతి సాగు
    మిడిమేలపుసిరుల మెఱయు మిడిసిపాటులివియేలోకొ?

    రిప్లయితొలగించండి
  7. వచ్చి పోవువా హనములు భయప డంగ
    నడవి సింహము లచ్చటయడ్డముగను
    దారి కాచెను జూడుడు,దారిలేక
    నాగి పోయెను కారులే యార్య! యచట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘...లచ్చట నడ్డముగను...’ అనండి.

      తొలగించండి
  8. ఘోరారణ్యద్రుమముల
    వీరావేశ మలరంగ విచ్ఛేదించన్
    సారంగారి సమూహమ
    వారిత సువిహార లీల భాసిలె నచటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  9. అడవులన్నినరుక నాహారము కొరకు
    తెరువుపైకి వచ్చె తెలిమెకములు
    అడవి మృగములన్ని యంతరించుట గల్గు
    ప్రకృతి సమతులితము బాడుజేయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    " మనమున నె౦చ కోయి యణుమాత్రము ,మా గతి గూర్చి | ము౦దు నీ
    మనుగడ నాశ మౌను సుమి|క్ష్మా పయి మేఘము లెట్లు వర్షిలున్
    వనముల నెల్ల ఖ౦డన మొనర్చిన?యోజన.సు౦త. జేయుమా"
    యని వివరి౦ప వచ్చినవి వ్యాఘ్రము లన్నియు "రోడ్డు" మీదకున్

    రిప్లయితొలగించండి
  11. పద్యరచన పులుల నివాసమే నడవి-పూర్తిగ రక్షణ వాటికున్నచో
    పలువురు గొట్టివేసియు విపత్తునుబంచగ జంతు జాలమే
    కలవరమంది తిండియు సకాలమునందున చిక్కకున్నచో
    నిలచెను కార్ల కడ్డముగ నేటిసమాజపుమార్పుగోరియే|

    రిప్లయితొలగించండి
  12. .కారుల కడ్డమై పులులు కారడ వందునగాక నిల్వగా
    దారికి మార్గమేది? మనదారులు వీడి అరణ్య భాగముల్
    చేరియు నాశనంబొసగ?చేరక నుండున జంతుజాలముల్
    మారు సమాజ సంస్కృతుల మాయయె|స్వార్థము-నాశనంబుకే|

    రిప్లయితొలగించండి
  13. వనము మాది తోడ బాటయు మాదిగా
    యనుచు నున్న రీతి యడ్డముగను
    రాచఠీవి తోడ రాణించ సింహముల్
    చూచి భయము నందె చోదకుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘రీతి నడ్డముగను’ అనండి.

      తొలగించండి
  14. వనము లోన వాసముండు వనమృగముల గాంచుమా
    కనికరమ్ము లేని ప్రజల కనులను తెరిపించుమా
    వన తరులను గిరుల గూల్చ వాస రహిత సింహముల్
    మనుజులకును బుద్ధి జెప్ప మార్గ మడ్డ గించెగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. కారులు మారగ వేసిరి
    తారులతో పెద్దపెద్ద దారులు మాకౌ
    దారులు మృగ్యమ్మని వని
    చేరెను మృగరాజులటకు చేయగ ధర్నా !


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. రిప్లయిలు
    1. వన్యమృగాధి పతులమై
      యన్యాయము జరిగెననుచు నాక్రోశించన్
      విన్యాసము కాదిది చై
      తన్యుండగు 'కేజ్రివాలు' ధర్నా లెరుకే!

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. మా సంరక్షణ మెంచక
    మీ సంపద పెంచుకొనగ మేదిని యందున్
    వాసమ్ములు చందనములు
    మోసమ్మున దోచ మాన మూగితి మిటులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ రెండవపద్యం బాగున్నది. అభినందనలు.
      ‘దోచ మాన’...?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. మీ ఆరోగ్యము జాగ్రత. 'దోచుట మానేంత వరకు' అనే భావంతో వ్రాశానండి. పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
    3. సహదేవుడు గారూ,
      మీ వివరణ సంతృప్తికరం. సంతోషం, ధన్యవాదాలు.

      తొలగించండి