4, జనవరి 2016, సోమవారం

సమస్య – 1904 (బాటఁ బట్టి పోవు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు.

47 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు

    హితము గోరు సన్ని హితులాడు మాటలు
    కఠిన మనుచు దలచి కాలదన్ని
    యడ్డదారిన ధన మార్జింప నవినీతి
    బాట బట్టి పోవు వాడు ఖలుడు

    రిప్లయితొలగించండి
  2. సజ్జనుండెపుడును సన్మార్గు లేగెడి
    బుధుల బాట బట్టి పోవువాఁడు
    ఖలుఁడు దలచు నెపుడు కలిగించనిడుములు
    వారికడ్డు దగిలి వైరమూని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  3. చెలిమి జేసి నంత చెలికాని హితముకై
    మంచి నడత గలిగి నెంచి జూడ
    దుష్ట బుద్ధి తోడ దురితమం దునచెడు
    బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘హితమునకై’ అనడం సాధువు. అక్కడ ‘హితమునన్’ అనండి. అలాగే ‘...గలిగి యెంచి’ అనండి.

      తొలగించండి
    2. చెలిమి జేసి నంత చెలికాని హితమునన్
      మంచి నడత గలిగి యెంచి జూడ
      దుష్ట బుద్ధి తోడ దురితమం దునచెడు
      బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు

      తొలగించండి

  4. బాన బెట్టి సార బాయును మూర్ఖుడు
    వాడి జోడు కీడు బాపు వాడు
    ఆడ కూడ బెట్టి ఆడయు ఈడయు
    బాట బట్టి పోవు వాడు ఖలుడు

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ ! ఆటవెలది వ్రాయటం వచ్చింది...అభినందనలు.

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      సంతోషం! ఆటవెలదిని సమర్థంగా వ్రాశారు. అభినందనలు.
      ‘బాన బెట్టి సార’... అర్థం కాలేదు. ‘ఆడ, ఈడ’ అనడం గ్రామ్యం. ‘అచట కూడబెట్టి యచటయు నిచటయు...’ అనండి.

      తొలగించండి

    3. గోలి వారు

      నమో నమః !
      సాఫ్ట్ వేరు కార్ఖానా జిలేబి తయారీ :)

      @కంది వారు !

      నెనర్లు

      బాన బెట్టి సారాయ కాచును మూర్ఖుడు అన్నట్టు వ్రాసా !

      భట్టి బెట్టి సాహెబాయను మూర్ఖుడు
      వాడి జోడు కీడు బాపు వాడు
      అచట కూడ బెట్టి అచటయు యిచటయు
      బాట బట్టి పోవు వాడు ఖలుడు

      చీర్స్
      జిలేబి
      (ఆటవెలది)

      తొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    జార సఖ్యతఁ గొని; చోరులతోఁ గూడి;
    చెడ్డవారి పొందుఁ జెలఁగి పొంది;
    చేయరాని పనులఁ జేయఁజూచెడు చెడు

    బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు!

    రిప్లయితొలగించండి
  6. ఆట పాట తోడ నంతయు సమయమ్ము
    ఖర్చు జేసి చివరి కాలమందు
    కాలుడెదురు రాగ కాళ్ళను బట్టెడు
    బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ఆట పాట తోడ నంతయు సమయమ్ము
    ఖర్చు జేసి చివరి కాలమందు
    కాలుడెదురు రాగ కాళ్ళను బట్టెడు
    బాటఁ బట్టి " పోవు " వాఁడు ఖలుఁడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి వారూ,
      ‘పోవు’ను హైలైట్ చేసి విశేషార్థాన్ని సాధించారు. అభినందనలు.

      తొలగించండి
  8. తప్పులెన్నొ చేయు తప్పించుకు తిరుగు
    చెడ్డ దారి పట్టి చెడుచు నుండు
    వ్యసనములకు లొంగి యశతో నవినీతి
    బాట పట్టి పోవు వాడు ఖలుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘యశతో’... ‘యాశతో’ అనుకుంటాను. లేకుంటే గణదోషం, అర్థలోపం.

      తొలగించండి
  9. తల్లి దండ్రు లనిన దయలేక వర్తించు
    క్రూరకర్ముడైన కొమరుడకట!
    ఎంత వేడుకొన్న నేహ్యంపు భావాల
    బాటపట్టి పోవు వాడు ఖలుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. తల్లి దండ్రు లనిన దయలేక వర్తించు
    క్రూరకర్ముడైన కొమరుడకట!
    ఎంత వేడుకొన్న నేహ్యంపు భావాల
    బాటపట్టి పోవు వాడు ఖలుడు.

    రిప్లయితొలగించండి
  11. దుష్ట బుధ్ధి తోడ దురితము ల్గావించు
    పురుషు బాట పట్టి పోవు వాడు
    ఖలుడు,వాని తోడ మెలగకూ డదెపుడు
    దూరముండ వలయు దుష్టులకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. సజ్జనుండు వెలుగు సచ్ఛరితమ్ముల
    ధనమద గరిమంబు దలకొన నతి
    దురిత కారకుండు దుష్టుడైన విభుని
    బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. నమ్ము వారినెల్ల నాశమ్ము జేయుచు
    కన్నవారి పైన కరుణ మరచి
    అప్పనముగ ధనము నార్జించ నవినీతి
    బాట బట్టి పోవువాడు ఖలుడు!!!

    రిప్లయితొలగించండి
  14. స్వార్ధ పరుడు జనుల వంచించి పనులను
    లంచ మొసగి సేయ మంచివాడు
    నీతి నియమములను నెర నమ్మి న్యాయపు
    బాటపట్టి పోవువాడు ఖలుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      లోకం పోకడను వివరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. క్ష్మాతలమున బుద్ధి కర్మానుసారిణి!
      సీతను విడి రాముఁ జేరి కొల్వ
      మనిన ననుజు, నాలి నాదరించక చెడు
      బాటఁ బట్టి 'పోవు'వాఁడు ఖలుఁడు

      తొలగించండి
    3. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు కెంబాయి వారికి ‘ప్రత్యుత్తరం’ను క్లిక్ చేసి పోస్ట్ చేయడం వల్ల నా దృష్టికి రాలేదు.

      తొలగించండి
  15. విద్య వదలి వేసి వీ ధుల దిరుగుచు
    నన్ని వ్యసనములకు నాహుతగుచు
    పెద్దలపలుకులను వినక సతము చెడు
    బాటపట్టి పోవువాడు ఖలుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఆహుతి+అగుచు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘ఆహుతి యయి’ అనండి.

      తొలగించండి
  16. మంచి వాని మాట మన్నించ కెప్పుడు
    చెనటి నారి తోడ చెలిమి చేసి
    మంచి మార్గ మొదలి మహిలోన వంకర
    బాట బట్టి పోవు వాడు ఖలుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వదలి’ని ‘ఒదలి’ అనడం దోషం. ‘మార్గము విడి’ అనండి.

      తొలగించండి
  17. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    తాను బ్రతుకుచుండి తదితరుల్ బ్రతుకగ
    త్రోవ జూపు వాడు దైవ సముడు
    తనదు సౌఖ్యములకు తరగని హింసల
    బాట బట్టి పోవు వాడు ఖలుడు

    శ్రీ శంకరయ్య గారి కి నమస్కారములు
    మా నాన్న గారి నిన్నటి పూరణలను కూడా
    క్రింద నిచ్చితిని .పూరణలు వారు సకాలంలో చేసినను నేను " విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నదున టైపుచేయలేక పోయితిని. మా కుమార్తెలు చి.సౌజన్య , శిరీషలు ( ఈ టీవి, మా టీవి,జీటివి చానెళ్ళ లో పాడాలని వుంది,పాడుతా తీయగా ,స్వర నీరాజనం,ఒక్కరే,సూపర్ సింగర్ 6, మరియు 8 ఫేమ్ ) విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో సినీ సంగీత విభావరి లో పాల్గొన్న కారణంగా నాకు సమయం లేక పోయింది. మా నాన్న గారు రచించి స్వర పరచిన లలిత గీతాలు, జానపద గీతాలు వీరు పాడి శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రశంసలు పొందినవారే.

    చౌక మద్యము పల్లెలో చాల త్రాగి
    యడ్డపొగ పీల్చి యవధాని ననుచు నొకడు
    పలికె పూరణ మీవిధి పద్యమనుచు
    చైత్రమందు వినాయక చవితి వచ్చు

    తెలుగు వారి యుగాది యేతెంచు విధిగ
    చైత్రమందు ; వినాయక చవితి వచ్చు
    భాద్రపదమందు, గణపతిన్ భక్తి గొలువ
    తలచు కార్యము సిద్ధించ గలుగు శుభము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ కుమార్తెల ప్రతిభా పాటలవాలను గురించి తెలిసికొని సంతోషిస్తున్నాను. వారికి నా శుభాశీస్సులు.
      ఇక మీ నాన్నగారు భాగవతుల కృష్ణారావు గారి పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. సమస్య ముగ్ధ మోహనుండు మోజుగ ప్రేమతో
    కన్య కాంక్ష బెంచి కట్నమడుగు
    మంచి వంచనాన నెంచెడి మార్గాన
    బాటబట్టిపోవువాడు ఖలుడు

    రిప్లయితొలగించండి
  19. సద్గుణమును వీడి సంస్కారమే మర్చి
    తల్లి దండ్రు లనిన దయను మాని
    పాపభీతి లేక పలువురు వలదన్న
    బాట బట్టిపోవు వాడు ఖలుడు

    రిప్లయితొలగించండి
  20. గురుదేవులకు ప్రణామములు. నా పద్యము సమీక్షించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  21. క్షమించండి. మరలా పోస్ట్ చేసెదను.

    క్ష్మాతలమున బుద్ధి కర్మానుసారిణి!
    సీతను విడి రాముఁ జేరి కొల్వ
    మనిన ననుజు, నాలి నాదరించక చెడు
    బాటఁ బట్టి 'పోవు'వాఁడు ఖలుఁడు

    రిప్లయితొలగించండి
  22. క్షమించండి. మరలా పోస్ట్ చేసెదను.

    క్ష్మాతలమున బుద్ధి కర్మానుసారిణి!
    సీతను విడి రాముఁ జేరి కొల్వ
    మనిన ననుజు, నాలి నాదరించక చెడు
    బాటఁ బట్టి 'పోవు'వాఁడు ఖలుఁడు

    రిప్లయితొలగించండి