22, జనవరి 2016, శుక్రవారం

పద్యరచన - 1155

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

31 కామెంట్‌లు:

  1. శుభోదయం

    చోరుల భయమున వేసితి
    జోరుగ బీగము మరీను జోళ్ళకు హుర్రే
    తీరుగ సైకిలు జతయుగ ;
    నేరుగ వెళితిని చదువులు నేర్వగ చక్కన్ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘మరీను, వెళితిని’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘మరియును... సైకిలుకు జతగ... నేరుగ నేగితి...’ అనండి.

      తొలగించండి

  2. గుడిముందర బడిముందర
    పడిగాపులు బడుదు రంట పగలే చోరుల్
    విడువగ చెప్పులు సైకిళ్ళు
    బిడియము లేకుండ దోచు బీగము లేకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘సైకిలు’ అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    2. గుడిముందర బడిముందర
      పడిగాపులు బడుదు రంట పగలే చోరుల్
      విడువగ చెప్పులు సైకిలు
      బిడియము లేకుండ దోచు బీగము లేకన్

      తొలగించండి
  3. పవన మున్న చాలు పయనించు దూరాలు
    పాదరక్ష లిచ్చు బద్ర తేల?
    పేదవాడి కదియె పెన్నిధై చెరగును
    ఇంధనమ్మడగని ఇంపులాడి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పెన్నిధి+ఐ’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘పెన్నిధియై యొప్పు’ అనండి.

      తొలగించండి
  4. సైకిలెత్తుకెళ్లు సైలగుళ్లేనుండ
    కాలి జోళ్లు దాన్కి కట్టినంత
    రెండు పోయి నీవు నెండలో నడువగన్
    తల్లడిల్లెదవది తప్పటంచు!
    (సైలగుడు = దొంగ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీవల్ల ‘సైలగు’డనే కొత్తపదం తెలిసింది. కాని ఇది కేవలం జి.ఎన్.రెడ్డి. పర్యాయపద నిఘంటువులో తప్ప ఇతర నిఘంటువులలో కనిపించలేదు.

      తొలగించండి
    2. ధన్వవాదములు గురువుగారూ! సవరించి పూరిస్తున్నాను పరిశీలించ మనవి.

      సైకిలెత్తుకెళ్లు పోకిరీలుండగన్!
      కాలి జోళ్లు దాన్కి కట్టినంత
      రెండు పోయి నీవు నెండలో నడువగన్
      తల్లడిల్లెదవది తప్పటంచు!

      తొలగించండి
  5. పోకిరి గాళ్ళే చెప్పులు
    చేకొని పోకుండ మంచి చిట్కా, కనగన్
    సైకిలు తాళముతోనే
    నొకదానికి రెండు పనుల నూహయె మెత్తున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్చాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. శ్రమ జీవులకుం బుష్పక
    విమాన మైబరగు బ్రీతి విహరింపంగన్
    సముచిత వాహన రాజము
    సమద్విచక్రము చరింప సంతస మొసగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కలియుగ ధర్మం బెవ్విధి
      విలసిల్లె గనుడు రవంత పెడబాసిన వే
      కలుగుం జౌర్యము లీలన్
      లలితమ్ముగ వేసె తాళరాజము భీతిన్

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. నా శతక పద్యము:
      కలుషపది యయ్యె నిప్పుడు
      కలియుగ మేకపదధర్మ కానేర దనన్
      కల యందున ధర్మము భూ
      తలమున నిక పోచిరాజతనయా వినుమా

      తొలగించండి
  7. చెప్పులు పోవుట వలనన
    తప్పని సరి భద్ర పరచదా సైకులుకున్
    గప్పయు తాళము వేసెను
    తప్పదు మఱి యటుల జేయ దాపురి కము గాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. కాలమహిమ నిపుడు గాంచుడు జనులార
    చౌర్య రీతి హెచ్చె జగతి యందు
    సైకిలెత్తు కెళ్ళి చక్కగా నమ్ముచూ
    దొంగ తిరుగు చుండు దొరల వోలె.
    2.పేదవారికిదియె వాహనమ్ము గనుడు
    బడికి వెళ్ళువారి కిడెను ప్రభుత
    దాని నెత్తు కెళ్ళు తస్కరు లెందరో
    కాన తాళమేసి కాపు కాసె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘...నమ్ముచున్’ అనండి.

      తొలగించండి
  9. పద్యరచన పాదరక్షలు-మనుషులపాలిగాక
    వాహనంబును రక్షించు|”సాహసంబు|
    దొంగ-సైకిలుజేబట్టి త్రొక్క దలచ?
    తాళ మెగతాళి ,చెప్పులతన్నులనుచు
    చూపు చిత్రంబు సూచనల్ చోద్యమేగ|

    రిప్లయితొలగించండి
  10. క్రొత్త ద్విచక్ర వాహనము క్రొత్తవి చెప్పులు పుస్తకమ్ములున్
    క్రొత్తది యాసనమ్ము నిక కుట్టును దొంగకు కన్నటంచు నా
    మొత్తము మూడు వస్తులకు మోడిగ బీగము వైచితీవు నీ
    జిత్తులు "దొండపాదు-మడి చీర"కతన్ తలపించునే మదిన్

    రిప్లయితొలగించండి
  11. క్రొత్త చెప్పులెవరు నెత్తుకుపోకుండ
    తాళమును బిగించె తెలివిగాను
    సైకిలు గొనిపోవు చౌరులుండ గ నేడు
    చెప్పులేమిలెక్క చెప్పుడయ్య ?

    రిప్లయితొలగించండి
  12. దెబ్బ కొక్కటికే రెండు పిట్టలనుచు
    తాను సైకిలు జోళ్ళకు తాళమెట్టె
    తిరిగి జూడ రెండును లేక దిమ్మ దిరిగె
    పిట్ట ఒక్కటే ; మరిరెండు దెబ్బలాయె.
    (ఒక్క దెబ్బకే రెండు పిట్టలని ప్లాన్
    వేస్తే ఒక పిట్టకే రెండు దెబ్బలు తగిలె నకటకటా !)

    రిప్లయితొలగించండి
  13. చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద గాకుండా పెట్టెను చెప్పులు
    సైకిలు మీద మరి సైకిలు చోరులే ఉన్నచో చేయునదేమిరా శివా.

    రిప్లయితొలగించండి
  14. చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద గాకుండ‌‌‌ పెట్టెను చెప్పులు సైకిలు మీద. సైకిలు చోరులే ఉన్నచో చేయునదేమిరాశివా

    రిప్లయితొలగించండి