14, జనవరి 2016, గురువారం

సమస్య – 1914 (భోగిపండ్లు వోయ...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భోగిపండ్లు వోయఁ బోయె నుసురు.

53 కామెంట్‌లు:

  1. గురువు గారికీ కవిమిత్రులెల్లరులకు నమస్కారములు

    పిలిచి రనుచు నమ్మ పేరంటమునకేగె
    ప్రక్క యింటి లోని బంధు జనులు,
    భోగి పండ్లు వోయ బోయెను, సురులదీ
    వెనలు దొరుకు నంచు విశ్వసించి

    ఆస్తి కొరకు జ్ఞాతి యందాల పసివాన్ని
    హత్య జేయ నెంచె నదను జూచి
    చెరుకు గడల లోన చిన్నతేలునిపెట్టె
    భోగి పండ్లు వోయ బోయె నుసురు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      అసురులు, భూసురులు అనవచ్చు కాని సురుడుకు బహువచనం ‘సురలు’.

      తొలగించండి
    2. ధన్యవాదములండి.....అలాంటపుడు సురుని దీ
      వెనల అనొచ్చు గదండి

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాకు కూడా ఒకసారి మీరు చెప్పారీ విషయము.
      “ధరణి సురులు” కూడా అన వచ్చును. కానీ “సురులు” దోషము. నేనూహించిన వివరణ యిది.
      “సుర” అ కారంత పుంలింగము బహువచనము.
      కాబట్టి తత్సమము “సురుడు” లేదు. తత్సమము సుర + లు = సురలు బహువచనము మాత్రమే యున్నది. వివరించ గోర్తాను.

      తొలగించండి
  2. పిండి వంట లెన్నొ ప్రియముగా వండిరి
    క్రొత్త యళియ కొఱకు కోరి కోరి
    భోగి పండ్లు వోయఁ బోయెను సురుచిర
    భాగ్య మనుచు వేడ్క పడతు లంత

    అళియ = అల్లుడు

    రిప్లయితొలగించండి
  3. అక్కయ్యా ! అద్భుతం ! చాల చక్కగా నున్నది ! సురుచిరమైన విరుపు !




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోదరులకు ధన్య వాదములు
      గురువులకు,సోదర సోదరీ మణులందరికీ భోగి మరియు సంక్రాంతిశుభాకాంక్షలు

      తొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పక్కింటి పాపాయికై :

    01)
    ____________________________________________________


    భోగి పబ్బ మందు - రేగు పండ్లను కొని
    ప్రక్కవారు పిలువ - పాప తలను
    భోగి పండ్లు వోయ - బోయె; నుసురు బెంచు
    మనుచు గౌరి మాత - నచట వేడె !
    ____________________________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
      ఆండ్రాయిడ్ ఆప్ గురించిన సాంకేతిక లోపాల విషయం నాకు తెలియదు. నా ఫోన్లో మాత్రం చక్కగా పనిచేస్తున్నది.

      తొలగించండి

  5. అందరికీ !

    భోగి సంక్రాంతి శుభాకాంక్షలతో

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. పూజ్య గురుదేవులకు,కవిమిత్రులకు, వీక్షకులకు భోగి పండగ శుభాకాంక్షలు....

    పాడి పంటలమరు పండుగ భోగిన
    సాటి వారి తోడ సంబరముగ
    భోగి పండ్లు వోయ బోయెను సురుగున
    ప్రక్కవారు బిలువ పంకజాక్షి !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ! మూడవ పాదం చివరి మాట 'సరగున' అనవలయునేమొనని సందేహము.

      తొలగించండి
    3. సహదేవుడు గారూ,
      నిజమే. అక్కడ ‘సరగున’ అనడమే యుక్తం. కాని పూరణలో దోషం వస్తుంది. ‘సురుగు’ శబ్దానికి ఉన్న అర్థాల్లో కదలు, చలించు అని కూడా ఉన్నాయి. ఆ లెక్కన ‘సురుగున= కదలుతూ’ అని అర్థం చెప్పుకొని ఆ పూరణకు మినిమమ్ పాస్ మార్కులు వేసేద్దాం.

      తొలగించండి
  7. సంతసంబుతోడ సంకు రాతిరిరోజు
    భోగి పండ్లు వోయ బోయెను సురు
    డీశ్వరుండు సయిత మీక్షించి పైనుండి
    విరుల జల్లి సురలు వేడ్క గనిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  8. భోగ భాగ్యములు గలుగు భోగి నాడు
    సిరియు సంపద లువిరియు శివుని గృపను
    పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని
    పాడి పంటల వృద్ధియు బాగు గాను
    కనుము దినమున మొదలిడు ననుట నిజము .

    సంక్రాంతి శుభా కాంక్షలు
    సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
    సంక్రాంతి మూడు రోజులు
    ‘సంక్రందననుతుఁడు శివుఁడు సత్కృపతోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. భోగి పండ్లు వోయఁ బోయెను సురుచిర
    రూప బాలకృష్ణుఁ బాపడని య
    శోద, బదిరి వృక్ష పాదున తపమున
    బ్రహ్మ తోడ నున్న బభ్రువుఁగనె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. మంచి బుద్ధి గలిగి మాన్యుడ గునట గ
    భోగి పళ్ళు వోయ, బోయె నుసురు
    భోగి మంట బడగ భుగభుగ మని కాలి
    జాగరూకత మవ సరమ యెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మాన్యు డగు నటంద్రు’ అనండి.

      తొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. భోగినాడు సేరి ముదిత లెల్లరుఁ జేయు
    చిత్ర మంత జూచి చిట్టి తల్లి
    గుక్కబెట్టి యేడ్వ మిక్కుటముగ నంత
    భోగిపండ్లు వోయఁ బోయె నుసురు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. “ఉసురు” దృష్టి లేక మనస్సు క్షోభ వలన కలుగు దోషము గా నెంచి వ్రాసిన పూరణ.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. పగటి వేషమటుల పడతి యొకర్తుక
    భోగిపండ్లు వోయఁ బోయెను, సురు
    మాను కండ్ల కద్ది మామిడి పిందెల
    గొలుసు మెడను దాల్చి గొప్పజూప

    రేగు పండ్లలోన రాగి రంగున బాంబు
    నుంచి తెచ్చియిచ్చె నొక్క చెనటి;
    మెరయుచున్నదనుచు మురియుచు తలపైన
    భోగిపండ్లు వోయఁ బోయె నుసురు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. ముందుగా సాహితీ బంధువులందఱకు హృదయపూర్వక భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు
    """"""""""""""""""""""""""""""
    సాగిపోవుచుండె యోగుల దీవనన్
    భోగి పండువనగ యోగ భూమి
    ఎవరి గేహమందు? నెచ్చటా ఘటనంబు?
    భోగి పండ్లు వోయ బోయె నుసురు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. ఇరుగువారు బిలువ నింతి సాగెనపుడు
    భోగి పళ్ళు వోయ;వోయె నుసురు
    నచట నెద్దు కుమ్మనతివ గొల్లుమనుచు
    జనులు గుమిగూడ జాతరయ్యె.
    2.తరుణి సాగెను శుభ తరుణమిదె యటంచు
    భోగి పళ్ళు వోయ వోయెను సురు
    లనుతి యించు పాటలనుపాడగ మురిసి
    బాగు బాగు యనిరి పడతు లెల్ల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘జను లదె గుమిగూడ...’ అనండి.
      రెండవ పూరణలో ‘సురలు’ అనాలి. ‘బాగు+అనిరి’ అన్నపుడు యడాగమం రాదు. ‘బాగు బాగని రట పడతు లెల్ల’ అనండి.

      తొలగించండి
  16. విమల యింట నేడు వేడ్కగా మాయమ్మ
    భోగిపండ్లు వోయబోయె!నుసురు
    ఫెరుగు కాంక్షతోడ!నరమర లేకుండ.
    పెద్దవారి యాశ పెన్నిధౌను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. విమల యింట నేడు వేడ్కగా మాయమ్మ
    భోగిపండ్లు వోయబోయె!నుసురు
    ఫెరుగు కాంక్షతోడ!నరమర లేకుండ.
    పెద్దవారి యాశ పెన్నిధౌను!

    రిప్లయితొలగించండి
  18. భోగిపండ్లు వోయఁబోయె, నుసురు తప్పనిసరిఁ
    బెరుగు ననుచు తరుణియొకతె
    తనకుమారుని గొని తనివితోడ, పిలువ
    పొరుగు వారు వారి యిరవుకడకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. కవి మిత్రులకు,గురుదేవులకు,భోగిపండుగశుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  20. భోగి[రాహువు]పీడ తొలగె భోగి పండ్లు వోయ,
    బోయె నుసురు కాటు వేయ బోవు
    ఫణికి.మృత్యు దోష పరిహార మై బిడ్డ
    స్వస్థు డాయె తల్లి సంతసించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. భోగిపండ్లు వోయబోయెను-సురు
    గు తనకష్టములిక గుర్తురావు
    సంతసంబు సాగు వింతగు బాల్యము
    శంక మాన్పునట్టి సంకురాత్రి|

    రిప్లయితొలగించండి
  22. తేట గీతి రాయ తీరుగ అదిమారి
    ఆట వెలది గాన అయ్యె నోయి
    మాట పాట గాను మారెను కవివరా
    భోగి పండ్లు బోయ బోయె నుసురు

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తేటగీతి వ్రాయ’ అనండి.

      తొలగించండి

  23. తెలుగు రాష్ట్రములను తీరైన రీతిలో
    బాలబాలికలకు పడతులెల్ల
    భోగిపండ్లు వోయఁ బోయె నుసురనుచు
    భోగిపీడ జనుల మోద మలర.

    రిప్లయితొలగించండి