27, జనవరి 2016, బుధవారం

సమస్య – 1926 (గుండ్రాతికి నోరు వచ్చి…)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

 1. గురువు గారికి కవిమిత్రులెల్లరులకు నమస్కారములు

  బండ్రాళ్ళు జెక్కు శిల్పియె
  ఉండ్రాని యడవి జనినట నులితో తొలవన్
  బండ్రాతి సడియె వినినను
  గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘...జని యట యులితో/ జనెనట యులితో...’ అనండి.

   తొలగించండి
 2. ఉండ్రా ళ్ళను గణపతికని
  బండ్రాయిని బియ్యముంచి బరబర ద్రిప్పన్
  గుండ్రముగా రవ్వను జుట్టగ
  గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవపాదంలో గణదోషం. ‘గుండ్రముగ రవ్వఁ జుట్టఁగ...’ అనండి.

   తొలగించండి
  2. ఉండ్రాళ్ళను గణపతికని
   బండ్రాయిని బియ్యముంచి బరబర ద్రిప్పన్
   గుండ్రముగ రవ్వ జుట్టగ
   గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్

   తొలగించండి
 3. తండ్రియె తెచ్చెను ప్రేమగ
  నాండ్రాయిడు ఫోను నొకటి యందున కనగన్
  గాండ్రించె పిల్లి మరియును
  గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్

  అండ్రాయిడు ఫోనులలో
  బండ్రాళ్ళైనను పలుకును బహుచిత్రముగా
  బండ్రాతిని నొక్కిన చో
  గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి


 4. శుభోదయం !

  రండ్రా అంటూ బిలిచెన్
  కొండ్రాళ్ళ కవిత జిలేబి గోముగ చదివెన్
  బండ్రాళ్ల కు మతి బోయెన్
  గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్ :)


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   గుండు వారి సవరణలను గమనించండి.

   తొలగించండి
 5. మిత్రులందఱకు నమస్సులు!

  జిలేబిగారూ...పద్యము బాగుగ వ్రాసితిరి. అభినందనలు...
  దీనిని...కొంచెము సవరించిన నెటులుండునో చూడుఁడు...

  రండ్రా యనుచును బిలిచియుఁ
  గొండ్రాళ్ళ కవిత జిలేబి గోముగఁ జదువన్
  బండ్రాళ్ళకు మతి పోయెను
  గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్ :)

  గుండు మధుసూదన్

  రిప్లయితొలగించండి
 6. ముండ్రాయను గ్రామమ్మున
  పండ్రెండేళ్ళ పసిదాని భర్తయె పోవన్
  ముండ్రాలు జేయు వేళన
  గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్

  రిప్లయితొలగించండి
 7. ''రాండ్రా! యని గొడవేలను?
  పొండ్రా! గుడిలోకి మీరు పోగూడదుగా''
  గాండ్రించు వారి గని గుడి
  గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. గుండ్రాయి మీద శిల్పులు
  తండ్రీకొడుకులనుజెక్క దైన్య ముదోపన్
  బండ్రాతినిజూచుసరికి
  గుండ్రాతికినోరువచ్చి గొల్లున నేడ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘తండ్రియు కొడుకులను’ అనండి.

   తొలగించండి
 9. కంది వారు మధు వారు,
  నెనరస్య నెనరః !

  మధు గారి సవరణ జిలేబి మయము గా ఉన్నది !

  నెనర్లు !

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. బండ్రెడ్డి " కబడిలో " ను
  ద్దండ్రాయుడు నెట్టివేయ దబ్బున పడగా
  గుండ్రముగ తిరిగి, తగిలె
  గుండ్రాతికినోరు - వచ్చి గొల్లున నేడ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. వండ్రు పదమంట, తుడువగ
  గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్
  దండ్రీ! నహల్యను శిలా
  కండ్రికనై యుండ రామ! కరుణందెననెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘తండ్రీ యహల్యను.... కరుణ గనె ననెన్’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
   వండ్రు పదమంట, తుడువగ
   గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్
   తండ్రీ! యహల్యను శిలా
   కండ్రికనై యుండ రామ! కరుణ గనె ననెన్!

   తొలగించండి
 12. రిప్లయిలు
  1. వేండ్రపు పల్కుల నందర
   గండ్రించి యకారణంబ గద్దిం చతనిన్
   గాండ్రించి కొట్టి నంతట
   గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్.
   [అతను హృదయములేని రాయివంటివాడు]

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘గద్దించి+అతనినిన్=గద్దించి యతనినిన్, గద్ధించ+అతనినిన్=గద్దించ నతనినిన్’ అని ఉండాలి కదా! ‘క్త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు’

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “గద్దించు+అతనిన్”. అని నాఉద్దేశ్యము. అయితే “ఉదంతతద్దర్మర్థవిశేషణమున కచ్చు పరమగునపుడు ను గాగమంబగు.” నుగాగమ సంధి విస్మరించాను. సవరించిన పద్యము తిలకించగోర్తాను.
   వేండ్రపు పల్కుల నందర
   గండ్రించి యకారణంబ గద్దిం చంగన్
   గాండ్రించి కొట్టి నంతట
   గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్.

   తొలగించండి
  4. కామేశ్వర రావు గారూ,
   మీ సవరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. గుండ్రాయి వంటి మూగకు
  కండ్రిక దేవాలయమున కళ్యాణమనన్
  ఈం డ్ర కులోద్భవ యగు నా
  గుండ్రా తికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. తండ్రీ కొడుకులుగలసియు
  బండ్రాతిని మలచిరంట ?పలికెడి రకమున్
  గుండ్రాళ్ళ గుడిన యేడ్వగ?
  గుండ్రాతికినోరువచ్చి గొల్లున నేడ్చెన్. {రాళ్లయందు పలుకురాళ్ళుతో కట్టిన గుడియందుమనముమాట్లాడినమాట్లాడి నట్లుఉంటుంది}

  రిప్లయితొలగించండి
 15. తండ్రీ యెప్పుడు వత్తువు
  బండ్రాయినిబోలునట్లు పలుకే లేకన్
  గుండ్రాయినయితి ననుచూ
  గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున యేడ్చెన్

  రిప్లయితొలగించండి
 16. గుండ్రాతికి కక్కు పొడిచి
  రొండ్రోజుల కొక్క సారి రోలున త్రిప్పన్
  పండ్రెండేళ్ళకు గుండై
  గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్

  రిప్లయితొలగించండి

 17. జిలేబి వారు రాళ్ళకు పద్యాలు నేర్పెద అనగా

  తీండ్రింప చేతు రాళ్ళను
  వేండ్రపడవలెనవి నాదు వేదముగానన్
  రండ్రా నేర్పెద ననగా
  గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్.


  జిలేబి

  రిప్లయితొలగించండి