డా. విష్ణునందన్ గారూ, అద్భుతమైన పద్యాన్ని అందించి ఆనందింపజేశారు. అభినందనలు, ధన్యవాదాలు. గతంలో దీనినే పద్యరచనాంశంగా ఇచ్చినట్టు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఏం చేయను? వయస్సు పెరుగుతున్నకొద్దీ మతిమరుపు ఎక్కువౌతున్నది.
జిలేబీ గారూ, మీ ఉత్కళిక బాగున్నది. అభినందనలు. (కళిక, ఉత్కళికలు ఉదాహరణ కావ్యానికి సంబంధించినవి. వీటిని గురించి తరువాత వివరంగా తెలియజేస్తాను. మీరు ముందుగా ఆటవెలది, తేటగీతులు వ్రస్తే బాగుంటుందని నా సలహా)
దొంగ కంద బోదు దొరలవశముగాదు
రిప్లయితొలగించుభాగమడగ లేరు భ్రాతలెవరు
భారమదియు గాదు పంచినన్ పెరుగును
ధనము లందు విద్య ధనమె మిన్న
ఆంజనేయ శాస్త్రి గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘విద్యాధన’మని సమాసం చేయాలి. మీరు గుండు వారి బాట బట్టడం మేలు.
ధన్యవాదములండి గురువుగారు.
తొలగించుదొంగ కంద బోదు దొరలవశముగాదు
తొలగించుభాగమడగ లేరు భ్రాతలెవరు
భారమదియు గాదు పంచినన్ పెరుగును
సిరుల లోన విద్దె సిరియె మిన్న
దొంగిలించ లేరు దొంగలేమాత్రము
రిప్లయితొలగించుదొరలు దోచ లేరు బరువు గాదు
పంచ శక్య మవదు పాలివారికి విద్య
వ్యయము జేయ నెపుడునధికమగును
శశికాంత్ మల్లప్ప గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దోచు కొనగ దొంగ తొలగిపో వనిదంట
రిప్లయితొలగించుదొరల చేతి కసలు దూష్య మనగ
పంచు కొనగ రాదు పదుగురు సోదరుల్
ధనము కంటె విద్య దనము మిన్న
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘విద్యాధన’మనడం సాధువు. అక్కడ ‘విద్దె ధనము’ అనండి.
సవరించిన పద్యము
తొలగించు---------------------
దోచు కొనగ దొంగ తొలగిపో వనిదంట
దొరల చేతి కసలు దూష్య మనగ
పంచు కొనగ రాదు పదుగురు సోదరుల్
ధనము కంటె విద్దె దనము మిన్న
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుదొంగిలింప బడదు దొరల పాలు గాదు
రిప్లయితొలగించుపంచు కొనగరాదు భ్రాతలందు
బరువు కాదు మోయ వ్యయము చేయ పెరుగు
ధనము లందు విద్య ధనము మిన్న
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘విద్దె ధనము’ అనండి.
గురుదేవులసూచన మేరకు పద్యము సవరించితిని
తొలగించుసవరించినపద్యము
దొంగిలింప బడదు దొరల పాలబడదు
పంచు కొనగరాదు భ్రాతలందు
బరువు కాదు మోయ వ్యయము చేయ పెరుగు
ధనము లందు విద్దె ధనము మిన్న
నృపుడు తస్కరుండు నిగిడి దోచగలేరు
రిప్లయితొలగించుపెరుగుచున్న మనకు బరువు కాదు
తోడ బుట్టు వారు తోడు దీసుక పోరు
విద్య గొప్ప ధనము విజ్ఞులార.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించుదోచుకొనఁగఁ బడదు; దొరలపాలునుఁ గాదు;
భ్రాతృజనమునకునుఁ బంచఁబడదు;
బరువు కాదు; పెరుఁగు వ్యయపఱచినఁ గాని;
సిరుల కన్న విద్దె సిరియె మిన్న!!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వ్యయపఱచినఁ గాని’ అన్నచోట గణదోషం. ‘వ్యయము సేసినఁ గాని’ అంటే ఎలా ఉంటుంది?
శ్రీ కంది శంకరయ్య గారూ, శ్రీ గుండు మధుసూదన్ గారి పద్యం నిర్దోషమే! పునస్సమీక్షింపగలరు.
తొలగించుడా. విష్ణునందన్ గారూ,
తొలగించునిజమే... ధన్యవాదాలు. నేనేదో పరధ్యానంలో ఉండి వ్యాఖ్యానించాను.
మధుసూదన్ గారూ,
తొలగించుమీ పద్యంలో గణదోషం లేదు. తొందరపడి వ్యాఖ్యానించినందుకు మన్నించండి.
దొంగిలింప బడదు దొరలచే జిక్కదు
రిప్లయితొలగించుపాలివారు గోర వీలుగాదు
తరుగ బోదు విద్య,ధనములన్నిటిరీతి
వృద్ధి నొందు గాదె ప్రొద్దు ప్రొద్దు !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దొంగిలించగ లేరుగా దొంగలెవరు
రిప్లయితొలగించుపంచు కొనలేరు భాగమ్శు భాతృలెవరు
వశము కాదిదిరేలకు భరణి వినుము
పంచు నెడలను బెరుగును గొంచె మవదు
అన్ని ధనముల గంటెను మిన్న సుమ్ము
విద్య యనబడు ధనమని విదితమయ్యె
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించుమీ పద్యం బాగుంది. అభినందనలు.
చోరులు సంగ్రహింపని విశుద్ధ ధనమ్మిది , రాజులైన సం
రిప్లయితొలగించుస్కారము వీడి లాగుకొనఁ జాలని మేలి ధనమ్మభాజ్యమై
చేరిన యన్నదమ్ములకుఁ జిక్కని చక్కనిదీ ధనమ్మిఁకే
భారము గాదు మోయుటకుఁ బంచుకొలంది పెరుంగుచుండు వి
స్తారముగా విశేషముగఁ దామరతంపరగా సమృద్ధిగా
నారయ విద్య - శ్రేష్ఠ ధనమౌ గద సర్వ ధనమ్ములందునన్ !
(స్వేచ్ఛానువాదము - ఈ 'కవితా వస్తువు ' ఈ వేదికపై పునర్దత్తము )
డా. విష్ణునందన్ గారూ,
తొలగించుఅద్భుతమైన పద్యాన్ని అందించి ఆనందింపజేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
గతంలో దీనినే పద్యరచనాంశంగా ఇచ్చినట్టు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఏం చేయను? వయస్సు పెరుగుతున్నకొద్దీ మతిమరుపు ఎక్కువౌతున్నది.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి పద్యములో హీనమున్+ అశమమున్= హీనమున్నశ మమున్. ‘న’ వత్తు బదులు ‘శ’ వత్తు పడింది చూచుకోలేదు.
రిప్లయితొలగించుమదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్మునున్
మద మాత్సర్య విమోహ లోభములు కామావేశ బంధమ్ములున్
సదసద్వీక్షణ హీనమున్నశమమున్ సంరంభముం దర్పమున్
మదిరానీయక వర్తిలన్నరుడు సామాన్యుండె చింతింపగన్
కామేశ్వర రావు గారూ,
తొలగించుసందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
1దోచ లేరు విద్య దొంగలు జగతిని
రిప్లయితొలగించుదొరల కందబోదు;సిరులు పంచు
పెరుగు చుండునిదియు ప్రీతితో పంచగా
సాటి లేని ధనము చదువె యిలను.
2.తస్కరులకు నిదియుతరమౌనె దోచంగ?
నిదియు లొంగ బోదు నృపతులకును
బరువు గాదు మోయ భాగమడుగ బోరు
తతరుగు చున్నకొలది పెరుగు చుండు.
3.పాలు పంచ లేము బరువెపుడును కాదు
వెచ్చమైనగాని వచ్చి చేరుచునుండు
విద్దె ధనము యనెడి సుద్ది నిజము.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించుమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మూడవపద్యంలో రెండవ పాదం లోపించింది.
‘ధనము+అనెడి’ అన్నపుడు యడాగమం రాదు. ధనమటన్న... అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుచోర భయం బాయకర వి
రిప్లయితొలగించుచార మెరుంగ దది విద్య సహ జన్ములకు
న్నీరాదు పంచి ధనమది
పేరిమి నిచ్చిన పెరుగును బెద్ద సిరులకున్
ఇది రాజుల కాలము కాదు గదా యని ఆదాయపు పన్ను పేరుతో హరించు ప్రభుత్వమును దలచి వ్రాసినది “ఆయకరవిచారము”.
తొలగించుపోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలన్నయ్యగారూ సవరించాను
రిప్లయితొలగించు3.పాలు పంచ లేము బరువెపుడును కాదు
దొరలు దొంగలైన దోచలేరు
వెచ్చమైనగాని వచ్చి చేరుచునుండు
విద్దె ధనమటన్న సుద్ది నిజము.
ఉమాదేవి గారూ,
తొలగించుసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుహర్తకు కనబడదు అనుజులు గొనలేరు
రిప్లయితొలగించుప్రభువు పొంద లేడు, భ రము గాదు
పెరుగు పంచి నపుడు తరగని ధన మది
అన్ని సిరుల విద్య య ధిక మెపుడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించుమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కనబడదు+అనుజులు’ అని విసంధిగా వ్రాశారు. ‘కనుపించ దనుజులు...’ అనండి.
చోరుల పరమ్ముఁ గానిది
రిప్లయితొలగించురారాజుల పాలుగాని, భ్రాతల్ వాటా
గోరని, పంచిన పెరిగియు
భారమవక, యన్ని సిరుల ప్రముఖము చదువే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దొరలకు చిక్కని ధనమిది
రిప్లయితొలగించుతరలించుకు బోవలేరు తస్కరు లైనన్
మరి సహజులకున్ దక్కదు
పెరుగును గద పంచుకొలది విద్దియ ధనమే!!!
శైలజ గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నమో నమః !
రిప్లయితొలగించుదొరయు దొంగ యు కదుప లే
రరయ భ్రాత భాగ మసలు
గలద !విద్య నేర్చి ఒరుల
కలర నేర్పి ఏలు విపుల
చీర్స్
జిలేబి
(ఉత్కళిక)
జిలేబీ గారూ,
తొలగించుమీ ఉత్కళిక బాగున్నది. అభినందనలు.
(కళిక, ఉత్కళికలు ఉదాహరణ కావ్యానికి సంబంధించినవి. వీటిని గురించి తరువాత వివరంగా తెలియజేస్తాను. మీరు ముందుగా ఆటవెలది, తేటగీతులు వ్రస్తే బాగుంటుందని నా సలహా)
* గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించువ్యయమొనరి౦ప వీల్పడదు |భాగము కోరగ రారు సోదరు ల్
భయమది యేల ముష్కరులు లాగరు| నీకడ. నెవ్వ రేని న
ద్యయనమొనర్చు వారలకు దానము జేయ. నశి౦చి పోదు వి
ద్యయె గద యీ జగమ్మున ప్రధాన ధనమ్ము గడి౦ప నె౦చు మా !!
ద్యయె జగమ౦దు ప్రధాన ధనమ్ము |
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
చివర ఉన్న ‘ద్యయె జగమందు ప్రధాన ధనమ్ము’ అన్నది అన్వయానికి, ఛందస్సుకు లొంగడం లేదు.
దొంగలించ నగున విద్య దొరలపాలు గాదులే
రిప్లయితొలగించుబంగబరచ లేరుయెవరు భాగమడుగ సాద్యమా?
సంగతెంచి చూడ చదువు సమసిపోని దెప్పుడున్
రంగరించి ధనమునింపు రక్ష గూర్చు విద్యయే|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘లేరు+ఎవరు’ అన్నపుడు యడాగమం రాదు. ‘లే రెవారు’ అనండి. ‘సంగతి+ఎంచి’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘సంగతి కనుగొన్న చదువు...’ అందామా?
దొంగల కందబోదిదిర తోరపు బొజ్జల రాజుగార్లకున్
రిప్లయితొలగించుభంగము కాదు భ్రాతలకు భారము కాదుర మోయగన్ భళా
చెంగున వృద్ధి జెందునుర చెన్నుగ కర్చును చేయగా సదా
బంగరు మీరెడిన్ ధనము పచ్చగ నుండెడి వాగ్ధనమ్మురా!
చోరులు దోచగ లేరున్
రిప్లయితొలగించుమారాజుల వశముగాదు మాదనడుగరున్
నేరోజు భ్రాతృలవదుగ
భారము, విద్య ప్రధమసిరి పంచినపెరుగున్