21, జనవరి 2016, గురువారం

పద్యరచన - 1154

కవిమిత్రులారా,
“సతి పుట్టింటికి నేగిన....”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని వ్రాయండి.
(దీనిని సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

39 కామెంట్‌లు:

  1. గురువు గారికీ కవిమిత్రులకు నమస్కారము

    1.
    సతి పుట్టింటికి నేగిన
    శృతిదప్పెడు పతుల గూర్చి జెప్పగ వశమే
    గతిదప్పిన మిత్రులతో
    మతిదప్పెడవిధము ద్రావి మత్తున మునుగున్

    2.
    సతిపుట్టింటికీ నేగిన
    పతికప్పుడు భార్య విలువ పాటిగ తెలియున్
    ప్రతిపని కిని యాలియనుచు
    నతిగానాధారపడిన యల్పుల కిలలో.

    రిప్లయితొలగించండి
  2. సతి పుట్టింటికి నేగిన
    పతులకు మరియాట విడుపు బహుళ ప్రీతిన్
    మితిమీరిన వ్యసన ములను
    సతతము తామునిగి యుండి సర్వము మరువన్

    రిప్లయితొలగించండి




  3. Zilebiజనవరి 21, 2016 4:06 [AM]

    శుభోదయం

    సతి పుట్టింటికి నేగిన
    పతి సాపాటుకు టికాణ పరగడ పస్తే
    గతి! కావున మరి సీతా
    పతి, కందము గూర్చుచు పదపదరా మెస్సూ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. సతిపుట్టింటికి నేగిన
    పతిచేతికి గరిట వచ్చు వంటలుచేయన్
    గతితప్పిమతి యు తప్పును
    కతిపయ ది వసముల చేయి కాలుట జరుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. సతిపుట్టింటికి నేగిన
    నతిగానే " కాల్సు " జేసి నానావిధముల్
    పతి " చేయి కాల్చు " కొనును వ
    సతిలేకను బయట తిండి సరిపడకున్నన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. పతి పరదేశం బేగిన
    నితరములే దలపకుండ నిజసంతతికే
    పతిబంపు డబ్బుతోడను
    సతి చక్కని చదువు నేర్పు సద్గతితోడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      నిన్నటి అంశానికి చెందిన మీ పద్యరచన బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. సతిపుట్టింటికి నేగిన
    పతిమదిలో పుట్టుచుండు పలుభావనలున్
    గతితప్పును మతియంతయు
    హితమేదోతెలియక పరమేశుని దలచున్ !!!

    రిప్లయితొలగించండి
  8. సతి పుట్టింటికి నేగిన
    సత తార్ధాంగీ నిబద్ధ సంతృప్తాత్ముల్
    సతిగత జనితావేదన
    నతి సంతప్త మతులౌదు రందరు సూడన్
    “సతిగత” కి ముందు “వితరణ”: విడుపు, విడిచియుండడమనేయర్థములో వాడాను. భావ్యమేనా? తెలుప గోర్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      మీరు పేర్కొన్న భావంలో ‘వితరణ’ రూఢ్యర్థం కాదు కనుక వాడకపోవడమే మేలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  9. సతి పుట్టింటికి నేగిన
    పతియే యిక చేసికొనును వంటను దానే
    నతిగా కాకను పొదుపుగ
    మితముగ నే వండుకొనును మెచ్చిన వాటిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. 1.సతి పుట్టింటికి నేగిన
    నతి సంబరపాటుతోడ నానందముతో
    హితులను కూడుకొను చనవ
    రతము స్వేచ్ఛగ నటునిటు రహితో తిరిగెన్.

    2.సతి పుట్టింటికి నేగిన
    సుతులను చెంతన నిడుకొని జోపానముగా
    హితమును బోధించుచు నా
    పతి కంటికి రెప్పవోలె పసివారి నటన్.
    3.సతి పుట్టింటి కేగిన
    నతి హరుషముతో మిత్రుల నందరి నింటన్
    సతతము చేర్చుచు నాడుచు
    పతి తా కాలము గడిపెను పది మాసంబుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘...చనవ|రతమును స్వేచ్ఛగ...’ అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
  11. సతి పుట్టింటికి నేగినన్ పతియు నుత్సాహమ్ముతో నేగె తో
    డుత, నత్తింట వివాహ సంభ్రమము రండోరంచు బండ్లెక్కుచున్
    సుతులన్ తోడ్కొని యెల్లరీ దినమునన్ చొక్కంపు కాన్కల్, భళీ!
    మితితోడన్ గొని పాల్గొనంగ జనిరా మేళమ్ములున్ మ్రోగగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘రండో యంచు’ అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  12. సతిపుట్టింటికి నేగిన
    అతికష్టము పతికి నింట .ఆనందంబే
    ఉతుకని నుడుపుల వోలెను
    గతుకుననొకయెడ్లబండికదలిక వలెనే|
    2.సతిపుట్టింటికి నేగిన
    గతిలేకను పనులుజరుగు గమనించంగా
    మతిలేని మనిషి బ్రతు కౌ
    సతిపతి సంసారమనగ ?సద్గుణ వ్రతమే|
    3.సతిపుట్టింటికి నేగిన
    హితమెరిగిన బుద్దియు బలహీనముగనన్
    శ్రుతిలయ దప్పినరాగము
    అతి ఆలాపనలు బాడ?నలుపే మిగులున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మూడవపద్యం రెండవపాదంలో గణదోషం. ‘బలహీనము గాగన్’ అందామా? ‘అతి+ఆలాపన=అత్యాలాపన’ అవుతుంది. ‘అతి ప్రేలాపనలు’ అనండి.

      తొలగించండి
  13. సతి పుట్టింటికి నేగిన
    పతియే నలభీముడగుచు బట్టును గరిటె
    న్నతలాకుతలంబగుచున్
    బతిమాలును రమ్మనుచును భార్యామణినే!!!


    రిప్లయితొలగించండి
  14. సతిపుట్టింటికి నేగిన
    అతికష్టము పతికి నింట .ఆనందంబే
    ఉతుకని నుడుపుల వోలెను
    గతుకుననొకయెడ్లబండికదలిక వలెనే|
    2.సతిపుట్టింటికి నేగిన
    గతిలేకను పనులుజరుగు గమనించంగా
    మతిలేని మనిషి బ్రతు కౌ
    సతిపతి సంసారమనగ ?సద్గుణ వ్రతమే|
    3.సతిపుట్టింటికి నేగిన
    హితమెరిగిన బుద్దియు బలహీనముగాగనన్
    శ్రుతిలయ దప్పినరాగము
    అతి ప్రేలాపనలు బాడ?నలుపే మిగులున్.

    రిప్లయితొలగించండి
  15. సతి పుట్టింటికి నేగిన
    వెతలను పడు పతుల గూర్చి వివరంబేలా?
    ప్రతి మగవాడె రుగును గద
    సతి రాకకు నెదిరి చూచు సద్భావనతోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. సతి పుట్టింటికి నేగిన

    పతిజాతికి వచ్చునకట!`బహువిధ బాధల్

    సతి పుట్టింటికి నేగగ

    పతి పరమేశుని కిడుములు బహుధా కలిగెన్.

    డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూలె రామమునిరెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. సతి పుట్టింటికి నేగిన
    మతి ముందరి శ్రీ తొలంగి మతి దప్పించున్
    గతిఁ దప్పిన వాడౌచును
    శృతిఁ దప్పిన దప్పవచ్చు శేషాచలుడౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. సరేనండి. రండోయంచు సరిగ్గా ఉంది.
    రండోరి +అంచు =ఏవిధంగా వస్తుందో దయచేసి తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  19. స్వానుభవము 👇

    సతి పుట్టింటికి నేగిన...
    మతి తప్పుచు వంట యింటి మాయల వలలో
    పతియతి సతమత మౌచును
    గతి గానక నల్ల జీర కాఫీ త్రాగెన్!

    రిప్లయితొలగించండి


  20. సతి పుట్టింటికి నేగిన
    వెతపడ కన్నా ! గునగున వెంబడిపొమ్మా
    కతచెప్పి యత్త గారికి
    జత తీసుకుని వెనుతిరుగు జగణ జిలేబిన్‌ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. సతి పుట్టింటికి నేగిన
    మతి పోవును పతికి త్వరగ మమతయె పోవన్
    సతి రాగనె తిరిగి తిరిగి
    మతి పోవును పతికి త్వరగ మండగ పోపే

    రిప్లయితొలగించండి