19, జనవరి 2016, మంగళవారం

పద్యరచన - 1152

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

36 కామెంట్‌లు:

 1. గురువు గారికి, కవిమిత్రులకు నమస్కారములు

  గరిటను పట్టిన కరములు
  కరవాలమ్మైన బట్టు కలముల బట్టున్
  బరువగు బాధ్యత లున్నను
  వెరువక వాహసము ద్రిప్పు విమలులె రమణుల్

  రిప్లయితొలగించండి
 2. వంటలు జేయుట కంటెను
  కంటను నీరొలికె నేని కష్టము లందున్
  చంటిది పాలకు నేడ్చిన
  యంటిన బాధ్యతల కొఱకు నాటో నడుపన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   '... నేడ్చిన |నంటిన... 'అనండి.

   తొలగించండి
  2. వంటలు జేయుట కంటెను
   కంటను నీరొలికె నేని కష్టము లందున్
   చంటిది పాలకు నేడ్చిన
   నంటిన బాధ్యతల కొఱకు నాటొ నడుపన్

   తొలగించండి
 3. శుభోదయము !

  అమ్మి వినుము ఫుటోన ఆటో
  జమ్ము గనుండు ; నడుప దానిని
  తిమ్మి నిబెమ్మి జేయవలె వల
  దమ్మి; చదువు కొనుము !

  సావేజిత !
  జిలేబి
  (ముత్యాల సరము ౨)

  రిప్లయితొలగించండి
 4. కలమున్ బట్టిరి కావ్యముల్ వెలయగా, గర్జించి రెన్నన్ తుపా
  కులు చేదాలిచి గుండెలాగి యరులే కూలంగ యుద్ధాల నే
  డిలు సాకంగ కొమారుడై యువతి తానే త్రోలెడిన్ బండి నౌ
  నెలతల్ నేర్వగ లేని విద్య గలదే నిండార నేర్పించినన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు.

   తొలగించండి
 5. మిస్సన్న వారి జిస్టు మిస్సులు మెచ్చు బెష్టు :)

  నెలతల్ నేర్వగ లేని విద్య గలదే నిండార నేర్పించినన్ !

  చాలా బాగుందండీ మిస్సన్న వారు !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. చేటులు దలపక నూహల
  దీటుగ మగవారితోడ తెలివిగ బ్రతుకన్
  ఘాటగు పనియేయైనను
  యాటోనే నడిపె చాన నహహా ! నొహొహో !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. అడువారు యనుచు నలుసుగా చూడకు
  నవని నేలగలరు నేర్పు తోడ
  వంట వండగలరు వాహనాలవలీల
  నడపగలరు గాంచు మలుపు లేక/మవని యందు.
  2.ఆడువారు యనగ నబలలే గారిల
  నాదిశక్తులంచు నరయుడయ్య
  ఎట్టి పనుల నైన నిట్టె చేయగలరు
  వాహనమ్ము నడుపు పడతిఁగనుము.
  3.జల్లెడ దిప్పిన చేతులు
  మెల్లగ స్టీరింగు బట్టి మెలకువ తోడన్
  తల్లడి చెందక బండిని
  నుల్లము నందున బెదరక నువిదయె నడుపున్.
  4.హయము నెక్కగలదు నవనినేలగలదు
  విద్య లెల్ల నేర్చి వెలుగ గలదు
  వాహనంబు నడిపి వాసికెక్కగలదు
  అబల కాదు చూడు సబల యీమె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యాలులు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పద్యంలో 'ఆడువా రటంచు' అనండి. రెండవ పాదంలో యతి తప్పింది. `... నేలగలుగు నలఘుమతులు ' అనండి.
   రెండవ పద్యంలో' ఆడువా రనంగ' అనండి.
   నాల్గవ పద్యంలో '... నెక్కనేర్చు నవని...' అనండి

   తొలగించండి
 8. వనితల కసాధ్య మగునే
  సునిశిత దృక్కులఁ ద్రిచక్ర చోదనము భువిన్
  పను లన్నియు నేర్తురు గద
  యనురాగము వంచుచును సహాయము సేయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. ఆడ పిల్లను జూడుమ యాటొ నడుపు
  చుండె నచ్చట చక్కగ చోద్య ముగను
  నేటి యాడు వా రలిక నేర్వ నట్టి
  విద్య లేదార్య !పుడమికి వింత యదియ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. '... యాడువారలు పూని నేర్వనట్టి' అనండి.

   తొలగించండి
 10. గాడీ నడపుచు నట విరి
  బోడియెమరి బోవుచుండె పూనిక తోడన్
  జూడుడు! పుడమిన నేర్వగ
  చేడియలకసాధ్యమైన చెయివులు గలవే?!!!  చదువుల యందున మేటిగ
  నధిరోహించుచు పదవుల నద్భుత రీతిన్
  ముదితలు తేరులు నడుపుచు
  విదితంబుగ నేర్చినారు విద్యల నెన్నో!!!

  రిప్లయితొలగించండి
 11. మమ్మెవ్వరు తక్కువగా
  నిమ్మహిలోనెంచబోకుడేపని కైనన్
  ముమ్మాటికి సన్నద్ధమె
  యమ్మాయిలమనుచునతివ యాటోనడిపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. తండ్రి బాధ్యతలను వీడి త్రాగితిరుగ
  నడుపుచుండెనాటో బిడ్డ కుడుపు(కడుపు) కొరకు
  అన్నివిద్యలనందున నాడు వార
  లారితేరుచు నుం డ్రి తా మద్భుతముగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. గురువర్యులకు నమస్సులు. నిన్నటి పద్యంకూడా పరిశీలించ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెడ్డి గారూ,
   నిన్న ప్రయాణంలో ఉన్నాను. ఇప్పుడు పరిశీలిస్తాను.

   తొలగించండి
 14. వనిత విచారమెంచకను వాహన చోదకు రాలుగాగ|వే
  దన గనుపించదింట తన దక్షత జూపెడి మార్గదర్శిగా
  దినములువెళ్లుచుండుటన?దీనతలేదికతల్లిదండ్రికిన్
  ఘనత గలట్టి సంతసము కన్నులమాటునదాగెనీటిలో
  2.మహిళలు వాహనంబులు ,విమానములే నడుపంగ జూడగా
  బహుమతులివ్వకున్న తగుభాద్యత లెంచియుజీవనంబు కై
  సహనములందు జేయుచు విశారదు లైరిల నేర్పు కూర్పునన్
  అహమును వెళ్ళగొట్టి నబలన్నపదాలనుమార్చివేసిరే|

  రిప్లయితొలగించండి
 15. * గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  చదువున్,చక్కదన౦బు,సభ్యతయు,స౦స్కారమ్ము లున్నట్టి యో
  సుదతీ ! వాహన చోదన౦బు తగునే సు౦తేనియున్ ? రక్షణ౦
  బది లేదయ్యె సమాజ మ౦దు|వలదమ్మా నీకు దస్సాహస౦|
  బొదుగన్ మ౦చిది యాడపిల్ల|సుకుమారోద్యోగము౦. జేయుమా |

  ( వాహనచోదన౦బు = డ్రై వి ౦ గ్ ; )

  రిప్లయితొలగించండి
 16. ఆడది యాడదంచు నసహాయుల నందురు మూర్ఖు లెల్లరుల్
  జూడగ నారులే భువిన శూరులు ధీరులు కార్యదక్షులై
  బాడుగ వాహనమ్ము నడుపంగల వారల మంచు చాటగన్
  నేడిల నేలు ధైర్యమున నిల్చిరి సాహసు లైరి వారిజల్

  రిప్లయితొలగించండి
 17. ఆటోనడిపే అమ్మాయికి, ప్రయాణించే మనిషికి మధ్య సంభాషణగా..

  చదువెట్లు బండినడిపిన?
  ముదమెట్లు కడుపుననొక్క ముద్దయు పడకన్?
  వదలమ్మా నన్నిప్పుడె!
  వదలుదు గమ్యమ్ముఁ జేర్చి పైకము ముట్టన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి