23, జనవరి 2016, శనివారం

పద్యరచన - 1156

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

32 కామెంట్‌లు:

 1. కాఫీ గ్లాసులు వరుసగ
  కాఫీ వేడిగ సెగపొగ కాచిన పాలన్
  కాఫీ సెహభేష్ ; అయ్యర్
  కాఫీ తోడుగ జిలేబి కందము హుర్రే

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. కాఫీ త్రాగని వారలు
  సాఫీ గాపనులు జేయ సరిరా దంచున్
  కాఫీ ప్రాణము మనకని
  కాఫీ సేవించ కున్న కాకై బుట్టున్

  రిప్లయితొలగించండి
 3. గోలి వారి ని అనుకరిస్తూ :)

  కాఫీ కా ఫి క్యా జీ ?
  కాఫీ కా ఫీ కిసుకిసు ; ఓ , మా
  కాఫీసు టయము ; తాగా
  కాఫీ ఇచ్చా కిసుకిసు "కాఫీ" ఫ్రీ గా :)

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   గోలివారి కాఫీ పద్యాలను చూసే ఈ చిత్రాన్ని ఇచ్చాను.
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   రెండవపాదం చివర గణదోషం. ‘కాఫీ కా ఫీ కిసుకిసు(?) కాదా, ఓ మా’ అనండి.

   తొలగించండి
  2. జిలేబి గారూ ! కాఫీలమీద కాఫీలు అందిస్తున్నారు....రుచిగాఉన్నాయి.

   తొలగించండి
 4. నరులకు దేవుండిచ్చిన
  వరమీకాఫీయె గదర ప్రతి యదయమునన్
  నురగలు క్రక్కుచు వెచ్చగ
  నరములకుత్తేజమిచ్చునమృత మ్మిదియే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. ఇంతకుముందే పెట్టిన కాఫీ...ఇంకా వేడి చల్లారలేదు ..అందుకే అలాగే ఇస్తున్నాను....ఆస్వాదించండి.
  నా కాఫీ నచ్చినందులకు మాస్టరుగారికి ధన్యవాదములు.

  కాఫీ త్రాగుటకెందుల
  కా ఫీలింగ్, త్రాగు రెండు కప్పులు, నీకే
  " కాఫీ " దేతా హూ నీ
  కా ఫీడింగ్ చాలకున్న, క్యా ! బోలో జీ !

  హిందీలో " కాఫీ " అంటే వలసినంత అని అర్థం....

  రిప్లయితొలగించండి
 6. క్రొత్తగా పెట్టిన కాఫీ...


  నా కాపీస్ టైమైనది
  నీకా ఫిల్టరును వాడ నిజముగ రాదే
  ఓ కాఫి విడిగ పెట్టుము
  నాకా ఫీలింగులేదు నమ్మవె సఖియా !

  రిప్లయితొలగించండి
 7. 1.
  చిక్కని పాలలొ నించుక
  చెక్కరనే వేసి యందు చిటికెడు కాఫిన్
  మక్కువతోడన్ గలిపిన
  జక్కని కాఫీగ మారి జనహృది దోచున్

  2.
  అరుణుడు ప్రాగ్దిశ చేరెడు
  తరుణమునకు ముందుగ మది తలుపులు తట్టున్
  వరముగ దొరికెను కాఫియె
  నరునకు అమృతమ్ము వోలె నాణ్యత తోడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘లొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘పాలను నించుక’ అనండి. షష్ఠ్యర్థంలో ద్వితీయ.

   తొలగించండి
 8. కాఫీ గ్లాసుల జూడగ
  గాఫీతో బాటు నురగ గప్పున నుబికె
  న్గాఫీ రుచిని జూడగ
  నే ఫిల్టరు కాఫియనుచు నే నను కొంటిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. subbaraoజనవరి 23, 2016 10:06 [AM]
   కాఫీ గ్లాసుల జూడగ
   గాఫీతో బాటు నురగ గప్పున నుబికె
   న్గాఫీ రుచినిo జూడగ
   నే ఫిల్టరు కాఫియనుచు నే నను కొంటిన్

   తొలగించండి
  2. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. కాఫీ తాగిన ఉదయము
  సాఫీగా సాగు పనులు చక్కని దినమౌ
  కాఫీ దొరకని రోజున
  మాఫీ కర్నా విడవదు మమ్ముల మజ్జే

  రిప్లయితొలగించండి
 10. నురగలు గ్రక్కెడు కాపీ
  సురుచిరమగు నిన్ను త్రాగు చుందుము నహమున్
  హరిహరులిది చవి జూసిన
  మరి వదలరు మాకు నిన్ను మధురపు కాఫీ!!!  కాఫీ త్రాగిన చాలును
  సాఫీగా సాగు దినము సందియ మేలా?
  హేఫీగా నతిధులకున్
  కాఫీనందింతు రిండ్ల కాంతామణులే!!!  కాఫీ త్రాగగ నుదయము
  సాఫీగా జరుగు పనులు జర లేటైనన్
  దాపురమగు తలనొప్పియె
  మాపాలిట రక్ష నీవె మధురపు కాఫీ!!!


  ఎప్పుడు బడలిక గల్గిన
  కప్పుడు కాఫీని త్రాగి కడు వేడుకతో
  చప్పున పనులను జేయుచు
  విప్పుగ నిను మెచ్చుచుంద్రు ఫిల్టరు కాఫీ!!!


  రిప్లయితొలగించండి
 11. చిక్కని డికాక్షనులో
  చక్కెర తగుపాళ్ళలోన చంచా తోడన్
  చిక్కని పాలను కలుపగ
  మక్కువతో తాగనట్టి మనుజుడు గలడా!
  2.కమ్మనైన యట్టి కాఫీని త్రాగక
  కార్యమేది మొదలు కానె కాదు
  అందరింట నుండి యమృతము బోలిన
  కాఫి తాగు చుండ కమ్మగుండు.
  3.కాఫీ గ్లాసులు జూచుచు
  ఆఫీసుపనిని మరచుచు హాయిగ నుండన్
  ఆఫీసరుఫైరవగా
  కాఫీ కప్పును యొసంగి కరుణను బొందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   మొదటిపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘చిక్కనగు డికాషనులో’ అనండి.

   తొలగించండి
 12. మనము నలరించి వెచ్చం
  దనమ్ము నిచ్చు మధురతర ద్రవ రాజమునన్
  ఘనముగ నాసక్తి కలుగు
  మనమం దందరుకు వేగ మరువం గలరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   అన్యభాషాపదాలు లేకుండా మీరొక్కరే పద్యాన్ని వ్రాశారు. సంతోషం!

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.

   తొలగించండి
 13. సాఫీగా పనిజరుగగ
  కాఫీగొనవలె నుదయపు కాలము నందున్
  ఆఫీసునందు సైతము
  కాఫీదొరకని దినమ్ము కదలదు కలమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. రంగుల హంగులున్ గనగ?రాతిరి దాగిన మందు-గ్లాసులా
  ఎంగిలిజేయకన్ నిడిన యేమరు పాటున పాయసంబ?ను
  ప్పొంగెడి మానసంబునకు పొందిక నిచ్చెడి కాఫిరూపమా?
  సంగతు లేవిగాక మనసందునదాహపు నీటి నిల్వలా?

  రిప్లయితొలగించండి
 15. కప్పెడు కాఫీని కల్లునులిమిలేసి
  త్రాగక రోజెట్లు సాగునండి!
  అతిధులు వచ్చిన నరకప్పు కాఫైన
  చేతికీయకనెట్లు చెల్లునండి!
  ఆఫీసు పనులన్ని సాఫీగ చేయగన్
  మధ్యలో నొకకప్పు మంచిదండి!
  సాయంత్ర వేళలో సఖ్యులు తోడుండ
  కాఫీయె ప్రియమార కలుపునండి

  కప్పు కాఫీకిఁ బిల్చిన గౌరవమ్ము!
  ఫలితమీయకన్ మానదు పిలువరండి!
  జీవితమ్మున నింతగా చెల్లు నట్లు
  పఱగు కాఫీకి జోహార్లు పలుకరండి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   కాఫీ ప్రాధాన్యాన్ని తెలిపిన మీ సీసపద్యానికి జోహార్లు!
   ‘ఈయక’ అనేది కళ. కనుక ‘చేతికీయక యెట్లు’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

   కప్పెడు కాఫీని కళ్లు నులిమిలేసి
   త్రాగక రోజెట్లు సాగునండి!
   అతిధులు వచ్చిన నరకప్పు కాఫైన
   చేతికీయక యెట్లు చెల్లునండి!
   ఆఫీసు పనులన్ని సాఫీగ చేయగన్
   మధ్యలో నొకకప్పు మంచిదండి!
   సాయంత్ర వేళలో సఖ్యులు తోడుండ
   కాఫీయె ప్రియమార కలుపునండి

   కప్పు కాఫీకిఁ బిల్చిన గౌరవమ్ము!
   ఫలితమీయక మానదు పిలువరండి!
   జీవితమ్మున నింతగా చెల్లు నట్లు
   పఱగు కాఫీకి జోహార్లు పలుకరండి!

   తొలగించండి