13, జనవరి 2016, బుధవారం

సమస్య – 1913 (కుజను లెల్ల సజ్జనులె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుజను లెల్ల సజ్జనులె యీ కువలయమున.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

45 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘మారేరు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘ఖలుని’ అని ఏకవచనం వేశారు. ‘కాలవశమున నగుదురు ఖలులు గాను’ అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి, కవి మిత్రులకు నమస్సుమాంజలులు

   నేటి పూరణలు

   1.
   పాప పంకిలమ్మంటని బాలు రైన
   కాలవశమున నగుదురు ఖలులు గాను
   తరచి చూచిన విశదమౌ తత్వ మొకటె
   కుజను లెల్ల సజ్జనులె యీ కువలయమున.

   2.
   అర్థ సాధన పరమార్థ మనుచు తలచి
   మానవతను మరచినట్టి దానవులట
   కుజను లెల్ల, సజ్జనులె యీ కువలయమున
   త్యాగ ధనులుగ మనుటయే ధర్మమనరె.

   తొలగించండి
 2. మనసు తిలకించి పలుకును మంచి చెడులు
  పుట్టి నంతనె కాలేరు బుధులు నెవరు
  కలుషి తంబగు పరిసర కాల మహిమ
  కుజను లెల్ల సజ్జనులె యీ కువలయమున

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘బుధు లెవారు’ అనండి.

   తొలగించండి
 3. పరుల దోషమ్ము లెంచక, కరుణ గల్గి
  ప్రాణులన్నింటఁ బరమాత్ముఁ బడసి, స్వపర
  భేద మెంచక జీవించు విజ్ఞులకును
  కుజను లెల్ల సజ్జనులె యీ కువలయమున.

  రిప్లయితొలగించండి
 4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చిన్న ధర్మ సందేహము. నిన్నటి నా పద్యములో
  “..లు ప్రవిమల చరితులు విప్రవరులు” లో “లు”, “వి” రెండూ హ్రస్వములైనను “వి” “ప్ర” వలన గురువు కానీ “లు” “ప్ర” వలన గురువు కాలేదు, లఘువే. మరి ప్రాస యతి చెల్లుతుందా?
  చెల్లనియెడల విప్రవరులు కు బదులు “రుచిర మతులు” లేక “రుద్ర జపులు” లేక “అలుబ్ధ యశులు” అనిన యెట్లుండును? తెలుప గోర్తాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   నిజమే. నేను గమనించలేదు. ఆ పాదంలో ప్రాసయతి దోషమే. మీరు సూచించిన సవరణలు బాగున్నవి.

   తొలగించండి
 5. రిప్లయిలు
  1. నిన్న మీరిచ్చిన సమస్య పూరించడము మరచిపోయాను. ఇప్పుడు పరిశీలించ గోర్తాను.
   ఆడపెళ్ళి వారు మగ పెళ్లి వారి రాక కోసమెదురు చూస్తున్న సందర్భము.
   వధువు వైపు వారు వరుని బంధువులకు
   వంత సెంది యుండ బంధువొకడు
   వచ్చు వారి జూచి పలికెనా వచ్చెడి
   వారు వేఱు వీరి వారు వేఱు.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  పరమ హ౦స వచి౦చె నీ పగిది , " మరువ
  కు | జను లెల్ల సజ్జనులె యీ కువలయమున
  వారు వీరను భేద భావమ్ము విడిచి
  యీవొనర్చుమ. యుపకృతి నెల్లరకును "

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   వైవిధ్యమైన విరుపుతో అద్భుతమైన పూరణ చెప్పి ఔత్సాహిక కవులకు మార్గదర్శకు లయ్యారు. అభినందనలు.

   తొలగించండి
 7. ఎదుటివారిలోదోషములెంచకుండ
  చిరునగవుతోడ పలుకరించి తనువారి
  స్నేహబంధము కోరుకొనెడి మనుజున
  కు జను లెల్ల సజ్జనులె యీ కువలయమున.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారి పద్యం రోజూ ముందుగా చదవటం అలవాటయింది.మళ్ళి మిత్రుడు చురుకుగా పద్య రచన చే సి నిత్యమూ, ఆ నందింప చేయాలని కోరుకుంటున్నాను.

   తొలగించండి
 8. తాలిమి వహించి చక్కగఁ దనకు తగిన
  శక్తి దీనజనుల ఘన సంకటములు
  సక్కదిద్ది యెలమి సాంత్వవాక్కులు పలు
  కు జనులెల్ల సజ్జనులె యీ కువలయమున.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. కు-వలయమ్మున జన్మి౦ప కు-జనులైరి
  జనులలో తక్కరీడులు సజ్జనులును
  కలసి యుండగ తెలుపగ నలవి గాదు
  కు జనులెల్ల సజ్జనులె యీ కు వలయమున.

  రిప్లయితొలగించండి
 10. కు-వలయమ్మున జన్మి౦ప కు-జనులైరి
  జనులలో తక్కరీడులు సజ్జనులును
  కలసి యుండగ తెలుపగ నలవి గాదు
  కు జనులెల్ల సజ్జనులె యీ కు వలయమున.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.

   తొలగించండి
  2. గురుకృపాంజనమహిమచే కుదురు కవిత

   తొలగించండి
  3. గురుకృపాంజనమహిమచే కుదురు కవిత

   తొలగించండి
 11. శత్రు భావంబు తలచని సాధుమూర్తి
  ధర్మరాజనునట్టి యా ధర్మవిదున
  కు-జనులెల్ల సజ్జనులె యీ కువలయమున
  ఉత్తమోత్తము తలపు లత్యుత్తమంబు!

  రిప్లయితొలగించండి
 12. కుజనులెల్ల సజ్జనులెయీకువలయమున
  మొదట, పరిసరములబట్టి మోడులగుట
  వారిమనసులు కతమున మారిరటులు
  కానిజనులెల్ల రుసుజను లేనునరయ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సుజనులే నిజముగ’ అనండి.

   తొలగించండి
 13. శత్రు భావంబు తలచని సాధుమూర్తి
  ధర్మరాజనునట్టి యా ధర్మవిదున
  కు-జనులెల్ల సజ్జనులె యీ కువలయమున
  ఉత్తమోత్తము తలపు లత్యుత్తమంబు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 14. ప ద్య ర చ న

  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గు రు దే వు ల పా ద. ప ద్మ ము ల కు

  * వ ౦ ద న ము లు *

  కే వ ల ము మీ ఆ శీ ర్వా ద. బ ల ము

  వ ల న నే నే ను ప ద్య ర చ న. చే య

  గ లు గు చు న్నా ను . న. మ. స్తే

  రిప్లయితొలగించండి
 15. ధనముపై మోజు తోడుత తపన పడక,
  నార్తి జనుల ననవరత మాదుకొనుచు,
  సతము హరిని భజించుచు, సత్యము పలు
  కు జనులెల్ల సజ్జనులెయీ కువలయమున

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. 1.దురితము లొనరించు చునుంద్రు దుష్ట బుద్ధిఁ
  కుజనులెల్ల;సజ్జనులె యీకువలయమున
  మంచి పనులాచరించుచు మంచివారు
  గానె ఖ్యాతి నంద గలరు ఘనము గాను.
  2.ఇందు గలడందు లేడని యించుకైన
  శంక నొందక ననయము జప తపాదు
  ల నొన రించుయాస్తిక పరులైన జనుల
  కు,జనులెల్ల సజ్జనులె యీకువలయమున.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ‘దుష్టబుద్ధి’ తరువాత అరసున్నా ఉంచినప్పుడు తరువాత ‘గుజనులెల్ల’ అనాలి.
   రెండవ పూరణలో ‘...నొనరించెడి యాస్తిక...’ అనండి.

   తొలగించండి
 17. కులమతమ్ములు దలపరు గుడి మసీదు
  చర్చిలను గూర్చి వారికి చర్చ లేదు
  కూర్మి ,శాంతిని ప్రగతిని కోరు బుధుల
  కు,జనులెల్ల సజ్జనులె కువలయమున !!!

  రిప్లయితొలగించండి
 18. “స్వార్థ పరతత్వ మందున సాగువారె
  కుజనులెల్ల”.”సజ్జనులెయీ కు వలయమున
  బాల్యమందున,జీవన మూల్యమెంచ
  బ్రహ్మ,విష్ణు,ఈశ్వర పర బ్రహ్మలగుచు.”

  రిప్లయితొలగించండి
 19. .ఓట్లు నడిగేటి వారికి నొదిగియు,పలు
  కు-జనులెల్ల సజ్జనులె|యీ కువలయమున
  డబ్బులెరవేసి గెలిచెడి డాంబికంబు
  నీతి నిలుపున?నవనీతి నెగడు టౌన?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ‘విష్ణు ఈశ్వర’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ ‘విష్ణు శివులను పర...’ అనండి.
   రెండవ పూరణలో ‘ఓట్ల నడిగెడు..’ అనండి. అలాగే ‘...నిలుపున? యవినీతి..’ అనండి.

   తొలగించండి
 20. సర్వ మానవ హితమును సతము దలచి
  ధర్మమార్గము విడువక దయను గలిగి
  నెయ్యమును జూపి తోడుగ నిలుచు బుధుల
  కు, జనులెల్ల సజ్జనులె యీ కువలయమున!!!  రిప్లయితొలగించండి
 21. బ్రతుక జూచుచు పరులను బ్రతుకనిచ్చి
  విధిని గొల్చుచు నుత్తమ పథమునందు
  జనులు స్వపరభేదములేక జనెడు నాడు
  కుజను లెల్ల సజ్జనులె యీ కువలయమున.

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. బద్ధకమ్మును వీడుచు శ్రద్ధ తోడ
   సొంత పనులెల్లఁ జేయుచు సుంత విడక
   తోటి వారల సాయంపు బాటన బ్రతు
   కు జనులెల్ల సజ్జనులె యీ కువలయమున!

   తొలగించండి
  2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి