28, జనవరి 2016, గురువారం

సమస్య – 1927 (పురుషుని నిందించు సతిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్.

55 కామెంట్‌లు:

 1. పరమ సాద్వి రుద్రాణి యైనను
  మరుభూమి నినడచె నంట మగడీ శునిపై
  సరసము విరసము లందున
  పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదంలో గణదోషం. ‘పరమ సతి రుద్రాణియె...’ అందామా?

   తొలగించండి
  2. అక్కయ్యా,
   మన్నించాలి. నేను సూచించిన సవరణలోను గణదోషం ఉంది. ‘పరమసతియె రుద్రాణియె’ అందాం.

   తొలగించండి
  3. క్షమించాలి -
   పరమ సతియె రుద్రాణియె
   మరుభూమి నినడచె నంట మగడీ శునిపై
   సరసము విరసము లందున
   పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్

   తొలగించండి

 2. శుభోదయం !

  మరిమరి తననే మనసున
  సరిసరి యనగన పదనిస సరిగమ లన నా
  గరికపు సొగసున గడుసుగ
  పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. పురుషుండు రెండు తెరగుల

  ధర నుత్తము డనగ బరగు ధాత్రిని నెంచన్

  దూరుడు త్రాష్టుడు భ్రష్టుడు

  పురుషుని నిందించు సతిని బూజింతురిలన్.

  విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మూలె రామమునిరెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. విరిబోణులాట బొమ్మలు
  తరుణులె యిల దాసులనుచు తలచుచు నెపుడున్
  పురుషాధిక్యత చాటెడు
  పురుషుని నిందించు సతిని బూజింతురిలన్

  ధరణిన గల వ్యసనములకు
  పరిపూర్తిగ లొంగితాను భార్యల నెపుడున్
  పరితాపమందు ముంచెడు
  పురుషుని నిందించు సతిని బూజింతురిలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘ధరణిని...’ అనండి.

   తొలగించండి
 5. గరళము మ్రింగుదునాయని
  పరాత్పరుడుఁ జూచినంత, పాలక! జాగే
  లర మంగళమున కనుచున్
  పురుషుని నిందించు సతిని బూజింతురిలన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. పరమ సనాతన ధర్మము
  తరుణులకతి ముఖ్యమనుచు దలచెడి స్త్రీలున్
  ధర దీని విరోదించెడి
  పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. కొరగానిసతిగజూతురు
  పురుషుని నిందించుసతిని,బూజింతురిలన్
  పురుషుని యాలనపాలన
  దరహసిత ముఖంబుతోడ దాల్చెడునింతిన్

  రిప్లయితొలగించండి
 8. ధరలో పరీక్ష జేయగ
  హరభక్తుల బాధలగని యమ్మగ కరుణన్
  త్వరత్వరగాబ్రోవగ తన
  పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్.

  రిప్లయితొలగించండి
 9. * గు రు మూ ర్తి ఆ చా రి *
  „„„„„„„„„„„„„„„„„„„„„„„„„„„„


  [ పూ జి ౦ చు = గౌ ర వి౦ చు ]
  .................................................


  పరసతి యన. " మాత " యగును
  పరికి౦పక మదము బట్టి వాగు తులువ ! ని న్
  నరుకును నా పతి యని కా
  పురుషుని ని౦ది౦చు సతిని బూజి౦తు రిలన్

  రిప్లయితొలగించండి
 10. పరిణయ మాడిన పతినే
  నిరతము నియతిన్ నుతించు నెచ్చెలి విడి తా
  పరకాంతలతో తిరిగెడు
  పురుషుని నిందించు సతిని పూజింతురిలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. రిప్లయిలు
  1. పుర జను లెల్లరు మెచ్చగ
   పరదారల గౌరవింపఁ బాడియ సుమ్మీ
   పరసతిఁ గామించెడి కా
   పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. శరవణ భవ భవ కారక
  శరపుష్ప కరాబ్జ ముక్త శరతప్త ఘనా
  తుర హర విదళిత ఘను రతి
  పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ముందు “విదళిత తను” అని వ్రాసి ఘను అని మార్చాననుమానము వచ్చి.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. పరుషపు మాటల నాడుచు
  హరివక్షస్థలమునందు ఆగ్రహమందున్
  చరణముతో ముని తన్నగ
  పురుషుని నిందించు సతిని బూజింతురిలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. విరించి గారు నమస్కారములు. “వక్షస్థలమునందు నాగ్రహమందున్” అంటే విసంధి దోషము పోతుంది.

   తొలగించండి
  3. ధన్యవాదములండీ పోచిరాజు కామేశ్వరరావు గారూ ....నేనా వీషయాన్ని గమనించలేదు....సరి చేస్తానండీ

   తొలగించండి
 14. సమస్య నరక చతుర్దశి నాడే
  నరకుడు సంహారమయిన?నరహరి నవ్వే
  తరుణంబాయిది ననుచును
  పురుషుని నిందించ సతిని పూజింతు రిలన్| {శ్రీకృష్ణునిసమయస్పూర్తి కి నవ్వాలా నిందించాలా?యుద్దమునుజేయకున్నందుకు,నిందించినా సత్యభామను పూజింతురు దీపావళికి}

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘నవ్వే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘..యిది యనుచును’ అనండి.

   తొలగించండి
 15. నరకాసురుండు కంసుడు
  కురురాజును రావణుండు ఘోర దురితముల్
  పరుల కొనర్చగ కా
  పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్.

  నిన్నటి పూరణ

  గాండ్రించగ పులి యొక్కటి
  "పెండ్రారోడ్డు"న జనములు పెడబొబ్బలిడన్
  "బాంద్రా" లో బాంబులు పడ
  గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటిపూరణ మూడవపాదంలో గణదోషం. ‘పరుల కొనర్చగ నా కా...’ అనండి.

   తొలగించండి
 16. .కం:తరుణీమణియౌ కృష్ణను
  దురుళ తనముతో కొలువున దుష్టుండౌ యా
  విరటుని బావమరిది యౌ
  పురుషుని నిందించు సతిని పూజింతురిలన్.

  2:కం:కురుపతి తీర్చిన సభలో
  దురుసు ప్రవర్తనము తోడ దుశ్శాసనుడున్
  తరుణి వలువలూడ్వన్ యా
  పురుషుని నిందించు సతిని పూజింతురిలన్.
  3కం: పరుగులు తీసెడి వయసున
  దురుసుగ వర్తించుచు పడతుల వేధింపన్
  కరుణను జూపుచు నచ్చో
  పురుషుని నిందించు సతిని పూజింతు రిలన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటిపూరణలో ‘దురళతనము’...? అది ‘దురుసుతనము’ అనుకుంటాను. ‘దుష్టుండౌ నా...’ అనండి.
   రెండవపూరణలో ‘తరుణి వలువ లూడ్వగ నా...’ అనండి.

   తొలగించండి
 17. వరగర్వంబున దక్షుని
  పరిహాసము-వీర భద్ర పరిహారమునన్
  జరుగగ?యజ్ఞము జేసిన
  పురుషుని నిందించు|సతిని బూజింతురిలన్ {దక్షునిగర్వమును నిందించగా?సతీదేవినిపూజింతుముగదా.|}

  రిప్లయితొలగించండి

 18. పరసతి పొందును మెచ్చిన
  పురుషుని నిందించు.సతిని బూజింతు రిలన్
  మెర మెర లాడక భర్తను
  శిరమున గంపను నిడుకొని జేర్చగ వెశ్యన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 19. పరసతి పొందును మెచ్చిన
  పురుషుని నిందించు.సతిని బూజింతు రిలన్
  మెర మెర లాడక భర్తను
  శిరమున గంపను నిడుకొని జేర్చగ వెశ్యన్

  రిప్లయితొలగించండి
 20. పరకాంతల వెంట తిరిగి
  నరకము జూపించు వాడు నాథుడె యైనన్
  వెరవక నెదురొడ్డుచు నా
  పురుషుని నిందించు సతిని బూజింతు రిలన్​!

  రిప్లయితొలగించండి
 21. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....

  నేడు టివీ సీరియళ్ళలో, సినిమాలలో చూపించునది

  పరుష పదజాలములతో
  పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్
  కరవాలము బట్టి దిరుగ
  కిరము వలె ననవరతమ్ము కీర్తింతురిలన్

  కిరము= పంది

  రిప్లయితొలగించండి
 22. కందుల వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. పరిపరి గంగను పొగడుచు
  గిరితనయను ప్రక్కనుండి గేలించుచునున్
  శిరమున భస్మము నద్దెడి
  పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్!

  పురుషుడు = భర్త
  సతి = పార్వతి

  రిప్లయితొలగించండి
 24. సరసపు మాటల నాడక
  విరసంబగు చేష్ట లొల్లి విడ్డూరముగా
  కరచుచు తిట్టుచు కొట్టెడి
  పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్

  రిప్లయితొలగించండి