16, జనవరి 2016, శనివారం

పద్యరచన - 1149

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“అయ్యప్ప - జ్యోతి దర్శనము”
(ఈ అంశాన్ని సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు)

28 కామెంట్‌లు:

  1. హరిహర సుతు డయ్యప్పను
    శరణ మనుచు వేడువారు శబరి గిరీశున్
    కరుణా మూర్తిని యాజ్యో
    తిరూప మందు మణికంఠ దేవుని గనరే

    రిప్లయితొలగించండి
  2. శరణము వేడుచు శబరికి
    నిరుముడి గట్టంగ తరలి నిష్టగ బోవన్
    వరమని దీక్షను విడువక
    దరిశన మొందగను జ్యోతి తనరెడు భక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘దరిసెన మొందగను...’ అనండి.

      తొలగించండి
    2. శరణము వేడుచు శబరికి
      నిరుముడి గట్టంగ తరలి నిష్టగ బోవన్
      వరమని దీక్షను విడువక
      దరిసెన మొందగను జ్యోతి తనరెడు భక్తిన్

      తొలగించండి

  3. శుభోదయం -> య రమణ గారి సంప్రదాయపు గోడలు టపా ఆధారం గా :)

    వనితల కుగలిగె వరమున తీర్పు
    అనిరి సామి శరణం అయ్యప్ప యనగ
    చనిరి వడివడిన చరణము గనగ
    గనిరి కొండన జ్యోతి గణగణ వెలుగ

    పదభిఘావళి
    జిలేబి ద్విపద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ద్విపద బాగున్నది. అభినందనలు.
      ‘అనిరి స్వామి శరణ మయ్యప్ప యనగ’ అనండి.

      తొలగించండి
  4. ఇరుముడులను తల దాల్చుచు
    శరణంచును శబరి జేరు సర్వులకచటన్
    దరిసెనమిచ్చుచు జ్యోతిగ
    హరుసమ్మును గల్గజేయు హరిహరసుతుడే !!!

    రిప్లయితొలగించండి
  5. నలుబది దినములు సాములు
    పలురకముల బాధలోర్చి పాయని భక్తి
    న్నల యాశబరి మలేశుని
    వలయాకా రమున జూచి వలరుదు రార్యా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘అల, ఆ’ రెండూ ఒకటే కదా! ‘అల శబరికొండలో ను|జ్జ్వల మకరజ్యోతిఁ జూచి వరలుదు రార్యా’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. చక్కగ దేవస్థానమె
      యక్కథ విశదీకరించె యనృతం బనుచున్
      వెక్కసము గాదె జనులకు
      మిక్కుటముగ కారణంబు మిథ్యాచార్యుల్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'విశదీకరించె ననృతం' అనండి.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పొరపాటయినది చూచుకోలేదు. ధన్యవాదములు.

      తొలగించండి
    4. చక్కగ దేవస్థానమె
      యక్కథ విశదీకరించె ననృతం బనుచున్
      వెక్కసము గాదె జనులకు
      మిక్కుటముగ కారణంబు మిథ్యాచార్యుల్

      తొలగించండి
  7. మండల దీక్షగఁ గొలుచుచు
    గుండెల జ్యోతిస్వరూపుఁ గూరిమి తలచన్
    కొండలఁ జూడఁగఁ బోయిన
    నుండడె జ్యోతిగ తపసుల నుల్లముఁ దీర్చన్!
    (యద్భావం తద్భవతి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. ఇరుముడి నే తల దాల్చియు
    శరణము శరణమ్మనుచును శబరికి వెడలన్
    హరిహర సుతుడు మకర జ్యో
    తిరూప మెత్తి కనిపించు, దేవుని లీలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో ‘మకర జ్యో’ అన్నచోట ర గురువై గణదోషం. ‘హరిహరసుతుడు మహాజ్యో...’ అందామా?

      తొలగించండి
  9. నలుబది దినముల దీక్షను
    పలువిధముల భక్తి యందుభక్తులునడకే
    విలువగు శబరి గిరీశుని
    వెలుగే నొక దివ్య-కాంతి వివరణ జూడన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘వెలుగే యొక’ అనండి.

      తొలగించండి

  10. హరహర తనయుండ అయ్యప్ప శరణంచు
    మకర జ్యోతిని గన సకల జనులు
    ఇరుముడిని శిరమున నిడుకొని భక్తితో
    సాగుచుందురిలను శబరిమలకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మకర జ్యోతి’ అన్నపుడు ‘ర’ గురువై గణదోషం.

      తొలగించండి
  11. జ్యోతిదర్శనంబు మీరు జూప మాకుపుణ్యమే
    నీతి నిలుప గలుగునట్టి నిర్మలత్వ తత్వమే
    జాతియందు శబరి భక్తి జన్మ ధన్యమేగదా
    ఈతరాన దివ్య వెలుగునెంచు మెపుడు భక్తిచే

    రిప్లయితొలగించండి
  12. హరిహరసుతుడు శరణమయ్యప్ప భక్తి
    తోడ గొల్చిన ఆర్తిని తొలగ జేయు
    దైవలీలలనెన్నగ తరమె నచట,
    జ్యోతి రూపమై స్వామి తేజోవిరాజి!

    రిప్లయితొలగించండి