21, జనవరి 2016, గురువారం

సమస్య – 1921 (హృద్రోగము మేలుసేయు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హృద్రోగము మేలుసేయు నెల్లజనులకున్.

48 కామెంట్‌లు:

 1. హృద్రోగము అనాయాస మరణమను తెచ్చే అవకాశాలెక్కువని ఊహించి.......

  బద్రత లేని బ్రతుకులివి
  భద్రుని యానతిని మీరి బ్రతకగ వశమే
  ఛిద్రము తప్పని వేళన
  హృద్రోగమె మేలు సేయు నెల్లజనులకున్

  రిప్లయితొలగించండి
 2. భద్రాద్రి రాము గొలిచిన
  హృద్రోగము మేలుసేయు నెల్లజనులకున్
  ముద్రిక జేకొని హనుమయె
  భద్రముగా జేరె నంట భగవతి సీతన్  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   రాముణ్ణి కొలిస్తే హృద్రోగపీడితుడు మేలు పొందుతాడని మీ భావం అనుకుంటాను. పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 4. సరియో లేదో తెలియదు !

  భద్రం కొడుకో పుడమిన
  ఛిద్రము సేయన మనలను చిత్రాతిచిత్ర
  క్షుద్రము రోగము వాటిన
  నృద్రోగము మేలు సేయు నెల్లజనులకున్

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం చాలవరకు బాగున్నది. ‘చిత్రాతిచిత్ర’ అన్నచోట గణదోషం. ‘చిత్రవిచిత్ర|క్షుద్రము...’ అనండి. ‘రోగములందున| హృద్రోగము...’ అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 5. నిద్రను మెలకువ నైనను
  సద్రూపుని సాంబశివుని స్మరియించుటలన్
  భద్రము గూర్చెడు నిమ్మను
  హృద్రోగము మేలుసేయు నెల్లజనులకున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. క్షిద్రుడు హరియింప గలడు
   హృద్రోగము.మేలుసేయు నెల్ల జనులకున్
   భద్రమొసగు.ప్రతి దినమును
   నిద్రను మేల్కొనగ సంధ్యనిష్టగ జేయన్

   తొలగించండి
  3. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. భద్రముగా యోగసన
  ముద్రలనే నేర్చి విష్ణు మూర్తిని మదిలో
  చిద్రూపు దలప - రాదుగ
  హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘యోగాసన’ టైపాటువల్ల ‘యోగసన’ అయింది.

   తొలగించండి
 7. భద్రముగా యోగసన
  ముద్రలనే నేర్చి వేయ " ఫుడ్ డైటింగ్ " తో
  ఛిద్రము గాదుగ - రాదుగ
  హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్కవులు హనుమచ్ఛాస్త్రి గారూ వందనములు. “ఫుడ్ డైటింగ్” డైటింగ్ అంటేనే ఫుడ్ డైయటింగ్ గదా. సమృద్ధ పదకోశ భాష యుండగా యాంధ్రభాషా సత్కవితావనములో పర భాషా పదములేల? “పథ్యము” పదము సముచితము గద .
   “ముద్రలనే నేర్చి వేయు "ముప పథ్యమునన్”
   అనిన యెట్లెండును? అధిక ప్రసంగమని భావించిన క్షంతవ్యున్ని.

   తొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ రెండవపూరణ బాగున్నది. అభినందనలు.
   పోచిరాజు గారి సూచనను గమనించండి.

   తొలగించండి
  3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   నిజమే! సంప్రదాయ కవిత్వంలో అన్యభాషాప్రయోగం పరిహరించవలసించే. కాని అప్పుడప్పుడు ఆటలో అరటిపండుగా సమస్యాపూరణల్లో అన్యభాషాపదాలను చూసి చూడనట్టు వదిలేద్దాం.
   మీ సవరణ బాగున్నది. దన్యవాదాలు.

   తొలగించండి
  4. మాస్టరుగారూ ! ధన్యవాదములు.టైపాటును సరిచేస్తున్నాను.
   కామేశ్వరరావు గారూ ! యతితో సరియైన పదము దొరకక అలా వ్రాశాను. చక్కని పదము సూచించిన మీకు ధన్యవాదములు. చిన్న సవరణతో...

   భద్రముగా యోగాసన
   ముద్రలనే నేర్చి విష్ణు మూర్తిని మదిలో
   చిద్రూపు దలప - రాదుగ
   హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.


   భద్రముగా యోగాసన
   ముద్రలనే నేర్చి జేయ నుపపథ్యమునే
   ఛిద్రము గాదుగ రాదుగ
   హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.

   తొలగించండి
  5. సవరణతో...


   భద్రముగా యోగాసన
   ముద్రలనే నేర్చి జేయు ముపపథ్యమునే
   ఛిద్రము గాదుగ, రాదుగ
   హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.

   తొలగించండి
  6. హనుమచ్ఛాస్త్రి గారూ నా సూచనను సహృదయముతో స్వీకరించినందులకు ధన్యవాదములు. మీ సవరించిన పద్యము చక్కగనున్నది. అబినందనలు.

   తొలగించండి
 8. విద్రోహ విహీ నామల
  సద్రాజిత సుహృద యాతిశయ సంపదలన్
  భద్రంబుగ బాపిన నప
  హృద్రోగము మేలుసేయు నెల్ల జనులకున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. అద్రుగలుగజేయు సతము
  హుద్రోగము , మేలుజేయు నెల్లజనులకున్
  బద్రపు నాహారము గొని
  నిద్రను సుఖముగను బోవ నిశ్చల మతితో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘అద్రు’ అన్నపుడు రెండూ లఘువులే. గమనించండి. దానివల్ల పాదాది లఘువై కందపద్య నియమభంగం జరుగుతుంది.

   తొలగించండి
  2. ఛిద్రము చేయును బ్రతుకును/ హృద్రోగము - అంటే సరిపోతుందా సర్.

   తొలగించండి
  3. రెడ్డి గారూ,
   చక్కగా సరిపోతుంది.

   తొలగించండి
 10. భద్రత లేకను వచ్చును
  హృద్రోగము, మేలుసేయు నెల్ల జనులకు
  న్భ ద్రాద్రి రాము సేవలు
  హృద్యముగా జేయునె డల యెప్పుడు నచట న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాల్గవపాదంలో ప్రాస తప్పింది. ‘హృద్రంజన మందజేయు నెప్పుడు నచటన్’ అనండి.

   తొలగించండి
 11. ఉద్రేకములే దెచ్చును
  హృద్రోగము, మేలుసేయు నెల్ల జనులకున్
  భద్రత నే యొసగెడు యా
  దాద్రీశుని కొలి చినంత యవనిన గాదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘కొలిచినంత నవనిని గాదే’ అనండి.

   తొలగించండి
 12. భద్రముగ నుండ నీయదు
  హృద్రోగము, మేలు సేయు నెల్ల జనులకున్
  రుద్రాక్షమాల దాల్చుచు
  రుద్రుని గొలువంగ తగ్గు రుగ్మపు బాధల్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రుగ్మత లెల్లన్’ అంటే బాగుంటుందేమో!

   తొలగించండి
 13. ఛిద్రంబయ్యె హృదయమన
  హృద్రోగము మేలు సేయు నెల్ల జనులకున్
  భద్రంబగునన సరియే?
  భద్రాద్రి రాముని కరుణను బడయుట మేలౌ.
  2.ఉద్రేకంబులె దెచ్చును
  హృద్రోగము;మేలు సేయు నెల్ల జనులకున్
  రుద్రుని గొల్చుచు నుండగ
  భద్రంబౌ కాయమునకు బాధలు జేరవ్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘భద్రాద్రి రాముని’ అన్నచోట గణదోషం. ‘భద్రాద్రీశుని కరుణను...’ అనండి. అలగే ‘..జేరవ్’ అనడం సాధువు కాదు. ‘బాధలు దొలగున్’ అనండి.

   తొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘యోగా’ తెలుగు కాదు. ‘యోగము’ అనాలి.

   తొలగించండి
 15. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  భా వ ప్ర క ట న కు వ స తి గా ను౦ డు న ని
  మ ధ్యా క్క ర. వ్రాస్తున్నాను
  హృ ద్రో గ ము మే లు చే యు ను
  హృ ద్రో గ మే మే లు చే యు అ న్నా ను
  ...............................
  క్ష. మి౦. చ. వ. లె. ను.
  ..................................

  భద్రము లే దీ జగాన
  ప్రాణికి | దు : ఖ తప్త మయి

  విద్రుతమై పోవు | నొక్క
  వేళ , నదృష్ట వశాత్తు

  నిద్రి౦చు నపుడు పో టి డి న. ,
  నిర్మలముగ. చావ వచ్చు |

  హృద్రోగమే మేలు చేయు
  నెల్ల జనులకున్ నిజమిది ! !
  ......................................................
  దు : ఖ తప్తమయి = శోకముచేవేడియయి :
  విద్రుతమై పోవు = కరిగి పోవు , నీరుగారి పోవు
  శక్తి హీనమై పోవు ; పో టి డి న =
  పోటు + ఇడిన. = పోటు నిస్తే
  నిద్రి౦చు నపుడు పోటిడిన = నిద్రలో గు౦డె పోటు వస్తే ్
  ..............................................

  రిప్లయితొలగించండి
 16. ఛిద్రము కాగా గుండెకు
  భద్రము శూన్యము ; రుజలను పడిమడయక , నే
  నిద్రనొ , మెలకువ నైనన్
  హృద్రోగము మేలుసేయు నెల్లజనులకున్.

  రిప్లయితొలగించండి
 17. సమస్య చిద్రము జేయును బ్రతుకును
  హృద్రోగము|మేలుసేయు నెల్ల జనులకున్
  ముద్రలు,యోగము జేయగ
  నుద్రేకము లేక మనసు నుత్సాహమిడున్.
  2.విద్రోహుల వలె మోసము
  హృద్రోగము|”మేలుసేయు నెల్లజనులకున్
  బద్రత ఆరోగ్యంబగు
  నిద్రయు నియమాలయందె నిలుచునుబలమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 19. భద్రమ్ముగ వేళకు తమ
  నిద్రాహారాల నంది నిశ్చింతులుగ
  న్నుద్రేకము విడఁ జేరదు
  హృద్రోగము, మేలు సేయు నెల్ల జనులకున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. క్షుద్రుడ! నీపని పట్టెద!
  పద్రా! యింటికి నని సతి పండ్లను కొరుకన్...
  కుద్రగ పరసతి వలపుల
  హృద్రోగము...మేలుసేయు నెల్లజనులకున్ :)

  రిప్లయితొలగించండి


 21. భద్రము కొడుకో ! చేయదు
  హృద్రోగము మేలు,సేయు నెల్లజనులకున్
  ఛిద్రము జీవితమును! శ్రీ
  మద్రామాయణము చదువుమయ పుణ్యమగున్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి