23, జనవరి 2016, శనివారం

సమస్య – 1923 (నన్నయ తిక్కనాది కవినాథులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా?

53 కామెంట్‌లు:

  1. నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?
    చెన్నుగ మంచిభా షణము చిక్కని భావము ప్రోదిజేయుచున్
    వెన్నుని భారతా దిగల వేలకు వేలగు పండితోత్తముల్
    మిన్నగ వ్రాసినంతనిల మేలొన గూర్చెడి కావ్యమౌగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వెన్నుని గాధలన్ దెలిపి వేలకు...’ అనండి.

      తొలగించండి
    2. నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?
      చెన్నుగ మంచిభా షణము చిక్కని భావము ప్రోదిజేయుచున్
      వెన్నుని గాధలన్ దెలిపి వేలకు వేలగు పండితోత్తముల్
      మిన్నగ వ్రాసినంతనిల మేలొన గూర్చెడి కావ్యమౌ గదా

      తొలగించండి

  2. శుభోదయం

    ఉన్నది లెక్కలే యనగ ఉత్పల మాలన పద్యమే గదా
    ఫన్నన షాయిరీ యనను ఫక్కున నవ్విన రాగమే గదా
    తిన్నగ పాదమే కవిత; తీరుగ వేసుకొ జోడుగా యిలా
    నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      వృత్తరచనలో కూడా మీరు నైపుణ్యాన్ని సాధించారు. సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మాల+అన’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘ఉత్పలమాలగ’ అనండి. ‘ఇలా’ అనడం వ్యావహారికం. ‘జోడుగా నిటుల్’ అనండి.

      తొలగించండి
  3. నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వ మా
    సన్నుత కావ్యకర్తలును జక్కగ వ్రాసిన గ్రంధరాజముల్
    మన్నన బొందిలోకమున మాన్యత గాంచెను వారికావ్యముల్
    క్రన్నన మార్గ దర్శనముగావిలసిల్లెచునుండె నేటికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. గురువు గారికి నమస్సుమాంజలులు

    నన్నయ తిక్కనాదికవి నాథులు సెప్పినదే కవిత్వమా
    నెన్నగ నెందరెందరొ కవీంద్రులు పుట్టిరి తెల్గునేలపై
    మన్నన జేయదగ్గ ఘనమాన్యులు లెక్కకు మించియున్నిలన్
    పున్నమి వెన్నెలై విరియు భూరికవిత్వము నందజేసిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కవిత్వమా| యెన్నగ...’ అనండి.

      తొలగించండి
  5. నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా
    కన్నని నామమొక్కటిల కమ్మగ పల్కను కావ్యమవ్వదా
    నిన్నను నేడు రేపుయును నిక్కము దైవము కృష్ణుడేగదా
    అన్నిటియందు తోడు తనుయందరి మానసమందు వెల్గడా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రేపును’ అంటే చాలు, ‘రేపుయును’ అనకూడదు. అక్కడ ‘రేపులును’ అనండి.

      తొలగించండి
  6. నన్నయ తిక్కనాదికవి నాథులు సెప్పినదే కవిత్వమా
    మన్నననొందినట్టికవి మాన్యులు చక్కగ ఖ్యాతినందగన్
    కన్నని గాధలన్నిటినిల కమ్మగ వ్రాసిన పోతనాదులున్
    యున్నతమైన కావ్యముల హుమ్మసు తోడను కూర్చి రెల్లరున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పోతనాదు ల|త్యున్నతమైన...’ అనండి.

      తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా
    అన్నది నిర్వివాదమిక. నాద్యులు వారలు మార్గ దర్శకుల్
    చెన్నుగ దేశి చందముకు చేవను గల్గిన భారతమ్ముకున్
    నిన్నటి నవ్యకావ్యములు నేరవు నిల్వగ నెల్లకాలమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఛందమునకు, భారతమ్మునకున్’ అనాలి. అక్కడ ‘దేశి+చందము=దేశిచ్ఛందము’ అవుతుంది. ‘దేశికావ్యమును చేవను గల్గిన భారతానికిన్’ అనండి.

      తొలగించండి
  9. నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?
    మిన్నగ నుండునే గదయ మేదిని భూజను లంద రున్సదా
    మన్నన లిచ్చిరా కవిత మాన్యము పూజ్యము నంచు నెప్పుడు
    న్నన్నయ తిక్కనాదులది నాణ్యత గల్గిన దేభువిన్గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. చెన్నుగ నన్న యాదులు రచించిన సత్కవి తానురక్తులై
    మన్నన గొన్న గొప్పకవి మాన్యుల విద్యను గొంద రెంత కా
    దన్నను జెల్లునే బహుపదార్థ కవిత్వము సెప్ప నేర్చినన్
    నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా?
    యన్నది నిక్కమే యయిన , నద్భుత కైత రచించ లేదె పె
    ద్దన్నయు పోతనార్యుడును యట్టులె పింగళి సూరనార్యుడున్
    చెన్నుగ కైత లెన్నియొ ? వచించగ చాల దిదొక్క పద్యమే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అద్భుత కైత’ అనడం దుష్టసమాసం. ‘అద్భుతకావ్యము వ్రాయలేదె...’ అనండి. ‘పోతనార్యుడును నట్టులె’ అని ఉండాలి.

      తొలగించండి
  12. సమస్య
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రె౦డవ పాద౦ వాక్యా౦త మయి న౦దున
    మూడవ పాద౦ అచ్చు తో ప్రార౦భి౦చాను .
    …………………………………………………

    పూ ర్వ క వీ శ్వ రు లు = మ హా వృ క్షా లు !
    మ రి , మ న మో ! =
    ఒ క వృ క్ష ము యొ క్క. శా ఖ పై
    ప రా న్న జీ వి గా మొ ల కె త్తి దా ని సా ర ౦ గ్ర హి౦ చి బ్ర తి కే చి న్న మొ క్క ల తో
    స మా న మై న వా ర ము క దా !

    ..... ..................... ......... ......................

    నన్నయ తిక్క నాది కవి నాధులు చెప్పినదే కవిత్వమా ?
    యన్న. నొకి౦త లేదు కద యర్థము ! వారలు " భూరి భూజముల్ " |
    ఎన్నగ , వాని శాఖల జని౦చి గ్రహి౦చెడు >>నా " పరాన్న భు క్
    సన్నిభ మైన మొక్కలము " కాదె మన౦దర మో కవీశ్వరా ? ? ?


    { వాని శాఖల జని౦చి = ఆ మహా వృక్షముల.
    యొక్క కొమ్మలకు పుట్టి ; గ్రహి౦చెడు =
    సారము గ్రహి౦చెడు ; పరాన్నభుక్సన్నిభ మైన = పరాన్నజీవులతో సమాన మైన. }

    రిప్లయితొలగించండి
  13. నన్నయతిక్కనాది కవి నాథులు సెప్పినదే కవిత్వమా ?
    యెన్నగ భారతమ్ము కడు యింపుగ వ్రాయ తెలుంగు బాషలో
    సన్నుతి చేయు చుంద్రు ప్రజ చక్కని కైతలంచు హెచ్చుగా
    పన్నుగ కైతలన్ పిదప వ్రాసి ద్వితీయపు స్థానము పొంది రెందరో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కడు నింపుగ’ అనండి. ‘చక్కని కైత లటంచు హెచ్చుగా’ అనాలి. లేకుంటే గణభంగం. అలాగే ‘ద్వితీయపు స్థానమందిరే/ ద్వితీయులు గారె యెందరో’ అంటే అక్కడి గణభంగం తొలగిపోతుంది.

      తొలగించండి
    2. గురువర్యుల సవరణలకు ధన్యవాదములు.

      తొలగించండి

  14. అన్నుల మిన్నలే గన మహాద్భుత కావ్యము లెన్నియో నిలన్
    మిన్నగ వ్రాసి పెక్కురులు మేదిని యందును కీర్తి నొందిరే
    నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వ మా
    మన్నన జేయరే జనులు మాన్యవరేణ్యుల కావ్యప్రజ్ఞతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...లెన్నియో యిలన్’ అనండి.

      తొలగించండి
  15. తిన్నగ సౌమనస్యమదిఁ దెల్పిన పుష్పవిలాప కావ్యమున్
    పున్నమఱేని మోముగల పూర్ణమ గాథను దీర్చిదిద్దగన్
    మన్నన లందిరే భువిని మాన్యులు పాపయ, యప్పరావులున్!
    నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా
    చిన్నయ సూరి తానొకడె జేసినదే కవనంబివాళనా
    మన్ననలొందుచున్ జనుల మానస రంజన మవ్వ జేయుచున్
    చెన్నుగ జెప్పగా కవిత చెల్లునుగా మరి శంకరార్యుడా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కవనంబు నేడు నా...’ అనండి.

      తొలగించండి
  17. నన్నయ,తిక్కనాదికవినాథులు సెప్పినదే కవిత్వమా?
    అన్నది సత్యమేగ మనకన్నలు,తాతల తండ్రు లందరున్
    నెన్నగ పద్యముల్గనుక|యిప్పటి మార్పులకూర్పులన్నియున్
    చిన్ని-కవిత్వ దోరిణిలు|” చిత్రకవిత్వము ?కొందరిష్టమే”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తండ్రు లెల్ల తా| మెన్నగ...’ అనండి.

      తొలగించండి
  18. ఎన్నగ నెందరో సుకవు లిద్ధరణీశుల ప్రాపకంబు లే
    కున్నను కావ్యపుష్పముల గూర్చిరి, రాజుల పోషణమ్ములో
    మన్నన పొందినట్టి కవి మాన్యులు కీర్తివహించినట్టి యా
    నన్నయ తిక్కనాది కవి నాథులు సెప్పినదే కవిత్వమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా
      మిన్నగు సత్కవీశ్వరులు మేదిని యందున యెందరున్ననూ
      మున్నుగ వ్రాసినారుగద ముచ్చట గొల్పెడు భారతమ్మునన్
      చెన్నుగ నెందరో కవుల చేవకు మార్గము జూపె తెల్గునన్!!!

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘...యెందరున్ననూ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘...యెంద రుండినన్’ అనండి.

      తొలగించండి
  19. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
    నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా
    అన్నది నిర్వివాదమిక. నాద్యులు వారలు మార్గ దర్శకుల్
    చెన్నుగ దేశి కావ్యముకు చేవను గల్గిన భారతానికిన్
    నిన్నటి నవ్యకావ్యములు నేరవు నిల్వగ నెల్లకాలమున్

    రిప్లయితొలగించండి
  20. ​నన్నయ తిక్క​ ​నాది కవినాథులు సెప్పినదే కవిత్వ​మా
    ​యన్నను పాడిగాదు, మరి యా కవివర్యులు వ్రాసి గ్రంథముల్
    వన్నెలు దిద్దినారు మన భాషకు ​తీయదనమ్ము కూర్చియున్
    ​మన్నన లందినారు ఘనమాన్యులు వారలె తెల్గు భాషకున్!

    రిప్లయితొలగించండి
  21. మున్నిల శంకరాభరణ ముండినచో నిట...వీధివీధులన్
    పన్నుగ వేనవేలున ప్రభాకర శాస్త్రులు పద్యవిద్యనున్
    చెన్నుగ నేర్వగల్గుచును సెప్పరె కైతలు కుండపోతగా?...
    నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా? :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తమిళం నాకూ రాదు గానీండి పైన “జిలేబి” గారు తమిళంలోన వ్రాసిన వాక్యంలో ఒకటే పదాన్ని మూడుసార్లు వ్రాసినట్లు ఆ అక్షరాల రూపురేఖలను బట్టి అనిపిస్తోంది 🙂. అర్థం వారే చెప్పాలి.

      తొలగించండి
    2. పొగిడారా, తిట్టారా .. అయోమయం deepens further (మనకి) 😳 . ఇప్పటికీ పై రెండు తమిళ వాక్యాలకీ అర్థం చెప్పడం బాకీ ఉన్నారు “జిలేబి” గారు. అదేదో త్వరగా చెప్పరాదూ?

      తొలగించండి
    3. ఏవిటి నన్నే? నా ఫేవరైట్ డిటెక్టివ్.
      అనువదించినందుకు థాంక్స్ నీహారిక గారూ.

      తొలగించండి


    4. it's elementary my dear watson :)


      அதுரஹோ அதுரஹோ அதுரஹோ

      అదురహో అదురహో అదురహో

      చీర్స్ టు జీపీయెస్ వారు

      మున్నిల శంకరాభరణమున్న జిలేబుల నమ్మి వుందుమే :)


      జిలేబి

      తొలగించండి
  22. పన్నుగ శంకరాభరణ ప్రాంగణ మందున గోల జేయుచున్
    కన్నును గొట్టు కాలమున కంపము లేపయె కైపదమ్ములన్
    చెన్నుగ పూర్తి జేసెదనె చీకటి రాత్రిని గూబవోలుచున్...
    నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా?

    😊

    రిప్లయితొలగించండి