18, జనవరి 2016, సోమవారం

సమస్య – 1918 (అపరాధము కాదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్.
ఈ సమస్యను పంపిన ఆంజనేయ శర్మ గారికి ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

  1. అపకారము కాదు జనని
    సపర్యలను జేయుటదియె సత్కార్యంబౌ
    సుపథమును వీడినసుతున
    కపరాధముగాదు తల్లి నాశ్రమమంపన్

    రిప్లయితొలగించండి
  2. విపరీతము గాదు నేడిల
    నుపచర్యలు జేయరంట నుత్తమ వనితల్
    నెపమెన్నక వారి కొఱకు
    అపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్

    రిప్లయితొలగించండి
  3. శుభోదయం !

    జిలేబి కి అయ్యరు గారి రిటార్టు :)

    చపలము లాడుచు బ్లాగులొ
    కపరిన నారద కెలుకునొ కపరి తిరిగుచూ
    సపరియ జేయుమన తగునొ !
    అపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్ !

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసార్హం. భావమే కొద్దిగా తికమక పెడుతున్నది. ‘లో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. అక్కడ ‘బ్లాగున’ అనవచ్చు. ‘కపరిన’ అర్థం కాలేదు. ‘తిరిగుచూ’ అనడం గ్రామ్యం. ‘తిరుగుచున్’ అనండి. సపర్యను సపరియ అనడమూ దోషమే. మీ పద్యానికి నా సవరణ....
      చపలము లాడుచు బ్లాగున
      కపటమ్మున నారదుండు కడగి కెలుకునో
      నుపచారమ్ములె తగునో
      యపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్.

      తొలగించండి
    2. ధన్య వాదాలండీ కంది వారు !

      బ్లాగులు ఒకపరిన అన్నదాన్ని బ్లాగులొ కపరిన అని వ్రాసా :)

      జిలేబి

      తొలగించండి
    3. అరెరే! ఎంత అజ్ఞానిని? బ్లాగులొ+కపరిన అని విభాగం చేసుకొని తికమకపడ్డాను. ‘బ్లాగులు+ఒకపరి...’ బాగుంది. అటువంటప్పుడు నా సవరణ అవసరమే లేదు. మన్నించండి... మీ భావాన్ని అవగాహన చేసికొనలేకపోయాను.

      తొలగించండి
  4. విపరీతంబీ ధోరణి
    యుపకారములన్ని గూడ నూరకె బొందీ
    చపలుండై తలచెనొకడు
    నపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పొందీ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘...నూరకె కనియున్’ అనండి.

      తొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరింప నున్నవి !

    దుర్మార్గుడైన కొడుకు రోజూ తల్లిని హింసిస్తుంటే
    పాపం పక్కింటి వాళ్ళు దయతో ఆ తల్లిని ఆశ్రమంలో చేరిస్తే తప్పా???
    కాదుగదా !!!

    01)
    _______________________________________

    అపకర్ముండైన కొడుకు
    యపకరణము జేయుచుండ - నక్కటికముతో
    నుపకారమె యగును గనుక
    నపరాధము కాదు తల్లి - నాశ్రమ మంపన్ !
    _______________________________________
    అపకర్ముఁడు = దుష్టాచరణము గలవాఁడు
    అపకరణము = కీడు చేయుట, సరిగా చేయకుండుట,అవమానించుట.
    అక్కటికము = దయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కొడుకు+అపకరణము’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘...తనయుం|డపకరణము...’ అనండి.

      తొలగించండి
  6. విపులమగు కార్యభారపు
    నెపమున తిరుగాడువృత్తి నిశ్చయ మైనన్
    ఉపచారముల్ సలుపలే
    వపరాధము కాదు తల్లి నాశ్రమమంపన్

    కుపితుండుతండ్రి తిట్టిన
    నపరాధముకాదు, తల్లినాశ్రమమంప
    న్నపచారమ్ముయె జననికి
    సపర్యలన్ జేసినంత సద్గతి దక్కున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘...న్నపచారమ్మే/ న్నపచారమ్మగు జననికి...’ అనండి.

      తొలగించండి
  7. విపరీతమైన ధోరణి
    కృప సుంతయు లేక ఘోర కృత్యారతుడై
    నెపములు వేయుట కన్నను
    అపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. నిపుణులు 'చాగంటి' గురుల
    విపులమ్మౌ ప్రవచనముల వేదిక నుండ
    న్నుపదేశము వినగోరగ
    నపరాధము కాదు తల్లి నాశ్రమమంపన్

    రిప్లయితొలగించండి
  9. తపములు సేసిన దొరకున ?
    విపరీతపు బుధ్ధి కాక ,విడుతురె భార్య
    న్నపమార్గము నిట్లు పలుక
    న పరాధము కాదుతల్లి నాశ్రమ మంపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. ఉపకృతి సేయందలచినఁ
    గృపతో చింతవల దేరికిన్ స్వజనవిహీ
    న పరాధీనమ్మైన
    న్నపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. విపరీతము కాదు జరను
    జపతపముల సేయ పర్ణశాలకు బోవన్
    నెపమెన్నక పంపినచో
    నపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. నెపముల నెన్నుచు సతతము
    సపర్యలను చేయకుండ సణుగుట కంటెన్
    జపముల జేయుచు బ్రతుకగ,
    నపరాదముకాదు తల్లి నాశ్రమ మంపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. కపటికి మేలొనరించుట
    నపరాధము కాదు, తల్లి నాశ్రమ పంపన్
    విపరీతంబగు, సతతము
    నుపచర్యలుజేసి చెంత నుండుటె మేలౌ!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...ఒనరించుట| యపరాధము...’ అనండి.

      తొలగించండి
  14. విపరీత మైనవొత్తిడి
    నపరాదము|కాదు తల్లి నాశ్రమ మంపన్
    నుపకారమనుటతప్పే
    కపటంబగు ,కల్పనాల ,కరువున కరుణే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వొత్తిడి’ అనే పదం లేదు. ‘..మైన యొత్తిడి’ అనండి.

      తొలగించండి
  15. విపరీత బుద్ధి గలిగిన
    కృప హీనపు కోడలున్న గృహమున, తాని
    ష్కపటపు సేవా న్వితుడై
    అపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. నెపమెన్నక తన కోడలి
    నపురూపము గాగ జూచు నత్తను దూఱ
    న్పపశృతిని దునుమ పుత్రుని
    కపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్.

    రిప్లయితొలగించండి
  17. సుపథము బోధించు గురువు
    అపరాహ్ణపు వేళలందు నాహ్వానింపన్
    విపరీతమేమి గలదు?
    అపరరాధమము కాదు తల్లి నాశ్రమమమంపన్

    రిప్లయితొలగించండి
  18. అపనమ్మక మున దేవుని
    నెపమెంచెడువాని జేరి నెమ్మది "బాబూ
    కృప బంపు స్వామి కడ " కన
    నపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. ​కపటపు ప్రేమను జూపుచు
    సపర్యలను జేసి జనని సంపద దోచన్
    తపన పడు సుతుని గని సుత
    కపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్!

    రిప్లయితొలగించండి
  20. విపరీతపు యుద్ధమునను
    విపులమ్ముగ రుధిరస్రవము వీక్షించంగన్
    తపమునకన పాండవులకు
    నపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్

    రిప్లయితొలగించండి
  21. శపథమునన్ వచ్చెదనను
    తపమున నరుణాచలమున తాదాత్మ్యమునన్
    రెపరెప లాడగ హృత్తున
    నపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్

    రిప్లయితొలగించండి