3, జనవరి 2016, ఆదివారం

పద్యరచన - 1137

కవిమిత్రులారా,
“మదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్ము...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని వ్రాయండి.

39 కామెంట్‌లు:


  1. మదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్ము
    మార్కెటు స్కాముల్ గుడి హుండియల్ స్వాహాయున్
    కిరికెట్టు బెట్టింగుల్ ముంబై మాఫియా గ్యాంగులన
    కర్మ తీర కనుడు అవకాశాముల్ మన కర్మభూమినన్

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      చక్కని భావాన్ని అందించారు. దీనికి మత్తేభరూపం ఇవ్వాలంటే శ్రమపడక తప్పదు. ప్రయత్నిస్తాను.

      తొలగించండి
  2. మదిరా పానము చౌర్యమున్ పరసతీ మానాప హారమ్ము నన్
    సదనం బున్వీడి రేపవల్ నిదియె నాసౌఖ్యం బటన్ మోదమున్
    మదికీ డెంచక వ్యాధులన్ బడసి తామైకాన బంధం బులన్
    మదిలో పొంగిన బాధలన్ దలచి నేవాపోదుగా నేటికిన్ ?

    ఇదీ కిట్టింపే .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      కిట్టింపు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. పద్యం బాగుంది. అభినందనలు.
      ‘రేబవళ్ళిదియె’ అనండి. మిగతా పద్యమంతా సలక్షణంగా ఉంది.

      తొలగించండి
    2. గురువులకు ధన్య వాదములు సవరించిన పద్యము
      ----------------------------------------
      మదిరా పానము చౌర్యమున్ పరసతీ మానాప హారమ్ము నన్
      సదనం బున్వీడి రేబవళ్ళిదియె నాసౌఖ్యం బటన్ మోదమున్
      మదికీ డెంచక వ్యాధులన్ బడసి తామైకాన బంధం బులన్
      మదిలో పొంగిన బాధలన్ దలచి నేవాపోదుగా నేటికిన్ ?

      తొలగించండి
  3. మదిరాపానము చౌర్యమున్ పరసతీ మానాప హారమ్ములే
    మదిలో దూరిన భ్రష్టుడౌ పతితుడౌ మాయంబగున్ మన్ననల్
    వదలన్ జాలగవచ్చు దుర్గుణములన్ వాచామన:కర్మచే
    పదముల్వీడకవేడనీశ్వరునిలన్ ప్రాప్తించు సద్భావనల్ !!!

    రిప్లయితొలగించండి


  4. శ్రీగురుభ్యోనమః

    “మదిరాపానము చౌర్యమున్పరసతీమానాపహారమ్ములున్
    కదనోత్సాహము హింసయున్ వికట యుగ్రాకార మోహమ్ములన్
    మదమాత్సర్యములన్ త్యజింప వలె, సన్మార్గమ్ములన్ పొందుచున్
    హృదయంబందనురాగ భావములతో నిద్ధాత్రి పై వెల్గగాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      “వికట+ఉగ్రాకార=వికటోగ్రాకార” అవుతుంది. ‘హింస ఘోరమగు నుగ్రాకార...’ అందామా?

      తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. మదిరా పానముచౌర్యమున్ పరసతీమానాపహారమ్మునన్
    మదినీ లగ్నముజేతువేమి యికకామంబొప్పునేనీకిటన్
    చదువేముఖ్యము బాలకా! మరినివేసారింతువిప్పుడున్
    మదికిన్ హానినినోయవియ యే మాత్రంబురానీయకే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసార్హం. అభినందనలు.
      ‘మదినిన్/మదినే’ అనండి. మూడవ నాల్గవ పాదాలలో గణదోషం.

      తొలగించండి
  7. మదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్ముయున్
    పెదవుల్ దాటెడు బొంకులన్ వదలగా పృధ్వీజనామోదమున్
    కదురౌ కూరిమి పొందుచున్ నిలుతురే కావేషముల్ బాయుచున్
    బుధులై మోదము చెందరే గురువులన్ పూజించ, దౌర్భాగ్యులున్

    నా మొదటి మత్తేభ విక్రీడితం...గురువులు తప్పులుంటే మన్నించాలి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుసర్ల నాగజ్యోతి గారూ,
      మొదటి ప్రయత్నమైన సాఫాల్యాన్ని సాధించారు. బాగుంది. అభినందనలు.
      ‘కావేశము’ అని విడిగా ప్రయోగించరాదు. చదువు-గిదువు వంటిదే ఆవేశ కావేశాలు. అక్కడ ‘గర్వోద్ధతిన్ బాయుచున్’ అనండి.

      తొలగించండి
    2. మదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్ముయున్
      పెదవుల్ దాటెడు బొంకులన్ వదలగా పృధ్వీజనామోదమున్
      కదురౌ కూరిమి పొందుచున్ నిలుతురే గర్వోద్ధతిన్ బాయుచున్
      బుధులై మోదము చెందరే గురువులన్ పూజించ, దౌర్భాగ్యులున్



      ధన్యవాదములండీ శంకరయ్య గారూ ,మార్చాను

      తొలగించండి
  8. మదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్మునున్
    మద మాత్సర్య విమోహ లోభములు కామావేశ బంధమ్ములున్
    సదసద్వీక్షణ హీనమున్శశ మమున్ సంరంభముం దర్పమున్
    మదిరానీయక వర్తిలన్నరుడు సామాన్యుండె చింతింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘శశమమున్’ నిఘంటు శోధనలో కనిపించలేదు.

      తొలగించండి
  9. మదిరాపానము చౌర్యమున్ పరసతీ మానాపహారమ్ములు
    న్నుదయాస్తమ్ములు జూదక్రీడయు గురుద్రోహమ్మనే దుష్కృతుల్
    మదిలోనైన తలంపబోనినరుడే మాన్యుండుగా వెల్గడే
    బుధుడెవ్వండును మెచ్చడిట్టి ఖలు పాపోత్కృష్టమౌ కార్యమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘అనే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘ద్రోహమ్మనన్’ అనండి.

      తొలగించండి
  10. మిత్రులందఱకు నమస్సులు!

    మదిరాపానముఁ జౌర్యమున్ బరసతీ మానాపహారమ్మునున్
    మదిలో నెవ్వఁడు పూని చేయు నతఁడే మాన్యుండు కాఁబోఁడిలన్!
    హృదయమ్మందుఁ గృపానుకంప మెడలన్, హేయమ్మె తజ్జీవిత!
    మ్మిది గుర్తించి దిశానుకూల్యుఁ డగుఁడున్; మేల్గౌరవాల్ పొందెడున్!!

    రిప్లయితొలగించండి
  11. మదిరాపానము,చౌర్యమున్,పరసతీ మానావహారమ్ముచే
    మది సంతృప్తిని గూర్చ దెప్పటికి సామాన్యంబైన సద్భక్తినే
    కొదవల్ లేకను నిల్పగా మనకు”సంకోచంబు మాన్పించు స
    న్నిదియే దైవసమానమౌ గురువు|సాన్నిధ్యానసాధించుమా.

    రిప్లయితొలగించండి
  12. మదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్ములున్
    విధిగా కీడును కల్గ జేయును సుమా విశ్వంబు నందెచ్చటై
    న, ధనాంధుండగు వానికిన్ సతము మానంబున్ క్షయంబయ్యెడిన్
    బుధవర్గంబును గౌరవించుచును సద్బుద్ధింజనన్ మేలగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. మదిరాపానము, చౌర్యమున్,పరసతీ మానాపహారమ్ములున్,
    కొదువన్ లేకను సాగుచున్న వకటా!ఖుల్లమ్ములన్ బాపగన్
    మదనోన్మాదుల ధూర్తపాలకుల దుర్మార్గంపు నేరస్తులన్
    తుదముట్టించుచు క్రూర శిక్షలకు బధ్ధుల్ జేసి దండించుడీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మదిరా పానము . చౌర్యమున్. పరసతీ మానాపహారమ్ము. దు
    ర్మద స౦చారము , దైవ దూషణము , దుర్మార్గ క్రియావృత్తి , ని
    త్య ధనాకా౦క్ష. మనుష్య నైధనము క్రుధ్ధాత్మ౦. బసత్య౦బు లన్
    మది వర్జి౦పుము మానవా బ్రతుకుమా మాన్యు౦డవై శా౦తి తో


    { మనుష్య నైధనము = నర హత్య }. ్

    రిప్లయితొలగించండి
  16. రావణాసురునితో ధర్మపత్ని మండోదరి:

    మదిరాపానము, చౌర్యమున్, పరసతీమానాపహారమ్ములన్
    వదలన్ జాలక లోకపావని రమన్ వాంఛించి బాధించినన్
    సుదతీనాథడు రామచంద్రుఁడు మహీ శూరుండు వంశంబుఁ దా
    తుదముట్టించక మానునే? దెలియుమా దోషోపశాంతమ్ముకై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘శాంతమునకై’ అనడం సాధువు. ‘దోషోపశాంతార్థివై’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

      రావణాసురునితో ధర్మపత్ని మండోదరి:

      మదిరాపానము, చౌర్యమున్, పరసతీమానాపహారమ్ములన్
      వదలన్ జాలక లోకపావని రమన్ వాంఛించి బాధించినన్
      సుదతీనాథడు రామచంద్రుఁడు మహీ శూరుండు వంశంబుఁ దా
      తుదముట్టించక మానునే? దెలియుమా దోషోపశాంతార్థివై!

      తొలగించండి
  17. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మదిరా పానము . చౌర్యమున్. పరసతీ మానాపహారమ్ము. దు
    ర్మద స౦చారము , దైవ దూషణము , దుర్మార్గ క్రియావృత్తి , ని
    త్య ధనాకా౦క్ష. మనుష్య నైధనము క్రుధ్ధాత్మ౦. బసత్య౦బు లన్
    మది వర్జి౦పుము మానవా బ్రతుకుమా మాన్యు౦డవై శా౦తి తో


    { మనుష్య నైధనము = నర హత్య }. ్

    రిప్లయితొలగించండి
  18. మా బంధువుల ఇంట్లో కార్యక్రమానికి ఉదయం వెళ్ళి ఇంతకుముందే తిరిగివచ్చాను. అలసి ఉన్న కారణంగా ఈనాటి పద్యరచన లన్నింటినీ రేపు ఉదయం సమీక్షిస్తాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  19. మదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్మునున్
    పదులున్ వందలు హత్యలున్ విరివిగా బంగారు స్మగ్లింగులున్
    గదిలో కోటుల నోటులున్ కుదురుగా గంజాయి చాక్లెట్టులున్
    కదరా నేతకు పొందుగా వలయు శృంగారాలు బీహారులో!

    రిప్లయితొలగించండి
  20. బైబుల్ ప్రవక్త ఉవాచ:

    మదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్మహో
    చదువన్ గోరిన నీ పురాణములనున్ చండాలమై యుండురా!
    అదుగో చూడుము జానకమ్మనయయో హ్లాదంపు పాంచాలినిన్
    కుదురున్ రోగము నీదిరా భడవడా క్రూరంపు హైందవ్యుడా!

    రిప్లయితొలగించండి