7, జనవరి 2016, గురువారం

సమస్య – 1907 (కట్నముఁ గోరిన వరుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్. 
ఈ సమస్యను పంపిన ఆంజనేయ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

51 కామెంట్‌లు:

  1. పట్నము నందున జదివిన
    రత్నము వంటి కొమరుడు రాజేంద్రు డటన్
    యత్నము జేసిన దొరకడు
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. ‘కొమరుండు’ అంటే సరి!

      తొలగించండి
    2. పట్నము నందున జదివిన
      రత్నము వంటి కొమరుండు రాజేంద్రు డటన్
      యత్నము జేసిన దొరకడు
      కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్
      dhanya vaadamulu

      తొలగించండి
    3. అక్కయ్యా,
      నేను గమనించలేదు. మీ పద్యంలో ట్న-త్న లకు ప్రాస వేశారు. అది దోషమే.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. పట్నము నందున కొలువని
      పట్నాయ కుపరి ణయమ్ము వరమని యెంచెన్
      రాట్నము వలెపని జేయగ
      కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్


      తొలగించండి
    2. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. కట్నము నిమ్మని పట్నపు
    పుట్నాలమ్మెడు యువకుడు భూరిగ గోరన్
    బూట్నందుకుని ఘనమ్ముగ
    కట్నము గోరిన వరుని జగమ్ము నుతించెన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘బూట్నందుకుని’ అన్న ప్రయోగమే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది.

      తొలగించండి
  4. పట్నపు వెలుపల రంగుల
    రాట్నము త్రిప్పెడి యువకుడు రాజస మొప్పన్
    కట్నమె వలదని వధువను
    కట్నము గోరిన వరుని జగమ్ము నుతించెన్

    రిప్లయితొలగించండి
  5. పట్నములో నుండెడి మన
    పట్నాయకు పెండ్లిలోన, ఫేస్బుక్ లోనన్
    పెట్నట్టి పోస్ట్కు లైకుల
    కట్నము గోరిన వరుని జగమ్ము నుతించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమ చ్ఛాస్త్రి గారూ - రెండవ పాదంలో యతి సరిపోలేదు. గమనించండి.

      తొలగించండి
    2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీరు సరదాగా చేసిన పూరణ బాగున్నది. సరదాగానే కనుక శబ్దదోషాల జోలికి పోవడం లేదు. కాని అన్నపరెడ్డి వారన్నట్టు రెండవపాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    3. దోషమును తెలియ జేసినందులకు ధన్యవాదములండీ సత్యనారాయణ గారూ..
      మాస్టరుగారూ..సరిజేయుచున్నాను....ధన్యవాదములు.


      పట్నములో నుండెడి మన
      పట్నాయకు ఫేసుబుక్కు పై తా ప్రేమన్
      పెట్నట్టి పోస్ట్కు లైకుల
      కట్నము గోరిన వరుని జగమ్ము నుతించెన్

      తొలగించండి
    4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. కొట్నము కంటెను ముందుగ
    కట్నము నిమ్మనుచు తల్లి కలహము బెట్టన్
    మ్యాట్నీ టిక్కెటు మాత్రమె
    కట్నము గోరిన వరుని జగమ్ము నుతించెన్

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. చట్నీ ,యిడ్లీ, కివలెను
    కట్నమ్మొక సాధనమ్ము కన్యకు పెండ్లిన్
    కట్నము లేకను పెండ్లియ?
    కట్నము గోరిన వరుని జగమ్ము నుతించెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. మిట్నాల గ్రామ యువతిని
    పాట్నాలో శాస్త్రవేత్త పరుగున మెచ్చెన్!
    ఛట్న సుదతి చిరునగవను
    కట్నము గోరిన వరుని జగమ్ము నుతించెన్!
    (

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. పట్నాయకాఖ్య యువకుడు
    చట్నీలనునమ్ముకొనుచు సాలోచనుడై
    పట్నపు మామను రాట్నమె
    కట్నము గోరిన వరుని జగమ్ము నుతించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. పట్నాయకాఖ్య యువకుడు
    చట్నీలనునమ్ముకొనుచు సాలోచనుడై
    పట్నపు మామను రాట్నమె
    కట్నము గోరిన వరుని జగమ్ము నుతించున్

    రిప్లయితొలగించండి
  12. పట్నపు జనులుస హించరు
    కట్నముకోరినవరుని,జగమ్శు నుతించున్
    కట్నము గోరని వానిని
    కట్నములవితీయుచుండె గాంతల యసువుల్

    రిప్లయితొలగించండి
  13. అట్నా! నాకెందుకులే
    కట్నము మీ పిల్ల చాలు కమ్మని వలపే
    కట్నము నాకని ప్రేమపు
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్.

    రిప్లయితొలగించండి
  14. రాట్నము వడుకుట నేర్చుచు
    పట్నము నందున వసించు పడుచు యువకుడున్
    కట్నము వలదని కన్నెనె
    కట్నముగ కోరిన వరుని జగమ్ము నుతించెన్.

    రిప్లయితొలగించండి
  15. పుట్నాలమ్మెడి వాడే
    కట్నంబును గోరుచున్న కలికాలములో
    పట్నపు నుద్యోగస్తుడు
    కట్నముగోరిన వరునిజగమ్ము నుతించున్.
    2.పట్నమునందునచదివెను
    కట్నము గోరిన వరుని జగమ్ము నుతించున్
    కట్నము వలదని వాడన?
    చట్నీతో భోజనంబు సరిపడదు గదా?.

    రిప్లయితొలగించండి
  16. పట్నపు యువకుండొక్కడు
    కట్నదురాచారములను ఖండించియు నే
    కట్నము వలదని ప్రణయపు
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. పట్నపు యువకుండొక్కడు
    కట్నదురాచారములను ఖండించియు నే
    కట్నము వలదని ప్రణయపు
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్.

    రిప్లయితొలగించండి
  18. పాట్నాలో నుద్యోగిని
    మ్యాట్నీ షోలో కనబడి మనసును దోచన్
    పట్నపు కన్నియ వలపును
    కట్న ము గోరిన వరుని జగమ్ము నుతించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. * గు రు మూ ర్తి అ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { పె౦డ్లి జరగాల౦టె అమ్మాయికి బ౦గారము ా పెట్టాలి కదా! పె౦డ్లి ఖర్చు ఈ రోజుల్లో చాలా వస్తు౦ది. అవన్నీ అమ్మాయి త౦డ్రి యే భరి౦చాలి . అదే కట్న౦ అనుకోవాలి .

    సమాజ౦ ఎ౦త. వినాశన మయినద౦టే
    కట్న౦ లేకు౦డా ఎవడయినా పెల్లాడితే వాని కేదో లోప౦. ఉ౦దని అనుకునే౦త. !
    ఎ౦త కట్నము ఎక్కువ తీసుకు౦టే వాడ౦త
    గొప్పవాడనుకొని అనుకొనే౦త. !

    పద్యము

    """"""""""""""""""""""""""""""""""""""""
    కట్నము సమాజ. మనియెడు
    రాట్నములో దిరుగు నూలు | లా గి న. తెగు నీ
    కట్నము గౌరవ చిహ్నము |
    కట్నము కోరిన వరుని జగము నుతి౦చున్ .

    """"""""""""""""""""""""""""""""""""""

    కట్నమె హోదా పె౦చు ననుకొనే వానిని,కట్నము తెమ్మని ఆడ పిల్ల ను హి౦సి౦చే వారిని పచ్చడి చేసి కాట్నము లో కాల్చాలి

    ..........................................................


    పద్యము
    ,,,,,,,,,,,,,,,

    కట్నము తెమ్మని " హి౦సల
    రాట్నము " లో నాడపిల్లలను ద్రిప్పినచో
    ఛట్నీ చేయగ వలయును
    " కా ట్న ము " లో వేసి వారిc. గాల్చగ వలయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. కట్నమపరాధ మైనను
    కట్నము వలదను వరుని జగతి శంకించున్.
    కట్నముగా సంస్కారపు
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్.

    రిప్లయితొలగించండి
  21. ముట్నూరి వారి యువకుడు
    పట్నాల వారి పడచును పరికించి యనన్
    కట్నం బావధు వని , యా
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్.

    కట్నాలు కాన్క లెందుకు
    ముట్నూరి వారి వనితయె ముత్యం బనుచున్
    రాట్నము నొక్కటి మాత్రమె
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండు పూరణలలో రెండవ పాదంలో ‘ల వారి, రి వారి’ అని జగణం వేశారు. (కందం రెండవపాదంలో సరిగణంగా జగణం వేయరాదు కదా!)

      తొలగించండి
  22. గురువుగారికి, పెద్దలకూ నమస్కారం. మేనకోడలిని పెళ్ళి చేసుకొనే యువకుడు బుట్టలో పెళ్ళికూతురుని తీసుకువచ్చేటప్పుడు వచ్చే మేనమామ కట్నం మాత్రమే కోరాడు అన్న భావనలో రాశాను. దయచేసి పరిశీలించి నా తప్పులు తెలియచేయగలరు.
    కం:

    పట్నపుకోడలినిమనువు
    చట్నేయాడగముదమునచనుమాతులుడే,
    అట్నాబుట్టకుమాత్రమె
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్.

    రిప్లయితొలగించండి
  23. ఉట్నూరులతలు,మచిలీ
    పట్నపు మగువలు,విశాఖ పడుచులు, చెన్నై
    పాట్నా యువతులు ఛీయన
    కట్నముఁ గోరిన వరుని, జగమ్ము నుతించున్!!!

    రిప్లయితొలగించండి
  24. పట్నము నందున డాక్టరు
    కొట్నీసను చిత్రమందు కోరిక తీరన్
    నట్నమ్మాడుట కొరకై
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్!

    https://en.m.wikipedia.org/wiki/Dr._Kotnis_Ki_Amar_Kahani

    రిప్లయితొలగించండి


  25. కట్నంబు మేలు గూర్చును
    నట్నము వలె కాచు సతిని నల్గురిలోనన్ !
    పాట్నా లోన జిలేబీ
    కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్


    జిలేబి

    రిప్లయితొలగించండి