17, జనవరి 2016, ఆదివారం

పద్యరచన - 1150

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. 1.
    కన్న తల్లిని దయతోడ కాంచ లేని
    కోట్ల ధనరాశు లున్నట్టి కొడుకు కన్న
    పట్టె డన్నము ప్రేమతో పెట్టు సుతుడె
    ధనికు డనగనొప్పుగదనీ ధరణి యందు

    2.
    కన్న తల్లి కన్న మిన్న దైవము లేదు
    అమ్మ కన్న మిన్న యాప్తు లెవరు
    జనని లేనినాడు జగతికి రక్షేది
    ఆమె లేని నాడు యవని లేదు

    3.
    కన్నతల్లి మనసు కరుణా రస జలధి
    ఆమె కన్నులందు కరుణ కురియు
    సకల దేవతలకు సమతుల్య మే తల్లి
    మరువ దగదెపుడును మాతృ సేవ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ, (మిమ్మల్ని ఈ పేరుతో సంబోధించాలా లేక విరించి అనాలా?)
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు..గురువుగారూ ......మీ రేపేరుతో పిలిచినా నాకానందమే నండీ...

      తొలగించండి
  2. రామ రాజ్యము నేలిన ప్రేమ మూర్తి
    తల్లి మాటను తలదాల్చు తనయు డపుడు
    తరిగె తనయుని మమతల బరువు బ్రతుకు
    బిడ్డ ప్రేమను కొనలేని బిచ్చ గత్తె

    రిప్లయితొలగించండి
  3. కోట్లు గూడబెట్టి కోటలు గట్టిన
    వాడి కన్న మిన్న వసుధలోన
    కన్న తల్లి కనులు కన్నీరు గార్చక
    నరయు వాడె గాదె నాస్తిపరుడు!!!




    అమ్మ కన్న మిన్న యవనిలో యేముంది
    ఆమె లేని చోట నంధమగును
    భోగభాగ్యములను పొందుట కన్నను
    తల్లి క్షేమ మరయ ధర్మమంద్రు!!!



    ఆస్తు లెన్నియున్న అమ్మను జూడని
    మునుజుడధముడగును మహిని తుదకు
    అమర ప్రేమ ఫలము నమ్మలో జూచిన
    జయము బడయు గాదె జగతిలోన!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘..గాదె యాస్తిపరుడు’ అనండి.
      రెండవపద్యంలో ‘అవనిలో నేమున్న|దామె...’ అనండి.

      తొలగించండి
  4. కోటి రూప్యము లార్జించు కొడుకు కంటె
    తల్లి దండ్రుల సరిజూడు తనయు డరయ
    యుత్తము డనుచు బొగడు దు రోసుజాత !
    తల్లి యందున జూడుము దైవ మునిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘...అరయ|నుత్తము...’ అనండి.

      తొలగించండి
  5. అవ్వ సుచిరుహసి తానన
    యవ్వచనామృత మృదుమధు రాన్విత సూక్తుల్
    నివ్వటిల జూపు చున్నది
    సవ్వడి సేయకఁ గనుండు సదమల వృత్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. నాశతక పద్యము:
      పన్నుగఁ గన్పడు దైవము
      కన్నకడుపు నెంచ మిన్న కన్నని కన్నన్
      కన్నడ చేయం దగునే
      తన్నెప్పుడుఁ బోచిరాజతనయా వినుమా

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ శతక పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. వృద్ధ తల్లి పైన శ్రద్ధను జూపక
    ధనము గూడ బెట్ట ఘనత రాదు
    తల్లిదలచు వాడె తరగని ధనికుడు
    శంకరార్యుమాట చద్దిమూట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘వృద్ధతల్లి’ అని సమాసం చేయరాదు. ‘వృద్ధమాత’ అనండి.

      తొలగించండి
  7. అమ్మ కనుల నుండి ఆనంద భాష్పాలు
    కురియ జేయు నట్టి కొడుకు వగుము
    కలత తోడ నెపుడు కన్నీటి చుక్కతో
    తల్లి చెంప లెపుడు తడవ నీకు

    రిప్లయితొలగించండి
  8. కోటి విద్యలంది కోటానుకోట్లగన్
    కలిమిఁ గూడఁ బెట్ట కలుగునేమి?
    కన్నతల్లికంట కన్నీరురానీని
    కన్నవాడగు ధనమున్నవాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. కోటి విద్యలంది కోటానుకోట్లగన్
    కలిమిఁ గూడఁ బెట్ట కలుగునేమి?
    కన్నతల్లికంట కన్నీరురానీని
    కన్నవాడగు ధనమున్నవాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. కన్నతల్లి నష్ట కష్టాల పాల్జేసి
    కోటి రూప్యములను కూడబెట్ట
    ధనికు డవగబోడు ధరలోన యెన్నడు
    అమ్మెదైవ మెపుడు అవని యందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘ధరలోన నెప్పుడు, దైవ మెప్పు డవనియందు..’ అనండి.

      తొలగించండి
  11. తల్లిని మించిన సంపద
    పిల్లల కీ ధరణి గలదె వీడకుడయ్యా
    తల్లిని వార్ధకమందున
    వెళ్ళగ నడిపింప దగదు వృద్ధగృహాలన్.

    నీకు జన్మ నిచ్చి నీ బాగు కోరుచు
    బలము బాగు మాసి వడలిపోయె
    నంత్యకాలమందు నాకేమి యనుకొన
    తప్పుగాదె నీదు తల్లి పట్ల.

    ప్రాణములొడ్డి జన్మనిడి బాల్యమునన్ నిను గాచి బుద్ధులన్
    సానను బెట్టి సంఘమున జక్కని పౌరుని జేసి తోడుగా
    చానను దెచ్చి నీకొఱకు సర్వము త్యాగము జేయు తల్లినిన్
    న్యూనత జేయుటొప్పగునె యోచన జేయవె నీవు పుత్రుడా!

    తల్లి నిచట విడచి తరుణితో డబ్బుకై
    పొరుగుదేశములకు పోవుటగునె?
    తనువు వంగి తల్లి కనులలలో నిన్నుంచి
    యెదురుజూచి నందుకిదియ ఫలము?

    ధనము వచ్చును పోవును ధరణిలోన
    తల్లి పోయిన నీకింక తరలిరాదు
    ధనమునను కొందు సర్వమన్ తల పదేల
    నిలువు ధనమిచ్చినను కొనగలవె జననిఁ?

    జననియు జన్మస్థలమును
    వినవే స్వర్గమ్ము కన్న విలువని రాముం
    డనుటను నీ వీ సంస్కృతి
    ఘనవారసుడవుట మరువ ఘనతయె తనయా!

    రక్షించుము నీ తల్లిని
    శిక్షింపకు మయ్య నామె చివరి దశను నీ
    యీ క్షమ గని నీ తనయులు
    రక్షించెద రంత్యమందు రంగుగ నిన్నున్.



    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ,
    మీ ఖండకృతి నీతిబోధకంగా ఉంది. అభినందనలు.
    నాలుగువ పద్యంలో ‘కనులలలో’, ఐదవ పద్యంలో ‘జననిఁ’ టైపాట్లు.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ ధన్యవాదాలు. కొనగలవె జననిన్? అనే అర్థం రావడానికి అరసున్న వాడేను. కూడదంటారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      పరుషాక్షరం పరమై, అది సరళాక్షరంగా మారినపుడే ద్రుతం అరసున్నాగా మారుతుంది. ద్వితీయార్థంలో ‘జనని’ అని ప్రథమను ప్రయోగించవచ్చు.

      తొలగించండి
  14. తల్లిని విడనాడి ధనముపై మోజుతో
    తిరుగువాడు వట్టి దేశముదురు
    కోటి రూప్యములును కొరగావు ధరలోన
    అమ్మ ప్రేమ విలువ నరయు మయ్య.

    రిప్లయితొలగించండి
  15. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘దేశముదురు’ అనడం వ్యాకరణసమ్మతం కాదు.

    రిప్లయితొలగించండి
  16. కోట్లసంపదలార్జించు కొడుకుకన్న
    తల్లినిన్ సాకుతనయుడే ధరనుమిన్న
    కంటి నీరేది గార్చనికన్నతల్లి
    నెంచి సాకెడివాడేగ పెంచుగొప్ప
    అన్నమాటలానాటి కున్నమాట
    మాట మూటల నిల్వలీనాటి వేట.

    రిప్లయితొలగించండి