2, జనవరి 2016, శనివారం

సమస్య – 1902 (నను మించిన మూర్ఖు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్.

56 కామెంట్‌లు:

 1. కనివిని యెరుగని వింతలు
  వినువీధు లనేలు చుండె వేయి విధమ్ముల్
  మనసుకు తెలిసిన నిజమిది
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్

  రిప్లయితొలగించండి
 2. నను మించిన పామరుఁడును
  నను మించిన పాపి మరియు నాస్తికుఁ డీశా!
  నను మించిన దుష్టుండును
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ‘ఊకదంపుడు’ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువు గారూ,
   ధన్యవాదములు . ఈ పూరణను కూడా పరిశీలించవలసినదిగా ప్రార్ధన

   అనుమానము లేక సుయో
   ధనుడే "మూర్ఖాగ్రణి" బిరుదమునకుఁ దగువాఁ
   డనెదను, కాక, యెట వెతకి
   నను, మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్.

   తొలగించండి
 3. రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ మొదటి పాదాన్ని ‘ధనమును వనితలపొందే’ అనండి. పొందు+ఎ అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు.

   ధనమును వనితల పొందే
   ఘనమగు సౌఖ్యమని తలచి కామాంధుడనై 
   మనుగడ సాగించితినే 
   ననుమించిన మూర్ఖుడుండునా లోకమునన్ 

   కనబడని పరాత్పరుఁ న
   మ్మిన ఫలితమ్మేమి వాడు మిథ్యయె ననుచు
   న్ననవరతము వాదించితి
   ననుమించిన మూర్ఖుడుండునా లోకమునన్

   తొలగించండి
 4. శ్రీగురుభ్యోనమః

  జనులెల్లరు హితులేనని
  మనకొరకై పాటుబడెడు మాన్యులటంచున్
  వినిపించితి వాదమ్మును
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీపతి శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘హితులే యని’ అనండి.

   తొలగించండి
 5. కని పెంచిన తల్లినిచట
  ననాదరముతోడ జూచి నలుగురి లోనన్
  ననవరతము చులకనయితి
  నను మించిన మూర్ఖుడుండునా లోకమునన్.
  2.అనయము వెంటబడి నడుగ
  కొనుమంచు నొసగితి ధనము కూరిమి తోడన్
  అనుమానింపక;రాదది
  నను మించిన మూర్ఖుడుండునా లోకమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘వెంటబడి యడుగ’ అనండి.

   తొలగించండి
 6. ననుమిం చినమొన గాడును
  ననుమించినఐమాటకారి కానంబడెనే?
  ననుగురిచిదెలుప యిటులను
  ననుమించిన మూర్ఖుడుండునాలోకమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో యతి తప్పింది. ‘నను మించిన మాటకారి నా కగపడడే’ అందామా?

   తొలగించండి
 7. కనబడని హరిని జూడగ
  ననునిత్యము గిరుల ఝరుల నన్వేషిస్తూ
  మనమున వెదకుట మరచితి
  నను మించిన మూర్ఖుడుండు నాలోకమునన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘అన్వేషిస్తూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘అన్వేషింపన్’ అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 8. విననోపనుగురుబోధన
  మనసంతయుపదవిచుట్టె మసులుచునుండున్
  ధనమే ప్రాధాన్యంబగు
  ననుమించిన మూర్ఖుడుండునాలోకమునన్!!!


  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురుదేవుల సవరణలకు ధన్యవాదములతో...

  ధనార్జన యని కష్టముల నొందితిని
  =============*==================
  ధన వనమున నిలువ దలచి
  వనామి రొయ్యలను పెంచి వానరుడయితిన్
  నను మించిన దుష్టుండును,
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందుల వరప్రసాద్ గారూ,
   స్వానుభవంగా మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
   సానుభుతి తెల్పడం తప్ప నేనేం చేయగలను?

   తొలగించండి
 10. తిన్నని యొక్క యాలోచన........

  విను నా యెంగిలి నీటను
  నిను తడిపితి దోషినగుచు నిలచితి స్వామీ!
  ఘనులగు నీ భక్తులలో
  నను మించిన మూర్ఖుఁడుండునా లోకమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. తిన్నని యొక్క యాలోచన........

  విను నా యెంగిలి నీటను
  నిను తడిపితి దోషినగుచు నిలచితి స్వామీ!
  ఘనులగు నీ భక్తులలో
  నను మించిన మూర్ఖుఁడుండునా లోకమునన్.

  రిప్లయితొలగించండి
 12. భక్త కబీరు దోహా:తనయందు నున్న దేవుని
  గన జాలక వెదకినాను కాశీ,కాబా,
  ఘనబెత్లహాము నందున
  నను మించిన మూర్ఖు డుండునా లోకమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 13. పుండరీకుని వంటివారి స్వగతం...


  కనిపెంచిన తలిదండ్రులె
  కనబడు దైవమ్ములనుచు గమనించక నే
  ననిశము బాధలు బెట్టితి
  ననుమించిన మూర్ఖుడుండు నాలోకమునన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   పుండరీకుని స్వగతంగా మీ రెండవ పూరణ చాల బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 14. మోసపోయిన ఓ అభాగ్యుని ఆవేదన:

  కొననట్టి లాటరీయది!
  యొనగూర్చెను లక్షలనిన! నొసఁగితి బ్యాం
  కు నమోదితముల, దోచిరి!
  ననుమించిన మూర్ఖుడుండునా లోకమునన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   సైబర్ నేరాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. వనమేగి కట్టెలకుఁ దరు
  వునెక్కి తానిలచిన ఘనపు విటపమును బూ
  నెనొకడు ఖండింపంగఁ ద
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   ‘తనను’ అంటూ మీరు చెప్పిన పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 16. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  నను దైవ సన్నిభుని గా
  ననుకొను సతి లక్ష్య పెట్ట . కరసి గణికల
  న్ననురక్తిc. బతన మయితిని |
  నను మి౦చిన మూర్ఖు డు౦డునా లోకమున్ !

  గణిక = వేశ్య ె

  రిప్లయితొలగించండి
 17. ఇనవంశ రాజ చంద్రుడు
  జనవంద్యుండైన రామచంద్రుని మ్రొక్కన్
  కననెంత గ్రుడ్డి వాడనొ
  నను మించు మూర్ఖుడుండునా? లోకమునన్

  రిప్లయితొలగించండి
 18. చివరి పాదంలో... ననుమించినకు బదులు ననుమించు అని పొరబాటు దొర్లినది. క్షమార్హుడను,

  రిప్లయితొలగించండి
 19. కనిపెంచిన తలిదండ్రులు
  కనుపించరు సేవచేయ గయములనందున్
  పనిచేసెద పరుల కొరకు
  ననుమించిన మూర్ఖుడుండునా లోకమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో ‘గయములనందున్’...?

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మంచి ప్రయత్నమే. పద్యం బాగున్నది.
   కాని ‘ఆయనను’... ‘ఆయననను’ అయింది. ‘మనతో గడుపడు గాదె త|నను మించిన...’ అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 21. త నలోకమె తనదనుకొని
  మనుగడ సాగించుటందు మమతలు లేకన్
  మనతో గడుపడు గాదెత
  నను”మించిన మూర్ఖు డుండునా లోకమునన్?

  రిప్లయితొలగించండి
 22. కనకేమియు పూరించగ
  మనసునదోచినదియేదొ మరి వ్రాయంగా
  అనఘా మన్నించుడు సరి
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శశికాంత్ మల్లప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వ్రాయంగా’ అనడం వ్యావహారికం. ‘మరి వ్రాయగ నో| యనఘా...’ అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారూ..
   కనకేమియు పూరించగ
   మనసునదోచినదియేదొ మరి వ్రాయగనో
   యనఘా మన్నించుడు సరి
   నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్

   తొలగించండి
 23. అని గూలుచు రావణు డనె
  ననిరుద్ధా ! నరుడ వనుచు నమ్మితి నాజి
  న్నిను దైవముగా నెరుగని
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్.

  రిప్లయితొలగించండి
 24. మిత్రులందఱకు నమస్సులు!

  (పావలా కూలీకై నూనెపీపాను మోయుచు, నా పావలాతో గ్రుడ్డును కొని పొదిగించి, బయల్వెడలిన కోడి ద్వారా మరిన్ని గ్రుడ్లు పొంది, వాటిని పొదిగించి, మరిన్ని కోళ్ళను పొంది, కోళ్ళవ్యాపారము చేసి, ధనవంతుఁడనై మంచి భవనము కట్టుకొని, పెండ్లి చేసికొని, యొక కొడుకు పుట్టిన తదుపరి, యా పిల్లవాఁడిని నేనిటుల ముద్దిదుననుకొనుచు...నూనెపీపాను పట్టుకొనిన రెండు చేతులను విడచి, కొడుకును ముద్దాడిన ట్లభినయించఁగా నూనెపీపా క్రిందపడి నూనె యంతయు నొలికిపోవఁగా, యజమానికి నా ఖరీదు నీయలేక నౌకరుగా మాఱిన భీమన్నను మించిన మూర్ఖుఁడు లోకమందుండునా?....ఇది నా చిన్నతనమందుఁ జదివిన కథ...)

  అనిశము ధనసంపాదన
  మునకై తలఁచుచును నూనె మోయుచు స్వప్నా
  లను కనెడునట్టి భీమ

  న్నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   చిన్నప్పుడు చదివిన కథను గుర్తుకు తెచ్చారు. ఇటువంటిదే పేలపిండి కథ కూడా ఉంది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. మనమున నూరట లేకయె
  వినుచును నా బావ మాట వివశుడనౌచున్...
  కననాయెనె నభిమన్యుని...
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్!

  రిప్లయితొలగించండి

 26. కంది వారి మన్ కీ బాత్ :)


  అనుమాన మేమియునులే!
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్,
  పనిలేని జిలేబీ పూ
  రణల చదువ కర్మ కలిగె రసనయు బోయెన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 27. రాహులుడువాచ:

  వినుచును మిత్రుల హితవులు
  కనుగొని జందెమ్ము నొకటి గమ్మున దాల్చన్
  తనువున తీటాయె గదర!
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్ ?

  రిప్లయితొలగించండి


 28. అనమానములేదు సుమా
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్
  పనిలేక యనుదినమ్ము స
  దనమున పూరణలచేసి తరియించితినే :)


  జిలేబి

  రిప్లయితొలగించండి