6, జనవరి 2016, బుధవారం

సమస్య – 1906 (కుందనమును కోమలాంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!
(ఒకానొక అవధానంలో శ్రీ నరాల రామారెడ్డి గారు పూరించిన సమస్య)

65 కామెంట్‌లు:

 1. ఈ సమస్యకు శ్రీ నరాలా రామారెడ్డి గారు చాలా మంచి పూరణమిచ్చారండీ

  రిప్లయితొలగించండి
 2. గురువు గారికి నమస్కారములు

  చందురునివంటి యందము
  పొందిక గలసద్గుణములె భూషణమై వె
  ల్గొందెడు పతి లభింపను
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవపాదంలో గణదోషం. ‘వె|ల్గొందెడు పతియె లభింపగ’ అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి ధన్యవాదములు నాతొందరపాటు అక్షరం లోటైంది పతియె వుండాలి...అలానే రాసాను కూడా...

   తొలగించండి
  3. చందురునివంటి యందము
   పొందిక గలసద్గుణములె భూషణమై వె
   ల్గొందెడు పతి యె లభింపను
   కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ.

   తొలగించండి
 3. అందము చిందెడి పిల్లలు
  బంధనములె వరమటంచు బాధ్యత లందున్
  చందనము వంటి భర్తను
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ

  రిప్లయితొలగించండి


 4. శుభోదయం:-

  అందము గా పతి కార్డుతొ
  చందము గవెడలి జిలేబి చక్కగ కొనునా
  నందము గరోయి నిక్కము
  కుందన మును కోమలాంగి కోరదు సుమ్మీ :)


  చీర్స్
  జిలేబి
  (సావేజిత)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ కందం సలక్షణంగా ఉంది. పూరణ బాగుంది. అభినందనలు.
   ‘కార్డుతొ’ అని ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘కార్డున’ అనవచ్చు.

   తొలగించండి
 5. చందురుని బోలు ముఖమున
  నందముగా బొట్టుబెట్టి యల్లుచు జడనే
  ముందర పతి చేతల కర
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   ‘కరకుదనం’తో మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

   తొలగించండి
 6. సుందరి బొట్టును కాటుక
  నందముగా తీర్చి జేర నతి లలితముగా
  ముందర పతి చేతల కర
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. నా నిన్నటి పూరణ


  కొడుకు మడియ తాను కోపించి హరి ముందు
  ప్రతినజేయ " బావ ! బాగు " యనుచు
  మరణ శాసనమ్ము మదిలోన లిఖియించె
  సవ్యసాచిసఖుడు, సైంధవునకు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. సుందర రూపుడు మునిగణ
  వందితుడౌరామచంద్రు బతిగను పొందన్
  చందన చర్చితుడుండగ
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ

  రిప్లయితొలగించండి
 9. అందమె కాదు గుణమ్మును
  సందడిఁ జేయు సహచరుని సన్నిధి వలచున్
  సుందర మైనను నకిలీ
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. ఓ సాహితీ మిత్రుడు 'నకిలీ' బదులు మరే పదమైనా ప్రయత్నించమన్నారు.

   సవరించిన పూరణ:
   అందమె కాదు గుణమ్మును
   సందడిఁ జేయు సహచరుని సన్నిధి వలచున్
   సుందర మౌ పై పూతల
   కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు. ఓ సాహితీ మిత్రుడు 'నకిలీ' బదులు మరే పదమైనా ప్రయత్నించమన్నారు.

   సవరించిన పూరణ:
   అందమె కాదు గుణమ్మును
   సందడిఁ జేయు సహచరుని సన్నిధి వలచున్
   సుందర మౌ పై పూతల
   కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

   తొలగించండి
 10. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  కు౦దనపు సొమ్ములను సో
  కు౦దన మీనెడు జిలు౦గు కోకలు దాల్చన్
  పొ౦దునె త ని వి ? మగని కర
  కు౦దనము కోమలా౦గి కోరదు సు మ్మీ ! !

  రిప్లయితొలగించండి
 11. చందనవనమును బోలిన
  మందారపు తోటలోన మగనితొ డుండన్
  సుందరమగుసంతున్నన్
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మగతో డుండన్’ అనండి.

   తొలగించండి
 12. శతావధాని శ్రీ నరాల రామారెడ్డి గారి పూరణ.....

  మందస్మితముల జిమ్ముచు,
  చందన చూర్ణంబు మేనఁ జల్లిన రీతిన్
  చిందింపుము వలపుల, కఱ
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

  రిప్లయితొలగించండి
 13. నందము నీయుచు మదికి
  న్నందించుచు తెలి వలపుల నభిహారికముల్
  ముందర పతియుండిన యే
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!!!


  నందము =సంతోషము
  ప్రత్యుత్తరంతొలగించు

  రిప్లయితొలగించండి
 14. అందమ్మున మన్మథుడై,
  చందమ్మున రఘుకులాబ్ధిచంద్రునిగ, హృదిన్
  బందీ సేసిన, తనపతి
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. మరియొక పూరణ: అందపు తొలి రెయిని తన
  డెందములో వలపులన్ని డీలు పడంగన్
  కొందలము సేయు పతి కర
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ.
  కరకుందనము=కఠినము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రెయిని’ టైపాటు...

   తొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మంచమున’ అన్నది ‘మంచన’ అని టైపయింది.

   తొలగించండి
 17. విందున బొమ్శగ బంచెను
  కుందనమును కోమలాంగి ,కోరదుసుమ్మీ
  యెందును దేనిని దానుగ
  ముందరగా దనకుననుచు మొండిగనెపుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. మా తమ్ముడు, పోచిరాజు కామేశ్వర రావు పద్యము

  చందనపు బొమ్మ భంగిని
  నందము కను విందు జేయ నలరించె నటన్
  డెందమ్మున దా నితరుల
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. గురుదేవులకు వందనములు టైపు దోషము సవరించిన పద్యము

  మరియొక పూరణ: అందపు తొలి రేయిని తన
  డెందములో వలపులన్ని డీలు పడంగన్
  కొందలము సేయు పతి కర
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ.
  కరకుందనము=కఠినపు

  రిప్లయితొలగించండి
 21. గురుదేవులకు వందనములు టైపు దోషము సవరించిన పద్యము

  మరియొక పూరణ: అందపు తొలి రేయిని తన
  డెందములో వలపులన్ని డీలు పడంగన్
  కొందలము సేయు పతి కర
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ.
  కరకుందనము=కఠినపు

  రిప్లయితొలగించండి
 22. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....

  గురుదేవులను తప్పులున్న మన్నింప ప్రార్థన..


  తేటగీతి గర్భ ఆట వెలది కందము
  =============*============
  అందమయిన పద్య మలలు గందు మిచట
  గర్భ కవిత,ఖండికలను,గందమునను
  కుందనమగు కంది కుసుమ బందనమును
  కన్ను లదర,బంధు గణము గనును నేడు !

  ఆటవెలది

  అందమయిన పద్య మలలు గందు మిచట
  గర్భ కవిత,ఖండికలను,గంద,
  కుందనమగు కంది కుసుమ బందనమును
  కన్ను లదర,బంధు గణము గనును

  కందము
  అందమయిన పద్య మలలు
  గందు మిచట గర్భ కవిత, ఖండికలను,గం,
  కుందనమగు కంది కుసుమ
  బందనమును కన్ను లదర,బంధు గణము గన్ !

  (గం= గణపతి,కంది= శ్రీ కందిశంకరయ్య గురుదేవులు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందుల వరప్రసాద్ గారూ,
   మీ చిత్రకవిత్వాసక్తి నాకు ఆనందాన్ని కలిగించింది. గర్భకవిత్వ రచన ఎంతో శ్రమతో కూడినది. దానికి ముఖ్యంగా కావలసినది శబ్దజ్ఞానం. మీరు మీ ప్రయత్నంలో చాలవరకు సఫలమయ్యారు. స్వస్తి!

   తొలగించండి
 23. సుందరమగు పతి హృదయా
  నందమె సర్వస్వమంచు నాలోచించున్
  అందరివలె కావలెనని
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 24. కందము యతిగణ చందము
  అందముగను నాలుమగల నన్యోన్యతయౌ
  బంధముననుకొను సుందరి
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ
  2.ఎందును కట్నంబడుగక
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ
  అందరివలె నడిగినచో?
  అందపు నాభరణములను నందించవలెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 25. సుందరుడైనట్టి మగడు
  చందురు సరిపోలు నట్టి చక్కని సంతున్
  పొందిన పిమ్మట , తుష్టిన్
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. చందురుని వంటిభర్తయు
  పందిరిమంచమున పూల పరిమళ మందున్
  పొందగు సుఖమున దేలుచు
  కుందనమును కోమలాంగి కోరదుసుమ్మీ

  రిప్లయితొలగించండి
 27. చందన మద్దిన రీతిని
  మందస్మిత వదనుడైన మగని సరసనే
  పొందగ సతతము తలచును
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

  రిప్లయితొలగించండి
 28. సుందర రూపుడు పతియున్

  అందము నందులవకుశులు నగునందనులన్

  పొందిన కులసతి యెపుడున్

  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

  డాక్టర్ మూలె రామమునిరెడ్డి.ప్రొద్దుటూరు వై.యస్.ఆర్.జిల్లా 7396564549

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మూలె రామమునిరెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 29. గురువుగారికి, పెద్దలకు నమస్కారం. కుందమనునేకుబేరుని నిధివలె కుందకము అనగా లోపము ఎరుగని కంజకవు అనగా చేమంతిపూవువు అని కందువన అనగా ఏకాంతములో మగడు పొగడగా ఆమె దానికి మించి మరే కుందనమూ కోరదు అన్న భావనలో రాసినది. దయచేసి భావాన్నీ, పద్యాన్నీ పరిశీలించి నా తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదాలు.

  కుందమమనెడునిదివలెనే
  కుందక మెరుగని పడతివి కుంజక వనుచూ
  కందువనమగడుబొగడగ
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘కుంజక మనుచున్’ అనండి. ‘అనుచూ’ అనడం గ్రామ్యం.

   తొలగించండి
 30. సందడి డిస్కో డాన్సున
  వందల త్రొక్కిడి నడుమను భంగుల సేవన్
  చిందులు త్రొక్కెడి వేళను
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   ఎన్నాళ్ళకు మళ్ళీ మీ పూరణ కంట బడింది! సంతోషం.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

  2. కంది వారు ఇవ్వాళే నిదుర వీడినట్టున్నారు :) పాత టపాలలో జీపీయెస్ వారి కల్లోలాలు తెలియక పోయె ఆ ప్రొటెస్టు తరువాయి :)


   జిలేబి

   తొలగించండి


 31. ఛందస్సుల పద్యంబుల
  భందిలముల కోరుగాని పద్మార్పిత తా
  కొందల పడదు సుమీ మేల్
  కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 32. మందుడు వచించు నిటులన్:
  "కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!"
  అందముగా దిద్దుమిటుల:
  "కుందనమును కోమలాంగి కోరును సుమ్మీ!"

  రిప్లయితొలగించండి