6, జనవరి 2016, బుధవారం

పద్యరచన - 1140

కవిమిత్రులారా,
“కలఁ గంటిని కలలోనన్...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ స్వేచ్ఛాభావంతో పద్యాన్ని పూర్తి చేయండి.

36 కామెంట్‌లు:

 1. కలగంటిని కలలోనన్
  వలయితమౌ చెలి సరసపు పలుకుల తోడన్
  వలరాజుగ నను మలచుచు
  వలమల సిగరమ్ము జేర్చె వలజయె నన్నున్ .

  రిప్లయితొలగించండి
 2. కలఁ గంటిని కలలోనన్
  వలపుల చెలిసొగసు లందు వయ్యా రములన్
  కలతలు రేపగ నామది
  పులకింతల పూల వనము పొంగుచు నేగేన్

  రిప్లయితొలగించండి

 3. కలఁ గంటిని కలలోనన్
  కలయు కలయని తెలిసేను కాదే నాకున్
  కలయక యతియూ జోడిగ
  కలగని యతిజత కలుగక కలగన యేలా !

  జిలేబి
  (సావేజిత!)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘తెలిసేను’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘కలయు కల యనుచు తెలిసెను’ అనండి. ‘కలగన నేలా’ అనండి.

   తొలగించండి
 4. కలగంటిని కలలోనన్

  కలకాలము వెంటనడచి కమ్మనివలపున్

  తులలేని సుతుల నిచ్చెడు

  వలపుల రాణినలివేణి వన్నెల భామన్.

  డాక్టర్ మూలె రామమునిరెడ్డి. ప్రొద్దుటూరు వై.యస్.ఆర్. జిల్లా.7396564549

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మూలె రామముని రెడ్డి గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 5. కలఁ గంటిని కలలోనన్
  కలభాషిణి హంసల నడకల రాణియెనా
  కల యిక దీరునులే మన
  కలయికలే గలుగుననుచు కైపుగ జెప్పెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 6. కలగంటిని కలలోనన్
  పలురకముల మధురములను పరికించితి ,లో
  పలతినవలెనను కోరిక,
  కలదని మధుమేహమొకటి కలవరపడితిన్ !!!

  రిప్లయితొలగించండి
 7. కలగంటిని కలలో నన్
  తలపై గంగను ధరించి తనువున సగమున్
  కలికి కొసగి యంకము గొమ
  రులను కలిగినట్టివాడి రూపము గంటిన్

  రిప్లయితొలగించండి
 8. కలగంటిని కలలోనన్
  కలికి చిలుకలకొలికినట కనులార గాంచన్
  తనువును మనమును పులకిం
  చెను,హర్షంబుతోడనాతి చెంతను చేరన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   రెండవ, నాల్గవ పాదాలలో గణదోషం. ‘కనులార గనన్’, ‘హర్షముతోడ’ అంటే సరి!

   తొలగించండి
 9. సహచర రాక్షస స్త్రీలతో త్రిజట చెప్పిన స్వప్నవృత్తాంతము:

  కలఁ గంటిని కలలోనన్
  కొలువైన దశరథ రాముఁ గోమలి సీతన్!
  వలలో జిక్కిన రావణు!
  నిల మన రాజగు విభీషణేంద్రున్ గంటిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. కలఁ గంటిని కలలోనన్
  జలజాక్షుని రూపుగంటి సమ్ముదమున మా
  కిల శంకరాభరణ శ్రీ
  వెలుగుల వరమిమ్మటంచు వేడితి చక్రిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. కలగంటినికలలోన
  న్బలుసారులుశివునిరూపుబాహాటముగా
  న్విలసిల్లి పడగక్రిందను
  లలితముగా నుండెసామి! లావణ్యముగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. కల గంటిని కలలోనన్
  వలరాజును బోలు పతిని బడసితి తన బా
  హుల బంధి౦చెను హాయిని
  చెలియా!తెలుపంగలేను సిగ్గగు నాకున్

  రిప్లయితొలగించండి
 13. పోచిరాజు కామేశ్వర రావు గారి పూరణ
  కలఁ గంటిని కలలోనన్
  విలసిల్లె మహోన్నతంపు విగ్రహ మచటన్
  ఖలుజన విదారు గృష్ణుని
  జలరుహ నేత్రుం గొ లుతును జగదాచారున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. కలగంటిని కలలోనన్
  మెలతుక నొకదాని గంటి మేలగు రూపున్
  గలగల మాటల నాడుచు
  చలింపజేసెను మనసును చక్కని నడతన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. కలగంటిని కలలోనన్
  విలువగు నీముద్దులన్ని ప్రీతిగ నివ్వన్
  వలపుల తలపుల మూసియు
  పలుకకనే ప్రక్కజేరె బావకు మరదల్
  2.కలగంటిని కలలోనన్
  తెలవారెడి సమయమందు ధీరుడివలెనే
  పలుకగ కుక్కలు దరిమెను
  నలుగురిలో నవ్వులాట నవ్వె నొసగెన్.

  రిప్లయితొలగించండి
 16. కలఁ గంటిని కలలోనన్
  చెలియా నా చెంత గంటి సిగ్గుల మొగ్గై
  మిలమిల వెలుగుల జిమ్ముచు
  నెలవంకను పోలినట్టి నీనగుమోమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. కలఁగంటిని కలలోనన్
  తిలకించితి నార్యనేను తెలిదీవిదొరన్
  పులకించగ తనువు మనసు
  నిలచితి నేమాటరాక నిశ్చేష్టితనై!!!

  రిప్లయితొలగించండి
 18. "I have a dream"
  ...Martin Luther King Jr

  కలఁ గంటిని కలలోనన్
  కులమత భేదమ్ములన్ని కొట్టుకు పోగా
  "తెలి" కులమున పుట్టి ఘనుడు
  మలుపుల తేనీరు నమ్మి మన నేతాయెన్

  రిప్లయితొలగించండి
 19. కలఁ గంటిని కలలోనన్
  విలవిల లాడుచును మెండు విలపించుచు నే
  కొలవగ లక్ష్మీ దేవిన్
  చెలగుచు నాకిచ్చె సిరియె సిగరెట్లెన్నో!

  రిప్లయితొలగించండి