20, జనవరి 2016, బుధవారం

పద్యరచన - 1153

కవిమిత్రులారా,
“పతి పరదేశం బేగిన....”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని వ్రాయండి.

47 కామెంట్‌లు:

  1. 1.
    పతి పరదేశం బేగిన
    సతియేగద బాధ్యతనుచు స్వజనుల గాంచున్
    సతియేగిన పుట్టింటికి
    పతిగాంచడు తల్లినైన వాస్తవమిదియే

    2.
    పతిపర దేశం బేగిన
    సతికెన్నియొ బాధలిచట సంప్రాప్తించున్
    ప్రతిదిన మొకయుగ మగుచును
    వెతలెన్నియొ చుట్టుముట్టి వేదనదెచ్చున్

    రిప్లయితొలగించండి
  2. పతిపర దేశం బేగిన
    సతితన బాధ్యత యనుకొని సంసారమునన్
    గతుకుల వెతలను దాటుచు
    యతివలె తానుండి భర్త నారాధించున్

    రిప్లయితొలగించండి
  3. శుభోదయం ! నేటి కాలపు జిలేబీలు స్కైపు వీడియో కాలు లందున పార్టీ లు పతుల తో నెరపుదురు :)

    పతి పరదేశం బేగిన
    అతిరసము, పెసరట్టు తోడ అల్లపు చట్నీ
    అతిఘనముగ జేసి పతిని
    అతిధిగ రమ్మని స్కయిపున ఆహ్వానించెన్

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. "అతిరసమును నట్టుతోడ..." అనండి.

      తొలగించండి
  4. పతి పరదేశం బేగిన
    అతికొద్ది సమయములోనె యార్జించునుగా
    మితిలేని సంపదని సతి
    బ్రతిమాలి విదేశమునకు భర్తను పంపెన్

    రిప్లయితొలగించండి
  5. పతి పరదేశం బేగిన
    స్తుత మతి యైగృహిణి పతి పదోన్నతి మదినెం
    చి తనరి చేసెను నిత్యో
    చిత కార్యంబుల నపార సేవా రతినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. పతి పరదేశంబేగిన
    సతికుండును బాట్లు భువిని ,సంసారమును
    న్నతలా కుతలమ యగునిక
    పతులే మఱి సతుల కెపుడు పతిదేవుళ్ళే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పతి పరదేశంబేగిన
      సతికుండును బాట్లు భువిని ,సంసారమును
      న్నతలా కుతలమ యగునిక
      పతులే మఱి సతుల కెపుడు ప్రాణస మానుల్

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. 1.పతిపరదేశం బేగిన
    సతి ఖిన్నత నొందుచు సతిశయ సంతాపముతో
    పతి హితమును కోరుచు తా
    సతతము బాధల నణచుచు సమయము గడిపెన్.
    2.పతి పరదేశం బేగిన
    వెతలను దిగమ్రింగుచు సతి వీడక ధృతియున్
    సుతులను పెంచుచు కాలము
    వ్రతములు పూజలు సలుపుచు బరువున సాగెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూరూ ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. పతి పరదేశం బేగిన
    మతిలోపల దలచుకొనుచు మసలుచు సతియే
    హితముగ నింటిని దిద్దుచు
    సతతము పతి సేమమరసి శౌరిని గొలుచున్!!!


    రిప్లయితొలగించండి
  9. పతి పరదేశంబేగిన
    సతికుండును బాట్లు భువిని ,సంసారమును
    న్నతలా కుతలమ యగునిక
    పతులే మఱి సతుల కెపుడు ప్రాణస మానుల్

    రిప్లయితొలగించండి
  10. పతి పరదేశం బేగిన
    సతి బాధ్యతల గొని తానుసమ్మతితోడన్
    కతిపయ దినములు, ధృతితో
    నతినే ర్పునను నెరవేర్చె వ్యాపారములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. పద్యరచన పతిపరదేశంబేగిన
    సతిపతి గతులెంత వింత సంసారంబో?
    మతియెంతున్ననుఫలమా
    హితమొసగెడి పతి-సతికృతి హీనత మాన్పున్
    2.పతిపరదేశంబేగిన
    అతిత్వరగ దుర్ముఖమున నతడేరాగా?
    సతిపతి కుగాదిపండుగ
    ప్రతిదినమును జేసినటులె పరికించంగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    పతి పరదేశ౦ బేగిన

    సతికిని , స౦తుకు కరువగు స౦తోష౦. బీ

    వెతలె౦దుకు ? శక్తి స్థో

    మత లున్న గడి౦ప వచ్చు మనదేశములోన్ ! !

    రిప్లయితొలగించండి
  13. పతి పరదేశం బేగిన
    క్షితినెంతటి కష్టమౌనొ శ్రీమతి కంచున్
    సతి యూర్మిళ లక్ష్మణునిన్
    గతిఁ జూపుమనంగ 'నిద్రఁ' గానుక నొసగెన్
    (వాల్మీకి వారల రామాయణంలో ఎలా వివరించారో గురుదేవుల వారు తెలియజేయ ప్రార్థన)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ఊర్మిళాదేవి నిద్ర అవాల్మీకం.

      తొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. పతి పర దేశ౦ బేగిన
    గతించ నొక పుష్కరమ్ము.కాంతుడు మరలెన్
    సతిని,పరపురుషు గాంచి కు
    పితుడవడు.సతి తెలిపె తమ బిడ్డడితడనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యంతో భారవి కథలోని ఘట్టాన్ని గుర్తుకు తెచ్చారు. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  16. పతి పర దేశ౦ బేగిన
    గతించ నొక పుష్కరమ్ము.కాంతుడు మరలెన్
    సతిని,పరపురుషు గాంచి కు
    పితుడవడు.సతి తెలిపె తమ బిడ్డడితడనన్

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ, నమస్కారములు.
    సమస్యాపూరణము చేయజాలక,మధ్యాక్కరగా వ్రాయాలని ప్రయత్నించినాను.

    పతిపరదేశంబు కేగ, పత్నియు కలగకయుండి
    సుతునికి విద్యలనెన్నొ చొక్కపు రీతినిఁ గఱపి,
    కతిపయ దినములపిదప కాంతుడు మరలిన వేళ
    నతిశయమగురీతి ముదమునాతనికందగఁ జేసె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. పతిపర దేశం బేగిన

    సతితన నాధుని కుశలము సతతము గోరున్;

    ''సతిఅనసూయల''రీతిన్

    సతులే గదసంప్రదాయ సాధకు లిలలోన్.

    డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
  19. పతిపర దేశం బేగిన

    సతితన నాధుని కుశలము సతతము గోరున్;

    ''సతిఅనసూయగ''వెలసిన

    సతులందరు సంప్రదాయ సాధకు లవనిన్

    డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
  20. పతిపర దేశం బేగిన

    సతితన నాధుని కుశలము సతతము గోరున్;

    ''సతిఅనసూయను'' బోలిన

    సతులే గదసంప్రదాయ సాధకు లిలలోన్.
    డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూలె రామముని రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. పతి పరదేశంబేగిన
    గతియెవ్వరు నాకటంచు గాభర పడుచున్
    ధృతిగోల్పోవుచు వెతతో
    చతికిలబడిపోయినచటసతి దుఃఖితయై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘చతికిలబడిపోయె నచట/ చతికిలబడిపోయి యచట’ అనండి.

      తొలగించండి
  22. పతి పరదేశం బేగిన
    నితరములే దలపకుండ నిజసంతతికే
    పతిబంపు డబ్బుతోడను
    సతి చక్కని చదువు నేర్పు సద్గతితోడన్.

    రిప్లయితొలగించండి
  23. పతి పరదేశం బేగిన
    మతిగల మన దేశమునకు మాన్యత క్రుంగన్...
    మతిలేనిది పరదేశము
    స్తుతమతితో విభవ మొందు సుఖముగ ట్రంపూ!

    రిప్లయితొలగించండి
  24. పతి పరదేశం బేగిన,
    మతిబోవును సతికి త్వరగ మమతయె పోగన్
    పతిరాగను తిరిగి తిరిగి,
    మతిబోవును సతికి త్వరగ మగటిమి మీరన్

    రిప్లయితొలగించండి