24, జనవరి 2016, ఆదివారం

పద్యరచన - 1156

కవిమిత్రులారా,
“చేతులారంగ శివునిఁ బూజింపఁడేని 
నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని 
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపడేని 
గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు”
పై పద్యభావాన్ని ఏదైనా వృత్తంలో తెల్పండి.
(ఈరోజు మా చెల్లెలి ఊరికి వెళ్తున్నాను. అక్కడ నెట్‍వర్క్ సిగ్నల్స్ ఉండవు. రాత్రికి తిరిగి వచ్చిన తరువాత మీ పద్యాలను సమీక్షిస్తాను. ఈలోగా మీరు పరస్పర గుణదోష విచారణ చేసుకుంటే బాగుంటుందని నా మనవి)

50 కామెంట్‌లు:

  1. పురహరు శంకరున్ శివుని పూజలు సేయక చేతులారఁగా
    గిరిధరు పద్మనేత్రు హరి కీర్తిని సెప్పక నోరు నొవ్వఁగాఁ
    గరుణయు సత్యమున్ మొదలుగా గుణముల్ దలపోయకున్న సు
    స్థిరముగఁ దల్లికిన్ గడుపుచేటుగఁ జెప్పుదు రట్టివారలన్.

    రిప్లయితొలగించండి
  2. ఊరికి బయలుదేరుతున్నాను. ఏరాత్రికో తిరిగి వస్తాను. అప్పటికి ఎన్ని పద్యాలు ఉంటాయో?

    రిప్లయితొలగించండి
  3. చేతల భక్తినేగలిగి చేతులతో శివ పూజ చేయకన్
    ప్రీతిగ కీర్తనల్ గొలుచు రీతిని విష్ణుని పిల్వకుండినన్
    భూతములన్నిటన్ దయయు బూనుచు సత్యము దల్పకుండినన్
    భూతలమందు నీనరుగ బుట్టిననేమిఫలమ్ము మానవా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. స్వయముగా శివుని భజన చలపడేని
    వక్త్ర మలయు నట్లు హరికి ప్రణతు లిడక
    సత్వ దమము లెరిగి సదా సంచరించ
    తలచడేని పుట్టుక కీడు తల్లి కెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారూ! మీ పద్యము బాగున్నది. కాని, సత్వ దమము లన్నారు...సత్యము దయ రావలయును గద! ఐనను నియమము "వృత్తము"న వ్రాయుట కదా! అన్యథా భావింపక వృత్తమునుం ప్రకటింపఁగలరు.
      స్వస్తి.

      తొలగించండి
    2. సుకవిశేఖరులు మిత్రులు గుండు మధుసూదన్ గారికి ధన్యవాదములు . వేరేపనిమీద బయటకు వెళుతూ వృత్తం వ్రాయాలనే నియమం గమనించలేదు. సాయంత్రం యింటికి వచ్వ్హిన పిదప వృత్తరచన చేస్తాను.

      తొలగించండి
    3. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      గుండు వారు చెప్పినట్లు నియమోల్లంఘన జరిగినా మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. * గు రు మూ ర్తి ఆ చా రి *
    „„„„„„„„„„„„„„„„„„„„„„„„„

    కరముల్ చేర్చి మహేశ్వరార్చనము తా గావి౦ప. డేనిన్ | సదా
    హరి నామ స్మరణ౦బు భక్తి మెయి చేయ౦డేని | స్వా౦త౦బునన్
    కరుణా సత్యము లె౦చడేని | జననీ గర్భమ్ము న౦టి౦చుచున్
    నర జన్మ౦బున పుట్ట నేటి కల " కు౦దారమ్ము " మేలౌను గా ! ! !

    ………………………………………………………

    { కరముల్ చేర్చి = చేతులు జోడి౦చి ; జననీ గర్భ౦బున౦టి౦చుచున్ =తల్లి కడుపునకు చిచ్చు పెట్టుచు ; కు౦ దా ర ము = ప౦ ది }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    పూనియుఁ జేతులారఁగ శివుం దగఁ బూజలు సేయఁడేని; వా
    గ్లీనత నోరు నొవ్వ హరి కీర్తి వచింపక యుండునేని; వి
    శ్వాన నరుండు తా దయయు సత్యము లోనఁ దలంపఁడేని; నా
    హీనుఁడు తల్లికిం గలుగ నేటికిఁ? దల్లుల కడ్పు చేటగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారు మీ పద్యము చాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      పోతనగారి భావాన్ని సంపూర్ణంగా వృత్తంలో అనువదించిన మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  7. గిరిజావల్లభు భక్తితో నెవడిలన్ కేల్మోడ్చి సేవింపడో
    హరినామంబును నిష్టతో నెవడు నోరారంగ కీర్తింపడో
    కరుణన్ సత్యము లోనుగా దలపకన్ కాఠిన్యతన్ బెంచునో
    ధరణిన్ పుట్టగనేల తల్లులకుతాదైన్యంబుచేకూర్చుచున్ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి మిత్రులు అద్భుతమైన పద్యాలను అందించారు అందరకు ప్రణామములు .

      తొలగించండి
    2. మంద పీతాంబర్ గారు మీ పద్యము చాల బాగున్నది. అభినందనలు.
      "డిలంగేల్మోడ్చి"; ధరణింబుట్టగ" అంటే యింకా బాగుగనుండు నేమో?

      తొలగించండి
    3. మంద పీతాంబర్ గారూ,
      మీ పద్యం చాల బాగున్నది. అభినందనలు.
      పోచిరాజు వారి సవరణలను గమనించండి.

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  8. చేతుల తోడ పుష్పములను జేర్చుచు నీశుని పూజసేయకన్
    గీతము లందు శ్రీ హరిని కీర్తన జేయక స్వార్థబుధ్ధితో
    భూతదయన్నదే విడిచి భూరిగ కల్లల నాడువారలున్
    మాతల గర్భవాసమున మానవుడై జనియింపవ్యర్థమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘దయ+అన్నదే’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘భూతదయావిదూరుడయి భూరిగ...’ అనండి.

      తొలగించండి
  9. శివ పూజ లేని కరములు
    భవు కీర్తన లేని నోరు వ్యర్ధము సుమ్మీ
    లవ మాత్ర నిజముకరుణ లు
    నెవనికి మఱి యుండ బోవొ యెందుకు బ్రదుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి మిత్రులు సుబ్బారావుగారూ! మీ కందపద్యము బాగున్నది. అభినందనలు.
      కాని, మన నియమము...వృత్తము..కదా!

      తొలగించండి
    2. పోచిరాజు సుబ్బారావు గారూ,
      గుండు వారు చెప్పినట్లు నియమోల్లంఘనం జరిగినా మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘లవమాత్ర సత్యకరుణలు...’ అంటే బాగుంటుంది.

      తొలగించండి
  10. చేరిం గొల్వక చేతులారగను కించిత్తైననాయీసునిన్
    నోరారంగను విష్ణు కీర్తనల నెన్నోకొన్ని విన్పించకన్
    కారుణ్యంబును సత్యవర్తనలనేకాదంచు జీవించినన్
    ప్రారబ్ధంబుగ కన్నతల్లికిని తాభారంబుగాకుండునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు.
      ‘...యీశునిన్’ అనండి.

      తొలగించండి
  11. కరముల్ మోడ్చి శివార్చనాది ఘన సత్కార్యావ హీనుండునున్
    హరి కీర్తింపక వక్త్ర మించుక సునాయాసంబు నన్నున్నయున్
    కరుణన్ సత్యదయాది సద్గుణములం గాంక్షింప నేర్వండొ యీ
    ధరణిన్ వాడు జనింప నేటికి కులోద్ధారంబె తాదల్లికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. చేతులుశైవ పూజలనుజేయకనున్నఫలంబు శూన్యమే
    నీతులుదెల్పు నోరు హరి నెంచక నుండిన లాభముండునా?
    నేతకు సత్య,నిష్ట,దయ నిత్యము నుంచకనున్నవారలే
    మాతకు సంతు చేటు|”పరమాత్మనునెంచక పాడుజన్మయే|”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘నేత’ ఎక్కడినుండి వచ్చాడు?

      తొలగించండి
  13. హరునిఁ గరమ్ములార సరి యర్చన జేయగ రానివారలున్!
    హరిని స్వరార్చనమ్మునిడి నార్తిగఁ గొల్వఁగ రానివారలున్!
    కరుణ, యథార్థమున్ మదిని గన్పడ జేయగ రానివారలున్!
    ధరణి జనించ నేమిటికి తల్లుల గర్భము చేటు చేటనున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
      ‘కరుణయు సత్యమున్...’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      హరునిఁ గరమ్ములార సరి యర్చన జేయగ రానివారలున్!
      హరిని స్వరార్చనమ్మునిడి నార్తిగఁ గొల్వఁగ రానివారలున్!
      కరుణయు సత్యమున్ మదిని గన్పడ జేయగ రానివారలున్!
      ధరణి జనించ నేమిటికి తల్లుల గర్భము చేటు చేటనున్!

      తొలగించండి
  14. చేతులు గల్గినన్ శివుని సేవలు సేయని వాడునున్ సదా
    భీతుడు కాక నాహరిని పేర్మిని కీర్తన చేయ కుండ గన్
    బ్రీతిని నెప్పుడున్ దయను ప్రేమను సత్యము దాదలంపడో
    నాతని పుట్టుకే భువిని మాతల గర్భము చేటుగా దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. చేతుల లెస్సగా విరుల చేకొని శంభునిఁ గొల్వకున్నచో,
    నీతిని న్యాయమున్ నిలుపు నీరజనాభుని పాడకున్నచో,
    చేతల సత్యనిష్ఠ, దయ చెల్వగఁ జూపని నాఁడదేటికా
    మాతకు కష్టమౌ ప్రసవమా వెతలున్ మరి? వ్యర్థమే కదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      ‘చెల్వుగఁ జూపని...’ అనండి.

      తొలగించండి
  16. మలహరు చేతులారగను మాన్యతతోడ భజింపకున్నచో
    హలధరు తమ్ముఁబూజఁదన యానన మెప్పుడు నోహటిల్లకన్
    బలముగ సత్య సాకతపుబాటల నిత్యము సాగకున్నచో
    కలిగి ఫలమ్ము సూన్యమగు కన్న ప్రసూతికి చేటు గున్ సుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలిగి ఫలమ్ము సూన్యమగు కన్న సవిత్రికిఁజేటు గున్ సుమా

      తొలగించండి
    2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘సత్య సాకతపు’ అని సమాసం చేయరాదు. ‘సత్యమున్ దయల బాటల...’ అనండి. పద్యం చివర ‘చేటగున్’ అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  17. హస్తము లుండియున్ శివునియర్చన సేయనివాడుయీభువిలో
    శిస్తుగ వక్త్రమున్దెరచి శ్రీహరిస్తోత్రము చేయలేనివా
    డాస్తులు కూడబెట్టినను డంబము లాడుచుసత్యమున్దయన్
    కాస్తయు కారుణీకమునుజూపక కన్న

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదం చివర గణదోషం. ‘...సేయనివాడు భూమిపై...’ అనండి. ‘దయన్, కారుణీకము’ అని పునరుక్తి. చివరిపాదం అసంపూర్ణంగా ఉంది. సవరించండి.

      తొలగించండి