రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ఒకటి, మూడవ పాదాలలో గణదోషం. 'చెంగున నాడెదరు' అనండి. మీ పద్యానికి నా సవరణ... బొంగరము గిల్లిదండలు చెంగున నాడెదరు..... భంగము వాటిలు ముదిమిని....
జిలేబీ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. కొన్ని లోపాలు... నా సవరణ పరిశీలించండి.... అరచేతను బొంగరమును నరమోడుపు కనుల గనుచు నచ్చెరువుగ నా తిరుగుట తన చే మహిమ గ...
పోచిరాజు కామేశ్వరరావు గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. బొంగరము పద్య రచనాంశంగా గతంలో ఇచ్చానేమో అని సందేహించాను కూడా... గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కాలపు+ఆట=కాలపుటాట’ అని టుగాగమం వస్తుంది. ‘తిరిగేను’ అనడం వ్యావహారికం. ‘తిరిగేను+అరుగుపైన’ అన్నపుడు నుగాగమం రాదు. ‘మహడి’ అన్నది మాండలికం. మీ పద్యానికి నా సవరణ.... పాతకాలమందు బాలు రాడెడి యాట గిరగిరమని తిరుగు నరుగుపైన మట్టిలోనగాని మరి మేడమీదను చాటి చుట్టి యాడు మేటి వీడు.
బొంగరములు గిల్లి దండలు
రిప్లయితొలగించుచెంగున యాడెదరు గాన చిన్నత నానన్
భంగము వాటిల్లు ముదిమిని
రంగుల వలయమ్ము నందు రౌలుచు తిరుగన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు. ఒకటి, మూడవ పాదాలలో గణదోషం. 'చెంగున నాడెదరు' అనండి. మీ పద్యానికి నా సవరణ...
బొంగరము గిల్లిదండలు
చెంగున నాడెదరు.....
భంగము వాటిలు ముదిమిని....
నేలను తిరిగెడు దానిని
రిప్లయితొలగించువీలుగ నరజేత బెట్టి వేడుక తోడన్
మేలుగ నా బొంగరమును
బాలకుడట దిప్పుచుండె ప్రావీణ్యముగన్!!!
సైలజ గారూ ! మీ పద్యం బాగుంది
రిప్లయితొలగించుశైలజ గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ధవ్యవాదాలు....అక్కయ్య గారూ...
తొలగించుశుభోదయం !
రిప్లయితొలగించుఅరచేయిన బొంగరమును
అరమోడ్పు కనుల గనుచును అచ్చెరువుగ నా
తిరుగుట తనచే మహిమగ
నర యది వినువీధి తనదె నను ధైర్యమయే !
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొన్ని లోపాలు... నా సవరణ పరిశీలించండి....
అరచేతను బొంగరమును
నరమోడుపు కనుల గనుచు నచ్చెరువుగ నా
తిరుగుట తన చే మహిమ గ...
గిరిగా నున్నది గన గిం
రిప్లయితొలగించుగిరములు తా దిరుగుచుండె కేలున నా బొం
గరమే చూడుడు బాలకు
గరమున్ గిలిగింత లిడగ గలగల నవ్వెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
చిత్రమందునబాలుడు చేతితోడ
రిప్లయితొలగించుత్రిప్పుచుండెనుబొంగరమొప్పుగాను
చిత్రమేమననరచేతచిందులాడ
గిరగిరతిరుగుచుండెనుగరముకనుము
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది అభినందనలు.
గిరగిరఁ దిరిగెడు బొంగర
రిప్లయితొలగించుమరచేతన్నీకు నిచ్చె నానందమురా!
మెఱసెడు సమర్థతఁ బడయ
ధరణియె నీ చుట్టు తిరుగు తధ్యమ్మిదిరా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గిరగిరఁ దిరిగెడు బొంగర
రిప్లయితొలగించుమరచేతన్నీకు నిచ్చె నానందమురా!
మెఱసెడు సమర్థతఁ బడయ
ధరణియె నీ చుట్టు తిరుగు తధ్యమ్మిదిరా!
ఆటకైన మరియు నంగడి కైనను
రిప్లయితొలగించుకంప్యుటరునె వాడు కాలమందు
బొంగరమును ద్రిప్పు సింగన్నకనగను
మనసు పరవశించె మమత తోడ
పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గ్రుక్కపట్టునటుల చక్కగ కరమున
రిప్లయితొలగించుబొంగరంబు ద్రిప్పు పుంగవుండు
వడిగ వచ్చి తనదు తొడనటు కొట్టంగ
సంతసింతు మిగుల పంతమొప్ప
గ్రుక్కపట్టునటుల చక్కగ కరమున
రిప్లయితొలగించుబొంగరంబు ద్రిప్పు పుంగవుండు
వడిగ వచ్చి తనదు తొడనటు కొట్టంగ
సంతసింతు మిగుల పంతమొప్ప
పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
తొలగించుమీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
బొంగర మరచేతినిఁ జ
రిప్లయితొలగించుక్కంగ నమరి రివ్వున తిరుగంగ మనంబు
ప్పొంగెఁ గనుడు బాలున కి
భ్భంగిఁ జిరుముదమె ఘనంబు పసివారలకున్
22Sep2015 నాటియంశము:
శైశవంపు క్రీడ లొసగు సంతసంబు
వర్ష త్రయమున రయమున పాప ననుప
మూల ధనమిచ్చి బడులకు ముద్దు గూల్చ
బొంగరపుటాటలు గనము పురము లనిక
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించుమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
బొంగరము పద్య రచనాంశంగా గతంలో ఇచ్చానేమో అని సందేహించాను కూడా... గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
గురుదేవులకు ప్రణామములు. నిన్నటి పద్యరచనను పరిశీలించ ప్రార్ధన
రిప్లయితొలగించుతరుణులందు, వివాహతరుణములందు,
భరణి మానార్థాది ప్రాణ భంగముల,
వెఱచు గోవులఁగాచ, ద్విజ రక్షణమున
దురితమంట దు బొంకు దొరలిన నధిప!
సహదేవుడు గారూ,
తొలగించుమీ నిన్నటి పద్యం బాగున్నది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుకరముపై ద్రిప్పుచు తన బొంగరమును కడు
రిప్లయితొలగించుచెంగలించుచు నుండెను చిన్ని బుడుత
చింత లేలేని బాల్యపు జీవితమ్ము
యెంత యింపైన దోగద యెంచిచూడ !
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు. 'జీవితమ్ము+ఎంత' అన్నప్పుడు యడాగమం రాదు.
జీవితమ్ము /
తొలగించులెంత యింపైన వోగద యెంచిచూడ అంటే సరిపోంతుందా సర్
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించు.......................................................
అ ౦ ద రి కి చ క్క ని స ౦ దే శ ము
ని స్తు న్న బా లు డు
...........................................................
" గిర్రు గిర్రున దిరిగెడు బొ౦గరము వోలె =
కూలె దీవు తుదకు నేల పైన. >>
నె౦త మిడిసి పడిన. నెప్పుడో యొకసారి "
యనుచు తెలుపు చు౦డె నర్భకు౦డు
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కాలమె బొంగరమగు మన
రిప్లయితొలగించుజాలగ జీవితము తిరుగ” జాలియులేకన్
ఫలితము సూన్యంబగులే|
తెలిపెను బొంగరపు చేయి తెలివియు లేకన్|
2.జాలియు మాను జీవితము,జాలియు లేకను బొంగరమ్మెగా|
జాలియు జేరగా?తిరుగజాలును బొంగర మట్లు చేతిపై
జాలియు జేయుమేలు జనజాగృతి,బొంగర మెంచు నాటలా|
ఏలెడి వాడి యాట మనమెంచగ పంచెనుబాలుడిచ్చటన్.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
అరచేత బొంగ రమ్మును
రిప్లయితొలగించుగిరగిర మనిద్రిప్పినంత కీర్తియె నంచున్
మురిసిన బాలుని వదనము
విరిసిన యానంద మదియు విధమును గనుమా
ఆంజనేయ శర్మ గారూ,
రిప్లయితొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పాతకాలపాట బాలురాడెడియాట
రిప్లయితొలగించుగిరగిరతిరిగేను నరుగుపైన
మట్టిలోనగాని మహడిమీదైనను
చాటి చుట్టి యాడు మేటి వీడు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కాలపు+ఆట=కాలపుటాట’ అని టుగాగమం వస్తుంది. ‘తిరిగేను’ అనడం వ్యావహారికం. ‘తిరిగేను+అరుగుపైన’ అన్నపుడు నుగాగమం రాదు. ‘మహడి’ అన్నది మాండలికం. మీ పద్యానికి నా సవరణ....
పాతకాలమందు బాలు రాడెడి యాట
గిరగిరమని తిరుగు నరుగుపైన
మట్టిలోనగాని మరి మేడమీదను
చాటి చుట్టి యాడు మేటి వీడు.
బొంగరమునర చేతిలో పూని త్రిప్పు
రిప్లయితొలగించుబాలకుని యాత్మ విశ్వాస బలము చూడ
భావి కాలములో నెదిగి ప్రజలనెల్ల
నేతయై త్రిప్పు తనచుట్టు నిజము నమ్ము
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ప్రణామములు. నిన్నటి పద్యరచనను పరిశీలించ ప్రార్ధన
రిప్లయితొలగించుతరుణులందు, వివాహతరుణములందు,
భరణి మానార్థాది ప్రాణ భంగముల,
వెఱచు గోవులఁగాచ, ద్విజ రక్షణమున
దురితమంట దు బొంకు దొరలిన నధిప!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించుమీ ద్విపద బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ.
రిప్లయితొలగించుWe have collected special information about Australian open Schedule , Australian open Tennis Schedule and Australian open Tickets. You can also find info about Australian open Tennis Schedule , Australian open Tickets as well as Australian open Tickets 2016. If you want to find latest updates about Australian open 2016 live scores, you can find it on Australian open 2016 live scores. Here is the list of expected Australian Open 2016 Winners . We have also provided some details of australian open schedule 2016 . You can also find list of Australian Open 2016 Players . We have also shown Australian open TV schedule , Australian open TV schedule 2016 , Australian open 2016 TV schedule and Australian Open 2016 Broadcast . Chech out our website on Australian Open 2016.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించు