19, జనవరి 2016, మంగళవారం

సమస్య – 1919 (రావణు కథ లేక వ్రాసె....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రావణు కథ లేక వ్రాసె రామాయణమున్.

52 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. కోవెలలో జేరి యొకడు
   పావనమౌరామ చరిత వ్రాయదొడంగె
   న్నావచనము జదివిన మై
   రావణు కథలేక వ్రాసె రామాయణమున్

   తొలగించు
  2. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 2. భావము పొందిన తమకము
  రావణు కధ లేక వ్రాసె రామాయణమున్
  నీవిక చదువుము ప్రేయసి
  దావానల మంటి బాధ దహియించు మదిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దావానలము వలె బాధ' అనండి.

   తొలగించు
  2. భావము పొందిన తమకము
   రావణు కధ లేక వ్రాసె రామాయణమున్
   నీవిక చదువుము ప్రేయసి
   దావానలము వలె బాధ దహియించు మదిన్

   తొలగించు
 3. భావోన్నత కథకుండు కు
  రావణు కథ లేక వ్రాసె రామాయణమున్
  దేవాది దేవు భక్తుడు
  రావణు సుచరిత్రుడనుచు వ్రాసెన్ బ్రాంతిన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 4. బావా! జూడుము నీవిది
  పావని తన నాటకమున పద్ధతి మార్చెన్
  భావినుల సడపు వాడని
  రావణు కధలేక వ్రాసె రామాయణమున్!!!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శైలజ గారూరూ ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   భావినుల....?

   తొలగించు
  2. ధన్యవాదములు గురువుగారు.. ఇంతి = భావిని, భామిని, ..

   తొలగించు
 5. శుభోదయం

  బావను గోముగ కోరగ
  రావణు కధ లేక వ్రాసె రామాయణమున్
  ఆవనిత కనెను కథలో
  దేవర ! కారము లవణము దేలని చారే

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించు
 6. భూవిభుడు రామ జననము
  పావని సీతపరిణయము వనవాసమునున్
  రావణ వధ సహితము మై
  రావణు కథ లేక వ్రాసె రామాయణమున్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 7. ఆవారుని భక్తుడయిన
  రావణ బ్రహ్మను విదుడుగ రచియించంగన్
  కోవిదుడొకండు, పావిగ
  రావణు కధలేక వ్రాసె రామాయణమున్!!!


  పావి = పాపాత్ముడు ; వారుడు = శివుడు

  రిప్లయితొలగించు
 8. రిప్లయిలు
  1. భూవిభుడు రామ జననము
   పావని సీతపరిణయము వనవాసమునున్
   రావణ వధ సహితము, మై
   రావణు కథ లేక, వ్రాసె రామాయణమున్.

   తొలగించు
  2. భూవిభుడు రామ జననము
   పావని సీతపరిణయము వనవాసమునున్
   రావణ వధ సహితము, మై
   రావణు కథ లేక, వ్రాసె రామాయణమున్.

   తొలగించు
  3. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 9. ఏవిధముగ జూ చినయట
  రావణు కధయే గదమరి రామాయణ ము ,
  న్నీ వచన మెట్లు పొసగును
  రావణు కధ లేక వ్రాసె రామాయణ మున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు. '... జూచిన నట' అనండి.

   తొలగించు
 10. దేవుడె రాముడని దలచ
  రావణు డాలంకలోన రణమెటు జేయున్,
  భావించి యటుల నొక్కడు
  రావణు కథ లేక వ్రాసె రామాయణమున్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 11. సమస్య. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { ఒక చోట. + గుర్తు పెట్టి విడ దీసి న౦దులకు క్షమి౦చవలసినది }

  మ ధ్యా క్క ర
  .......................

  భావి౦ప నౌర. క౦క౦టి పాపరాజ కవీ౦ద్రు డతిగ
  రావణు కథ లేక వ్రాసె రామాయణము నల నాడు + అ
  హో!విశిష్ట గ్ర౦ధ మదియె = యుత్తర రామాయణము|ప్ర
  జావలోకిత సుభావ గరి మౌన్నతి౦ గల్గుచు వరలె |


  { అతిగ = ఎక్కువగ ; అవలోకి౦చు = గమని౦చు ;
  ప్రజావలోకిత = ప్రజలచే గమని౦పబడిన ;
  సుభావ గరిమౌన్నతి = సద్భావ పటిమ యొక్క ఔన్నతి , ఔన్నత్యము }

  రిప్లయితొలగించు
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 14. పావన తులసీదాసు౦
  డావిధి పామరులు జదువ నవధీ బాసన్
  శ్రీ విశ్వేశుని కృప,మై
  రావణు కధ లేక వ్రాసె రామాయణమున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 15. క్రమాలంకారము
  యేవరమందిన ఫలమా? {రావణుని కథ}
  జీవన సారాన ఘనుడు చింతింతయునే {లేక}
  భావన భాగ్యంబు నొసగ {వ్రాసె రామాయణమున్}
  రావణునికథ,లేక,వ్రాసె రామాయణమున్
  2.కావరమే కడదేర్చెను
  రావణకథ|”లేకవ్రాసె రామాయణమున్
  దేవుడు రాముడుకాదను
  భావన|చొప్పించిదెలిపె భాద్యత లెన్నో

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 16. ఆవిష్ణు లీల తెలియున
  రావణ కథలేక ? వ్రాసె రామాయణము
  న్నో వామలూరు తనయుడు
  భావితరమ్ముల సవరణ భావించి మదిన్
  సవరణ : చక్కచేయుట
  వామలూరు తనయుడు: పుట్ట పుట్టువు , వాల్మీకి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 17. ఆవేశముననొకడు మై
  రావణు కథ లేక వ్రాసె రామాయణమున్
  దైవానుగ్రహ మందిన
  రావణుడుండంగ యీకు రావణు డేలన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "రావణు డుండంగ నీకు" అనండి.

   తొలగించు
 18. శైవమును నమ్ము కవియే
  రావణ శివభక్తి దలచి రాక్షస గుణమున్
  పావన చరితన వలదని
  రావణు కథలేక వ్రాసె రామాయణమున్

  రిప్లయితొలగించు
 19. శ్రీవిష్ణు రాము డెట్లగు?
  రావణు కథ లేక, వ్రాసె రామాయణమున్
  రావణు మదమడ చినయా
  పావన చరితుని కథయని వాల్మీకియె గా

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 20. సినిమా కోసం రామాయణ కథ వ్రాయమనగా ఓ సినీ రచయిత క్రిందివిధంగా ఆలోచిస్తూ...

  అవనీజనమొప్పరనుచు
  శివభక్తపరాయణత్వ శీర్షము స్పృశియిం
  చవిడచి, పొగడెడు గుణముల
  రావణు కథలేక వ్రాసె రామాయణమున్

  రిప్లయితొలగించు
 21. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ నమస్కారం
  ప్రతి పాదపు మొదటి అక్షరం గురువై వుండాలండి.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విరించి గారికి నమస్కారం.ధన్యవాదములు.
   తెలిసి చేసెడు పొరపాట్లంటటే ఇట్టివేనండి.
   సవరించిన పూరణ:
   జీవనమందున నిత్యము
   శైవపరాయణతఁ గల్గు సత్యమెరిగియున్
   భావమున భక్త తత్పరు
   రావణు కథలేక వ్రాసె రామాయణమున్

   తొలగించు
  2. పొరపాటుదొర్లె మిత్రమ,
   సరిజూడు మటంచుఁ దెల్పు సరళత
   మేలౌ!
   పరిశీలించుడు దీనిని
   విరించి పురుషోత్తమ! పలు విధముల మదినిన్

   తొలగించు
  3. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 22. ​పావన సీతారాముల
  జీవన గమనమున నెట్టి చెడు వలదంచున్
  దీవెన లందగ నొక కవి
  ​రావణు కథలేక వ్రాసె రామాయణమున్​!

  రిప్లయితొలగించు
 23. ఆ వాల్మీకి ప్రబుద్ధుడు
  పావనమౌ రామలీల్న పటపట పగులన్
  కేవల మొకటే తల గల
  రావణు కథ లేక... వ్రాసె రామాయణమున్ :)

  రిప్లయితొలగించు


 24. తావిరి యించెను భట్టియు
  రావణ వధయను చు సూవె రమ్యము గానౌ
  పావన రాముని చరితము
  "రావణు కథ", లేక వ్రాసె, "రామాయణమున్"

  జిలేబి

  రిప్లయితొలగించు
 25. గోవుల చంపెడు తురకడు
  కావలెనని పట్టుబట్టి కర్నూలందున్
  బావురుమన భక్తవరులు
  రావణు కథ లేక వ్రాసె రామాయణమున్

  రిప్లయితొలగించు