24, జనవరి 2016, ఆదివారం

దత్తపది - 87 (ఆవు-మేక-కుక్క-పిల్లి)

కవిమిత్రులారా,
ఆవు - మేక - కుక్క - పిల్లి
పై పదాలను ఉపయోగించి భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
(ఈరోజు మా చెల్లెలి ఊరికి వెళ్తున్నాను. అక్కడ నెట్‍వర్క్ సిగ్నల్స్ ఉండవు. రాత్రికి తిరిగి వచ్చిన తరువాత మీ పూరణలను సమీక్షిస్తాను. ఈలోగా మీరు పరస్పర గుణదోష విచారణ చేసుకుంటే బాగుంటుందని నా మనవి)

34 కామెంట్‌లు:

  1. రాయబారము విఫలమైన తరువాత భీమునితో శ్రీకృష్ణుడు...

    ఆవులింత లేల యనిలాత్మజా యుద్ధ
    మే కద యిక సిద్ధమై కదలుము
    మొక్కవోక వదల కుక్కడగింపుమా
    యెల్లరు రిపులు దురపిల్లి పార.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్యగారూ! ఎంత చక్కని పద్యము నందించితిరి! చాల బాగున్నది. మీ రీ పద్య ద్వారమున మా కందఱకును మార్గదర్శకులైతిరి. శుభాభినందనలు!

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఊరికి బయలుదేరుతున్నాను. ఏరాత్రికో తిరిగి వస్తాను. అప్పటికి ఎన్ని పద్యాలు ఉంటాయో?

    రిప్లయితొలగించండి
  3. మాస్టరుగారూ ! ఆన్నింటిని చక్కగా నొక గాటకు కట్టివేశారు..చాలా బాగుంది.

    ఆవురావురుమని తిండి నారగించి
    తామమేకమై భీముండు దారిబట్టె
    కానకే త్రొక్క కుక్క బకాసురుసురు
    తల్లికొకకాంతయే దురపిల్లి జెప్ప.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్చాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘త్రొక్క కుక్క’...?

      తొలగించండి
    2. నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
    3. మాస్టరుగారూ ! ధన్యవాదములు...చిన్న సవరణతో...

      ఏగె భీముండు తినుచు మమేకమగుచు
      ఆవురావురుమనెడు బకాసురునట
      పేనువోలెను కుక్కగా కోనలోన
      తల్లికొకకాంతయే దురపిల్లి జెప్ప.

      తొలగించండి
    4. హనుమచ్ఛాస్త్రి గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    (కౌరవ సభ యందు ద్రౌపదీ మాన సంరక్షణ మెటుల జరిగినదో తెలుపు సందర్భము)

    ఆవురుమని ద్రోవది కృష్ణు నపుడు పిలువ,
    శీఘ్ర
    మే కరమున నుండి చీరలిచ్చె!
    కౌరవుల
    కుక్కడంపఁగ గాడ్పుపట్టి
    ప్రతిన ఱం
    పిల్లినది యా సభాంతరమున!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దీని నిటులఁ గూడ చెప్పవచ్చును:

      ఆవురుమని ద్రోవది కృష్ణు నపుడు పిలువ;
      శీఘ్రమే కన్నఁ డత్తఱిఁ జీర లిచ్చె!
      కౌరవుల కుక్కడంపఁగ గాడ్పుపట్టి
      "ప్రతిన" ఱంపిల్లినది యా సభాంతరమున!!

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఆవులించి భుక్తాయాస మంత దీర
    బకుని వన మేకతమ మేగి పాండు సుతుడు
    రక్కసున కుక్కటయు నెల్ల నుక్క డగుగ
    భీతి కంపిల్లి సూడగ వేగ జంపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. రాయభారానికి వెళ్ళిన శ్రీ కృష్ణుడు ధృతరాష్ట్రునకు హితవచనములు తెలుపుతున్నట్టుగా నూహించిన పద్యము

    ( సీసము....ఆటవెలది )

    ఆవురావురనుచు ననిని గోరుచుండ్రి
    . పడతిద్రౌపదికురుల్ ముడవనెంచి

    రణమే కలిగెనేమి గుణహీను లైనట్టి
    . కుక్కమనస్కులు కొమరులెల్ల

    అనిజత్తురు నిజమహంభావ మదియేల
    . కులనాశమున్ గోరకూడదంటి

    దుర్దశ యదయె సతులు దురపిల్లిన
    . తాలజాలవునీవు నేల రణము

    పాండుసుతులు వారు భండనభీములు
    పగను మాని కోరు వారి చెలిమి
    శాంతి గోరు వారు సత్కీర్తి బొందరే?
    కృష్ణ పలుకు వినిన కీర్తి నీకు

    అర్థములు

    కుక్క మనస్కులు=కుత్సితులు
    దురపిల్లిన=శోకించిన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...నని గోరుచుండిరి, రణమె కలిగెనేని...’ అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  8. ఆవులింత లాపి వినుమో యనిల సుతుడ
    పురజనులతోమమేకమై తిరుగుచుండ
    కీచకున కుక్కటపెరిగి చేసె దాడి
    నిండు సభలోన దురపిల్లి నిలచినాను
    వాని ను క్కడగించి కాపాడు మయ్య
    ఉక్కట: గర్వము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. పిల్లి కూత కూసి పెద్దపులి నటంచు
    నిక్కు చుంటి వేము కుక్క వోలె
    మేక వంటి నిన్ను మ్రింగుచుంటి ననిని
    యా(ఆ)వులించి; కర్ణ యం(అం)గరాజు !

    చూపు లిప్స గాగ చూడుము కురువృద్ధ!
    కుక్క గొడుగె నీదు కొడుకు బ్రతుకు
    దుండగీడు బోవు;దుర పిల్లి ఫలమేమి
    లోకమేక మైన సాక గలదె ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. ఆవురుమనెడర్జునుఁగని
    జీవితపథమేక విధిని జెప్ప హరి యనిన్
    లేవగ వైరులకుక్కట
    మే వైదొలఁగ దురపిల్లి మృతిఁజెందిరరుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఆవురుమను నర్జునుఁ గని...’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
      ఆవురుమను నర్జునుఁగని
      జీవితపథమేక విధిని జెప్ప హరి యనిన్
      లేవగ వైరులకుక్కట
      మే వైదొలఁగ దురపిల్లి మృతిఁజెందిరరుల్!

      తొలగించండి
  11. ప్రతిదిన మేక చక్ర పురవాసులు యన్నము బ౦డెడున్ బలో
    ధ్ధతు,దురపిల్లి బంపెదరు దానవు నాకలి దీర్చ నానవా
    యితిగను. నేడు వాయుసుతు డేగెను.మెక్కుచు ఆవురావురన్
    కుతుకము దీరగన్ బకున కుక్కడగించగ శ్రేయ మేర్పడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ వృత్తరచన, పూరణ బాగున్నవి. అభినందనలు.
      ‘వాసులు+అన్నము’ అన్నపుడు యడాగమం రాదు. ‘బండెడు తిండిని/బోనము’ అందామా?

      తొలగించండి

  12. తామమే కమై కౌరవుల్దండి జేయ
    యావులింతలు మానుచు నన్న !భీమ !
    భీతి గంపిల్లి వారి ని భీ తు జేసి
    వారి వదలకు క్క డగించు పవన సుతుడ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. ఆవురు నావురంచు తననాత్మయు దేల్ప సుభద్ర|”మౌని-మ
    మ్మేవిధమందు చక్కగ మమేకము జేతువొ?పిల్లిమొగ్గ లౌ
    భావన కుక్కకయ్య ననుబంధమువాడదు”|అర్జునుండు నా
    జీవన భాగమైవరల జేయుమటంచన?కోర్కె దీర్చుమా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      వైవిధ్యమైన ఘట్టాన్ని ఎన్నుకొని చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

      తొలగించండి
  14. ఆవురావురంచు ననిలజుడు దినుచు
    శీఘ్రమే కనియెనసురవరేణ్యు
    బకుని కుక్క తాను బండిపై తరలంగ
    బెదురు పిల్లి వోలె భీతి జెందె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
      ప్రతిదిన మేక చక్ర పురవాసులు బ౦డెడు బోనమున్ బలో
      ధ్ధతు,దురపిల్లి బంపెదరు దానవు నాకలి దీర్చ నానవా
      యితిగను. నేడు వాయుసుతు డేగెను.మెక్కుచు ఆవురావురన్
      కుతుకము దీరగన్ బకున కుక్కడగించగ శ్రేయ మేర్పడన్

      తొలగించండి
    3. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
      ప్రతిదిన మేక చక్ర పురవాసులు బ౦డెడు బోనమున్ బలో
      ధ్ధతు,దురపిల్లి బంపెదరు దానవు నాకలి దీర్చ నానవా
      యితిగను. నేడు వాయుసుతు డేగెను.మెక్కుచు ఆవురావురన్
      కుతుకము దీరగన్ బకున కుక్కడగించగ శ్రేయ మేర్పడన్

      తొలగించండి