5, జనవరి 2016, మంగళవారం

సమస్య – 1905 (సవ్యసాచి సఖుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సవ్యసాచి సఖుఁడు సైంధవునకు.

53 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు

    చక్ర మడ్డ గించి సవిత కాంతిని యాపె
    సవ్యసాచి సఖుడు, సైంధవునకు
    శిక్ష వేయ మనుచు, శ్రీ కృష్ణ లీలలన్
    పొగడ సాధ్య మగునె పుడమి ప్రజకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సవితృకాంతిని’ అనండి. అలాగే ‘వేయు మనుచు’ అనండి.

      తొలగించండి
  2. మిత్రులందఱకు నమస్సులు!

    పుత్ర మరణమునకుఁ బొగిలి, కోపమ్మునఁ
    బ్రతినఁ బూనఁగా; నభయము నిడియు

    సవ్యసాచి సఖుఁడు సైంధవునకుఁ దగు
    దండన మిడఁ గ్రీడి కండ యయ్యె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరిస్తూ ఔత్సాహిక పూరకులకు మార్గదర్శకంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  3. భక్తి తోన గొలుచు పార్ధుని సారధి
    సవ్య సాచి సఖుఁడు , సైంధవు నకు
    దుష్ట బుద్ధి గలిగి ద్రోవదిని దమించు
    దేహ శుద్ధి జేసె దీనము గను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘భక్తితోడ’ అనండి. ‘ద్రోవదిని దమింప’ అంటే అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
    2. భక్తి తోడ గొలుచు పార్ధుని సారధి
      సవ్య సాచి సఖుఁడు , సైంధవు నకు
      దుష్ట బుద్ధి గలిగి ద్రోవదిని దమింప
      దేహ శుద్ధి జేసె దీనము గను

      తొలగించండి
  4. నింగి సూర్యుఁడుండ నేలఁగూలఁడతఁడు
    వేటు వేయఁ జిక్కి వీలుఁ గాగ
    చరమ గీతి పాడె చక్రమడ్డి రవికి
    సవ్యసాచి సఖుఁడు సైంధవునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. శౌరి యెవరి కయ్యె సారథి బవరాన
    కర్ణుడేమగునిల కౌరవునకు
    చక్రి తరణి నాప చావెవరికొదవె
    సవ్యసాచి సఖుడు సైంధవునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ఇరుకరముల చేత శరములు సంధించు
    నెవడు?మిత్రు డనగ నేమి? తెలుపు
    కలికి దుశ్శల సతిగ నెవని కయ్యెనో
    సవ్యసాచి సఖుడు సైంధవునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      క్రమాలంకారంలో మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  7. దివ్య కాంతులీను దేదీప్యమానుడౌ
    సవ్యసాచి సఖుడు- సైంధవునకు
    మరణశిక్ష వేసె మాయను గ్రమ్మించి
    రవికి చక్రమొడ్డి రణమునందు

    రిప్లయితొలగించండి

  8. దివ్య కాంతులీను దేదీప్యమానుడౌ
    సవ్యసాచి సఖుడు- సైంధవునకు
    మరణశిక్ష వేసె మాయను గ్రమ్మించి
    రవికి చక్రమొడ్డి రణమునందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    సవ్యసాచిసఖుడు = సై౦ధవునకు > మృత్యు
    కారయితగ. నయె , వికర్తనునకు
    చక్ర మడ్డు వేసి | చ౦కలూపుచు వాడు
    వెలికి రా c. గిరీటి వేసె శరము ! !

    { కారయిత = చేయి౦చు వాడు ;

    వికర్తనునకు = సూర్యునికి ; }

    రిప్లయితొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    సవ్యసాచిసఖుడు = సై౦ధవునకు > మృత్యు
    కారయితగ. నయె , వికర్తనునకు
    చక్ర మడ్డు వేసి | చ౦కలూపుచు వాడు
    వెలికి రా c. గిరీటి వేసె శరము ! !

    { కారయిత = చేయి౦చు వాడు ;

    వికర్తనునకు = సూర్యునికి ; }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  11. మురళి చేత బట్టు ముద్దుల కృష్ణుడు
    సవ్యసాచి సఖుడు , సైంధవుండు
    రాజరాజు భగిని రమణి దుస్సల భర్త
    బావ యగును గాదె పాండవులకు!!!

    రిప్లయితొలగించండి
  12. దారుణ రణభూమి దానకర్ణుం డంగ
    రాజు సకల శత్రు రాజ ఖండ
    నుండు నుత సుయోధనుం డపరాజిత
    సవ్యసాచి సఖుఁడు సైంధవునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. జగము నేలు హరియె సరిగను నరయగ
    సవ్యసాచి సఖుడు,సైంధవునకు
    చేటుకాలమగుట శీఘ్రముగనపుడు
    సంహరించెనతని సమరమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. అడ్డువేసె చక్ర మబ్జ బాంధవునకు
    సవ్యసాచి సఖుడు, సైంధవునకు
    చావు తప్పెనంచు సంబరపడ , మాయ
    వీడె , చంపె ఖలుని విజయు శ రము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. సాత్యకి సఖు డెవరు? సావిత్రుడేమగు
    ధార్తరాష్ట్రునికిల? తరుణి చెపుమ
    దుస్సలెవరికి సతి లెస్సగా? క్రమముగ
    సవ్యసాచి, సఖుడు, సైంధవునకు!!!

    సావిత్రుడు = కర్ణుడు

    రిప్లయితొలగించండి
  16. వాచ నుడివె సవ్యసాచి సఖుడు "సైంధ
    వునకు వరము గలదతని శిరమ్ము
    యెవని చేతి నుండి నవనిపై రాలునో
    నతని శిరము వ్రక్కలగునటంచు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘శిరమ్ము+ఎవని’ అన్నపుడు యడాగమం రాదు, సంధి నిత్యం. ‘శిర మది| యెవని...’ అనండి. అలాగే ‘..నుండి యవనిపై...’. ‘రాలునో యతని...’ అనండి.

      తొలగించండి
  17. వాచ నుడివె సవ్యసాచి సఖుడు "సైంధ
    వునకు వరము గలదతని శిరమ్ము
    యెవని చేతి నుండి నవనిపై రాలునో
    నతని శిరము వ్రక్కలగునటంచు"

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటిపాదంలో గణదోషం. ‘సైంధవనునకు తన| బాల్యమందు...’ అనండి.
      రెండవ పూరణలో ‘కృష్ణు డన్న నెవరు’ అనండి.

      తొలగించండి
  19. సవ్యసాచి సఖుఁడు సైంధవునకు మృత్యు
    దప్పకుండ జేసె తనదు చక్ర
    మడ్డు పెట్టి రవికి యంధకారముజేయ
    శబ్దవేది చంపె సైంధవుడిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘మృత్యు’ అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘మిత్తి| దప్పకుండ...’ అనండి. అలాగే ‘రవికి నంధకారము...’ అనండి.

      తొలగించండి
    2. దోషములు సవరించిన గురువరులకు ధన్యవాదములు

      తొలగించండి
    3. దోషములు సవరించిన గురువరులకు ధన్యవాదములు

      తొలగించండి
  20. వ్యథను తలచె జేయ ప్రాయోపవేషము
    ప్రతిన తీర్చ లేక పాండుసుతుడు
    మరణ మవగ జేసె మహిమతో యుద్ధాన
    సవ్యసాచి సఖుఁడు సైంధవునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ప్రాయోపవేశము’ అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు

      వ్యథను తలచె జేయ ప్రాయోపవేశము
      ప్రతిన తీర్చ లేక పాండుసుతుడు
      మరణ మవగ జేసె మహిమతో యుద్ధాన
      సవ్యసాచి సఖుఁడు సైంధవునకు

      తొలగించండి
  21. సవ్యసాచి సఖుడు సైంధవునకుతన
    బాల్యమందు విద్య బడయునపుడు
    ఆశ దోషమేది నంకురించక ముందు
    చిన్న తనముమాట చెరగనపుడు.
    2.కృష్ణు డనగ నెవరు?తృష్ణనుమాన్పెడి
    సవ్యసాచి సఖుడు|సైంధవునకు
    ప్రాణహానిబంచె పనితనమందున
    యుద్దభూమియందు సిద్దుడట్లు|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  22. ఆత్మ బోధ జేసె నర్జునున కనిని
    సవ్యసాచి సఖుఁడు ; సైంధవునకు
    రణమునందు చావు రవియస్తమించెడి
    సమయ మునకు మున్నె సంభవించె

    రిప్లయితొలగించండి
  23. వక్రమార్గ మందు విక్రమోపేతుడౌ
    బాలు నార్పుటందు భాగమవగ
    చావు భయము నంత చావు ముందరె జూపె
    సవ్యసాచి సఖుడు సైంధవునకు !!!

    రిప్లయితొలగించండి
  24. కొడుకు మడియ తాను కోపించి హరి ముందు
    ప్రతినజేయ " బావ ! బాగు " యనుచు
    మరణ శాసనమ్ము మదిలోన లిఖియించె
    సవ్యసాచిసఖుడు, సైంధవునకు.

    రిప్లయితొలగించండి
  25. నా నిన్నటి పూరణ


    కొడుకు మడియ తాను కోపించి హరి ముందు
    ప్రతినజేయ " బావ ! బాగు " యనుచు
    మరణ శాసనమ్ము మదిలోన లిఖియించె
    సవ్యసాచిసఖుడు, సైంధవునకు.

    రిప్లయితొలగించండి