8, జనవరి 2016, శుక్రవారం

సమస్య – 1908 (ముదుసలిం గొట్టువారలే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముదుసలిం గొట్టువారలే పోటుమగలు.

33 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    కౌరవుల సేన కధిపతి గౌరవయుతుఁ
    డాపగా సుతుఁ డతిబలుం డతని తోడఁ
    బోరు వారేరి? భీష్మాఖ్య వీరుఁడునగు

    ముదుసలిం గొట్టువారలే పోటుమగలు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      కృరువృద్ధుని ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  2. అదను జూచుచు పక్షిని వ్యాధు డనగ
    శరము సంధించి జంపును వరమ టంచు
    ముదుసలిం గొట్టువారలే పోటు మగలు
    పిరికి తనమందు కొరగాని బేల పలుకు

    రిప్లయితొలగించండి
  3. తాత! మిముఁగెల్చు తక్షణ ధర్మమేది?
    యెరుక పఱచుము మాకంచు దరికిఁ జేరి!
    పేడి వాడిని ముందుంచి వేసి శరము!
    ముదుసలింగొట్టు వార లేపాటి పోటు మగలు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వార లేపాటి’ అన్నపుడు గణదోషం. ‘వారలు + ఏ పోటుమగలు’ అన్న అర్థంలో ‘వార లే పోటుమగలు’ అన్నా సరిపోతుంది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సమస్యపాదము పొరపాటున మార్చాను.సవరించిన పూరణ:
      తాత! మిముఁగెల్చు తక్షణ ధర్మమేది?
      యెరుక పఱచుము మాకంచు దరికిఁ జేరి!
      పేడి వాడిని ముందుంచి వేసి శరము!
      ముదుసలింగొట్టు వార లే పోటు మగలు?

      తొలగించండి
  4. కయ్యమునకైన ప్రేమంపు వియ్యమైన
    నెవ్వరైనను సమవారి నెంచ వలయు
    తగిన బలములు' సిరులను తలచకుండ
    ముదుసలింగొట్టు వారలేపోటు మగలు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. గురువు గారికి నమస్కారములు

    నిప్పులై రాలు శరముల న్నిలువ రింప
    జాల కుంటిని గోపాల శాంతనవుని
    కదనమున గెల్వ వలెనన్న గావలె గద
    ముదుసలింగొట్టు వారలే పోటు మగలు

    రిప్లయితొలగించండి
  6. శ్వేత వాహనా! వినుమిట వీరు డైన
    ముదుసలిం గొట్టు వార లేపోటు మగలు?
    కౌరవకుల భూ షణుజేరి గారవించి
    యడుగ వలయు నుపాయమ్ము ననిన గెలవ

    రిప్లయితొలగించండి
  7. పరమనీచులు దుష్టులు బరగు భువిని

    ముదుసలింగొట్టువారలే, పోటుమగలు
    దానధర్మాలుసేయుచు ధర్మవిధిని
    నడచుకొనువాడునిజమది నమ్ముడార్య!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పోటుమగలు.... నడచుకొనువారు’ అనండి.

      తొలగించండి
  8. భారత రణాన ముందుండె పార్థుడపుడు
    శాంతనవుడును నచ్చోట సర్వ సైన్య
    ములకు నధ్యక్షుడై పల్కె ముందు నిలిచి
    ముదుసలిం గొట్టు వారలే పోటు మగలు.

    రిప్లయితొలగించండి
  9. విర్ర వీగకు మర్జున వీరు నంచు
    యుద్ధరంగంబు నందు గడుగ్రడైన
    ముదుసలిం గొట్టువారలే పోటుమగలు
    భీష్ము నెదిరించ తరమ! నీ బింకమేల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కడు+ఉగ్రుడైన=కడు నుగ్రుడైన’ అవుతుంది. ‘యుద్ధరంగంబు నందున నుగ్రుడైన’ అనండి.

      తొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    తాళక. క్షుదార్తి c. జిన చోర తనము జేసె ,
    వదలి వేయుడు పాపము వలదు కొట్ట. |
    ముదుసలి౦ గొట్టు వార . లే పోటు మగలు ?
    కు౦భకోణాలు జేయుచు కోట్లు దినెడు
    క్షుద్ర నేతలకున్ జ య. కొట్టు మీకు
    లేదు పౌరుష మన్నది లేశ. మ౦త

    { చిన = చిన్న: క్షుద్రనేతలు=నీచనాయకులు :

    రిప్లయితొలగించండి
  11. భీష్ము జంపు నుపాయము విశద పడక
    తాతకడకేగి పార్థులు తలలు వంచి
    కోర, చెప్పె మార్గమ్మును కూర్మితోడ
    నడ్డుపెట్టి శిఖండిని యదను చూచి
    ముదుసలింగొట్టువార లే పోటు మగలు ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. మంచి చెడ్డలు జెప్పెడి మాన్యులయిన
    వృద్ధులకు సేవ జేయక పెడసరముగ
    ముదుసలింగొట్టువార లేపోటు మగలు
    కాదు పరమ హీనులగును క్షాంతిలోన!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదాన్ని ‘కారు పరమ హీనులు గద క్షాంతిలోన’ అనండి.

      తొలగించండి
  13. శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదములు నిన్నటి పూరణ లో గణ దోషం సవరించు కొంటిని

    ఈ నాటి నాపూరణ

    ఎదుట పేడిని నిలిపి తానేగి యనిని
    యుద్ధ మొనరింప నొల్లని యోధు నొకని
    గూల్చ , నయ్యది గూర్చునే గొప్ప కీర్తి !
    ముదుసలిం గొట్టువారలే పోటుమగలు.?

    రిప్లయితొలగించండి
  14. సామునేర్చిన గురువు-నసాధ్యు డతడు
    అరువదేండ్లున్న?శత్రువే దరికిరాడు
    విద్య విజయంబులే గూర్చ బెదురులేని
    ముదుసలిం గొట్టువార లే పోటుమగలు.
    2.వయసుగలిగిన? మమతచే వంగియుండు
    బలుపు,విద్యయు సాధనా బలముచేత
    జాంబవంతుని దెబ్బలే బాంబు లయిన?
    ముదుసలిం గొట్టు వారలే పోటు మగలు

    రిప్లయితొలగించండి
  15. బలము గలదేని కుజనుల బాఱదోల
    వలయు బూజింప దగు వృద్ధ పౌరు లందు
    భక్తి గౌరవమ్ములు సూప వలయు గాని
    ముదుసలిం గొట్టువారలే పోటుమగలు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పట్నంపు చదువు లన్నియు
      కట్నమ్ముల కొఱ కటంచు కలగను తరుణిన్
      కట్నమదియేల వధువను
      కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి