11, జనవరి 2016, సోమవారం

సమస్య – 1911 (వనిత కామింప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?

36 కామెంట్‌లు:

 1. ధనమె దేహధారుఢ్యమై దరికి చేర
  కనకములె కాంతులీనెడి కాయమైన
  నగలె మగడుగ వలపులు రగుల, వార
  వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?

  రిప్లయితొలగించండి
 2. లలిత లావణ్య సొగసరి వలపు లందు
  మలయ మారుత వీచికల్ వలను చిక్కి
  మధుర భావాల మల్లెలు యెదను పొంగి
  వనిత కామింప నొల్లని వాఁడు గలఁడె ?
  --------------------------------------
  పచ్చ చేమంతి యందాల నెచ్చె లకట
  వలపు సంకెళ్ళు బిగియించి కలత రేపి
  జిలుగు వెన్నెల సౌరులు చిలక రించ
  వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'మల్లెలు+ఎదను' అన్నప్పుడు యడాగమం రాదు. 'మల్లెలే యెదను' అనండి. 'నెచ్చెలి +అకట' అన్నప్పుడు యడాగమం వస్తుంది. 'నెచ్చెలి తన' అనండి.

   తొలగించండి
  2. లలిత లావణ్య సొగసరి వలపు లందు
   మలయ మారుత వీచికల్ వలను చిక్కి
   మధుర భావాల మల్లెలే యెదను పొంగి
   వనిత కామింప నొల్లని వాఁడు గలఁడె ?
   --------------------------------------
   పచ్చ చేమంతి యందాల నెచ్చెలి తన
   వలపు సంకెళ్ళు బిగియించి కలత రేపి
   జిలుగు వెన్నెల సౌరులు చిలక రించ
   వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె ?

   తొలగించండి
 3. వరూధిని ప్రవరాఖ్యునితో...


  ఇంతగాకన్నులుండంగ నెదుట గనక
  ఇంటికేగెదవేల పూవింటివాడ !
  వింటివాయిది ప్రవరుడ విప్రవరుడ !
  వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. సరస సద్గుణ ధీమణి చంద్రవదన
  మదన వేదన మనసంత కుదిపివేయ
  వలపు తలపుల పులకించి వరుసకలుపు
  వనిత కామింప నొల్లనివాడు గలడె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. సృష్టికే ప్రతిసృష్టిని జేయఁ గల్గు
  మౌని ముందఱ నర్తించి మరులఁ గొల్ప
  బిడ్డను గనిన మేనక పిదప ధరను
  వనిత కామింప నొల్లని వాఁడు గలఁడె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. చెలువ గలదగు చెంగావిచీరకట్టి
  బూరిబుగ్గలసొగసులుభూరిగాను
  ద్యోతమగుచుండ,శిరసునద్యుమణికాంతి
  వెలుగు లనలరు చుండిన లలితయనెడు
  వనితకామింపనొల్లనివాడుగలడె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. తనసతీమణి తోడనే తనరు వాడు
  రామచంద్రు౦డు,పరసతి రంభ వంటి
  వనిత కామింప నొల్లని వాడు.గలడె
  ననెడి సంశయమే వలదార్యులార!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. తనసతీమణి తోడనే తనరు వాడు
  రామచంద్రు౦డు,పరసతి రంభ వంటి
  వనిత కామింప నొల్లని వాడు.గలడె
  ననెడి సంశయమే వలదార్యులార!

  రిప్లయితొలగించండి
 9. గాధిసుత శరద్వం తాదిగ ముని వరులు
  సంయమాత్ములు శస్త్రాస్త్ర సకల శాస్త్ర
  పారగులు వనితాలోలు లైరి జూడ
  వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. వాంఛితమ్ముల త్యజియించి భక్తి తత్త్వ
  భావములఁ బెంపు గావించి పరమ పుణ్య
  మూర్తినారాధనము జేయ ముక్తి యనెడు
  వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?

  ముక్తి వనిత అని వ్రాసి -- దుష్టసమాసము అవుతుందని ముక్తి యనెడు అని వ్రాసినాను గురువుగారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   కీర్తి వనిత అనడంలో దోషం లేదు.

   తొలగించండి
 11. చిరునగవులను చిందించి చెన్నుగాను
  నడకలో నడుమంత్రము నాట్య మాడ
  సైకతములను కదిలించి సైయనుచును
  వనిత కామింప నొల్లని వాడు గలడె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  వర ! ప్రవర ! విప్రవర ! నిను వలచి తేను
  వర. కుసుమ శర ధాటి కోర్వ౦గ లేను
  మన్మ థోద్దీప నోప శమన మొనర్ప
  తేలుచు వరూధిని c. బ్రణయ ఖేలనమున
  ఏల , దరి జేర వేల. ? రావేల నోయి !
  వనిత కామి౦ప నొల్లని వాడు గలడె ?

  { వర = పదునైన. తేలుచు = తేల్చుము.
  ఏల = ఏలుటకు . }

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  గాధి సుత. ! కనులు దెరచి కా౦చు మోయి ,
  మేన కాప్సర చూపి౦చు > మేని సొగసు
  తప మొనర్చిన. కలుగు వృధా ప్రయాస.
  స్వర్గ సుఖము కలుగు నన్ను స౦గమి౦ప.
  పులకరి౦పవు -- తాకుచు , పలుకరి౦ప
  వనిత కామి౦ప. నొల్లని వాడు కలడె

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 13. వనితకామింప వొల్లనివాడుగలడె?
  గలడు బాధ్యత లెరిగిన విలువలెరిగి
  చదువు సంధ్యల నాశించుచక్కనోడు
  లక్ష్య సాధనా దిశయందులాభ పరుడు.|
  2.వనితకామింప వొల్లని వాడుగలడె?
  కలడు కట్న మాశకుధన కాంక్షలందు
  తిరుగు బోతుగ నలవాటు మరువలేక
  తాళి గట్టిన తనకెగతాళి యనుచు|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు

   తొలగించండి
 14. మదిని దోచిన యందాల మగువ యైన
  కలువ కన్నుల జవరాలు కన్నుమీటి
  ప్రేమ మీరగ రమ్మంచు పిలవ, తనను
  వనిత కామింప నొల్లని వాడు గలడె?

  కుందనపు బొమ్మ యననొప్పు ఇందు వదన
  హృదయమందున కొలువున్న సుదతి తనను
  వలపు పండించు కొనగను పిలిచి నంత
  వనిత కామింప నొల్లని వాడు గలడె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 15. వనిత కామింప నొల్లని వాడు గలడె ?
  గలడు గలడు శ్రీరాముడు! కాననమున
  శూర్పనఖకోర వలదన్న శూరు డతడె
  ధర్మ పథమును వదలని దైవ మతడె !!!

  రిప్లయితొలగించండి
 16. 1.చిరుచిరు అలకను బూనుచు చెలుని వైపు
  కొరకొరగ జూచు నిల్లాలు కూర్మితోడ
  మోహపరవశయై రాగ ముదము నందె
  వనిత కామింప నొల్లనివాడు గలడె!

  2.ఊరు యూరను చేలనోపుడమి సురుడ
  యంగ లార్చుచు నున్నావు యార్తి తోడ
  పూజలు వ్రతములె వరికంచు పూవు బోణి
  వనిత కామింప నొల్లని వాడు గలడె.
  3సతిని కోల్పోయినట్టి యాశంకరుండు
  తపము చేయుచు నుండె తపసి వోలె
  ముగ్ధమోహన రూపున ముందు నిలుచు
  వనిత కామింప నొల్లని వాడు గలడె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘చిరు+అలక’ అన్నచోట ద్విరుక్తటకారం వస్తుంది కదా!
   ‘ఉన్నావు+ఆర్తి= ఉన్నావార్తి’ అవుతుంది. అక్కడ ‘ఉన్నాడ వార్తితోడ’ అనండి.
   రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘పూజ వ్రతము లెవరి కంచు...’ అనండి.
   మూడవపూరణ రెండవపాదంలో గణదోషం. ‘చేయుచు నుండెను...’ అనండి.

   తొలగించండి
 17. మోక్ష గాములు పలువురు మోకరిల్లి
  తపములను వీడి తరుణికి దాసులైరి ,
  విప్రనారాయణుని గాధ విశదమె కద !
  వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?

  రిప్లయితొలగించండి