18, జనవరి 2016, సోమవారం

పద్యరచన - 1151

కవిమిత్రులారా,
“సిరిగలవానికిఁ జెల్లును
దరుణులఁ బదియారువేలఁ దగఁ బెండ్లాడన్,
దిరిపెమున కిద్దరాండ్రా?
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.
ఈ శ్రీనాథుని చాటువును అన్యచ్ఛందంలో చెప్పండి.

75 కామెంట్‌లు:

 1. గురువు గారికి నమస్కారములు
  సమస్యను ప్రకటించినందులకు ధన్యవాదములు

  భాగ్యమున్న వాడు పదివేల భార్యలన్
  పెండ్లి యాడ దగును వింత యేమి?
  సర్ప భూషణునకు సతులిద్ద రేలరా!
  గంగ నివ్వు మయ్య గరళ ధరుడ.

  రిప్లయితొలగించండి
 2. ద్విపద
  ధనము గలిగెనేని దర్పమ టంచు
  మనసు వలచినంత మహరాణు లుండు
  పునుక కంచమువాని మురిపెమెం తైన
  వనము విడువుమయ్య పార్వతి చాలు
  --------------------------------------
  విత్త మున్న వాడు వేలాది భార్యలన్
  సంత సమ్ము గాను సరస మందు
  బిచ్చ మెత్తు వాని ప్రియసతు లిరువురా ?
  గంగ విడువు మోయి జంగ మయ్య .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘మహరాణి’ అనడం దోషమే.

   తొలగించండి
  2. ధనము గలిగెనేని దర్పమ టంచు
   మనసు వలచినంత మారాణు లుండు
   పునుక కంచము వానిమురిప మెంతైన
   వనము విడువు మయ్య పార్వతి చాలు

   తొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 4. శుభోదయం

  సత్కవీశ్వరుల వలె పరి విధ
  సత్కధ చందములనగ సువిధ
  తత్కరము నగునా ? విడుము,సుధ,
  ఉత్కర కందము, ముత్యాలె అభిధ !

  ముత్యాల
  "శర" జిలేబి :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   అంత్యానుప్రాస బాగుంది. కాని జిలేబీ చుట్టల్లా గజిబిజిగా భావాలతో పద్యం దురవగాహంగా ఉంది సుమా!

   తొలగించండి

  2. కంది వారు :)

   నేనేమి జేతు సామీ ! అదియె అక్కడి భావము :)

   నెనర్లు ! కవీశ్వరుల వలె వ్రాయటం మా తరము గాదు ! వదిలితి కందము , ముత్యాల సారము జాలు అను నర్థము ! మరీ జిలేబి "చుట్టాల్" అయిపోయే !

   జిలేబి

   తొలగించండి
  3. ఎవరూ పుట్టుకతో కవీశ్వరులు కారు. ఆసక్తి, ఉత్సాహం ఉండి అభ్యాసం చేసే ఎవరైనా చక్కగా పద్యాలు వ్రాయవచ్చు. పురోగమించండి!

   తొలగించండి
  4. కంది వారు !

   నెనర్లు ! మీ ప్రోత్సాహమే మాకు పూర్తి బలము ! శ్రీనాధు ల వారి కి జెల్లు అటుల వ్రాయుట మా తరమా అను అర్థము లో !

   సత్కవి శ్రీనాధ ! నీవలె
   సత్కధ చందములన నావలె
   తత్కరము నగునా ?విడు రవళి
   ఉత్కళ కందము, గను ముత్యసరళి !   జిలేబి

   తొలగించండి
 5. శ్రీపతికిని జెల్లు శ్రీమతుల్ పదునారు
  వేలమంది,హర ! త్రిశూలపాణి!
  ఆదిభిక్షు !చూడ నాలులిద్దర ? విడు
  మాకు గంగ, గిరిజ నీకు చాలు.

  రిప్లయితొలగించండి
 6. శ్రీపతికిని జెల్లు శ్రీమతుల్ పదునారు
  వేలమంది, యేంగు తోలుగట్టు
  నాదిభిక్షువ! కన నాలులిద్దర ? విడు
  మాకు గంగ, గిరిజ నీకు చాలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. గోలీ వారి పదభిఘావళీ అమోఘం !

   జిలేబి

   తొలగించండి
  2. శాస్త్రి గారూ,
   ‘ఏంగు’ అంటే వెళ్ళు అని అర్థం. అక్కడ ‘ఏన్గు’ అనండి. మీ ఉద్దేశం అదే కావచ్చు. టైపాటు అనుకుంటా.

   తొలగించండి
  3. మాస్టరుగారూ ధన్యవాదములు...లేఖినిలో ఎంత ప్రయత్నించినా అలా టైప్ కాలేదండీ...మీరు వ్రాసినదానిని పేస్ట్ చేస్తాను

   శ్రీపతికిని జెల్లు శ్రీమతుల్ పదునారు
   వేలమంది, యేన్గు తోలుగట్టు
   నాదిభిక్షువ! కన నాలులిద్దర ? విడు
   మాకు గంగ, గిరిజ నీకు చాలు

   తొలగించండి
 7. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి !

  " పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ !"

  01)
  _______________________________________

  పింగు గలవాడె పదహారు - వేల మంది
  భార్యలను పొంది సుఖముల - బడయ వచ్చు
  జొగ్గు నెత్తుట కిరువురు - జోటులేల ?
  గంగ విడువుము కాట్రేడ - గౌరి చాలు !
  _______________________________________

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

  2. జొగ్గు నెత్తుట కిరువురు - జోటులేల ?

   జూపర్ :)

   జిలేబి

   తొలగించండి

 8. పైకమున్నవాడు పడతులెందరినైన
  పరిణయంబు నాడ వచ్చు ధరను
  తనకె లేని శివుకు తరుణులి రువురేల
  యెంచి చూడ వింత యిదియు గాదె.

  సతులు యెందరున్న సరిపోవు హరికట
  తిరిపె మెత్తు వాని కిరువురేల
  నీటి కొరత దీర్చు నీరిచ్చు గంగను
  వదలమయ్య స్వామి వామదేవ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
   ‘శివునకు’ అనడం సాధువు. ‘తనకె లేని శివుడు తరుణు లిరువు రేల’ అనవచ్చు.
   ‘సతులు+ఎందరు’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. అక్కడ సవరణ సూచించలేకపోతున్నాను.

   తొలగించండి

 9. తిరిపె మెత్తు వాని కిరువురేల!

  చాలా బాగుందండీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. ధనము గలవాని కెం దరు దార లున్న
  నుండ వచ్చును ,శంకర ! యొండు చాలు
  గంగ మాకిచ్చి పార్వతి గై కొనుము ర
  తిరిపె వగుటను నిట్లంటి దేవ ! నతులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. అన్నయ్యగారూ నమస్తే.సవరించాను.ఒకసారి చూడండి.
  పైకమున్నవాడు పడతులెందరినైన
  పరిణయంబు నాడ వచ్చు ధరను
  ఇరువురేల తిరిపె మెత్తు శంకరునకు
  యెంచి చూడ వింత యిదియు గాదె.
  భార్యలెందరున్న బాధ లేదు హరికి
  తిరిపె మెత్తు వాని కిరువురేల
  నీటి కొరత దీర్చు నీరిచ్చు గంగను
  వదలమయ్య స్వామి వామదేవ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ సవరించిన పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘ధరను+ఇరువురు’ అని విసంధిగా వ్రాశారు. ‘ధరణి|నిరువు రేల’ అనండి. ‘శంకరునకు+ఎంచి’ అన్నపుడు యడాగమం రాదు. ‘శంకరునకు|నెంచి...’ అనండి.

   తొలగించండి
 12. తరుణులెందరున్న తగుదురు సిరియున్న
  బిక్షువునకిరువురు శిక్ష గాదె
  గిరిసుతసరినీకు సురగంగ ధరకిడు
  కరువు దీరు నీదు కరుణ వలన !!!

  రిప్లయితొలగించండి
 13. సిరి మగనికి జెల్లు తరుణులు పదిహారు
  వేలమంది, యాది భిక్షువయిన
  ఇందుమౌళి !నీకు యిరువురు సతులేల?
  గంగను విడు మాకు గౌరి చాలు!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘నీకు నిరువురు’ అనండి.

   తొలగించండి
 14. రిప్లయిలు
  1. లచ్చిగలవాని మెత్తురు లక్షణముగఁ
   దరుణులఁ బదాఱువేల సదమల మతులఁ
   బెండ్లి యాడ భార్యాద్వయం బేల నాది
   బిక్షువునకుఁ బార్వతి చాలు విడుము గంగ

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు

   తొలగించండి
 15. భార్యలుండ వచ్చు పదునారు వేలైన
  సిరిని గలిగి నట్టి శ్రీధరునకు
  బూదిదాల్చు నీవు భూతనాథుడవు నీ
  కిద్ద రేల గంగ నిడుము మాకు

  రిప్లయితొలగించండి

 16. పైకమున్నవాడు పడతులెందరినైన
  పరిణయంబు నాడ వచ్చు ధరను
  తనకె లేని శివుకు తరుణులి రువురేల
  యెంచి చూడ వింత యిదియు గాదె.

  సతులు యెందరున్న సరిపోవు హరికట
  తిరిపె మెత్తు వాని కిరువురేల
  నీటి కొరత దీర్చు నీరిచ్చు గంగను
  వదలమయ్య స్వామి వామదేవ.

  రిప్లయితొలగించండి

 17. పైకమున్నవాడు పడతులెందరినైన
  పరిణయంబు నాడ వచ్చు ధరను
  తనకె లేని శివుకు తరుణులి రువురేల
  యెంచి చూడ వింత యిదియు గాదె.

  సతులు యెందరున్న సరిపోవు హరికట
  తిరిపె మెత్తు వాని కిరువురేల
  నీటి కొరత దీర్చు నీరిచ్చు గంగను
  వదలమయ్య స్వామి వామదేవ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   సవరించిన పద్యాలు బాగున్నవి.
   మళ్ళీ ‘శివుకు’ అన్నారు.

   తొలగించండి
 18. ధనము గలవాడు శౌరికి తగును సుమ్మ
  చేకొన పదునారు సహస్త్ర చేడియలను
  తిరిపె మెత్తుచు వీధుల తిరుగునీకు
  నంగన రిరువుర ? విడువు గంగ నజుడ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 19. పద్య రచన. . * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
  సిరియును, స౦పదల్ గలుగు శ్రీ యదు నాయకు డష్టభార్యలన్
  బరిణయ మాడ వచ్చును|కపాలము చేకొని,కాటిరేనివై
  తిరుపము నెత్తుచున్ బ్రతుకు దేవర!పె౦డ్లము లిద్ద రేటికిన్?
  గిరిసుత చాలు గాని,యిక--నీతల పైగల గ౦గ వీడుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మనోహరమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 20. స్త్రీలు పదారువేలు గను శ్రీయుతు శౌరికి నుండ లెస్సయే
  కేలను భాజనమ్ము గొను కింజున కిద్దరు స్త్రీలదేలనో
  యేలుకొనంగ చాలు నొక యీశ్వరి,గంగను వీడుమయ్య,నా,
  నాలుక యెండి పోయినది నాకొక గ్రుక్కెడు నీరు గావలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 21. సిరిగల వానికిన్ దగును చింతయుజేయ ?పదారువేలుగా
  తరుణుల పెళ్లి యాడినను తప్పనువారిల లేరు శంకరా
  తిరుపపు జీవనాన కడుతిప్పలు నీకగుయిద్దరాండ్రతో
  కరువని|పార్వతీశుడిగ గాంచుము గంగను వీడు భూమికిన్.

  రిప్లయితొలగించండి
 22. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గు రు వు గా ర గు శ్రీ శ౦ క ర య్య. గా రి కి ధ న్య వా ద ము లు * న మ స్తే *

  రిప్లయితొలగించండి
 23. శ్రీగల వానికెట్టులయు జెల్లునులే పదియారు వేవురన్
  చేగొని పెండ్లి చేసికొని చేయ వినోదమునిష్టరీతిలో
  నేగతి భిక్షమెత్తుకొనునీశ్వర కావలె భార్యలిద్దరున్
  వేగమె గంగనున్ వదలి వేడుక పార్వతినుంచుకొమ్మికన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘వాని కెట్లయిన...’ అనండి.

   తొలగించండి
 24. ఉద్వాహంబులు జేసికొన్న తగునెన్నో వేలవై కృష్ణుడా
  తద్వారా యగు నష్టమేమి కనగా తామెంతొ సంపన్నులే
  యధ్వాన్నంబిది యాలులిర్వురనగా యాచించువో శంకరా
  మద్వాక్యంబుల నాలకించి యిడవో మాకింక నీ గంగనే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శశికాంత్ మల్లప్ప గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘యాచింతు నో శంకరా’ అనండి.

   తొలగించండి
 25. సిరిగల వానికిఁ జెల్లున్ దరుణులు
  పదియారు వేవురు పరిణయమాడ
  నాదిభిక్షువ నీకు నాండ్రిద్దరేల?
  గంగ విడువు మయ్య గౌరియె చాలు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ - ద్విపదకు కనీసం రెండు పాదము లు కావాలి. మూడవ పాదం సరిచేయాలనుకుంట.

   తొలగించండి
  2. పెద్దలకు నమస్సులు. మూడవ పాదంలో దోషము తెలుపగలరు.ఇది మంజరి ద్విపద.

   తొలగించండి
  3. పెద్దలకు నమస్సులు. మూడవ పాదంలో దోషము తెలుపగలరు.ఇది మంజరి ద్విపద.

   తొలగించండి
  4. సగం తెలివితో తెలియక చేసిన చూచన. మన్నించండి.సరి గానే ఉన్నది.

   తొలగించండి
  5. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. శ్రీపతి చెకొనన్ దగును చెన్నుగ తా పదునారువేల స
  త్గోపికలన్ ఘనమ్ముగను, కొంపల లోనను బిచ్చమెత్తగన్
  గోపతి! సర్పభూషణుడ! కూర్మి సతీమణులిద్దరేలనో
  యీ! పురుహూతి నాథ !విడు మిమ్ముగ గంగను, చండి చాలులే!
  పురుహూతిః పార్వతి, విష్ణువు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   వృత్తరచనలోను నిష్ణాతులయ్యారు. సంతోషం.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. తమరి ఆశీర్వచన ఫలిత మే.

   తొలగించండి
  3. గురువర్యులకు నమస్సులు. తమరి ఆశీర్వచన ఫలిత మే.

   తొలగించండి
 27. మిత్రులందఱకు మనస్సులు!

  ఆండ్రు పదునాఱువేలఁ బెం♦డ్లాడఁ జెల్లె
  సిరులు గల్గిన వాఁడైన ♦ శ్రీపతికిని!
  తిరిపమెత్తెడి నీకేల ♦ నిరువురుసతు?
  లీశ గంగను విడువు! మ♦ద్రిజయె చాలు!!

  రిప్లయితొలగించండి
 28. డబ్బులు వేనవేలుగల డాబుల కన్నడి కందమిచ్చు తా
  నబ్బుర మౌచునున్ కొనగ నంగనలన్ పదహారు వేలనున్
  నిబ్బర మౌచునున్ తగున నీవిటు లిద్దరి నేలగా ఫకీర్!
  పబ్బము చేయుచున్ విడుము పావని గంగను...గౌరి చాలులే!

  రిప్లయితొలగించండి
 29. అరెవో శంకర! శ్రీకరుండు కొనగన్ హ్లాదంపు వే భార్యలన్
  పరవా లేదుర! వాని బొక్కసమునన్ బంగారమే పండురా!
  సరియౌ తిండియు లేని భిక్షువుర! నీ సంసారమందేలరా?
  వరమౌ నిర్వురు భార్యలే! విడువుమా బంగారు గంగమ్మనున్
  కరముల్ మోడ్చెద! పార్వతమ్మ నికపై గారాబుగా హత్తుమా!

  😊

  రిప్లయితొలగించండి
 30. లచ్చిమి యున్నవానికిని లక్షణమైనటువంటి భార్యలున్!
  హెచ్చుగ నెందరున్నను మహీతలమందున నేమి గాదులే!
  బిచ్చము నెత్తునీశునకు బింకముగా సతులిద్దరేలనో
  యిచ్చిన జాలు గంగనిక, నీశ్వరి నీయరభాగమేగదా!!

  రిప్లయితొలగించండి
 31. "వేలు"గలవానికిపదారు-వేలమంది
  చెల్లునిల్లాండ్రుగా,నీకు-చెల్లరయ్య!
  బిచ్చమెత్తుచు బతికెడి-చిచ్చుకంటి!
  గంగ మాకిడు పార్వతీ-కలదు నీకు!

  రిప్లయితొలగించండి