14, జనవరి 2016, గురువారం

పద్యరచన - 1147

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యం వ్రాయండి.

37 కామెంట్‌లు:

  1. సంప్రదాయమనుచు సంక్రాంతి తొలినాడు
    తెలుగు లోగిలందు వెలుగు నింపు
    భోగి మంట లవియె భూరిగా వేడ్కలన్
    జరుపు కొందురంట సంత సమున

    రిప్లయితొలగించండి
  2. పండుగ సంబర మనుచును
    నెండిన కట్టెలు చితుకుల నెన్నోరకముల్
    రండిర మంటలు వేయగ
    మెండుగ మనభోగి యనుచు మిన్నంటు నిలన్

    రిప్లయితొలగించండి
  3. పూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరికీ, వీక్షకులకు, భోగీ శుభాకాంక్షలు....



    స్వాగత మీయరె లక్ష్మికి
    భోగమ్ములనొసగ వచ్చె భూరిగ నిలకున్
    రాగమును బెంచి జనులకు
    పోగొట్టును చింతలన్ని భోగీ మంటల్









    రిప్లయితొలగించండి
  4. పోగేసిరి గతమంతయు
    దాగుండెడు వెతలనన్ని దాచక మదిలో
    భోగియరుదెంచ మంటల,
    రేగెడు జ్వాలలు భవితకు ప్రేరణమొసగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  5. భోగ భాగ్యములు గలుగు భోగి నాడు
    సిరియు సంపద లువిరియు శివుని గృపను
    పెద్ద పండుగ రోజున , నిధ్ధరణి ని
    పాడి పంటల వృద్ధియు బాగు గాను
    కనుము దినమున మొదలిడు ననుట నిజము .

    సంక్రాంతి శుభా కాంక్షలు
    సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
    సంక్రాంతి మూడు రోజులు
    ‘సంక్రందననుతుఁడు శివుఁడు సత్కృపతోడన్

    రిప్లయితొలగించండి
  6. భోగి మంట జూడు భుగభుగ రవమును
    జేయు చుండి యఘము జిదుము చుండె
    భోగి మంట జూచు భూజను లెల్లరు
    పుణ్య వంతు లార్య! పుడమి యందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. 1.ఎండు కట్టె లన్ని యేరి కూర్చుచు దెచ్చి
    ముగ్గు లిడుచు నుంద్రు ముదిత లెల్ల
    భోగి మంట వేసి భోగములను కోరి
    మురిసి పోవు చుంద్రు భువిని జనులు.
    2.భోగి మంటలనగ పోగొట్టు చీడంచు
    పిడకలన్ని దెచ్చి పేర్చి పేర్చి
    తనువు కాచు కొనగ జనులెల్ల నొకచోట
    చేరి సంబరాలు చేయు చుంద్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. ఉజ్వల రేఖావృతమై
    ప్రజ్వలి తానల శిఖా విరాజిత ప్రహ్లా
    దజ్వరిత వరాంగజ తృ
    ప్తజ్వలితానన ప్రమోద భరితుల గనరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెలుగు తరంగాలతో చుట్టుకొని మండుతున్న యగ్నిశిఖలతో ప్రకాశమానమై యానందమనెడి జ్వరము(వేడి)కల్గిన అవయువముల వలన పుట్టిన తృప్తి తో వెలిగే ముఖములతో సంతోషముతో నిండిన వారిని చూడండి.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.మీరు ఎప్పుడు చూస్తారాయని యెదురు చూశాను. సమాసప్రయోగములో యేమైన దోషములున్నవేమోయని యాందోళన.ధన్యవాదములు.

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      ఈరోజు ఉదయం మా చెల్లాయి అత్తగారు మరణించారు. వాళ్ళ ఊరు వెళ్ళి కార్యక్రమాలు అయి ఇల్లు చేరేంతవరకు వ్యాఖ్యలు పెట్టడానికి అవకాశం దొరకలేదు. అందుకే ఆలస్యమయింది.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విచారకరమైన వార్త. భగవన్నిర్ణయాన్ని యెవరాపగలరు? వారియాత్మకు శాంతి కలుగుగాక!

      తొలగించండి
  9. గురువులు శ్రీకందిశంకరయ్య గారికి మరియునితర కవిమిత్రులకుకవిమిత్రులకు భోగి పర్వదిన శుభాకాంక్షలు.

    పోచిరాజు కామేశ్వర రావుగారికి వందనములు. మీ పద్యము ఉజ్జ్వలప్రకాశమానమై విరాజిల్లుతున్నది.

    పాప విచార భావములు ప్రాకట దుష్టకరప్రచారముల్
    లోపములన్న భావనలు లోపలనున్న విరోధభావముల్
    చూపులనున్న వక్రతలు శూన్యముగావలె భోగిమంటలం
    దాపరివర్తనంబు నిజమైన యుషోదయమిజ్జగంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సంపత్ కుమార్ శాస్త్రి గారూ నమస్కారములు. మీ సుహృద్వాఖ్యానమునకు హృదయపూర్వక ధన్యవాదములు. నిజమైన యుషోదయమునకు మీ భాష్యము ప్రశంసనీయము.అభినందనలు.

      తొలగించండి
  10. భోగిమంటలువేయ?-సాగెడినౌత్సాహి
    -----చెలిలాగ చలిజేర కులికె మంట|
    వణికించు చలి రాగ-పలుకులుతడబడ
    -------మంటలదరిజేర ?మాట బుట్టె|
    సూక్ష్మజీవులుకొన్ని జోరుగా సాగగ?
    -------చలిమంటలందున సచ్చు బడును
    ధన ధాన్య రాసులు –దరిజేర రైతుకు
    ------అప్పులు-నిప్పునకుప్పగూల్చు|
    సర్వజనుల –ప్రమాణ మై నిర్విరామ
    మైన కృషినిల సల్పగ మంటలెగసె|
    భోగిమంటలు పల్లె విరాగిగాక
    వెలుగునింపును రాత్రికి వేడు కొసగ|


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మంటలందున+చచ్చు’ అన్నపుడు ద్రుతకార్యం జరిగి ‘మంటలందునఁ జచ్చు’ అవుతుంది. గసడదవాదేశం రాదు.

      తొలగించండి
  11. శంకరాభరణమునందుపూరణకర్తలకు గురువర్యులగు కందిశంకరయ్యగారికి భోగిశుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  12. పాంచ భౌతికమ్ముపంచేంద్రియమ్ములు ,
    విషయ వాసనలను పెంపు జేయు
    నారు యంతరంగ ఘోర శత్రుల భోగి
    మంట నాహుతి జేయుమనుచు గరపు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      చివరిపాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  13. మదిని నిండి యున్న మకిలి తలంపులు
    కాల్చి వేసి మనసు గడుగు మంచు
    మూగి చిన్న పెద్ద భోగి మంటలచుట్టు
    చేయి చాచి ప్రతిన జేయుచుండ్రి .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  14. అగ్ని తోడ చుట్టు అందరూ నిలబడి
    చలిని కాచు కుంటు చెలుర తోడ
    ఆట పాట జోరు గా చేర్చి భోగిని
    మనసు హాయి తోడ మరిమరి గనె

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. దక్షి ణాయపు కష్టముల్ దప్పిపోవ
    అన్నిబాధల నగ్నికి నాహుతినిడి
    క్రొత్తజీవిత మును పొందు కోర్కె తోడ
    యువత చేరిర చట మంచి భవిత కోరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. మూగిరి పిన్నపెద్దలును మోదముతో చలిలోన వేకువన్
    భోగిని, తెచ్చి కట్టెలను పోసిరి రాసిగ నిప్పుబెట్టగా
    రేగెను మంట చివ్వుమని లేచెను నింగికి నంతయెత్తునన్
    వేగమె నొక్కరొక్కరుగ వేసిరి బాలలు భోగిదండలన్.


    పనికిమాలిన వస్తువుల్ భగభగమని
    కాల్చి బూడిద యైననే కాదు భోగి
    పనికిమాలిన యోచనల్ పట్టి మదిని
    కాల్చ జ్ఞానాగ్ని నానాడె గాదె భోగి.

    రిప్లయితొలగించండి

  17. గురుదేవుల సూచన మేరకు గణదోషమును సవరించిన
    పద్యము
    పాంచ భౌతికమ్ముపంచేంద్రియమ్ములు ,
    విషయ వాసనలను పెంపు జేయు
    నారు యంతరంగ ఘోర శత్రుల భోగి
    మంట బూది సేయు మనుచు గరపు
    !

    రిప్లయితొలగించండి

  18. గురుదేవుల సూచన మేరకు గణదోషమును సవరించిన
    పద్యము
    పాంచ భౌతికమ్ముపంచేంద్రియమ్ములు ,
    విషయ వాసనలను పెంపు జేయు
    నారు యంతరంగ ఘోర శత్రుల భోగి
    మంట బూది సేయు మనుచు గరపు
    !

    రిప్లయితొలగించండి