9, జనవరి 2016, శనివారం

పద్యరచన - 1143

కవిమిత్రులారా,
“కనియెన్ రాముడు...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తిచేయండి. 
ఈ అంశాన్ని పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు. 

56 కామెంట్‌లు:

 1. కనియెన్ రాముడు లంకలోనగల యాకాంతా లలామన్ మదిన్
  వినిసంతో షమునందునన్ బొగిడి యావీరాంజనేయున్ హితున్
  వనమున్ వేడుకమీర కేకివలె భావావేశమున్ బొందుచున్
  వినువీధిన్ విహరించెనే యెదను నేవేవో సుమాళిం చినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ మత్తేభ వృత్తం నిర్దోషంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 2. కనియెన్ రాముడు మిథిలన్
  జనకు కొలువునందు ధరణి జను కడుదృతితో
  మనసు పరవశము నొందగ
  ధనువునుసంధించి వేగ తా భంగించెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. కనియెన్ రాముడు సీతను
  మనమున్ పొంగెను మోద మందు వలపున్
  పనుపున్ బాణము సంధింప
  ఘనమున్ జరిగెను పెండ్లి గారవ మందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   నిర్దోషంగా మత్తేభాన్ని వ్రాసిన మీరు ఇదేమిటి.. ఈ కందంలో మూడు పాదాల్లోను గణదోషాలు? సవరించండి.

   తొలగించండి
  2. కనియెన్ రాముడు సీతను
   మనమున పొంగెను వలపు మాధుర్య ముగన్
   పనుపున సంధించె శరమును
   ఘనముగ జరిగెను పెండ్లి గారవ మందున్

   గురువులు క్షమించాలి " సవరించిన పద్యము "

   తొలగించండి
  3. అక్కయ్యా,
   మళ్ళీ రెండవ మూడవ నాల్గవ పాదాల్లో గణదోషం. పొంగెను > పొంగినది, శరమును > శరము, జరిగెను > జరిగినది... అంటే సరి.

   తొలగించండి
  4. కనియెన్ రాముడు సీతను
   మనమున పొంగినది వలపు మాధుర్య మునన్
   పనుపున సంధించె శరము
   ఘనముగ జరిగినది పెండ్లి గారవ మందున్

   తొలగించండి
 4. శుభోదయం!


  కనియెన్ రాముడు కనె రా
  ముని సీతయు కనులు కలువ ముని సైగగ ధను
  వుని విరిచె రాముడు ; కనె య
  వనిజ కనుల కువలయములు వడివడి రామా

  చీర్స్
  జిలేబి
  (సావేజిత!)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో గణదోషం. ‘...ముని సైగను గై|కొని విరిచె ధనువు రాము డ|వనిజ... వడి వికసించెన్’ అందామా?

   తొలగించండి
  2. కంది వారు,

   ఛందస్సు సాఫ్టు మరి నూరు శాతం చూపిస్తుందే మిటి ?

   @మిరియాల దిలీప్ గారు,

   ఛందస్సు సాఫ్ట్ ణి ఏమైనా సవరించ వలె నా ?

   సవరించిన కందమూ సరి వంద శాతం

   కనియెన్ రాముడు కనె రా
   ముని సీతయు కనులు కలువ ముని సైగను గై
   కొని ధనువు విరిచె రాముడ
   వనిజ కనుల కువలయములు వడివడి రామా

   జిలేబి

   తొలగించండి
  3. కంది వారు,

   నెనరస్య నెనరః !

   సావేజిత అనగా సాఫ్ట్ వేర్ జిలేబి తయార్ :)

   మీరు పెట్టిన ఛందస్సు సాఫ్ట్ వేర్ లో సరి సరి జేసుకుని వేసుకున్న జిలేబీయం :)

   జిగిబిగి గీతల తో మరి
   బిగినడ పరిపరి విధముల బిరబిర వేయన్
   బిగువును సరిజే యంగ యు
   పకరిణి జూపిన సరళిగ పదముల గుచ్చెన్

   చీర్స్
   జిలేబి
   (సావేజిత!)

   తొలగించండి
  4. జిలేబీ గారూ,
   కందపద్యం రెండవ నాల్గవ పాదాల చివరి అక్షరం తప్పని సరిగా గురువు అయి ఉండాలని నియమం. అనగా అక్కడ చివరి గణంగా సగణం (IIU) కాని, గగం (UU) కాని ఉండాలి. ఛందస్సు సాఫ్టువేరులో ఇంకా కొన్ని లోపాలున్నాయనీ, సవరించవలసిన అవసరం ఉందనీ దాని రూపకర్తలే తెలిపారు.
   ఇక మీ ‘జిగిబిగి...’ పద్యంలో చివరిపాదంలో ప్రాస తప్పింది. ‘బిగువును సరళిగ సరిజే|యగ నుపకరణియె పదముల ననువుగ జూపెన్’ అందామా?

   తొలగించండి
 5. కనియెన్ రాముఁడు సన్ముని
  జనసేవాలబ్ధపుణ్యసాఫల్యాంచ
  ద్ధనయోగధ్యానోదిత
  ఘనసుజ్ఞానజధవళితకబరిన్ శబరిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. gurudEvulaku praNAmamulu. tamari padyam gamanincakanE nEnunnU Sabari mAta painE padyam vrASAnu.mI padyam prabhanda padyamlA adbhutangAvundi.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మహాకవి పోతనామాత్యుని శైలికి ధీటుగా శబ్ద లాలిత్యముతో నర్థ గాంభీర్యముతో మనోహరమైన మీ పద్యము మహదానందము నిస్తూ మార్గదర్శకముగా పరిఢవిల్లుచున్నది. ధన్యవాదములు.
   నేనిచ్చిన యంశము ఇంతటి గొప్ప పద్యాన్ని యిచ్చినందుకు నేను ధన్యుడను.

   తొలగించండి
  3. గురువర్యులకు నమస్సులు. తమరి పూరణ బమ్మెర పోతన పద్యములను గుర్తుకుతెస్తుంది.

   తొలగించండి
  4. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
   పోచిరాజు కామేశ్వర రావు గారికి,
   అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి
   ధన్యవాదాలు.

   తొలగించండి
 6. కనియెన్ రాముడు వనములఁ
  దన రాకకు వేచి చూచు తాపసి శబరిన్
  తినిపించఁగొరికి ఫలముల
  మనమున కౌసల్యమాత మరిమరి తోచన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. కనియెన్ రాముడు వనమున
  పనసలునిక యరటిపండ్లు బాహాటముగా
  న్దినవలెనను గోరికతో
  వినయముగా గాపువాని వేడెను నపుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘వేడె నపుడు తాన్’ అనండి.

   తొలగించండి
 8. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దత్త చిత్రాన్ని పెద్దది చేసి చూస్తే రామ చిలకల జంటలు కన్పిస్తున్నాయి. వలయాకారము లో నున్నవి యవి ఆడుకోవడానికి వేసిన ఇనుపవల యని భావించి వ్రాసిన పద్యము. విమానాశ్రయములో కూర్చుని వ్రాసిన పద్యము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   నిజమే... నేనిప్పుడే ఆ చిత్రాన్ని పరిశీలిస్తే చిలుకల బొమ్మలు కనిపించాయి. ధన్యవాదాలు.

   తొలగించండి
 9. కనియెన్ రాముడు మృగశా
  బనేత్ర విమల శరదిందు వదనన్ బాలన్
  జనకాత్మజన్ గుణమణిన్
  వినమ్ర విభ్రమ విలోల వీక్షన్ సీతన్


  కనియెన్ రాముడు సోమతేజ విలసత్కన్యా లలామన్ సనా
  తన ధర్మాచరణానురక్త రమణిం దామ్రాక్షి లజ్జాన్విత
  న్ననిలోద్ధూత విరాజమాన ఘన కేశాచ్ఛాది తాబ్జాననన్
  వనజాక్షిన్ వరదామ యుక్త కర శోభన్ సీత ధాత్రీసుతన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. ముఖ్యంగా మత్తేభరచన మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 10. కనియెన్ రాముడు వనముల
  వనితయెశాపమ్మువలన పడుకుగ మారన్
  తనపాదము దగిలించుచు
  మునిభార్య నహల్య కపుడు ముక్తినొసంగెన్!!

  రిప్లయితొలగించండి
 11. కనియెన్ రాముడు ప్రేమమీర కపినిన్ కారుణ్యనేత్రాలతో
  వినయంబాభరణమ్ముగా బడతి నణ్వేషించి యేతెంచెయ
  య్యనిలానందకరుండు పావనుని యాహ్వానించెశ్రీరాముడే
  ఘనసంతోషముతోడ కౌగిటకు నా గాకుత్సుడా మారుతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 1.కనియెన్ రాముడు మిథిలన్
   జనకుని కొలువున నిలిచిన జానకి దేవిన్
   కనుచును కడకంట జనుల
   వినయముతో ధనువు నెత్తి విజయుండయ్యెన్.

   2.కనియెన్ రాముడు వనిలో
   వనితామణియౌ శబరిని వైనముతోడన్
   వినుచును మొరలను దయతో
   డ,నొసంగెనుమోక్షమా లలనకు పేర్మిన్
   3.కనియెన్ రాముడు నచ్చో
   హనుమంతుని.యెరుగుచు యవనిజ జాడన్
   ధనువును బూనుచు యసురున్
   గొనయము సారించి గెల్చి కులసతి దెచ్చెన్.

   4.కనియెన్ రాముడు గాధే
   యునితోడ చనుచు నసురుల యుసురును గొనుచున్
   వినయము జూపుచు గురువుకు
   తనసోదరు గూడి సాగి తరుణిని బ్రోచెన్.(అహల్య)

   5.కనియెన్ రాముడు రావణు
   ననుజుని,కోరగ నతనిని నయమునసేనన్
   యునిచెను లంకకు యభిషి
   క్తుని చేయుచు జనకజ తోడుగ మరలెన్

   తొలగించండి
  2. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  3. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   కొన్ని సంధిగత దోషాలున్నవి. తరువాత వివరిస్తాను.
   మీరు ఆంజనేయ శర్మ గారి పద్యం క్రింది ‘ప్రత్యుత్తరం’ క్లిక్ చేసి మీ పద్యాలను పోస్ట్ చేశారు.

   తొలగించండి
  4. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   ‘హనుమంతునిఁ దా నెరుగుచు నవనిజ...’, ‘...బూనుచు నసురున్’, ‘గురువుకు>గురునకు’ అనండి, ‘సేనన్+ఉనిచెను’ యడాగమం రాదు.

   తొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘రాముం డడవిని...మహిమాన్వితునిన్’ అనండి.

   తొలగించండి
 13. కనియెన్ రాముడు కాననమ్ముల మహాకాంతార మార్గమ్ములన్
  తనదౌ పట్టపురాణి భూజ తనతో తారాడు ప్రాణేశ్వరిన్
  కనరానీయక క్లేశమున్ ముఖములో కంజాక్షయుగ్మమ్ములో
  తననాథుండె సమస్తలోకమను సీతన్ తన్మయాలోకితన్.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు, ఆంజనేయ శర్మ గార్ల పద్యాలు మనోజ్ఞంగా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 15. కనియెన్ రాముడు జింకను
  చనియెను వేటాడ దొరక జాలమి నొక కో
  లను వేసె వెంటనే యర
  చెనదియు హా లక్ష్మణుండ సీతా యనుచున్.

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న గారూ,
  చక్కని ఐతిహ్యంతో మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. సవరించినపూరణంగురువుగారికి వందనములతో
  2.కనియెన్ రాముండడవిన
  తనమంచిని గోరునట్టి తపసుల మదినే
  అనవరతముభక్తుడిగా
  మనుగడ సాగించు హనుమ మహిమాన్వితునిన్

  రిప్లయితొలగించండి
 18. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  కనియెన్ రాముడు = గాధి సూన ముని
  యాగ ధ్వ౦స దుష్కార్య. వ
  ర్తన యౌ తాటకి , భూరి శైల సమ తుల్య
  స్థూల దేహన్ , మహో
  గ్రను , ద౦ష్ట్రా యుత. రక్త సిక్త వదనన్ ,
  రక్తాక్షినిన్ , హూ౦కృతి
  ధ్వని స ౦వ్యాపిత దిగ్దిశా౦తను ,
  విరుద్ధ క్షుద్ర మాయావినిన్

  { సమ తుల్య = సరి సమాన మయిన ; ద౦ష్ట్రాయుత =కోరలచే ని౦డిన ; రక్తాక్షినిన్= ఎర్రని కనులు గలదానిని ;
  దక్ + దిశ + అ౦తను = దిగ్దిశా౦తను= ని౦డిన పది దిక్కులు గలదానిని ; }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పద్యం అత్యద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 19. కనియెన్ రాముడు రామతీర్థమున నాకర్షించగా శిల్పముల్
  మనసున్ జేరెడి మందిరంబులట|సామాన్యుండు నూహించగా
  ఘనమౌ శిల్పుల కల్పనా గతుల సాంగత్యంబు నాకర్షణల్|
  మనకోయాత్రగ పాత్రగానిలచె రామాయన్న దైవంబటన్.

  రిప్లయితొలగించండి
 20. ధన్మయవాదాలన్నయ్యగారూ మన్నించండి.దోషాలు తెలపండి సవరించుకొంటాను

  రిప్లయితొలగించండి
 21. కనియెన్ రాముడు హనుమను

  జనియెన్ హనుమంతువెంట సమ్బరమొప్పన్

  ఘన సుగ్రీవుని కోరెను

  జనకాత్మజ జాడ(దెలుపు సఖుడా యనుచున్.

  రిప్లయితొలగించండి
 22. అవును ఆచారిగారి పద్యం అత్యద్భుతం!

  రిప్లయితొలగించండి
 23. కనియెన్ రాముడు హైద్రబాదునను సాకారంబుగానున్న నా
  ఘనమౌ కూడలి చార్మినారునను చీకాకౌ కలాపమ్ములో
  కనులన్ విందగు రంగురంగులవి మేల్ గాజుల్ మహా చౌకగా...
  వనితల్ కోరగ తీసిచూడగను హా! పాకెట్టు చౌర్యమ్మయే :(

  రిప్లయితొలగించండి


 24. కనియెన్ రా ! ముడుకులపై
  వనితా మణి నొప్పి నంట వంగిన నడుమై
  గునగున నడవను శక్తియు
  కనకనలాడ సయి లేక కష్టపడెనుగా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. కనియెన్ రాముడు ప్రేతరూపమున భల్ కంగారుగా బాబునున్: 👇
  ధనమున్ తోడుత కోలుపోయి పదవిన్ దారిద్ర్యమున్ సైచుచున్
  పనియున్ లేకయె గోళ్ళు గిల్లుచును తా భారమ్ముగా చూచుచున్
  తనవారెల్లరు పారిపోవనిచటన్ తబ్బిబ్బుడై క్రుళ్ళగా!

  రిప్లయితొలగించండి