10, జనవరి 2016, ఆదివారం

సమస్య – 1910 (సత్కార్యంబుల ఫలమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

48 కామెంట్‌లు:

  1. సత్కారమందు టన్నది
    సత్కార్యంబుల ఫలమ్ము, సంతాపమ్ముల్
    చీత్కారమ్ములను కడు వి
    పత్కర స్థితికిన్ దురాశ ప్రథమమ్ముగదే.

    రిప్లయితొలగించండి
  2. సత్కవుల రచన లందున
    సత్కార్యంబుల ఫలమ్ము , సంతాపమ్ముల్
    నుత్కళ దేశము నందున
    నుత్కళి కావృత్త ములవి న్యూనత్వ మటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      పద్యం సలక్షణంగా ఉంది. భావమే కొద్దిగా గందరగోళంగా ఉంది.

      తొలగించండి
    2. గురువులకు ప్రణామములు
      గొప్ప గొప్ప కవుల రచనలకే సత్కారములు లభిస్తాయి ,ఏఉత్కళ లాంటి దేశములలో మనం కళికలు ,ఉత్కళికలు వ్రాసినా వారికి విలువ తెలియదు కదా ! అని నాఉద్దేశ్యము.పొరబడితే ఏముంది ? మన్నించడమే మరి.

      తొలగించండి
    3. హమ్మయ్య... ఇప్పుడు మీ భావం నాకు అవగతమైంది. ధన్యోస్మి!

      తొలగించండి
  3. ఛీత్కారమ్ములు కల్గు వి
    పత్కర గతి కూడివచ్చు పగటున చేయన్
    సత్కర్మలు నడుగంటును
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్.

    రిప్లయితొలగించండి
  4. తత్కాలంబున జని యా
    పత్కాలంబునను గావ పాపపు జీవిన్
    సత్కారంబయె నిందల
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్.

    రిప్లయితొలగించండి
  5. సాంబుడు తదితర యాదవులు మునీశ్వరుల యెడ జేసిన యపహాస్య ఫలితమే యాదవ వంశ నాశనము.

    సత్కర్మంబులె మేలు చ
    మత్కారము లేల సేయ మాన్యుల యెడల
    న్నుత్కంఠత నీ కించిద
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. సవరించిన నిన్నటి పద్యమొకసారి చూడండి అన్నయ్యగారూ

    రిప్లయితొలగించండి
  7. సత్కారభాగ్య సిరులవి
    సత్కార్యంబుల ఫలమ్ము,సంతాపమ్ముల్
    ఛీత్కారజనిత దుష్కృతి
    మత్కాంతా! ఆలకింపు మామక తలపున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. సత్కారభాగ్య సిరులవి
    సత్కార్యంబుల ఫలమ్ము,సంతాపమ్ముల్
    ఛీత్కారజనిత దుష్కృతి
    మత్కాంతా! ఆలకింపు మామక తలపున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. సత్కారములొందుటభువి
    సత్కార్యంబుల ఫలమ్ము,సంతాపంబుల్
    తత్కార్యంబులఫలితము
    సత్కులమునబుట్టునతడు సత్పురుషుడగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. సీతనపహరించిన అన్నగారితో విభీషణుడు

    సత్కర్మయె రావణ శివ
    సత్కారముబొందినట్టి సత్ఫలితము నా
    పత్కాలమునిష్ఫలమౌ
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్!!!

    రిప్లయితొలగించండి
  11. సత్కారంబులు కల్గును
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్
    సత్కార్య రహితులై యా
    పత్కర కార్యము లొనర్చ బాధలె మిగులున్.

    రిప్లయితొలగించండి
  12. చిత్కాంత పొందు కోరుచు
    తాత్కాలిక ప్రేమ నటన తప్పక చెరచున్
    తత్కాలమున జలిపిన య
    సత్కార్యమ్ముల ఫలమ్ము సంతాపమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. డా"రాధశ్రీ క్రమాలంకారం
    చిత్కవిత యనగ నేమిటి?
    ఉత్కంఠతరేపుమనకు నూరేమియిడున్
    సత్కవి వరుసగ జూడుము
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. రాధశ్రీ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొద్దిగా అన్వయలోపం ఉంది.

      తొలగించండి
  14. సత్కవుల రచన జదువక
    తత్కాలము నందుపనులు తగదనుకొనుటన్
    నుత్కంఠరేపుతదుపరి
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్.{ఆలస్యంఅమృతం విషముఅన్నభావన}

    రిప్లయితొలగించండి
  15. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఛీ యని పి౦చెడు , శుధ్ధిగా లేని పాత్ర లో వ౦ట చేయ. ప్రయత్న౦చిన. అది చక్కగా ను౦డునా ? అటులనే :-
    మనో నిశ్చయము పవిత్రము కానిచో
    సత్కార్యములు కూడ. దు : ఖ హేతువు లగును .
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    సత్ కృత. మగునే పా క ము
    ఛీత్ కృతి నిడు భా౦డ మ౦దు జేయ దొడగినన్ ?
    చిత్ కార. శుధ్ధి యు౦డక
    సత్ కార్య౦బుల ఫల౦బు స౦తాపమ్ముల్ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ీకృతము = చేయ బడినది ; సత్ కృత మగునే = చక్కగా చేయబడినది అగునే : ఛీత్ కృతి నిడు =
    ఛీ యని పి౦చెడు , శుధ్ధిగా లేని :
    కారము = నిశ్చయము. చిత్ కారము =
    మనో నిశ్చయము :

    రిప్లయితొలగించండి
  16. ఉత్కంఠ నిచ్చునుగదా
    సత్కార్యంబుల ఫలమ్ము ,సంతాపమ్ముల్
    ఛీత్కారములు గలిగనన్
    సత్కర్మల నాచరించ సబబగు ధరణిన్!!!

    రిప్లయితొలగించండి
  17. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఛీ యని పి౦చెడు , శుధ్ధిగా లేని పాత్ర లో వ౦ట చేయ. ప్రయత్న౦చిన. అది చక్కగా ను౦డునా ? అటులనే :-
    మనో నిశ్చయము పవిత్రము కానిచో
    సత్కార్యములు కూడ. దు : ఖ హేతువు లగును .
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    సత్ కృత. మగునే పా క ము
    ఛీత్ కృతి నిడు భా౦డ మ౦దు జేయ దొడగినన్ ?
    చిత్ కార. శుధ్ధి యు౦డక
    సత్ కార్య౦బుల ఫల౦బు స౦తాపమ్ముల్ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ీకృతము = చేయ బడినది ; సత్ కృత మగునే = చక్కగా చేయబడినది అగునే : ఛీత్ కృతి నిడు =
    ఛీ యని పి౦చెడు , శుధ్ధిగా లేని :
    కారము = నిశ్చయము. చిత్ కారము =
    మనో నిశ్చయము :

    రిప్లయితొలగించండి
  18. పుత్రుడు మరణించినపుడు భక్తరామదాసు ఆవేదన:

    సత్కృతమనిగుడిఁగట్టితి
    మత్కృతమౌ సేవలెల్ల మంచికికాదా?
    సత్కారమా సుతుఁగొనగ?
    సత్కార్యమ్ముల ఫలమ్ము సంతాపమ్ముల్!?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. మత్కుణము బోలు ఖలుడా
    పత్కాలమునందు సాయ పడగను కుట్టున్
    మత్కుణుడు భీష్ము జంపడె
    సత్కార్యమ్ముల ఫలమ్ము సంతాపమ్ముల్!?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ఛీత్కారమె కలియుగమున
    సత్కార్యంబుల ఫలమ్ము ; సంతాపమ్ముల్
    తత్కాలంబే యగుచు , వి
    పత్కాలంబు గడుచు ప్రాజ్ఞుల మెచ్చన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. '... గడుచుగద ప్రాజ్ఞులు...' అనండి.

      తొలగించండి
    2. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. '... గడుచుగద ప్రాజ్ఞులు...' అనండి.

      తొలగించండి
  21. గురువుగారికి, పెద్దలకూ నమస్కారం. సత్కారమందుతుందనుకుని శివపార్వతుల వివాహముకోసం మన్మధుడు శివుని దరిచేరితే సతృతుడు అనగా శివుడు క్షయము చేశాడు. కావున అతని సత్కార్యము యొక్క ఫలము సంతాపమైందన్న భావనలో రాశాను. తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదాలు.
    కం:
    సత్కారమందుననుకొని
    సత్కర్మగరపరతిపతిసర్గునిచేరెన్
    సత్కృతుడుక్షయముసలుపగ
    సత్కార్యంబులఫలమ్ముసంతాపమ్ముల్

    రిప్లయితొలగించండి
  22. ఉత్తర భారత పండాలు: 👇

    వెత్కుచు బేలల సొమ్ములు
    పిత్కుచు పీడించి...చనిన పితరుల ప్రీతిన్
    కిత్కిత లొందెడి హోతల
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్ :)

    రిప్లయితొలగించండి

  23. సత్కార్యమ్ముల చేసిన
    సత్కార్యంబులను నెంచ సద్గతి కలదోయ్
    సత్కారముకై చేసిన
    సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి