20, జనవరి 2016, బుధవారం

సమస్య – 1920 (కుంభకర్ణుండుఁ గర్ణుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుంభకర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట.

32 కామెంట్‌లు:

  1. చిన్న తనమున మిత్రులు చెన్ను గాను
    చదువు లందున నిరువురు సమ మటంచు
    కొలువు కూటము లందున కోరి కోరి
    కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట

    రిప్లయితొలగించండి
  2. శుభోదయం !

    యోగ నిదురన దయగ,పయోనిధిగను
    నీవె సత్యము; మేలుకొనేవు, ఉసురు
    దానముగ నీవు యివ్వగ దాత! గంటి
    కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట


    సావేజిత
    జిలేబి -(తేగీ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మేలుకొనేవు అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. కొనేవు+ఉసురు, నీవు+ఇవ్వగ అని విసంధిగా వ్రాసారు. మీ పద్యానికి నా సవరణ....

      యోగ నిదురన దయను పయోనిధిగను
      నీవె సత్యము; మేలుకొనెదవె యుసురు
      దానముగ నీవె యివ్వగ దాత! గంటి
      కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట

      తొలగించండి
  3. నాటకమ్ముల పోటీలు నడచు చుండ
    వరుసఁ బెట్టిరి వారిని పాల్గొనంగ
    వంతుకై వేచి చూచెడు పాత్రలైన
    కుంభకర్ణుండుఁ గర్ణుండుఁ గూడిరొకట!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. నిద్దురందున గొప్పలే " పెద్దవాడు "
    ఉన్నదిచ్చుటందు " చిన్నవాడు "
    మేటి యిద్దరు చూడగా నాటలందు
    కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. "ఉన్న దిచ్చుట యందున..." అనండి.

      తొలగించండి
    2. మాస్టరుగారూ ! ధన్యవాదములు....దోష సవరణతో..

      మొద్దునిద్దురనందున " పెద్దవాడు "
      ఉన్నదిచ్చెడి గుణమున " చిన్నవాడు "
      మేటి యిద్దరు చూడగా నాటలందు
      కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట

      తొలగించండి
  5. * గు రు మూ ర్తి ఆ చా రి *

    " ధరణి నాట్యమ౦డలి " వేష ధారు లైన

    చ౦దు , ప్రేమచ౦దులు మ౦చి సన్నిహితులు |

    కర్ణ పాత్ర నొకరు , కు౦భకర్ణ పాత్ర

    నొకరు పోషి౦ప. గలిగిన - యుత్తమ నటు

    లైన వీరు కన్పడ. జను ల౦దు రిటుల :---

    "" కు౦భ కర్ణుడు కర్ణుడు గూడి రొకట. ""


    ి

    రిప్లయితొలగించండి
  6. ఆరు మాసముల్ నిదురించు నగ్రియునకు
    సహజకవచ కుండలము లొసగు వరునకు
    బిరుదముల్ ప్రకటించెడి సురపతి సభ
    కుంభకర్ణుండు కర్ణుండు గూడి రొకట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. అస్త్ర శస్త్ర సంపన్నులు నలఘు బలులు
    నిద్ర కుంభ కర్ణారి యభద్ర గతిని
    శాపములు సూర్య సూనుని శత్రు తతులు
    కుంభకర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట.
    [ఇద్దరూ శాపగ్రస్తులే]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. అతిగ నిద్రించు వాడెవ్వ డంగ రాజె
    వండు? తెలుపుడి యజ్ఞాత వాసమందు
    తరలి రేలను పాండవుల్ విరటు గొలువు
    కుంభ కర్ణుండు, గర్ణుండు, గూడి రొకట.

    రిప్లయితొలగించండి
  9. ఆట లాడగ వచ్చియే యాప్తు లగుచు
    కుంభ కర్ణుండు కర్ణుండు గూ డిరొ కట
    యొకరి మించిన వారొక రుగనిరువురు
    కండ బలమును జూపించి కలయ పడిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  10. కవల లిద్దరు పరదేశ కాంక్షలందు
    వేరుబడిరిద్దరు –యుగాది వేడుకనగ
    ఊరుజేరిరి సంతోష మూరుచుండ
    కుంభ కర్ణుండు,గర్ణుడు గూడిరోకట|

    రిప్లయితొలగించండి
  11. అన్న త్రాగి తొంగొ ను చుండ ననవరతము
    తమ్ముడు సతతమున్ దాన దర్మములని
    నిడు ధనము, కాం చి యొకడనె నెకసెకెముగ
    కుంభకర్ణుండు కర్ణుండు గూడిరొకట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ధర్మము లని| యిడు ధనము...’ అనండి.

      తొలగించండి
  12. పంచ మాంకపు నాటకాల్నెంచి చూచి
    కలనుగంటిని పాత్రలు గలసిరాగ
    కుంభ కర్ణుండు,గర్ణుండు గూడి రొకట
    శకుని,రారాజు కృష్ణుని శాంత మందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నాటకా లెంచి చూచి’ అనండి.

      తొలగించండి
  13. పంచ మాంకపు నాటకాల్నెంచి చూచి
    కలనుగంటిని పాత్రలు గలసిరాగ
    కుంభ కర్ణుండు,గర్ణుండు గూడి రొకట
    శకుని,రారాజు కృష్ణుని శాంత మందు

    రిప్లయితొలగించండి
  14. ధర్మజునియన్న కర్ణుడు ధార్మికుండు,
    రావణానుజు డనికి విరాగియయ్యు,
    పోర గూలిరి; స్వర్గము చేరినంత
    కుంభకర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట.

    రిప్లయితొలగించండి
  15. నాటక సమాజ మందున నటన మాడు
    పాత్ర ధారులు పనిలేక పగటి వేళ
    శకుని శాంతనవుడు రామ శంకరులును
    కుంభ కర్ణుండు గర్ణుండు గూడిరొకట

    రిప్లయితొలగించండి
  16. అభినయమ్మునందున మేటు లైన యట్టి
    యన్న దమ్ములౌ నిర్వురి యందమైన
    మేటి నటనను జూచుచు మెచ్చు చనిరి
    కుంభకర్ణుండు కర్ణుడు గూడిరొకట.

    రిప్లయితొలగించండి