1, జనవరి 2016, శుక్రవారం

సమస్య – 1901 (క్రొత్త వత్సరమున... )

కవిమిత్రులారా,
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
క్రొత్త వత్సరమునఁ గోటివెతలు.

71 కామెంట్‌లు:

  1. శంకరాభరణ కవితా వేదికా నిర్మాణచణులు - కవిపండితులైన శ్రీ శంకరయ్య గారికి - ఇతరేతర కవి బృందానికి - ఆంగ్లమాన నూతన సంవత్సర శుభాకాంక్షలు.


    కాలగర్భమందు గతియించె నొక యేఁడు
    వచ్చెనిదిగొ నూత్న వత్సరమ్ము
    చేరుఁగాక సిరులు - తీరిపోవును గాక
    క్రొత్త వత్సరమునఁ గోటి వెతలు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. విష్ణునందన్ గారూ,
      సిరులు చేరి, వెతలు తీరాలని ఆశిస్తున్న మీ పూరణతో బ్లాగుకు నూత్నవత్సరపు శుభోదయం జరిగింది. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. చివరి పాదంలో క్రొత్త బదులు కొత్త అని పొరపాటు క్షమించాలి

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అన్నారు. ‘పూట పూట కరువు నీటికి...’ అందామా?

      తొలగించండి
    3. 1.
      ధరలు పెరిగి జనుల తలరాతనేమార్చె
      కరువు కాటకములు కలత బెంచె
      పూట పూట కరువు నీటికి వ్యధలాయె
      క్రొత్తవత్సరమున గోటి వెతలు

      2.
      స్వాగతించ కున్న నాగునా కాలమ్ము?
      బద్రత నిడు ననుచు భ్రమలవేల
      సాగరమును బోలు సంసారమందున
      క్రొత్త వత్సరమున గోటివెతలు

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భద్రత+ఒసగు’ అన్నచోట ‘భద్రత నొసగు’ అని వస్తుంది. ‘భద్రత నిడు ననుచు’ అనండి.

      తొలగించండి
  4. గురువులకు సోదర సోదరీ మణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
    ----------------------------------
    నిన్న లోన కలిసె మిన్నంటు వెతలన్ని
    వన్నె చిన్నె లన్ని వలస జేసి
    చిందు లేసి వచ్చె వందన ములటంచు
    క్రొత్త వత్స రమున గోటి వెతలు

    రిప్లయితొలగించండి
  5. బిల్లులాగిపోయె నొల్లక ప్రతిపక్ష
    మసహనంపు వాదు లధికమాయె
    వత్తిడాయె కేంద్ర ప్రభుతకు తప్పదు
    క్రొత్త వత్సరమునఁ గోటివెతలు.

    రిప్లయితొలగించండి
  6. నిధులు రానివాయె వ్యధలాయె కేంద్రంపు
    పట్టనట్టి తీరు బాధ రేపె
    దినముగడచు వీలు తెలియదు బాబుకు
    క్రొత్త వత్సరాన కోటివెతలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థితిగతులపై మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. అందరకూ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
    వచ్చె రెండువేల 'పదునారు' ప్రాయమ్ము
    యవ్వనమ్ము తిరిగి యంకురించ
    కలుములెన్నొగూర్చ బలిమి! కరగిపోవు
    క్రొత్త వత్సరమునఁ గోటి వెతలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. అన్నయ్యగారూ నమస్తే .మీకు మీకుటుంబసభ్యులకు నూతనసంవత్సర శుభాకాంక్షలు.
    శంకరాభరణంగ్రూప్ లో నేను వ్రాసిన పద్యాల సంఖ్య ఈపద్యముతో 500 చేరిందని సంతోషముతో తెలుపుకొనుచున్నాను.
    వచ్చె కొత్త యేడు పరుగుల తోడను
    తెచ్చె హరుష మెల్ల తెలుగు వారి
    కిలను ముదము కూర్చగలనటంచు,దీరు
    కొత్త వత్సరమున కోటి వెతలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. క్రొత్త వత్సరమునకోటి వెతలుదీరు
    ననుట యందు సంది యంబు వలదు
    ఈశ్వ రాను గ్రహము నెప్పుడు నుండును
    మనకు సామి! చింత మాను డిపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అనుగ్రహము’ అన్నపుడు ‘ను’ గురువై గణదోషం. ‘అనవరతము నీశ్వరానుగ్రహ మ్ముండు’ అందామా?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. (‘అనుగ్రహము’ విషయములో “ను” గురువే) అప్రస్తుతము గాదని యిక్కడ కొన్ని మినహాయింపులుదహరిస్తున్నాను. అద్రువ, విద్రువ, హరబ్రహ్మాదుల్ లలో రేఫాక్షరానికి పూర్వాక్షరాలైన “అ,వి, ర” లు లఘువులుగా పరిగణింప బడుతున్నాయి. అయితే రేఫము తేల్చి పలుకబడాలి. విశదీకరించ గోర్తాను.
      "ఆ. ...సెలఁగె సకలభువనవలయ మద్రువ." భార.ఆది.5,ఆ. 124.
      కం. ... లారయవర్ణింపలేరు హరబ్రహ్మాదుల్” భాగ. 11. 61

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      తెలుగు పదాలైన అద్రుచు, విద్రుచు మొదలైన పదాలలో ‘ద్రు’కు ముందున్న అక్షరాలు లఘువులే. రెండు సంస్కృత పదాలు సమసించినపుడు ఉత్తరపదాద్యక్షరం రకార సంయుక్తమైతే దాని ముందు పదం చివరి అక్షరం అవసరాన్ని బట్టి లఘువో, గురువో అవుతుంది. (ఉదా. దైవప్రార్థన - ఇక్కడ వ అవసరార్థం లఘువుగాను, గురువుగాను గ్రహింపబడుతుంది). కాని ‘అనుగ్రహము’ సమాసం కాదు. ఉపసర్గతో కూడిన పదం సమాసంగా గుర్తింపబడదు. కనుక ‘ను’ గురువే. అప్రస్తుతము, సువ్రతుడు మొదలైన పదాలలో అ,సు అనేవి ఉపసర్గలైనా రకార సంయుక్తాక్షారలకు పూర్వాక్షరాలు కనుక గురువులయ్యాయి. అలాగే అను అను ఉపసర్గ చేరిన అనుగ్రహములోని ను గురువే అవుతుంది.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణ కు ధన్యవాదములు. ‘అనుగ్రహము’ విషయములో నాకు సందేహము లేదు.

      తొలగించండి
  10. మిత్రులందఱకు నవ్యాంగ్లవత్సరాది శుభాకాంక్షలు!
    హాయిగ రెండువేల పదహా రిడు శాంతులు సౌఖ్యముల్ సిరుల్!!

    గతపు చేదు మనకుఁ గష్టాలఁ గల్గించె
    ననుచుఁ గుమిలి పోక; నడుము కట్టి
    పనులు చేయుచుండ వరుసగాఁ దొలఁగును

    క్రొత్త వత్సరమునఁ గోటివెతలు!

    రిప్లయితొలగించండి
  11. "మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !""

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారూ,
      ధన్యవాదాలు. మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

      తొలగించండి
  12. పూజ్య గురుదేవులకు, సుకవిమిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...


    కొత్త వత్సరమున గోటి వెతలుదీరి
    సకల జనుల కిడగ సంతసమును
    శాంతి సౌఖ్యమీయ సర్వభృతకునేడు
    వచ్చె నిదివొ నూత్న వత్సరమ్ము!!!

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమః

    గురువర్యులకు, కవి మిత్రులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    దేవదేవ నీదు దీవెనల నిడుచు
    క్రొత్త వత్సరమున కోటి వెతలు
    తొలగ జేయుమయ్య గొలతును భక్తితో
    లోక హితము గోరి యేక దంత

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. వత్సరమ్ము లెల్ల వచ్చును బోవును
    క్రొత్త వత్సరమునఁ గోటివెతలు
    పాత మేలనంగ పాడిగా దేరికిన్
    సత్కృషియ యొసంగు సత్ఫలములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు

      తొలగించండి
  16. గురువుగారు శ్రీ కందిశంకరయ్య గారికి కవిమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !!!

    క్రొత్తవత్సరమునఁగోటివెతలుపోయి
    కలిమిగలుగు కవుల చెలిమిపెరుగు
    పండుటాకురాల యెండునేవృక్షమ్ము
    చిగురుటాకు బుట్టు ప్రగతి కొరకు !!!

    రిప్లయితొలగించండి
  17. సిరుల నిచ్చి కాచు శ్రీరాము కరుణను
    క్రొత్త వత్సరాన కోటి వెతలు
    తొలగి పోయి మిగుల తుష్టిని గూర్చుచు
    ప్రజలు మనగ వలయు సుజనులగుచు!
    అందరకు నూతనాంగ్ల వత్సర శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  18. సిరుల నిచ్చి కాచు శ్రీరాము కరుణను
    క్రొత్త వత్సరాన కోటి వెతలు
    తొలగి పోయి మిగుల తుష్టిని గూర్చుచు
    ప్రజలు మనగ వలయు సుజనులగుచు!
    అందరకు నూతనాంగ్ల వత్సర శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. కాల చక్ర గమన జాల మందున జిక్కు
    మాన వాళి మనవు మారుచుండు
    క్రొత్త వత్సరమునఁ గోటి వెతలని బా
    ధపడ నేల సుఖము తరలి వచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. వెరపువీడి ఆత్మ విశ్వాసమున పోర
    కొత్త వత్సరమున కోటి వెతలు
    తొలగిపోయి ఎలమి కలుగును జనులలో
    యైకమత్యబలము నమరి యుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జనులలో నైకమత్యబలము...’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవుల సూచన మేరకు పద్యమును సవరించింతిని
      సవరించినపద్యము
      వెరపు వీడి ఆత్మ విశ్వాసమున పోర
      కొత్త వత్సరమున కోటి వెతలు
      తొలగిపోయి ఎలమి కలుగును జనులలో
      నైకమత్యబలము నమరి యుండు

      తొలగించండి
  21. క్రొత్త వత్సరమున గోటి వెతలు దీర్చి
    పెరుగు ధరలు తగ్గు వరము లొసగి
    సకల మానవాళి సంతస మందగ
    విశ్వ శాంతి నిమ్ము వేంకటేశ!!!

    రిప్లయితొలగించండి
  22. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { సమస్య పాద నిర్మాణ౦ మార౦ది పోనీ ీ
    భరత మాత స్తుతి గా స్వీకరి౦చ౦డి }

    * భ ర త మా త. స్తుతి *

    క్రొత్త వత్సర మ౦దున. కోటి వెతలు --
    బాపి , శతకోటి దివ్య శుభమ్ము లొసగి
    ఆయు రారోగ్య భోగ భాగ్యమ్ము లి చ్చి
    పౌరు ల౦దరిన్ బ్రోవుము భ ర త మాత ! ! ె


    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మిస్సన వలె కవిత చెప్పిన
    యస్సన వలె ; లేదయేని నట్టిటు వ్రాయన్
    లెస్సన వలెను పదౌచితి .
    మిస్సన వలె భావ పటిమ. మృగ్యము కాగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ, మిస్సన గారిపై పద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.
      సమస్యపాదాన్ని మార్చకుండా మీ భావంతో పూరణ చేయవచ్చు....
      క్రొత్త వత్సరమునఁ గోటి వెతలు బాపి
      దివ్యశుభము లిచ్చి కోరినన్ని
      భోగభాగ్యము లిడి బ్రోవుము దయతోడ
      పౌరజనుల నెల్ల భరతమాత!

      ‘మిస్సన’ పద్యంలో మొదటి, మూడవ పాదాలలో గణదోషం. ‘మిస్సనవలె కృతి సెప్పిన... లెస్సనవలె పదసంపద...’ అనండి.

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారూ! మీ అభిమానానికి ధన్యవాదాలు.
      కానీ మీ రనుకొనేటంతటి సత్తా నా దగ్గర లేదు.

      గురుమూర్తుల గురుకృపచే
      సరసంబౌ పూరణముల చకచక గురుశం
      కరులు తలనూచు సొగసౌ
      సరణిని ఆచారివర్య! సల్పరె తమరున్?

      యస్సని నా పూరణముల
      లెస్సగ మీరభినుతింప లేచెను మదిలో
      కస్సున గర్వము మునుపే
      మిస్సైతిని చూడ దాని మిత్రాచారీ!



      తొలగించండి
  23. వర్ష పాత మడగి పడిపోవ జలధార
    మంచి నీళ్ళ కరవు మించిపోయె
    నెండ లేమొ కరము మండిపోవుచునుండ
    క్రొత్త వత్సరమున గో టి వెతలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. క్రొత్త వ త్సరమున కోటివెతలు తీర
    వర్ష పాతమిమ్ము వరుణదేవ
    పులకరించ త నువు పుడమి తా నుప్పొంగి
    పసిడిపంటలనిడి వరలుగాత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ రెండవపూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘రావు+ఐకమత్య’ మని విసంధిగా వ్రాశారు. ‘...గోటి వెత లెక్కడి|వైకమత్యమందు...’ అనండి.

      తొలగించండి
  26. గురువర్యులకు కవిమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      ధన్యవాదాలు. మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

      తొలగించండి
  27. గురువర్యులకు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    తొడరు శాంతి సుఖము, తొలగి వెడలి పోవు
    క్రొత్త వత్సరమున గోటి వెతలు.
    మనిషి తీవ్రవాద మార్గంబు సడలించు
    శాంతి కామికులకు సౌఖ్య మమరు.

    క్రొత్త సంవత్సరములోని క్రొత్త ఆశ
    మహిళపై సాగు ఘోరాలు మానవలయు
    జగతిలో తీవ్రవాదపు సమర మణగి
    మానవత్వము నిండాలి మనిషిలోన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పి.యస్.ఆర్. మూర్తి గారూ,
      మీ పూరణ, దాని కొనసాగింపు పద్యం బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  28. కాలభ్రమణ మందు కదలియె తావచ్చె
    కాల మాన మునకు మైలు రాయి
    స్వాగతించినట్టి వత్సరాంబకు జూడ
    క్రొత్త వత్స రమున గోటి వెతలు

    రిప్లయితొలగించండి
  29. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    కనుమరుగవ జూసి కాలుష్యమంతయు
    స్వచ్ఛ భారతమును మెచ్చుకొనుచు
    మరల రాని రీతి తరలి పోవును గాత!
    క్రొత్త వత్సరమున కోటి వెతలు

    రిప్లయితొలగించండి
  30. గురువులు శ్రీ కందిశంకరయ్య గారికి, శ్రీ విష్ణునందన్ గారికి మరియునితర కవిమిత్రులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    శుభసంకల్పములున్ ప్రశాంతతయు సత్శోభావిహారంబులున్
    విభవంబున్ పరమేశ్వరార్చనమునన్విశ్వాసమున్ కీర్తియున్
    ప్రభవంబైన వచోవిలాసములు సంప్రాప్తంబుగా కోరెదన్
    శుభముల్ నూతనవత్సరంబు కురిపించున్ నిత్యమై మీయెడన్.

    పట్టుదల ఘటించి ప్రజ్ఞావిభూతులై
    వివిధ మార్గముల వివేచనమున
    విఘ్నములను బాప, వీక్షించు! తొలగునీ
    క్రొత్త వత్సరమునఁ గోటివెతలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పద్యం, దాని ననుసరించిన పూరణ రెండూ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  31. గురువర్యులు కంది శంకరయ్యగారికి మరియుకవివర్యులకునూతనసంవత్సరం
    శుభాకాంక్షలు.{పూరణందునారసింహ=గవర్నర్గారు.}చంద్రులు=ఇరురాష్ట్రాలమంత్రులు.సవరించినాపూరణ
    నారసింహ మందు నక్కిన చంద్రులు
    నార|సింహు|లుగనె వేరుబడిరి
    తెలుగు రాష్ట్ర మంత తేజంబునింపగ
    క్రొత్త వత్సరమున గోటివెతలు
    2.క్రొత్త వత్సరమున గోటివెతలెక్కడి
    వైకమత్య మందు నదురుబడక
    కష్ట నష్ట మైన నిష్టతో జేయగ
    సర్వసౌఖ్య మబ్బు సంతసాన.

    రిప్లయితొలగించండి
  32. శునకానందం:

    కొత్త నేత వచ్చె కొండలాయె గదర
    చెత్త కుప్పలన్ని చెల్ల చెదరి
    పండుగయ్యె మనకు పారిపోయె గదర
    క్రొత్త వత్సరమునఁ గోటివెతలు!

    రిప్లయితొలగించండి
  33. సీసము:-
    ఆఫీసు పనులలో నవినీతి లంచాలు!
    పేరుకు పోయిన పెంటకుప్ప
    పప్పు, ఉప్పులు, నూనె పలురకమ్ముల వంట
    దినుసులు కొన బోవ దిగులు నాయె!
    రోగాలతో జనుల్ రోదించు చుండిరి
    యార్తనాదాలతో నాసుపత్రి!
    అన్యాయమధికమై యంతట ప్రబలెను
    యంటు వ్యాధిని బోలి యవనియందు!
    .....
    ఆ. వె.
    బడుగు జీవులంత బ్రతుకుట భారమై,
    క్రొత్త వత్సరమున కోటి వెతలు
    రుచిని చూడవలదు, రుణబాధలును లేక
    సౌఖ్యజీవనమ్ము సాగవలయు!!

    రిప్లయితొలగించండి
  34. కాలమహిమ నేగె ,గడచినవర్షము
    మనుజ భావమేమి మారలేదు,
    వ్యధలునిండుమనసు ,వాసిగానుండునా
    కొత్తవత్సరమున ,కోటివెతలు

    రిప్లయితొలగించండి
  35. కాలమేగుచుండె ,కష్టాలుతొలగవు
    వృద్ధిబాటగనని ,బీదజనుల
    కింతసంతసమ్ము ,నీయరెవ్వరుకూడ
    కొత్తవత్సరమున ,కోటివెతలు

    రిప్లయితొలగించండి