30, జనవరి 2016, శనివారం

సమస్య – 1929 (అదిగో ద్వారక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అదిగో ద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ.
(ఇంకా జ్వరం తగ్గలేదు. మందులు వాడుతున్నాను. పద్యరచన శీర్షికను ఇవ్వలేకపోతున్నాను. మన్నించండి.)

48 కామెంట్‌లు:

  1. గురువు గారూ ఆరోగ్యము జాగ్రత్త

    (ద్వారక యని పేరుగల భార్యతో ఢిల్లీ చూడ వెళ్ళిన భర్త దూరంనుండి ఢిల్లీ నగరాన్ని చూపుతున్నట్టుగా నూహించిన పూరణము)


    సుదతిని గైకొని పతి రా
    జధాని గాంచెడు నెపమున జని దరిదాపున్
    ముదిత కు జూపుచు నగర
    మ్మదిగో ద్వారక యన , గననయ్యెను ఢీల్లీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      ధన్యవాదాలు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. శుభోదయం
    అదియేమి మాయ చేసెనొ
    నదిగో ద్వారక యనగన నయ్యెను ఢిల్లీ
    ఇది మోది మ్యాజికురా
    అది యమరావతి యనగన నయ్యెను ఢిల్లీ :)

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘చేసెనొ| యదిగో...’ అనండి. మూడవపాదంలో గణదోషం. (మోది మ్యాజికు... అన్నపుడు మ్యా వల్ల ది గురువైందనుకున్నారు. కాని కాదు) ‘ఇది మోదీ మ్యాజికురా’ అనండి.

      తొలగించండి

  3. ఇదియేమి చిత్రమో మరి
    అదిగోద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ
    నిదివిష్ణు మాయ గావున
    విదళించగ తరము గాదు వేవురు కైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఢిల్లీ| యిది విష్ణు...’ అనండి.

      తొలగించండి

    2. ఇదియేమి చిత్రమో మరి
      అదిగోద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ
      యిదివిష్ణు మాయ గావున
      విదళించగ తరము గాదు వేవురు కైనన్

      తొలగించండి
  4. విదితమ యయ్యెనె? నీకిది
    అదిగో ద్వారకయనగన నయ్యెను ఢిల్లీ
    వదినెను గూర్చియు పలికెను
    తుదిమెఱగులుచేయుచుండి తోమా లలతోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తోమా లలతోన్’...?

      తొలగించండి
  5. మాష్టారూ మీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటా పద్యరచన కోసం ఎదురు చూస్తున్నా

    రిప్లయితొలగించండి
  6. మాష్టారూ మీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటా పద్యరచన కోసం ఎదురు చూస్తున్నా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      ఇంకా జ్వరం తగ్గలేదు. పద్యరచన శీర్షికకు ఏదో ఒక అంశాన్ని ఇవ్వడం సులభమే. కాని మిత్రులు వ్రాసిన పద్యాలను చదివి, గుణదోష విచారణ చేయడమే ఈ అనారోగ్య పరిస్థితిలో ఇబ్బందిగా ఉంది. అందుకే ఇవ్వడం లేదు. ‘రోజు కొక్క సమస్య’ నియమభగం కాకూడనే ఓపిక తెచ్చుకొని సమస్యలు ఇస్తున్నాను. కొద్దిగా కోలుకోగానే పద్యరచన శీర్షికను ప్రారంభిస్తాను.

      తొలగించండి
  7. అదె "హస్తిన" యని బలుకగ
    కదలెడి రైలున ముదిత యొకతె కాదనగన్
    ముదమొన గూర్చగ "మీరా!"
    యదిగో "ద్వారక"యనఁ, గన నయ్యెను ఢిల్లీ.

    అదె "హస్తిన" యని బలుకగ
    కదలెడి రైలున ముదిత యొకతె కాదనగన్
    తదుపరి పుణ్య క్షేత్రం
    బదిగో ద్వారక,యనఁ,గన నయ్యెను ఢిల్లీ.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యారోగ్యము కుదుటపడినదని ఆశిస్తూ
    యదు వంశాంబుధి సోమ వ
    సుదేవ నందన పదాంబు జోల్లసిత విశే
    ష దురిత నిచయ విదారక
    మదిగో ద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు. ‘పద్యరచన’ శీర్షిక బ్లాగులో కనబడిందంటే నా ఆరోగ్యం బాగుపడిందన్నట్టు!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. వీలుచూచుకుని ఉత్తర దేశ యాత్రకు 'అదిగో ద్వారక' యను పేరుగల యాత్రా స్పెషల్ లో సంతోషంగా వెళ్లి వచ్చిన సతి పతితో :

    అదునిదె యుత్తర దేశము
    ముదమారగఁ జూచి వచ్చు పొందిక కుదిరెన్
    పద పోదము యాత్రా రథ
    'మదిదో ద్వారక' యన గన నయ్యెను ఢిల్లీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. పదిమంది కలసి యేగిరి
    సదమల దైవాంశ కలిత స్థలములజూడన్
    ముదమంది నొక్క ముదుసలి
    అదిగో ద్వారక యన గననయ్యెను ఢిల్లీ!

    రిప్లయితొలగించండి
  11. పదిమంది కలసి యేగిరి
    సదమల దైవాంశ కలిత స్థలములజూడన్
    ముదమంది నొక్క ముదుసలి
    అదిగో ద్వారక యన గననయ్యెను ఢిల్లీ!

    రిప్లయితొలగించండి
  12. కదలెనట రాజధానికి
    ముదమున నాటకసమాజ మొకటి ట్రెయినులో
    మొదలిడె నటుఁడు రిహార్సలు
    “నదిగో ద్వారక” యనఁ గననయ్యెను ఢిల్లీ.
    (అన్యదేశ్య ప్రయోగానికి క్షంతవ్యుణ్ణి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టరు గారూ ! మీ రిహార్సలు పద్యం అదిరింది.

      తొలగించండి
    2. హనుమచ్ఛాస్త్రి గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
    3. మిత్రులు శంకరయ్యగారూ!

      మీ పూరణము ప్రశస్తముగ నున్నది. ధన్యవాదములు!

      *****************

      మీకస్వస్థతగ నున్నటుల నీ బ్లాగునఁ జదివి చింతించితిని. మీకా భగవంతుఁడు సత్వరముగ నారోగ్యమునుం బ్రసాదింపవలెనని ప్రార్థించుచుంటిని.
      స్వస్తి.

      తొలగించండి
    4. గుండు మధుసూదన్ గారూ,
      ధన్యవాదాలు.
      నా పూరణలో తప్పనిసరియై నా కిష్టంలేని అఖండయతిని ప్రయోగించాను. అనారోగ్యబాధ కంటె అదే నన్ను బాధిస్తున్నది. (‘నా కిష్టంలేని’ అంటే నేను ప్రయోగించడానికి ఇష్టపడను అని భావం. ఇతరులు ప్రయోగిస్తే అభ్యంతరపెట్టను).

      తొలగించండి
    5. మధుసూదన్ మిత్రమా,
      ‘ఒదవున నాటకసమాజ మొకటి ట్రెయినులో’ అందామనుకున్నాను. ఒదవు శబ్దానికి కలుగు అని రూఢ్యర్థం. యుక్తమగు అనే అర్థం ఉన్నా అది ప్రసిద్ధం కాదు.
      ‘ముదమున నాటకసమాజము దగ ట్రెయినులో’ అనవచ్చు. కాని పద్యం నడక తడబడుతున్నది.
      అందుకే అఖండయతిని ఆశ్రయించాను.

      తొలగించండి

  13. ముదమున సుతులతొ పతితా
    సుదతిని వెంటన్ నిడుకొని సుందరములునై
    నవివిధ తావులు గన ననె
    నదిగో ద్వారక యన: గననయ్యెను ఢిల్లీ .

    ఇది యేమి చిత్రమయ్యెవి
    విధ ప్రాంతమ్ము ల జూడ విస్మయమయ్యెన్
    భవనములనుజూచివలికె
    నదిగో ద్వారక యన గననయ్యెను ఢిల్లీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘సుతులతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాశారు. ‘సుత్తులను’ అనండి. అలాగే ‘వెంట నిడుకొనుచు’ అనండి.

      తొలగించండి
  14. అదియొక కలననుకొందును
    అదిగో ద్వారక యనగన?నయ్యెను డిల్లీ
    కదలెడి మదిలో భావన
    నదిలించగనూహలన్ని అల్లినకళలే|
    2.చదువరులందరు యాత్రకు
    కదలెడి బస్సందు నిద్ర కౌగిలి జేరన్
    వదలని నిద్రన నొకడనె
    అదిగో ద్వారకయన గననయ్యెనుడిల్లీ|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘కల యనుకొందును’ అనండి.

      తొలగించండి
  15. ద్వారకను చూడాలని యాత్రాబస్సులో ఉత్తరదేశానికి పయనమైనవాడు నిర్వాహకుడిని “ద్వారక ఇంకా ఎప్పుడొస్తుంది?” అని అడుగుతుంటే వాడు అదిగో, ఇదిగో అంటున్నాడని భావం...

    వదలెను బస్సదె కాశీ
    “పద పద ద్వారకను చూడవలె”నన యొకఁ డొ
    ప్పిదముగను బలికె “నిదిగో
    యదిగో ద్వారక” యనఁ గననయ్యెను ఢిల్లీ.

    రిప్లయితొలగించండి
  16. అది కరినగరము[ఢిల్లీ],
    కదనమ్మున గెల్వ క్రీడి కన్నయ తోడున్
    మది గోరుచు, కీర్తించెను
    "యదిగో ద్వారక"యనఁ, గన నయ్యెను ఢిల్లీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. అది యిహసుఖముల ఢిల్లీ
    ఇది "ద్వారక"ముక్తి దాత యేది వలయునన్
    బెదరుచు నసిగెను జీవుడు
    "యదిగో--- ద్వారక” యనఁ గననయ్యెను ఢిల్లీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఏది వలె ననన్’ అనండి.

      తొలగించండి
  18. ఇదిగో! కాశీ నగరము
    అదిగో! ద్వారక యనఁ ,గననయ్యెను ఢిల్లీ
    కద, గను పటమున ముంబయి
    నదిగో! కాశ్మీరము గనుమయ్యా శిష్యా

    రిప్లయితొలగించండి
  19. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. ఇదిగో కాశీ యటంచు

    పదుగురు పలుకన్; ముదమున పజలే గుదురా?

    హైదరబాదుకు ఎట్లున్?

    అదిగో ద్వారకయన గననయ్యెను డిల్లీ.

    విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూలె రామమునిరెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. ఇదిగో చూపెదనని యా
    సదనము పైకెక్కి యింద్రజాలికుడొకడున్
    పదుగురి ముందర జూపుచు
    నదిగో ద్వారకయన గననయ్యెను డిల్లీ!

    రిప్లయితొలగించండి
  22. Political Yatras:


    పదరా గుజరాతునకన
    నదురుచు రాహులుడు సోమ నాథుని గొల్వన్...
    మదిలో మోడిని తలచుచు
    "నదిగో ద్వారక!" యనఁ గననయ్యెను ఢిల్లీ!

    రిప్లయితొలగించండి


  23. గదిలో కూర్చుని గూగులు
    ను దిప్పగ టకటక మారెను వరుసగ జిలే
    బి,దెసయటునిటు భళిభళీ
    యదిగో ద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. ముదమున ముచ్చట లాడుచు
    పదుగురు గుజరాతు స్త్రీలు పండుగ పూటన్
    మదిలో మోడిని తలచుచు
    నదిగో ద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ

    రిప్లయితొలగించండి