25, జనవరి 2016, సోమవారం

సమస్య – 1924 (తెలుఁ గదేల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తెలుఁ గదేల నీకుఁ దెలుఁగుబిడ్డ.

35 కామెంట్‌లు:

 1. గురువు గారికీ, కవిమిత్రులెల్లరులకు నమస్సుమాంజలులు.....

  1.
  అవని నేలు భాష ఆంగ్ల మొక్కటె యంచు
  దాన్ని పలుకువాడె ధన్యుడనుచు
  పారతంత్రు లైరి పరభాష మోజుతో
  తెలుగదేల నీకు దెలుగు బిడ్డ

  2.
  ప్రాణములను తల్లి పణముగా పెట్టుచున్
  పాప గన్న నేమి ఫలము తనకు
  అమెరికాకు బంప యమ్మకన్నదినిన్ను
  తెలుగదేల నీకు దెలుగు బిడ్డ

  3.
  అద్దె కిచ్చిరేమొ యాత్మాభి మానమ్ము
  పరుల భాష వెంట పరుగు దీయు
  అంధు లైన లోకులందురీ రీతిన
  తెలుగ దేల నీకు దెలుగు బిడ్డ

  4.
  మధుర మైన భాష మధుమేహ రోగికిన్
  బత్యమయ్యె నదియు బలుకదగదు
  తీయదనము లొలుకు తేనెలూరెడు భాష
  తెలుగదేలనీకు దెలుగు బిడ్డ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ‘దానిఁ బలుకువాఁడె’ అనండి.

   తొలగించండి

 2. అరవ మన్న నేమి ఆంగ్లభాష ఒరియ
  ఉరుదు కన్నడ యన ఉన్న చోట
  ఆ నగరు పలుకుల ఆకట్టుకొను; ఒక
  తెలుగదేల నీకు తెలుగు బిడ్డ !

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు. కాని సమస్య పరిష్కరింపబడలేదు.
   ‘కన్నతల్లి మరచి’ అనండి. లేకుంటే గణదోషం. ‘సాము+ఏల’ అన్నపుడు యడాగమం రాదు. ‘సాము లేల’ అనండి.

   తొలగించండి
  2. బ్రతుకు తెరువు కొఱకు పరదేశ మేగిన
   వీడ లేదు తెలుగు వెలుగు లచట
   పెక్కు భాష లందు ప్రేమజూపగ నొక్క
   తెలుఁ గదేల నీకు దెలుగు బిడ్డ

   తొలగించండి
  3. ఉన్న యూరు విడచి కన్నతల్లి మరచి
   నేల వదిలి సాము లేల మనకు
   నితర బాష లెన్నొ కౌతుకం బుననేర్వ
   తెలుఁ గదేల నీకుఁ దెలుఁగు బిడ్డ

   తొలగించండి
 4. తెలుగదేల నీకు తెలుగు బిడ్డ! యనిన
  సిగ్గు చేటు కాదె యెగ్గు కాదె
  కన్నతల్లి భాష కున్నగొప్పతనము
  తెలిసి నడచుకొన్న వెలుగు బ్రతుకు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. అక్షరములు కొన్ని యనవసరమ్మని
  "బరువ"ననుచు విడువ పలుకుటెట్లు
  తెలివిలేక నీకు "తేలిక"గా మారె
  తెలుఁ గదేల ? నీకుఁ దెలుఁగు బిడ్డ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అని +అనుచు'అన్నప్పుడు యడాగమం వస్తుంది. 'బరు వటంచు' అనండి.

   తొలగించండి
 6. అన్య భాష లందు నాదరమ్మును జూపి
  మాతృభాష పట్ల మమత వీడి
  తెలుగు మాటలాడ తలవంపుగానెంచు
  తెలుగఁదేల? నీకు తెలుగు బిడ్డ!!!

  రిప్లయితొలగించండి
 7. కోరి బంధుజనులు గూడి నీకుం బిల్ల
  నిత్తు రంటిరి గద చిత్త మలర
  కరుణ వీడి మదిని గఠినంబుగ దెలుపు
  తెలుఁగ దేల నీకుఁ దెలుఁగు బిడ్డ
  ఎలుగు=ధ్వని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. తెగులు సోకె నయ్య తెలుగుచెట్టుకు నేడు
  కాయలందు ఆంగ్ల కండ హెచ్చె
  తొక్క మెరుగు పెట్టి తుడుము కొట్టుకొనెడి
  తెలుగదేల నీకుఁ దెలుఁగు బిడ్డ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. ఆంగ్ల భాష చదివి యాం గ్ల దేశమునందు
  వాసముండి యకట భాష ణంబు
  తెలుగ దేల నీకు తెలుగు బిడ్డ !యికను
  నాం గ్ల భాష పలుకు ననవ రతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. ఆంగ్ల భాష నేర్చి యమెరికా చనినావు
  మంచి జీవితమ్ము నెంచి మదిని
  కూడు, గుడ్డ మరియు నీడనిడనియట్టి
  తెలుఁగదేలనీకుఁ దెలుఁగు బిడ్డ ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. భాషలెన్నొ వచ్చు వక్తవు నీవైన
  వేదికఁ గని బలుక విజ్ఙుడంద్రు
  సంకరమ్ము జేసి సంభాషణము దీర్చు
  తెలుఁ గదేల నీకుఁ దెలుఁగు బిడ్డ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. ఆంగ్లమందు పెరిగె నభిలాష మెండుగ
  తెలుగదేల నీకు తెలుగు బిడ్డ
  యనుచు తల్లి తానె యడ్డుపడుచు నుండ
  తెలుగదెట్లు వచ్చు తెలుగు బాల ?
  2.తెలుగు భాషకొచ్చె తెగులటంచుచునుండ
  తెలుగదేల నీకు తెలుగు బిడ్డ
  అన్య భాష నేర్చి ఆర్జనా పరుడవై
  మంచి పేరు నిలను గాంచవయ్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘ఒచ్చె’ అనడం గ్రామ్యం. ‘తెలుగు కేగుదెంచె’ అనండి.

   తొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. అమెరికందుచదువు ఆంగ్లమ్ములోనుండ?
  తెలుగదేల నీకు దెలుగుబిడ్డ
  దేశ మొదలి పెట్టి దీక్షగ చదివినా?
  మాతృభాషమమత మరువ దగదు.

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. తెలుగదేలనీకు ?దెలుగు బిడ్డవు గాన
  ఆలికంటెను వెలయాలు మేల?
  అన్య భాష కంటె నధికమే మనభాష
  మాతృభాష,మాత మమత సమత|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ‘వదలిపెట్టి’ని ‘ఒదిలిపెట్టి’ అన్నారు. ‘దేశము విడనాడి...’ అనండి.

   తొలగించండి
 17. అన్యదేశ మేగి ఆంగ్ల భాషను నేర్పు
  కొలువు జేరి నట్టి తెలుగు వాడ
  మాతృభాష నీవు మరువకున్న నచట
  ​తెలు గదేల నీకు దెలుగు బిడ్డ​!

  రిప్లయితొలగించండి
 18. డాక్టర్ మూలె రామమునిరెడ్డి గారి పూరణలు.....

  తెలుగు భాష తెలిపె తెలుగు జాతి విలువ
  తెలుగు భాష తీపి తెలుప దరమె?
  తెలుగ దేల నీకు తెలుగు బిడ్డ యనుట
  దారుణంబు కాదె ధరణి లోన.

  పక్షి జాతి పలికె పక్షుల భాషనే
  పసులు నేర్చె చూడు పసుల బాస
  తెలుగు వాడు మరచే తేనె లూరెడు భాష
  ఇంతకన్న వింత ఇలను గలదె!

  డాక్టర్ మూలె రామమునిరెడ్డి
  జిల్లా అధ్యక్షులు,
  తెలుగు భాషా సంరక్షణ సమితి,
  కడప శాఖ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మూలె రామమునిరెడ్డి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి