జిలేబీ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కనుడు’ అని ప్రారంభించండి. వాక్యప్రారంభంలో సరళాదేశానికి కాని, గసడదవాదేశానికి కాని అవకాశం లేదు. ‘శుద్ధ ఔషధము’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ వృద్ధిసంధి తప్పక జరగాలి కదా! ‘శుద్దౌషధము గాగ’ అనండి.
మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ తన తొలిప్రయత్నంగా గడ్డి పూవు అనే పేరుతో ఒక కవితా సంకలనాన్ని ప్రచురించింది. దాని వెల 20 రూపాయలు. ఒక విమర్శకుడు ఆ ధర ఎక్కువ అని అభిప్రాయపడ్డాడు. ఆ నేపథ్యంలో ఈ సమస్యకు నా పూరణ:
కొడిహళ్ళి మురళీమోహన్ గారూ, పూరణకు మీ నేపథ్యం చక్కగా సరిపోయింది. సమయోచితమైన పూరణ. నిజం చెప్పాలంటే ఈనాటి పూరణలలో మీది ఉత్తమంగా ఉంది. అభినందనలు. (ఈ సమస్యను సూచించిన పోచిరాజు వారికి మీ సంకలనం, దాని ధర తెలియదనే నా నమ్మకం).
గురువు గారికి కవి కవయిత్రి మిత్రులకు నమస్కారములు
రిప్లయితొలగించండివన్నె లెన్ని యున్న వాడిపొకున్నను
కాగితంబు పూల కన్న జూడ
భ్రమర ములను పిలుచు సుమములై విరిసెడు
గడ్డిపూల విలువ కడు బ్రియమ్ము.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భృంగ ములకు విందు పుష్కలం బుగనిచ్చు
రిప్లయితొలగించండిసొగసు లీను విరుల చొక్కు కంటె
తనదు లోక మందు తనరుచు పెరిగెడి
గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశుభోదయం ->
రిప్లయితొలగించండిగనుడు నేటి కాలమున కనిబెట్టి నా
రు మరి గడ్డి పూవు రుచిగ నుండు
శుచిగ దాని నూనె శుద్ధ ఔషధముగ
గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కనుడు’ అని ప్రారంభించండి. వాక్యప్రారంభంలో సరళాదేశానికి కాని, గసడదవాదేశానికి కాని అవకాశం లేదు. ‘శుద్ధ ఔషధము’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ వృద్ధిసంధి తప్పక జరగాలి కదా! ‘శుద్దౌషధము గాగ’ అనండి.
ఊనికని బట్టి కడుప్రియము లో డు గురువు అవుతుంది కదా! వివరించమని మనవి.
రిప్లయితొలగించండి‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
తొలగించండిఅవకాశం లేదు. ‘కడు’ తెలుగుపదం. ప్రియము సంస్కృతం. అక్కడ ఊనికకు తావే లేదు.
పలు రకముల పూల పండుగ బతుకమ్మ
రిప్లయితొలగించండితెలుగు నాట జరుగు దివ్యముగను
భక్తి తోడ బేర్చు బతుకమ్మ వేడ్కకు
గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సృష్టి లోన ప్రతిది సింగార మైతోచు
రిప్లయితొలగించండిచూచు దృష్టి తోడఁ జూచినంత
సుమము లన్నిటందు సొగసుండునని నమ్మ
గడ్డి పూవు విలువ కడుఁ బ్రియమ్ము!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మబోగ నవియె నడవిగా "దోచును "
రిప్లయితొలగించండిరైతుకేమి ఫలము చేత బడదు
కొనగ బోగ నవియె కొరివిగా గనబడె
గడ్డి, పూవు విలువ కడుఁ బ్రియమ్ము.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చూడబోకు దేని చులకనగానీవు
రిప్లయితొలగించండిప్రకృతిలోని వన్ని పరమ హితము
ను కలిగించు నిజము నూనెనొసగు చున్న
గడ్డి పూవు విలువ కడుఁబ్రియము.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నదిక్. అభినందనలు.
దొడ్డి లోన నున్న దొడ్డపూవుల నడ్డు
రిప్లయితొలగించండిజడ్డు లేక గోసి గడ్డి పూలు
కొండచూలి బిడ్డ నండకై కొలువగ
గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము.
(గడ్డిపూవు విలువ దొడ్డ సుమ్ము)
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బంతి మొదలు గాగ బరగుపూవు లులభి
రిప్లయితొలగించండియించు ,దొరకవెచట యీయ లరులు
అంద చంద ములను నందించు పూవగు
గడ్డి పూవు విలువ కడుప్రి యమ్ము
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూవు లెన్నొగలవు పూజలొనర్చంగ
రిప్లయితొలగించండివేల్పు లెందరున్న విఘ్నములకు
గణపతి యొకడతని ఘనముగా పూజించ
గడ్డిపూవు విలువ కడు ప్రియమ్ము
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సౌరభములు జల్లి చంచరీకములకు
రిప్లయితొలగించండివిందు జేయు చుండు విరులకన్న
పుడమిని వెలిగింప పొలుపుగావిరబూయు
గడ్డిపూల విలువ కడు బ్రియమ్ము!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పట్టణ పడతు లంత బతుకమ్మ కొరకంచు
రిప్లయితొలగించండిగునుగు పూల నేమొ కొనగ దలచి
నగరమందు దిరుగ నారికోరినయట్టి
గడ్డి పూవు విలువ కడు బ్రియమ్ము
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘పట్టణపు పడతులు...’ అనండి.
మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ తన తొలిప్రయత్నంగా గడ్డి పూవు అనే పేరుతో ఒక కవితా సంకలనాన్ని ప్రచురించింది. దాని వెల 20 రూపాయలు. ఒక విమర్శకుడు ఆ ధర ఎక్కువ అని అభిప్రాయపడ్డాడు. ఆ నేపథ్యంలో ఈ సమస్యకు నా పూరణ:
రిప్లయితొలగించండిగడ్డిపూవు యనెడి కవితల పొత్తము
సరసమైన ధరకు దొరుకుచుండ
పలుకనగునె యిట్లు పాడియే? ఎక్కడి
గడ్డిపూవు విలువ కడు బ్రియమ్ము?
కొడిహళ్ళి మురళీమోహన్ గారూ,
తొలగించండిపూరణకు మీ నేపథ్యం చక్కగా సరిపోయింది. సమయోచితమైన పూరణ. నిజం చెప్పాలంటే ఈనాటి పూరణలలో మీది ఉత్తమంగా ఉంది. అభినందనలు.
(ఈ సమస్యను సూచించిన పోచిరాజు వారికి మీ సంకలనం, దాని ధర తెలియదనే నా నమ్మకం).
సమస్య శరణమన్న విఘ్నరాజు శాంతమందజేయగా
రిప్లయితొలగించండిపురములందు పండుగనుచు పువ్వులన్ని ధరలతో
మెరియుచున్న?భక్తజనులు మిమ్ము గొల్వ కుందురా?
గరిక,గడ్డిపూవువిలువ కడు బ్రియమ్ముజూడగా|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ ఛందోవైవిధ్యంతో చక్కగా ఉంది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ ఈశ్వరప్ప గారికి ధన్య వాదములు !
మనోఙ్ఞ మైన పూరణ మ౦ది౦చారు ! !
కఱవు పీడనమున , గాధల వింటమి,
రిప్లయితొలగించండికాయ గూర లేక గరిక వండి
యతివ యొసగి దీర్చె నతిధికి క్షుద్బాధ
గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము.
ఆ.వె. కాగితంపు పూల కలదా సువాసన?
రిప్లయితొలగించండిరంగు లెన్ని యున్న హంగు లున్న
ప్రకృతి యొసగు పూలె పరిమళించునుగదా!
గడ్డి పూవు విలువ కడు ప్రియమ్ము.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.