25, జనవరి 2016, సోమవారం

పద్యరచన - 1157

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

46 కామెంట్‌లు:

  1. సిరులు కొలువ లేని శ్రీవారి భారమున్
    తులసి దళమొ కటియె తూ చె నపుడు
    కృష్ణ లీల లిలన కీర్తింప వశమౌనె
    భక్తి నిసరి తూ చు భాగ్యమేది?

    రిప్లయితొలగించండి
  2. భక్తి కన్న మిన్న భాగ్యమ్ము లేదంచు
    జగతి చాట దలచె సత్య ప్రియుడు
    కపట నాటకమ్ము కడురమ్య మయ్యెను
    తులసి దళపు టెత్తు తూ గె కడకు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘లీల లిలను’ అనండి.
      ‘సత్యాప్రియుడు’ అనాలి. ‘జగతిఁ జాటఁ దలఁచె నగధరుండు’ అనండి.

      తొలగించండి
  3. గర్వము గలిగిన వారలు
    సర్వము గోల్పోవు నంట సహనము లేక
    న్నుర్విని భక్తిగ గొలిచిన
    సర్వుని గెలువంగ వచ్చు సౌదా మినియై
    ------------------------------
    సత్య దలచెను ధనమంత చక్క బెట్టి
    పతిని తూచగ కొదవేల వెతను బడగ
    దైవ లీలలు తెలియక తనరు మదిని
    సవతి గెలువంగ భక్తిని సన్ను తించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  4. శుభోదయం

    పేటిక నిండుగ నగలా
    మేటి ? తులసియాకు ఒకటి మేలౌ చూడన్
    సాటి మరి నీకు ఎవ్వరు ?
    పాటిగ కృష్ణా సతులును పాడుదురు గనన్

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    ధవునిఁ గొనుగోలు సేయు పాత్రను ధరించి,
    తనదు పతినప్డు సత్యయే తపసి పాత్ర
    యందిడెఁ! దిరిగి కొన నపహాస్య పాత్ర
    యయ్యె! రుక్మిణి, యిడి పత్ర, మతనిఁ గొనియె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. తులలేని సిరులుగల భ
    క్తులలోనే యహమెయున్న దొరకడు బరువౌ
    తులలేని భక్తికే హరి
    తులసీ దళమిడినదూగు దూచగ పరువౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. విలువైన నిధులకన్నను
    వెలలేనిది భక్తి యనుచు విశ్వకు చాటన్
    తులసీదళమ్మునుంచగ
    తులదూగెను వెన్నదొంగ తుష్టుండగుచున్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'పృథివికి జాటన్ ' అనండి.

      తొలగించండి
  8. భక్తి మిన్న యనుట పరమస త్యమనియు
    తులసి దళపు మొగ్గు దెలియ పరచె
    సత్య దలపు లన్ని సత్యదూ రములని
    తెలియ జేసె గృష్ణు తెలివి గాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘కృష్ణు’ అని డుప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘తెలియజేసెను హరి తెలివిగాను’ అనండి.

      తొలగించండి
  9. అహమది గలిగిన తూగడు
    మహనీయుఁడు కృష్ణుడంచు మగువకు దెలియన్
    సహనవతి రుక్మిణర్పిం
    చ హరి తులసికైనఁ దూగె సత్యము దెలియన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘రుక్మిణి+అర్పించ’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘సహనవతి రుక్మిణియె యుం|చ...’ అందామా?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
      అహమది గలిగిన తూగడు
      మహనీయుఁడు కృష్ణుడంచు మగువకు దెలియన్
      సహనవతి రుక్మిణియె యుం
      చ హరి తులసికైనఁ దూగె సత్యము దెలియన్

      తొలగించండి
  10. బంగరు నగలఁదూచి తా భంగపడగ
    సత్య, రుక్మిణి శారిని సన్నుతించి
    తులసి దళమును వేయగ, తూగి తృప్తి
    నజుడు భక్తికి దాసుడ నంచు తెలిపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘శౌరి’ టైపాటువల్ల ‘శారి’ అయింది.

      తొలగించండి
  11. 1భక్తి కితడు లొంగు భాగ్యములకుగాదు
    యనుచు ఋజువు చేయ హరియు తాను
    తూగె త్రాసునందు తులసీ దళంబుచే
    పరమ కారుణికుడు భక్త ప్రేమి/భాగ్య దాత.

    2రహిని తనమాట జవదాట రాదటంచు
    పతిని దానమివ్వ దలచె సతియు సత్య
    కలహ భోజనుండు కవ్వించు చుండగ
    నగల నెన్నొ నిడియె:నవ్వె స్వామి.
    3సిరుల లొంగ బోను యరయు డయ్య నునట్లు
    సత్య యిడిన నగలు చాలలేదు
    పడతి రుక్మి డిడిన భారరహితమైన
    తులసి దళములకును తూగె శౌరి.
    4.సిరిపతిని కొనగ దలచుచు
    పరిపరివిధముల నగలను వరుసగ నిడగా
    హరికవి చాలక పోగా
    లక్ష్మి యిడిన యాతులసిదళముతో తూగెన్.
    5.కలహాసను మాటలువిని
    లలనామణి కొనగ దలచె లక్ష్మీ ధవునిన్
    విలువైన నగల గాదని
    తులసీ దళములకును సరి దూగెను హరియున్.
    6.నారదముని యచట నాటకంబు నడప
    సతియు సత్య యమ్మె పతిని యపుడె
    నగలు తూచలేని మగని రుక్మిణి తుల
    లేని తులసి దళము లిచ్చి గొనియె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘...గాదు+అనుచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘గా ద|టంచు...’ అనండి.
      రెండవపద్యంలో మొదటి రెండు పాదాలు తేటగీతి కాగా, తరువాతి రెండు పాదాలు ఆటవెలది.
      మూడవపద్యంలో ‘లొంగబోను+అరయుడు’ అన్నపుడు యడాగమం రాదు. ‘సిరుల కేను లొంగ నరయు...’ అనండి.
      నాల్గవపద్యం చివరిపాదంలో ప్రాస తప్పింది.
      ఆరవపద్యంలో ‘పతిని నపుడె’ అనండి.

      తొలగించండి
  12. శ్రీ కృష్ణ తులాభారము
    శ్రీకృష్ణుని నాటకంబె –సిరిసంపదచే
    ఆకృతి యిహమగు సత్యపు
    స్వీకృతి కాదనుచుదెలుపు చిత్రంబిదియే.

    రిప్లయితొలగించండి
  13. బత్తికి వశ్యుం డతడా
    సత్తిని జూపడు సిరులకు శంకను విడుమా
    పత్తిరితో తృప్తి పడి ని
    వృత్తి నొసగ నేర్తు భక్త బృందము కెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘బృందముకు’ అనరాదు. ‘బృందమ్మునకున్’ అందామా?

      తొలగించండి
  14. సత్య భామ పెట్టి తూచ సకల నగలు త్రాచులో
    కృత్య మంత వ్యర్థమాయె కేశవుడిని తూచగా
    సత్య భామ బాధ నెరిగి సతి గుణవతి రుక్మిణీ
    యత్యమల, తులసి దళము లపుడు వేయ తూగెనే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. సకల భువన భాండమ్ముల
    నకళం కోదర విలీన నలిన దలాక్షున్
    ప్రకటమ్ముగ( దూచె దళము
    వికసిత వదనారవింద వీక్షింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  16. .తలచగ భక్తి శక్తి కిట దక్షత జూపెను కృష్ణ మాయచే
    వలచిన సత్యభామయె సువర్ణపు టన్నులువేసి తూచినా?
    కలవర మందెగాని-తన కాంక్షయు దీరక నున్న వేళలో
    తులసి దళాలకే బరువు దూగెను కృష్ణుడు యెంత వింతయో|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘తూచినన్... కృష్ణు డదెంత వింతయో’ అనండి. (కృష్ణుడు+ఎంత=కృష్ణుడెంత).

      తొలగించండి
  17. గురుమూర్తి ఆచారి గారి పద్యములు....
    రు క్మి ణి :-
    భక్తి తత్పరనై నేను ప్రత్యహమ్ము
    తావక. చరణ పద్మముల్ తలతు నేని
    తులసి దళమే నిను౦ దూచ గలుగు గాక
    తులము దిగిరమ్ము మాకు స౦తోష మిమ్ము.

    నా ర దు డు :-
    దేవదేవ! పర౦ధామ! దివ్యతేజ!
    కృష్ణ! ని౦ దూచు ధన మేది సృష్టి లోన
    జగము న౦దున గల యెల్ల జనుల కీవు
    భక్తవశుడ వను నిజము వ్యక్త మయ్యె.

    సత్యభామ :-
    సామాన్య౦ బగు మానవు౦ డనెడు దుస్స౦కల్ప చేతస్క నై
    నీ మాహాత్య్మ మెరు౦గనైతి| నను మన్ని౦పన్ గదే పాహి మా౦|
    స్వామీ! యో జగదేక నాధ! మిగులన్ స్వార్థమ్ముతో నీపయిన్
    ప్రేమన్ "నాధుడ వీవు నాకె" యనుచున్ నేనె౦చితిన్ మూర్ఖతన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పద్యాలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. ధన్యవాదాలన్నయ్యగారూ.సవరించిన పద్యాలనోసారి దయచేసి చూడండి.

    1భక్తి కితడు లొంగు భాగ్యములకుగాద
    టంచు ఋజువు చేయ హరియు తాను
    తూగె త్రాసునందు తులసీ దళంబుచే
    పరమ కారుణికుడు భక్త ప్రేమి/భాగ్య దాత.

    2రహిని తనదు మాట జవదాట రాదంచు
    పతిని దాన మొసగ సతియు దలచె
    కలహ భోజనుండు కవ్వించు చుండగ
    నగల తోడ తూచ నవ్వె స్వామి.

    3సిరుల కేను లొంగ నరయు డయ్య నునట్లు
    సత్య యిడిన నగలు చాలలేదు
    పడతి రుక్మి డిడిన భారరహితమైన
    తులసి దళములకును తూగె శౌరి.

    4.సిరిపతిని కొనగ దలచుచు
    పరిపరివిధముల నగలను వరుసగ నిడగా
    హరికవి చాలక పోగా
    లక్ష్మి యిడిన యాతులసిదళముతో తూగెన్.
    'ల' కు 'ళ'కు యతి కుదురుతుందనుకొన్నానండీ.
    లక్ష్మియి/డినయా/తులసిద/ళముతో/తూగెన్.

    5.కలహాసను మాటలువిని
    లలనామణి కొనగ దలచె లక్ష్మీ ధవునిన్
    విలువైన నగల గాదని
    తులసీ దళములకును సరి దూగెను హరియున్.

    6.నారదముని యచట నాటకంబు నడప
    సతియు సత్య యమ్మె పతిని యపుడె
    నగలు తూచలేని మగని రుక్మిణి తుల
    లేని తులసి దళము లిచ్చి గొనియె.

    రిప్లయితొలగించండి
  19. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    సవరించిన పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవపద్యం మొదటిపాదంలో యతి తప్పింది.
    మూడవపద్యంలో ‘పడతి రుక్మిణి యిడు’ అనండి (దీనిని ఇంతకు ముందు గమనించలేదు).
    నాలుగవపద్యంలో పై మూడు పాదాలలో ప్రాసాక్షరం ‘ర’, కాని నాల్గవపాదంలో ‘క్ష్మి’ అయింది. ఆ పాదంలో యతికి దోషం లేదు. ప్రాస తప్పింది.

    రిప్లయితొలగించండి

  20. పద్యరచన
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రు క్మి ణి =
    ……………


    భక్తి తత్పరనై నేను ప్రత్యహమ్ము
    తావక. చరణ పద్మముల్ తలతు నేని
    తులసి దళమే నిను౦ దూచ గలుగు గాక
    తులము దిగిరమ్ము మాకు స౦తోష మిమ్ము



    నా ర దు డు =
    ……................


    దేవదేవ. ! పర౦ధామ. ! దివ్యతేజ. ! కృష్ణ. ! ని౦ దూచు ధన మేది సృష్టి లోన
    జగము న౦దున. గల యెల్ల జనుల , కీవు భక్త వశుడ వను నిజము వ్యక్త మయ్యె

    స. త్య. భా. మ . =
    ……………………

    సామాన్య౦ బగు మానవు౦ డనెడు
    దుస్స౦కల్ప చేతస్క నై


    నీ మాహాత్య్మ మెరు౦గ నైతి | నను
    మన్ని౦పన్ గదే పాహి మా౦. |


    స్వామీ ! యో జగదేక నాధ ! మిగులన్
    స్వార్థమ్ముతో ••• నీపయిన్


    ప్రేమన్ ••• " నాధుడ వీవు నాకె " యనుచున్ నేనె౦చితిన్ మూర్ఖతన్




    ె ్
    పద్యరచన
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రు క్మి ణి =
    ……………


    భక్తి తత్పరనై నేను ప్రత్యహమ్ము
    తావక. చరణ పద్మముల్ తలతు నేని
    తులసి దళమే నిను౦ దూచ గలుగు గాక
    తులము దిగిరమ్ము మాకు స౦తోష మిమ్ము



    నా ర దు డు =
    ……................


    దేవదేవ. ! పర౦ధామ. ! దివ్యతేజ. . కృష్ణ. ! ని౦ దూచు ధన మేది సృష్టి లోన
    జగము న౦దున. గల యెల్ల జనుల , కీవు భక్త వశుడ వను నిజము వ్యక్త మయ్యె

    స. త్య. భా. మ . =
    ……………………

    సామాన్య౦ బగు మానవు౦ డనెడు
    దుస్స౦కల్ప చేతస్క నై
    నీ మాహాత్య్మ మెరు౦గ నైతి | నను
    మన్ని౦పన్ గదే పాహి మా౦. |
    స్వామీ ! యో జగదేక నాధ ! మిగులన్
    స్వార్థమ్ముతో ••• నీపయిన్
    ప్రేమన్ ••• " నాధుడ వీవు నాకె " యనుచున్ నేనె౦చితిన్ మూర్ఖతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పద్యాలు రెండుసార్లు వచ్చాయని, పాదాలమధ్య ఎడం వల్ల ఎక్కువ స్థలం ఆక్రమించిందని నిన్ననే ఎడిట్ చేసి ప్రకటించి వ్యాఖ్యానించాను. మీరు చూడలేదనుకుంటాను. ఒకసారి పైకి వెళ్ళి చూడండి.

      తొలగించండి
  21. సతుల జగడ మందు సామి నలిగిపోయె

    సతుల పోరు నణచ సామి పూనె

    అంతరంగ మందు అహమున ణచమనె

    అదియె గొప్ప భక్తీ అవని పైన

    డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
  22. కలహ భోజనుండు కలహాలు సృష్టించి

    నిప్పు పెట్ట గలడు నిక్కముగను

    నారద ముని నమ్మ నగుబాట్లు తప్పునా?

    ఏయుగమ్ము నైన నెవరి కైన?

    విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
  23. తండ్రి యాస్తి నంత తాకట్టు పెట్టగ

    స్వామి దక్కు ననుచు భామ దలచె

    పన్న గమును పన్నె పన్నగ శయనుండు

    భామ గర్వమంత బ్రద్ద లయ్యె.

    విద్వాన్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

    రిప్లయితొలగించండి
  24. సత్య భామ నాడు సామిని తలదన్నె

    సతులు తనకు రారు సాటి యనుచు

    సొగసు లోనె కాదు సొమ్మునందైనను

    ఇప్పుడర్థ మయ్యె ఇంతి కకట!

    విద్వాన్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విద్యాన్ మూలె రామముని రెడ్డి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. కం.
    పత్రము, పుష్పము ఫలములు
    చిత్రంబుగతోయమిడిన, శ్రీహరివశుడౌ
    ఆత్రంబునధనమీయగ
    పాత్రతనీకబ్బదయ్య పరమాత్మకడన్

    రిప్లయితొలగించండి
  26. తే.గీ.
    కనకరాశుల తోతూచ, కాంతసత్య
    సరిగసరితూచలేకను, పరితపించె
    తులసిదళమున రుక్మిణి తూచెనంత
    భక్తిభావాన, పరమాత్మ, వశుడుగాదె

    రిప్లయితొలగించండి
  27. ఆ. వె.
    మగని పొందగోరి మగువలు నిద్దరు
    త్రాసు నందు తూచ తలచిరంత
    నటన సూత్రధారి నవనీత చోరుడు
    నంగనాచి వోలె నగుచునుండె
    .......
    సత్యభామ దెచ్చె సకలాభరణములు
    ధనము సంచులెన్నొ దండి గాను
    త్రాసు నందుపెట్ట తక్కువగానుండె
    తరుణి మనసు చాల తల్లడిల్లె
    ......
    తే. గీ.
    రాణి రుక్మిణీ దేవియు ప్రాణవిభుని
    చరణకమలమ్ములకు మ్రొక్కి స్మరణ జేసి
    తులసి దళములు వేసియు తూచుచుండ
    లేచె కృష్ణయ్య పైపైకి లీల గాను !

    రిప్లయితొలగించండి