13, జనవరి 2016, బుధవారం

పద్యరచన - 1146

కవిమిత్రులారా,
“కలఁ డందురు...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ దైవపరంగా కాకుండా పద్యాన్ని పూర్తి చేయండి. 
దీనిని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

50 కామెంట్‌లు:

  1. (దావూద్ ఇబ్రహీం కోసం వెతుకుతున్న ఒక పోలీస్ స్వగతం)
    కలఁ డందురు లండనులో
    కలడందురు పాకు లోనె కచ్చితమనుచున్
    కలడందురు షార్జాలో
    కలవడె దావూదు భాయి కలలోనైన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. కలడందురు సామాన్యుల
    కలనెరవేర్చెడు ప్రభువుయె గద్దియ పై నన్
    కలలో తేలెడు దొరలకు
    నిలలో పేదలు గను కల లెవ్విధి తెలియున్ .

    రిప్లయితొలగించండి
  3. కలఁ డందురు కాంతలతో
    కలనైనను విడువ నట్టి కాంతా లోలున్
    బిలచిన బలుకగ నేరడు
    వలచిన ప్రియురాలి మించు బహుమతి గలదే ?

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  5. శుభోదయం

    కలడందరుగా జిల్లా
    కలక్ట రు యన వెడినాను కైనటి క్హోం
    డ లగాయతుగా ;తెలిసే
    కలక్టరు తిరుపతికి చనె కన వెంకన్నా :)


    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      ‘కలెక్టరు యన వెడినాను’ అర్థం కాలేదు. ‘కైనటిక్ హోం’ అన్నదగ్గర గణదోషం. ‘తెలిసే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  6. కలఁ డందురు జనహృదయ
    మ్ములలో మన ముఖ్యమంత్రి భూరిఫలము లి
    మ్ములఁ గూర్చు నవ్యపథక
    మ్ముల నెన్నొ ప్రవేశపెట్టె ముద మలరారన్.

    రిప్లయితొలగించండి
  7. కలడందురు కోహిలనుచు
    నిలమెచ్చిన కేప్తెనొకడు క్రికెటను క్రీడన్
    కలరెందరెందరో గద
    గెలిపించెడుపటిమగల్ల క్రీడా కారుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘పటిమ గలుగు’ అనండి.

      తొలగించండి
    2. కలడందురు కోహిలనుచు
      నిలమెచ్చిన కేప్తెనొకడు క్రికెటను క్రీడన్ 
      కలరెందరెందరో గద
      గెలిపించెడుపటిమగలుగు క్రీడా కారుల్

      తొలగించండి
  8. కలడందురు దీనులయెడ
    నలుగురు మెచ్చిన నటుడగు నాగార్జునయే
    గెలిచెను జనహృదయమ్ముల
    నిల కోటీశ్వరుడు బెట్టి యిమ్మహిలోనన్!!!

    రిప్లయితొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { బ్యా౦క్ మేనేజరు మొ౦డి బాకీ దారుని
    కుటు౦బ సభ్యులతో అన్న మాటలు }
    ........................................................

    కలడ౦దురు - లేడ౦దురు
    కలడో , లేడో ఋణమును కట్టని యెడలన్
    పొల మేలము వేతుము , నను
    కలియు డని తెలుపు డతనికి కనిపి౦చగనే

    { ఏలము = వేలము }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పద్యం మనోరంజకంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  10. కలడందురురావణుడిల
    కలడందురులంకలోన కనుమరుగగుచున్
    కలడా నిజముగ నార్యా?
    కలగంటిన యిపుడనేను ? గలవరపాటా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. తనకు సాయము చేస్తానని చెప్పి ముఖము చాటు వేసిన స్నేహితుని వెదకు సందర్భము.

    కలఁ డందురు గృహమందున
    కలఁ డందురు బొలము నందొక పరి పురమునన్
    కలడందురు వేరొక పరి
    కలడు కలండెనిడి వాడు కలడో లేడో !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. తప్పి పోయిన తన కుమారుని గూర్చితల్లి ఆందోళన --
    ------""""""--------""""""---
    కలడందురు నా కొమరుడు
    పొలమందున గుట్టలందు మూలల యందున్
    కలిసిన చోటును జూపిన
    ఫలముగ నా భాగ్యమిత్తు వెలయెంతైనన్ !

    రిప్లయితొలగించండి
  13. తప్పి పోయిన తన కుమారుని గూర్చితల్లి ఆందోళన --
    ------""""""--------""""""---
    కలడందురు నా కొమరుడు
    పొలమందున గుట్టలందు మూలల యందున్
    కలిసిన చోటును జూపిన
    ఫలముగ నా భాగ్యమిత్తు వెలయెంతైనన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. ప ద్య ర చ న

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గు రు దే వు ల పా ద. ప ద్మ ము ల కు

    * వ ౦ ద న ము లు *

    కే వ ల ము మీ ఆ శీ ర్వా ద. బ ల ము

    వ ల న నే నే ను ప ద్య ర చ న. చే య

    గ లు గు చు న్నా ను . న. మ. స్తే

    రిప్లయితొలగించండి
  15. కలడందురు హిమపర్వత
    ములను ఘనుడగు మనబోసు మునివేషములో
    కలడో లేడో,నిజముగ
    కలడు ప్రజల మనసులందు కమనీయముగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. పద్యరచన కలడందురు గాంధీజీ
    నిలువగ హృదయాల యందు నేటికి నైనన్
    విలువగు శాంతి ప్రదాతగ
    కలనైన మహాత్ము డేగ కలిలో,నిలలో|


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మహాత్ముడె గద...’ అనండి.

      తొలగించండి
  17. 1.కలడందురు దీనుల యెడ
    నిలలోనొకపుణ్య మూర్తి యెప్పటినుండో
    కలతలు బాపుచు జనముల
    కిలకిల మనినవ్వునట్లు కేకలు వేయున్.

    2.కలడందురు చిననాటనె
    జలమున మునిగిన సఖుండు జగతిని యనగన్
    బలమెంతయొ పెరిగినటుల
    కలవరమంతయు తొలగెను కౌతుకమయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యంలో ‘...యెప్పటినుండో’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
      రెండవ పద్యంలో ‘జగతి ననంగన్’ అనండి.

      తొలగించండి
  18. కలఁ డందురు నను వలచియు
    కలలో కనిపించినట్టి కడు సుందరుడున్
    వలపులు దోచిన వానిని
    వలవేసియు పట్టుకొందు వదలను సుమ్మీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. కలడందురు నున్మాదిట
    పలుకకనే సూది గ్రుచ్చి పరుగులు బెట్టే
    చలిత మనస్కుడు దొరుకడ?
    కలుషాత్ముని బట్టలేర?గడచెను నెలలే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      సమకాలిక విషయంతో పద్యం వ్రాశారు. బాగుంది. అభినందనలు.
      ‘ఉన్మాది+ఇట’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘కలడందురు వెఱ్ఱి యిచట’ అనండి. ‘పరుగులు బెట్టీ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘పరులుగు బెట్టున్’ అనండి.

      తొలగించండి
  20. కలడ౦దురు వెన్నెలలో
    కలడ౦దురు నవ వస౦త కాంక్షల లోనన్
    కలడ౦దురు చెలి కౌగిలి
    కలడు కల౦డనెడి వాడు కవి భావన లో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. కలడందురు మంత్రి మనకు
    కలలో కన్ పించు నెన్ని కలలో దొరకున్
    కలికమునకైన పిదపను
    కలియడు జనతతుల నసలు కలడో లేడో.

    రిప్లయితొలగించండి

  22. కలడందురు పద్యములన్
    తొలిసారిగ వ్రాయనెంచి తులకించెడు వా
    రలలో 'జిలేబి' మొదలుగ
    పలువురికిని శంకరయ్య'బ్లాగున గురువై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. కలడందురు కనిపించడు
    గలగలమని మాటలాడు గగనవిహారుం
    డిలనంత తిరుగు చుండును
    బలహీనులగోడు వినుట బావ్యము మోడీ !!!

    రిప్లయితొలగించండి
  24. kaladanduru gurudevulu

    talidandrulavale manasula nepudun

    nilichen daivamu volen

    alasata deerchedu talliga nanisamu pudamin.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూలె రామముని రెడ్డి గారి పూరణ....

      కలఁ డందురు గురుదేవులు
      తలిదండ్రులవలె మనసుల నెపుడున్
      నిలిచెన్ దైవము వోలెన్
      అలసట దీర్చెడు తల్లిగ ననిశము పుడమిన్.

      తొలగించండి
    2. డా. మూలె రామముని రెడ్డి గారూ,
      మీ పద్యం బాగుంది.
      కాని రెండవపాదంలో ఒకగణం తప్పిపోయింది. ‘వోలెన్ అలసట’ అని విసంధిగా వ్రాశారు. నాల్గవపాదంలో జగణ, నలము లుండవలసిన చోట ‘తల్లిగ’ అని భగణం వేశారు.
      సవరించండి.

      తొలగించండి
  25. కలఁ డందురు తిరుపతిలో
    కలడందురు పలమనేరు కవితా గోష్ఠిన్
    కలడోయ్ తన కవిమిత్రుల
    కలవరమౌ నుల్లములను కందివరుడిలన్!

    రిప్లయితొలగించండి


  26. కలఁ డందురుడీశుని తా
    కలడో లేడో తెలియదు కలయో నిజమో
    తెలియదు తెలిసీ తెలియని
    కులంభరుడగుచు హృదయపు కుహురము దోచెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. కలఁ డందురు బ్యాంకాకున
    కలడందురు లండనందు కలవడు ఫోనున్
    కలవర మొందుచు మదినిన్
    విలపించగ సోనియమ్మ విలవిల దిల్లిన్

    రిప్లయితొలగించండి