12, జనవరి 2016, మంగళవారం

పద్యరచన - 1145

కవిమిత్రులారా,
“చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ మీకు తోచిన అంశంపై పద్యాన్ని పూర్తి చేయండి. 
దీనిని పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

  1. చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు మున్
    చేసిన గాని తప్పులని జెప్పుట కైనను వీలుగావునన్
    చేసిన వైన తప్పులును చేయుట మానక తప్పదేమిటో
    చేసిన వాటియందునని చిత్తములో తలపంగ తేలికౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు మున్
      చేసిన గాని తప్పులని జెప్పుట కైనను వీలుగావునన్
      చేసిన వైన తప్పులును చేయుట మానక తప్పదేమిటో
      చేసిన వాటియందునని చిత్తములో తలపంగ మేలదౌ

      తొలగించండి
    2. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  2. చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు తా
    జేసిన పాపముల్ గడకు జీవిత మంతయు భీతిచెం దకన్
    దోసమటంచు నిప్పుడిక దు:ఖము నొందక మార్గ మెంచుచో
    వాసవు పాదముల్ గనిన పావన మైమది మోక్షమొం దునే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ప్రాసకోసం ఇంద్రుని పాదాలు పట్టినట్టునట్టున్నారు!

      తొలగించండి
    2. పాపం ఆప్ద్భాంధవుడు కదా { కిట్టించడానికి ]

      తొలగించండి
  3. “చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు కా
    జేసిన మంది సొమ్ములను జేర్చుము వేంకట శౌరి హుండికిన్
    దోసములన్నిదొల్గు మరి దుఃఖము చేరదు చెంత కెప్పుడున్
    మోసము పాప కార్యములు పూర్తిగ మాని తరించు మానవా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘ప్రయోజనంబు+ఓ’ అన్నపుడు యడాగమం రాదు. ‘ప్రయోజనం బయో (అయ్యో రూపాంతరం)’ అనండి. ‘తెల్యదే’ అనరాదు. ‘ధూర్తుల లక్షణ మం చెరుంగవే’ అందామా?

      తొలగించండి
    2. చేసిన వన్నితప్పులని చింతిల నేమి ప్రయోజనంబయో
      కాసులపైన మోజుపడి కానిపనుల్ తలపెట్టినప్పుడీ
      దోషము లన్ తలంచుటయు ధూర్తుల లక్షణమంచెరుంగవే
      చేసిన తప్పులన్ని సరి జేసిన జాలుమహోన్నతుండవై


      సవరించిన పద్యము

      తొలగించండి
  5. చేసినవన్నితప్పులనిచింతిలనేమిప్రయోజనంబుమున్
    జేసినవాటినిత్తరినిజేయకనుంటనుమేలుగావుతన్
    చేసినతప్పులన్నికనుజేయకయుండుమునాదుసోదరా!
    వాసిగమేలుసేయునికపార్వతినాధుడెయెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. చేసినవన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు దా
    జేసిన కర్మలన్నిటినిఁ జిత్తము నందుఁ బరిష్కరింపగన్
    గాసిలి యత్నమించుక విఘాతమునేర్పడ కుండు నట్టులన్
    రోసము వీడి చేసిన నరుండు నొకింత విముక్తు డయ్యెడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఒ క అ భా గ్యు డు జీ వి త భ్ర ష్టు డు

    ఆ త్మ ని ౦ ద. చే సు కు ౦ టూ

    త న లో తా ను బా ధ ప డు ట
    ...........................................................

    చేసిన వన్ని తప్పులని చి౦తిల నేమి ప్రయోజన౦బు :- వి
    శ్వాసము లేక శీలవతి c బత్నిని నిర్దయ జ౦పుకొ౦టి | వే
    శ్యా సహవాస లాలసుడనై కల.యాస్తిని కాల్చితిన్|దుర
    భ్యాసములన్ జరి౦చితిని | వ్యాధుల జిక్కితి|బిచ్చగాడినై
    " పైసలు " దాన మిమ్మనితి|పస్తుల. ను౦టిని | యెల్లవారు న
    న్నీసడ మ౦దుచున్ దరుమ నిట్టుల దొర్లితి * వీధి రోగినై * |
    వాసి గలట్టి యి౦ట ప్రభవ౦బును గా౦చియు, విద్య యు౦డియున్
    జేసితి నిన్ని తప్పుల నిసీ ! యిక.నా యటు వ౦టి వారి నో
    యీ సరసీజజు౦డ ! సృజి యి౦పకు చేతుల నెత్తి మ్రొక్కెదన్







    రిప్లయితొలగించండి
  8. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఒ క అ భా గ్యు డు జీ వి త భ్ర ష్టు డు

    ఆ త్మ ని ౦ ద. చే సు కు ౦ టూ

    త న లో తా ను బా ధ ప డు ట
    ...........................................................

    చేసిన వన్ని తప్పులని చి౦తిల నేమి ప్రయోజన౦బు :- వి
    శ్వాసము లేక శీలవతి c బత్నిని నిర్దయ జ౦పుకొ౦టి | వే
    శ్యా సహవాస లాలసుడనై కల.యాస్తిని కాల్చితిన్|దుర
    భ్యాసములన్ జరి౦చితిని | వ్యాధుల జిక్కితి|బిచ్చగాడినై
    " పైసలు " దాన మిమ్మనితి|పస్తుల. ను౦టిని | యెల్లవారు న
    న్నీసడ మ౦దుచున్ దరుమ నిట్టుల దొర్లితి * వీధి రోగినై * |
    వాసి గలట్టి యి౦ట ప్రభవ౦బును గా౦చియు, విద్య యు౦డియున్
    జేసితి నిన్ని తప్పుల నిసీ ! యిక.నా యటు వ౦టి వారి నో
    యీ సరసీజజు౦డ ! సృజి యి౦పకు చేతుల నెత్తి మ్రొక్కెదన్







    రిప్లయితొలగించండి
  9. చేసినవన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు?మీ
    ధ్యాస పరోపకార సముదాయము నందునలేక,ఆశయే
    శ్వాసగ నెంచి ధర్మమగు సంగతులైనను వీడి వాడు వి
    శ్వాసము లెన్ని నాళ్ళు మనజాలదు|దైవము నెంచు మానవా.


    రిప్లయితొలగించండి
  10. చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనమ్ము నే
    వేసిన ధర్మ మార్గమును వీడి చరించితి వాకతాయివై
    మోసపుబుద్ధితోడుతను పోవు దురాత్ముని నిశ్చయంబుగా
    చేసిన పాపకార్యములు చేర్చును కాలుని లోకమందునన్
    మాసుతుడంచు తెల్ప పదిమందికి మిక్కిలి సిగ్గుగల్గెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. చేసిన వన్ని తప్పులని చి౦తిల నేమి ప్రయోజన౦బు రా
    ఆ సృజియించు వాడు నుదుటన్ రచియించిన వ్రాతలే కదా
    గాసిని జెందబోకు మొక గైరికు డ౦దగ లేద మోక్షమున్
    నీసరి లేడు రామ యని నిష్టను బూని లిఖియించి కావ్యమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో యతి తప్పింది. చివరిపాదంలో ‘లిఖియించి’ అంటే గణదోషం. ‘లిఖించె’ అంటే సరి.

      తొలగించండి
  12. చేసిన వన్ని తప్పులని చి౦తిల నేమి ప్రయోజన౦బు రా
    ఆ సృజియించు వాడు నుదుటన్ రచియించిన వ్రాతలే కదా
    గాసిని జెందబోకు మొక గైరికు డ౦దగ లేద మోక్షమున్
    నీసరి లేడు రామ యని నిష్టను బూని లిఖియించి కావ్యమున్

    రిప్లయితొలగించండి
  13. (ఒక ఉగ్రవాది పశ్చాత్తాపంతో)
    చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు నే
    కాసుల కోసమై కరడుగట్టిన రాక్షస యుగ్రవాదినై
    వేసిన బాంబులే చిదిమివేసె కుటుంబములెన్నియోకదా
    తీసిన ప్రాణముల్ మరల తీసుకు రాగల వాడనే యికన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘రాక్షస ఉగ్రవాది’ అని సమాసం చేస్తే అక్కడ గుణసంధి వస్తుంది. ‘రాక్షస’ సంబోధనమైతే ...యుగ్రవాదివై...రాగలవాడవే... అనవలసి వస్తుంది.

      తొలగించండి
    2. మాష్టారూ...సవరించిన పద్యం
      చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు నే
      కాసుల కోసమై కరడుగట్టిన క్రూరతరోగ్రవాదినై
      వేసిన బాంబులే చిదిమివేసె కుటుంబములెన్నియోకదా
      తీసిన ప్రాణముల్ మరల తీసుకు రాగల వాడనే యికన్

      తొలగించండి
    3. సూర్యనారాయణ గారూ,
      మీ సవరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు తా
    చేసిన తప్పులన్ మరల చేయక నుంట ప్రశంస పాత్ర మౌ
    చేసెద నన్నమంచిపని చెందుగదా కలివేళ పుణ్యముల్
    చేసిన నిశ్చయంబుగను శ్రేయము గూర్చును మానవాళికిన్ !!!




    రిప్లయితొలగించండి
  15. విద్యాభ్యాసము చేసే తనయునితో తండ్రి:

    చేసినవన్ని తప్పులని చింతిలనేమి ప్రయోజనంబు? నీ
    ధ్యాస పరీక్షలందునిడి యాత్రము వీడుచు నిప్పుడైన నా
    వ్రాసెడు వాటినైన కడు బాధ్యత తోడను వ్రాయనెంచుమా!
    మూసిన వాకిలుల్ దెఱచు మోదక ప్రీతుడు నమ్మి గొల్చినన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  16. గురుదేవులకు వందనములు మీసూచనమేరకు పద్యమును సవరించితిని
    చేసిన వన్ని తప్పులని చి౦తిల నేమి ప్రయోజన౦బు రా
    ఆ సృజియించు వాడు ముఖ మందు రచి౦చిన వ్రాతలే కదా
    గాసిని జెందబోకు మొక గైరికు డ౦దగ లేద మోక్షమున్
    నీసరి లేడు రామ యని నిష్టను బూని లిఖి౦చి కావ్యమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      నా సూచనలను పాటించి పద్యాన్ని సవరించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  17. చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు లే
    ద్మాసిన బట్టల న్నుతికి మైలను తీయుచు మడ్తబెట్ట వ
    చ్మాసిన గడ్డము న్గొరిగి మందులు పూయుచు రంగులద్ద వ
    చ్చేసిన తప్పుల న్తిరిగి చేయక నుండుట కష్టసాధ్యమౌ :)

    రిప్లయితొలగించండి


  18. చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు, కా
    మేశుని మాట యిద్ది విను మేలును గాంచ జిలేబి యా సదా
    యీశుని నామ మున్ మదిని నిండుగ కొల్చుచు నీదు‌ కార్యమున్
    చేసిన తప్పదెట్లగును చేసెడు వాడు సదాశివుండవన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబురా!
    కూసిన కూతలన్ తిరిగి కుందుచు గైకొని కాళ్ళుబట్టురా!
    దాసును మోడికంచు వడి దండిగ మ్రొక్కుచు నోరుమూయురా!
    మాసిన గుడ్డలన్ తొడిగి మమ్మిని చేకొని పారు రాహులా!

    రిప్లయితొలగించండి