15, జనవరి 2016, శుక్రవారం

పద్యరచన - 1148

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. గగన మందున విహరించు గాలిపటము
    దారపు నియంత్రణము లేని తరుణ మందు
    హద్దు లెరుగని నరుని పే రాశ విధము
    నేల రాలుట తథ్యమ్ము నీతి యిదియె.

    రిప్లయితొలగించండి
  2. రంగు వలయాల గిరికీలు నింగి పైన
    ద్యుమణి వలపు వెలుగున ద్యూత మందు
    వొంపు సొంపుల నృత్యాల నూయ లూగి
    చెట్టు కొమ్మల కౌగిట చిక్క బోకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. ‘ఒంపు’ను ‘వొంపు’ అన్నారు. ‘వలపుల వెలుగున ద్యూత మందు| నొంపు సొంపుల...’ అనండి.

      తొలగించండి
    2. రంగు వలయాల గిరికీలు నింగి పైన
      ద్యుమణి వలపుల వెలుగున ద్యూత మందు
      నొంపు సొంపుల నృత్యాల నూయ లూగి
      చెట్టు కొమ్మల కౌగిట చిక్క బోకు

      తొలగించండి
  3. గాలి పటము అదియె గాలియం దెగురును
    చూడు చూడు చెల్లి చూడు దాని
    సొంపు మనము కూడ సొంతము గయెగుర
    వేయ సంకు రాత్రి వేళ కూడ

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘పటము+అదియె=పట మదియె’ అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. ‘గాలిపటము చెలగి గాలియం దెగురును’ అందామా?

      తొలగించండి
  4. మాస్టరుగారికి, కవిమిత్రులు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


    సీసము:
    హరిహరియనుచును హరిదాసు మేల్కొలుప
    చెత్తగాలుచుమ ముంచెత్త శోభ
    రథము మ్రుగ్గిడి మనోరథము దీరుచుకొమ్ము
    ఇళ్ళముంగిటను గొబ్బిళ్ళ బెట్టి
    పొంగమది తినుమ పొంగలీ పులగమ్ము
    లరిసెగారెల రుచులరసి నీవు
    బాలల తల దలంబ్రాలుగా పోయుము
    రేగుపండ్ల మిగుల రేగ కాంతి

    ఆటవెలది:
    గంగిరెద్దులాట ముంగిటనే జూచి
    గాలికెగురవేసి గాలిపటము
    భోగి సంకురాత్రి భోగముల్ గనుమింక
    తెనుగునాట పరుల మనసు నాట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
      ‘మేల్కొల్ప’ అనండి. లేదంటే గణదోషం.

      తొలగించండి
  5. బాలు రక్కడ ముద్దుగా పాణి యందు
    గాలి పటముల దారము గట్టి గాను
    బట్టు కొనుచును నొక గాలి పటము నెగుర
    వేయు చుండిరి చక్కగా విజయ ! చూడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. సౌధాగ్రంబుల నుండక
    శోధించి విశాల హరిత సుక్షేత్రములన్
    సాధించి యెగుర వేసిరి
    మాధురి గాలి పటము సుకుమారులు ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. గాలికెగిరి సాగు కాగితమ్మేదయా?
    గాలిపటము! చెల్లి కాంచవమ్మ!
    చదువులెన్నొ జదివి సాధించ లక్ష్యమ్ము
    స్ఫూర్తిఁ బొందవమ్మ చూచి దాని!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. అందమైన గాలిపటము అందలాన్ని
    తాకదలచి యెగురుచుండె, దారమనెడు
    బంధమేమొ నిలువరింటు వైన మదియు
    నేల విడిచి సాము తగదు నీతి యిదియె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘పటము అందలాన్ని’ అని విసంధిగా వ్రాశారు. ‘అందమగు గాలిపటము తా నందలమును’ అనండి.

      తొలగించండి
  9. కందిశంకరులకు కవిబందుగులకు
    పద్యమాలికలల్లెడు పండితులకు
    బ్లాగు వీక్షించి దీవించు ప్రాజ్ఞు లకును
    శాంతి సౌఖ్యమ్ము లొసగు సంక్రాంతి లక్ష్మి !!!

    రిప్లయితొలగించండి
  10. గాలి పటానివైన తగు గాలియు లేకను నేలనుండుటే|
    బాలుని యూహలట్లుగను పంతము నందున పైకి వెళ్ళుచున్
    తేలికయందె నాడుచు విధేయత జూపుచు బాలచేష్టకున్
    కాలముబుచ్చు సమ్మతికి కాదనునా?మనసంకు రాత్రియున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘సంకురాతిరిన్’ అనండి.

      తొలగించండి
  11. 1.గగన మందు యెగురుగాలి పటము చూడు
    పైకి పైకి యెగిరి పరుగు దీయు
    సాగుచుందురాడ సకల జనమ్ములు
    సంకురాత్రియన్న సంబరమ్మె.

    2.రంగు కాగితముల రమణీయముగ కూర్చి
    శీఘ్రముగను చేసి చిన్న వారు
    గాలిపటములను గంభీరముగ జేసి
    యెగుర వేయుచుంద్రు యెలమి తోడ.

    3.తోకతోడ తాను తుర్రున యెగిరేటి
    గాలిపటమునిదియె గనుడు గనుడు
    దారముంచి చేత దాష్టికమును జూప
    రివ్వు మంచు నెగురురిక్క వరకు.

    4.రాచఠీవి తోడ రంజన మొనరించు
    గాలిపటము లివిగొ ఘనము గాను
    నేనె గొప్ప యనుచు నింగిపై కెగరంగ
    చూడచూడ వీని సొబగు హెచ్చె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘గగనమం దెగిరెడు గాలి..., పైకి నెగిరి..., సంకురాతి రన్న...’ అనండి.
      రెండవపద్యంలో ‘వేయుచుందు రెలమితోడ’ అనండి.
      నాల్గవపద్యంలో ‘తుర్రున నెగిరెడు’ అనండి.

      తొలగించండి
  12. పలుకదు పక్షిలా-ఫైకెగురు నింగిలో
    ------నాట్యమాడును జూడ నారిలాగ
    మంగళ సూత్రంబు –మహిళల కున్నట్లు
    ------సూత్రంబు గట్టును పాత్రదారి
    సమతుల్యతను బంచ సరియైన తోకతో
    ------గాలిపట మెగురు గాలిరాగ
    సంక్రాంతి పండుగ ,సాగెడి సంస్కృతి
    ------కనువిందు బంచులే క్రాంతిలాగ
    బాలుడాటకు జతగట్టితేలిపోవ|
    దారమాదార మందున కోరికెగుర?
    నీలిమేఘాలు గమనించె తేలిపోవ
    చెట్లు చేమలుగమనించె చిత్రమంత|
    2.కట్నమిచ్చి కొన్న కాంతయుమనసులా
    నెగురు గాలిపటము నింగి వైపు
    బాలచేష్ట లందు భాగమై భోగమై
    సంతసంబుసాకు సర్వులకును.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. ‘పక్షిలా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పలుకదు పక్షిగన్ పైకెగురు దివిలో...’ అందామా?
      ‘కోరిక+ఎగుర’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘కోరి యెగుర’ అనండి.

      తొలగించండి
  13. సీ||
    భోగిమంటలచలిఁ బ్రొద్దుటే కాచెడున్
    మధురానుభూతుల మాటవింటి!
    రంగవల్లులఁదీర్చి సింగారమొలికించ
    గొబ్బెమ్మలుంచుటన్ గూర్చివింటి!
    హరిదాసుకీర్తన!మురపించునాట్యమ్ము!
    చిడతలుఁ గూర్చునన్ జెప్ప వింటి!
    గంగిరెద్దుల వారి కదలించు పాటలు
    సందడిఁ జేయుటల్ జాల వింటి!
    ఆ.వె||
    పిండి వంటలఁ దిను ప్రీతి తీరుటె కాని
    పైనవన్ని జూచు భాగ్యమేది?
    పల్లె వారలందు పర్వదినఁపు తృప్తి
    చిత్తరువులె చూప చిత్తమలరె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. సంకురాత్రి పండుగ నాడు సంత సముగ
    గారెలరిశలు పులిహోర నారగించి
    గాలిపటములఁచేబట్టి కేళిగాను
    చెఱువుభూముల కేగిరి చిఱుతలంత

    రిప్లయితొలగించండి
  15. సంకురాత్రి పండుగ నాడు సంత సముగ
    గారెలరిశలు పులిహోర నారగించి
    గాలిపటములఁచేబట్టి కేళిగాను
    చెఱువుభూముల కేగిరి చిఱుతలంత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి