తెలుగు సోదరీసోదరులకు విన్నపం...
‘పొంగల్’ తమిళుల పండుగ. మన పండుగ ‘సంక్రాంతి’.
ఇంగ్లీషువాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీని పాలిస్తున్న రోజుల్లో పోస్టల్ శాఖలో టెలిగ్రాం గ్రీటింగ్స్ ఇవ్వడానికి కొన్ని సందేశాలకు కోడ్ నెంబర్లు ఇచ్చారు. టెలిగ్రాం ఫారం మీద ఆ సందేశాన్ని పూర్తిగా వ్రాయకుండా దాని కోడ్ నెంబర్ వ్రాస్తే చాలు... ఆ సందేశం పూర్తిగా పంపబడేది. వాళ్ళు పండుగలకు కోడ్ నెంబర్లు ఇచ్చే సమయంలో తమిళుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వాళ్ళ కార్యాలయాలు ఉండడం వల్ల, జనవరి 14న ఒకేరోజు తెలుగువాళ్ళు, తమిళులు పండగ జరుపుకొనడం వల్ల ఇద్దరిదీ ఒకే పండగ అనుకొని కేవలం ‘పొంగల్’కు మాత్రమే కోడ్ నెం. ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత కూడా పోస్టల్ వాళ్ళు అందులో సంక్రాంతిని చేర్చలేదు. దాంతో గత్యంతరం లేక మనవాళ్ళు పొంగల్ కోడ్‍నే ఉపయోగించారు.
ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ఒక మిత్రుడు దారిలో కలిసి “హాపీ పొంగల్” అన్నాడు.
నేను “సారీ...” అన్నాను.
అతడు విస్తుపోయి “అదేమిటి?” అని అడిగాడు.
“నేను తెలుగువాణ్ణి. నువ్వూ తెలుగువాడివి. మనమధ్య ఈ తమిళుల పొంగల్ ఎందుకు రావాలి?” అన్నాను.
“తెలుగులో అయితే ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటాం. మరి ఇంగ్లీషులో ‘హాపీ పొంగల్’ అని కాక ఇంకేమనాలి?” అతగాడి ధర్మసందేహం.
“పొంగల్ అనేది ఇంగ్లీష్ పదం కాదు, తమిళ పదం. ఇంగ్లీషులో ‘హాపీ సంక్రాంతి’ అనడమే మనకు సరియైనది” అన్నాను.
మౌనంగా వెళ్ళిపోయాడు. నా వాదన అతనికి నచ్చలేదు.
ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను. సంక్రాంతినాడు తెలుగమ్మాయిలు (అమ్మలు కూడా) బ్రహ్మాండమైన ముగ్గులు వేసి “Happy Pongal” అని వ్రాస్తున్నారు.
తెలుగు నిఘంటువులు వెదికితే ఎందులోనూ ‘పొంగల్’ శబ్దం లేదు. ‘పొంగలి’ మాత్రం ఉంది. దానికి ‘పాలుచేర్చి పొంగించునట్టి అన్నము. (దీని భేదములు పప్పుపొంగలి, చక్కెరపొంగలి.)’ అని చెప్పారు. బ్రౌన్ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువులో ‘పొంగల్’ను పేర్కొనలేదు. అంటే ఆయన దృష్టిలో అది తెలుగుపదం కాదు. కాని ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులో మాత్రం ‘Pongal = (Name of a Tamil feast in December January) పొంగలి పండుగ, సంక్రాంతి పండుగ’ అన్నాడు. ఇంగ్లీషువాడు కనుక ‘సంక్రాంతి’ని కూడ చేర్చాడు.
దయచేసి మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇంగ్లీషులో చెప్పినప్పుడు కూడా “Happy Sankranthi”, “Sankranthi Greetings” అని చెప్పండి.
జై తెలుగుతల్లీ!
గురువులకు ప్రణామములు
రిప్లయితొలగించండిచక్కని విషయాన్ని చిక్కగా చెప్పారు. ధన్య వాదములు
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
అక్కయ్యా,
తొలగించండిధన్యవాదాలు.
శుభోదయం :)
రిప్లయితొలగించండిపొంగల్ రోజున సంక్రాం
తింగని గోముగ నెరయగ తిండిపెట్ట జిలే
బిం గరము గరము జేయున్
పొంగలి వేడిగ వడివడి పొందుట తరమా !
జిలేబి
(సావేజిత!)
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘తిండిపెట్ట’ అన్నచోట గణభంగం. ‘తినబోయి జిలే...’ అనండి.
గరము అన్య భాషా ప్రయొగం, పదహారున్నర గుంజీలు నిలపకుండా
తొలగించండిNEENU KODA MAA PATASAALALONI VIDHYARDHULAKU IDE CHEPPANU
రిప్లయితొలగించండిమకర సంక్రాంతి అనే చెబుతానెప్పుడూ.....పొంగల్ అనను నేనైతే.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిహ్యాపీ పొంగల్ !
சம்க்ராந்தி ஷுபாகாம்க்ஷலு !
சீரஸ்
ஜிலேபி
జిలేబీ గారూ,
తొలగించండితెలుగులో ‘పొంగల్’, తమిళంలో ‘సంక్రాంతి’ శుభాకాంక్షలు తెలిపి మీకు భాషాదురభిమానం లేదని తెలియజేస్తున్నారా? సంతోషం!
కొత్తగా కిరణ్, జిలేబీ అని వ్రాసుకున్నారు.
மீகு கூடா சம்க்ரான்தி ஸுபாகாம்க்ஷலு.
కంది వారు,
తొలగించండినమో నమః :)
అది కిరణ్ కాదు చీర్స్ :) అరవం లో சீரஸ் :)
சீர்ஸ்
ஜிலேபி
మంచి సందేశాన్ని ఇచ్చారు గురువుగారూ!
రిప్లయితొలగించండి