కవిమిత్రులారా,
“ఊరక సజ్జనుం డొదిగియుండిననైన దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారముచేయుట వాని విధ్యగా
చీరలు నూఱుటంకములు చేసెడివైనను బెట్టె నుండగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా”
పై పద్యభావాన్ని మీకు నచ్చిన ఛందంలో చెప్పండి.
“ఊరక సజ్జనుం డొదిగియుండిననైన దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారముచేయుట వాని విధ్యగా
చీరలు నూఱుటంకములు చేసెడివైనను బెట్టె నుండగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా”
పై పద్యభావాన్ని మీకు నచ్చిన ఛందంలో చెప్పండి.
ఫలమించుక లేకున్నను
రిప్లయితొలగించండివలువల గొరుకుచె దపురుగు భంగి నవనిలో
ఖలుడును సజ్జనునోర్వక
పలురీతిగ కీడుసల్పి బాధింపునుగా.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఫలిత మేమియు లేకున్నను
రిప్లయితొలగించండివలువలు చిమ్మెట కొఱుకును బదరిక మందున్
నెలకొని యుండిన సుజనుని
ఖలుడది తానోర్వ లేక గాసిల్లు నటన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘ఫలిత మ్మేమియు లేకను’ అనండి.
గురువులకు ధన్య వాదములు . సవరించిన పద్యము
తొలగించండి-----------------------------------
ఫలితమ్మే మియు లేకను
వలువలు చిమ్మెట కొఱుకును బదరిక మందున్
నెలకొని యుండిన సుజనుని
ఖలుడది తానోర్వ లేక గాసిల్లు నటన్
లక్ష రూప్యములగు లక్షణమగు చీర
రిప్లయితొలగించండికొరుకు పెట్టె నుండ పురుగునటులె
మంచి వాడు అణగిమణగి యెంతయునున్న
కీడు జేయు చెడ్డ వాడునూర్కె
శశికాంత్ మల్లప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
శుభోదయం
రిప్లయితొలగించండిసజ్జను డై ఒండొరులకు
ఒజ్జగగుము;లేనమనకు ఒందిలి నిక్కము
సజ్జగ అలమర నిండగ
బొజ్జొన వస్త్రము ధరింప బొనరక చెడురా
చీర్స్
జిలేబి
(సావేజిత!)
జిలేబీ గారూ,
తొలగించండిమీ కందపద్యం బాగుంది. అభినందనలు.
కందంలో రెండవ, నాల్గవ పాదాల చివరి అక్షరం తప్పనిసరిగా గురువై ఉండాలి. అంటే అక్కడ సగణం కాని, గగము కాని ఉండాలి. ‘నిక్కము’ అన్నదానిని ‘నిజమే’ అంటే సరి!
‘ఒజ్జగగుము’ మీ ఉద్దేశంలో ‘ఒజ్జగ అగుము’ అనియా? ‘లేనమనకు’ అన్నది అర్థం కాలేదు.
ఇమ్మగు ఫలమే లేకను
రిప్లయితొలగించండిచిమ్మట విలువైన పట్టు చీరెల గొరుకున్
గమ్ముగ సజ్జనుడున్నను
జిమ్మడ ! నా దుర్జనుండు చెరుపును జేయున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగమ్ముగ సజ్జనుడుండిన
రిప్లయితొలగించండిజిమ్మును యపకారవిషము చేరి ఖలుండున్!
సొమ్మగు పెట్టెడు చీరలఁ
జిమ్మట కొరకదె ఫలమ్ముఁ జేకొనకున్నన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘జిమ్మున నపకారవిషము...’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
తొలగించండిగమ్ముగ సజ్జనుడుండిన
జిమ్మున్నపకారవిషము చేరి ఖలుండున్!
సొమ్మగు పెట్టెడు చీరలఁ
జిమ్మట కొరకదె ఫలమ్ముఁ జేకొనకున్నన్!
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఒరులకు హాని చేయని మహోత్తము డూరక యు౦డ,చూచి ము
ష్కరుడది యోర్వ జాల కపకారము జేయుట,వాని నైజమౌ
అరయగ పట్టువస్త్రముc బ్రియ౦బుగ పేటిక ను౦చ.కీటక౦
బొరయుచు ఛిద్ర మేర్పరుచు; ను౦డునె లాభ మొకి౦త. దానికిన్ ?
{ ముష్కరుడు = కుటిలుడు ; ఒరయుచు =
వెదకి సమీపి౦చుచు ; ఛిద్రము =
ర౦ధ్రము ; }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఒరులకు హాని చేయని మహోత్తము డూరక యు౦డ,చూచి ము
ష్కరుడది యోర్వ జాల కపకారము జేయుట,వాని నైజమౌ
అరయగ పట్టువస్త్రముc బ్రియ౦బుగ పేటిక ను౦చ.కీటక౦
బొరయుచు ఛిద్ర మేర్పరుచు; ను౦డునె లాభ మొకి౦త. దానికిన్ ?
{ ముష్కరుడు = కుటిలుడు ; ఒరయుచు =
వెదకి సమీపి౦చుచు ; ఛిద్రము =
ర౦ధ్రము ; }
గురుమూర్తి ఆచారి గారూ మీ పద్యం చాలా బాగుంది.
తొలగించండిశిష్టు డూరకు౦డిన గాని దుష్టుడెపుడు
రిప్లయితొలగించండిపీడ కలిగించుటాతని విద్య గాదె
పట్టు చీరలు పడి యుండ పెట్టెలోన
పురుగు కొరుకును గాదె భాస్కర! యెరు౦గు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
సజ్జను డూరకుండినను సర్రున లేచును హానిజేయగా
రిప్లయితొలగించండినొజ్జలకైన దుర్జనుడు, నోర్వమిచే, కతమేమి లేకయున్,
లజ్జనువీడి, వస్త్రములు లక్షలు చేసెడివయ్యు చిమ్మెటల్
బెజ్జములన్ పొనర్చు గద పెట్టెల వీసము లాభముండునే?
మిస్సన్న గారూ,
తొలగించండిఈనాటి ఉత్తమమైన పద్యాలలో మీ రచన కూడా ఒకటి. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు.
తొలగించండిఒదిగియున్ననుసజ్జనుండొప్పుమీర
రిప్లయితొలగించండికీడుజేయంగదలచునుకిట్టకతడు
తనర దుర్మార్గుడెప్పుడుతరచిచూడ
చిమ్మటలవియ కొరుకునుచీరలన్ని
లేశమైననులాభములేవియైన
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘లాభము లేకయున్న’ అనండి.
ఫలమేమియు లేకున్నను
రిప్లయితొలగించండివలువలఁచెదలు కొరికెడి భంగిన్ ఖలుడున్
విలువల పాటింపక సుజ
నులననయముబాధ లిడుచు నుండును గదరా!
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘వలువలను చెదలు కొరికెడి...’ అనండి.
కట్టడు లందు సజ్జనుడు కాలముబుచ్చగ-దుర్జనుండు ఓ
రిప్లయితొలగించండిపట్టున నోర్వలేక తన పంతమునంద పకార మెంచుటే|
“పెట్టెన నూరుటంకముల పేరగు చీరలనుంచ?చీడలే
గుట్టుగ గొట్టి చింపుటన కుత్సితవిద్యయె జూడ శంకరా”.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఒక’ను ‘ఓ’ అన్నారు. ‘దుర్జనుండు తాఁ|బట్టున...’ అందామా?
లేశ మంత ఫలము లేకపోయిన గాని
రిప్లయితొలగించండియుర్వి నెవరి ఘనత నోర్వ డోగు
చెదపురుగులు చేరి చీరెల్ చెరచునట్లు
దొడ్డవారి చెరచు దుష్టు డెపుడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
తీరగు కొఱ లేకున్నను
రిప్లయితొలగించండిచీరలు కొరుకంగ దూరు చిమ్మట వోలె
న్నూరక సజ్జనుడుండిన
చేరును గద దుర్జనుండు చెడుపును జేయన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉపమాన సహిత రాద్ధాంతము:
రిప్లయితొలగించండిదూరుచు మోడి హైందవుల తోరపు హృత్తులు హర్షమొందగా
కోరికలెల్ల తీర్చుచును కొండొక రీతిని సేవజేయగా
పోరుచు నట్టి భద్రుడను పోకిరి తీరున కౌగిలించుచున్
భారిగ కన్నుగొట్టెడివి వంకరి చేష్టలు మాను రాహులా!
😊